చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్‌లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు.
చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు
దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్
పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం
AR Rahman: ఏఆర్ రెహమాన్ కాదంటే ఈ చిత్రం ఉండేది కాదు: డైరెక్టర్
Published Tue, Jun 7 2022 10:04 AM | Last Updated on Tue, Jun 7 2022 10:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment