త్వరలో విక్రమ్‌ప్రభు కొత్త చిత్రం | Vikram Prabhu's next is an action comedy | Sakshi
Sakshi News home page

త్వరలో విక్రమ్‌ప్రభు కొత్త చిత్రం

Published Sat, Jul 18 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

త్వరలో విక్రమ్‌ప్రభు కొత్త చిత్రం

త్వరలో విక్రమ్‌ప్రభు కొత్త చిత్రం

 యువ నటుడు విక్రమ్‌ప్రభు నూతన చిత్రానికి సిద్ధం అవుతున్నారు. వెళైదొరై వంటి విజయవంతమైన చిత్రం తరువాత విజయ్ దర్శకత్వంలో చేసిన ఇదుఎన్న మాయం చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇందులో విక్రమ్‌ప్రభు సరసన కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించారు. చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.ప్రస్తుతం విక్రమ్‌ప్రభు వాగా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇండియన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగే ఒక యువ ప్రేమజంట ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం.
 
 జాతీయ అవార్డు గ్రహీత హరిదాస్ చిత్రం ఫేమ్ జీఎన్‌ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌ప్రభుతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరన్నది చిత్ర యూనిట్ రహస్యంగా ఉంచింది. కాగా విక్రమ్‌ప్రభు తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఇంతకు ముందు జయంరవి, హన్సిక జంటగా రోమియోజూలియెట్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మెడ్రాస్ ఎంటర్‌ప్రైజెస్ అధినేత ఎస్ నందగోపాల్ నిర్మించనున్న తదుపరి చిత్రంలో విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు గణేశ్ వినాయక్ పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని నిర్మాతల వర్గం తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement