నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు | susindran about maviran Kittu movie | Sakshi
Sakshi News home page

నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు

Published Tue, Nov 15 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు

నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు

నా చిత్రంలో నటించడానికి కొందరు హీరోలు అంగీకరించలేదని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఆయన తాజా చిత్రం మావీరన్ కిట్టు. విష్ణువిశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీదివ్య హీరోరుున్‌గా నటించారు. నటుడు పార్తీబన్ ముఖ్య పాత్రను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ ఇది మూడేళ్ల క్రితం తయారు చేసుకున్న కథ అని తెలిపారు. ఈ కథను నటుడు పార్తీబన్‌కు చెప్పగా తానీ చిత్రంలో తప్పకుండా నటిస్తానని అన్నారన్నారు. అరుుతే పలువురు నటులు ఇందుకు నిరాకరించారని అన్నారు. అందుకు వారు చెప్పిన కారణం ఇందులో పార్తీబన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉందని, ఆ పాత్రను తగ్గించమని కోరినట్టు తెలిపారు.

అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఆ తరువాత నటుడు విష్ణు విశాల్ నటించడానికి ముందు కొచ్చారని తెలిపారు. ఇది 1980లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు. ఐఏఎస్ అధికారి కావాలని ఆశ పడిన ఓ యువకుడు ఎరుర్కొనే సమస్యల ఇతివృత్తమే మావీరన్ కిట్టు చిత్రం అని తెలిపారు. ఓల్డ్ పీరియడ్ కథా చిత్రం కావడంతో లొకేషన్‌‌స, డస్రు తదిరత విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. చిత్రంలో చివరి అరగంట ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. కమర్షియల్ గానూ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని సుశీంద్రన్ వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement