ప్రేక్షకులు అన్నీ గమనిస్తారు!
ఈ కాలం సినీ అభిమానులు సినిమాల్లోని అన్ని విషయాలనూ క్షుణ్ణంగా గమనిస్తున్నారని దర్శక, నటుడు పార్తిబన్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణకు దేశంలో చాలా విషయాలున్నా ఇటీవల ఈ మధ్య విడుదలైన తొడరి చిత్రంలోని ఒక సన్నివేశంలో 150 కిలోమీటర్ల వేగంతో రైలు పయనిస్తున్నా అందులోని నటి కీర్తీసురేశ్ ఓణీ కొంచెం కూడా కదలలేదంటూ ప్రేక్షకులు పరిహాసం చేసిన విషయం వాట్సాప్‌లో హల్ చల్ చేసిందన్నారు. అదే విధంగా దర్శక నటుడు ప్రభుదేవా హీరోయిన్‌కు డా న్‌సలో శిక్షణ ఇవ్వడానికి రెండు రోజులు, దాని పర్ఫెక్షన్‌కు ఎనిమిది రోజులు పడుతుందని ఇటీవల పేర్కొన్నారన్నారు.
అలా పర్ఫెక్షన్‌కు ప్రాముఖ్యత నిచ్చే దర్శకుడు సుశీంద్రన్ అని పేర్కొన్నారు. నటి శ్రీదివ్య మంచి నటి అని, ఆమెను మావీరన్ కిట్టు చిత్రంలోని ఒక ఏడ్చే సన్నివేశం కోసం గ్లిజరిన్ వేసుకోమని చెప్పడంతో ఆ సన్నివేశంలో తన ముఖం కనిపించదని తెలిసినా సన్నివేశం బాగా రావాలని మారు మాట చెప్పకుండా గ్లిజరిన్‌తో నటించారని అన్నారు. ఇక నటుడు విష్ణువిశాల్ సహా మావీరన్ కిట్టు చిత్రంలోని అందరూ చాలా చక్కగా నటించారని అన్నారు.
విష్ణువిశాల్, శ్రీదివ్య జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో నల్లుసామి పిక్చర్స్, ఏషియన్ సినీ కంబైన్‌స సంస్థల అధినేతలు ఐస్‌వేర్.చంద్రస్వామి, డీఎన్.తాయ్ శరవణన్, రాజీవన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మావీరన్ కిట్టు.డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక సత్యం థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శక నటుడు పార్తిబన్ పై విధంగా వ్యాఖ్యానించారు. విష్ణువిశాల్, శ్రీదివ్య, దర్శకుడు సుశీంద్రన్, డి.ఇమాన్, చిత్ర నిర్మాతలతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.