ఆమె అయితే బాగుంటుంది | Amala Paul and Vijay to team up for the third time? | Sakshi
Sakshi News home page

ఆమె అయితే బాగుంటుంది

Published Sat, May 23 2015 2:32 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

ఆమె అయితే బాగుంటుంది

ఆమె అయితే బాగుంటుంది

దర్శకుడు విజయ్‌ని ప్రేమిస్తున్న సమయంలో అమలాపాల్ ఆయన దర్శకత్వంలో దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటించారు. ఆ తరువాత విజయ్‌తో ఏడు అడుగులు నడిచారు. ఆపై నటనకు స్వస్తి చెపుతారనే ప్రచారం జరిగినా అలాంటి అంచనాలను తారుమారు చేస్తూ అమలాపాల్ మళ్లీ నటించడం మొదలెట్టారు. తాజాగా హైకు చిత్రంలో సూర్య సరసన నటిస్తున్నారు. తన భర్త విజయ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది లేటెస్ట్ న్యూస్.
 
 విజయ్ ఇప్పుడు విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ జంటగా ఇదు ఎన్న మాయం చిత్రం రూపొందిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా నటించి, నిర్మించనున్న చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఒక ముఖ్యపాత్రలో అమలాపాల్ నటిస్తే బాగుంటుందన్న ప్రభుదేవా సూచనకు విజయ్ సమ్మతించినట్లు సమాచారం. నటి అమలాపాల్‌ను ఈ చిత్రంలో మనం చూడవచ్చు. అసలు ప్రభుదేవా పోషించనున్న పాత్ర ఏ తరహాలో ఉంటుందన్న విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement