అతనితో రొమాన్స్ కోసం... | actress sri divya Romance with Vijay | Sakshi
Sakshi News home page

అతనితో రొమాన్స్ కోసం...

Published Wed, Dec 24 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM

అతనితో రొమాన్స్ కోసం...

అతనితో రొమాన్స్ కోసం...

ఇళయదళపతి విజయ్‌తో రొమాన్స్ చేయాలని ఆశగా ఉన్నట్లు యువ నటి శ్రీదివ్య అంటోంది. ఈ అమ్మడు నటించిన రెండు చిత్రాలు వరుత్త పడాద వాలిబర్ సంఘం, జీవా, విడుదలై విజయం సాధించడంతో ఇప్పటి వరకు అపజయం ఎరుగని నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉండడంతో బిజీ నటిగా చెలామణి అవుతున్నారు. తొలి చిత్రం వరుత్త పడాద వాలిబర్ సంఘం హీరో శివకార్తికేయన్‌తో మరోసారి జతకట్టిన చిత్రం కాక్కిసట్టై సంక్రాంతికి విడుదలవుతోంది.
 
 అంతకంటే ముందు విక్రమ్ ప్రభు సరసన నటించిన వెల్లక్కార దురై చిత్రం క్రిస్మస్‌కు తెరపైకి రానుంది. దీంతో యమ ఎగ్జైటింగ్‌గా ఉన్న శ్రీ దివ్య వెళ్లక్కార దురై చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. ఈ చిత్రం తనకు చాలా సంతృప్తి నిచ్చిందని అంది. ప్రస్తుతం జి.వి.ప్రకాష్ కుమార్‌సరసన పెన్సిల్ చిత్రంలోను, అధర్వతో ఈట్టి, చిత్రంలోను నటిస్తున్నట్లు తెలిపింది. తమిళ చిత్ర పరిశ్రమలో తనకు నచ్చిన హీరో విజయ్ అని చెప్పింది. నటనలో ఆయన వేగం, స్టరుుల్ అంటే చాలా ఇష్టం అని అంది. ఆయన సరసన నటించాలని ఆశగా ఉందని శ్రీదివ్య చెప్పింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement