నన్ను క్షమించండి: పార్తిబన్‌ | Radhakrishnan Parthiban Says Sorry To Actress Tamannaah Bhatia On Recent Issue, Deets Inside | Sakshi
Sakshi News home page

Parthiban Apologizes Tamannaah: నన్ను క్షమించండి

Published Sat, Jul 20 2024 2:33 AM | Last Updated on Sat, Jul 20 2024 12:32 PM

Radhakrishnan Parthiban Says Sorry to Actress Tamannaah Bhatia

హీరోయిన్‌ తమన్నాకు తమిళ నటుడు–దర్శక–నిర్మాత పార్తిబన్‌ క్షమాపణలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా డ్యాన్స్‌ గురించి పార్తిబన్‌ చేసిన కామెంట్‌పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు కోరారు. ఆ ఇంటర్వ్యూలో పార్తిబన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలో కథ ఉందా? లేదా అన్నది ప్రేక్షకులు చూడటం లేదు.

హీరోయిన్‌ డ్యాన్స్‌ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది’’ అన్నారు. పార్తిబన్‌ మాటలను పలువురు నెటిజన్స్‌ తప్పుబట్టారు. దాంతో పార్తిబన్‌ స్పందిస్తూ– ‘‘సినిమా ఇండస్ట్రీ వారిపై నాకు గౌరవం ఉంది. నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అన్నారు. ఇక తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘రచ్చ’ సినిమాలో పార్తిబన్‌ నటించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement