susindran
-
ప్రముఖ దర్శకుడికి తీవ్ర గాయాలు
తమిళనాడు ,పెరంబూరు: ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. కాగా ఈయన నిత్యం ఉదయాన్నే వాకింగ్ వంటి ఎక్సర్సైజులు చేస్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళుతుండగా బైక్‌లో వచ్చిన వ్యక్తి సుశీంద్రన్‌ను ఢీకొన్నారు. దీంతో కింద పడిన సుశీంద్రన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక విరిగింది. దీంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.గాయాలు తీవ్రం కావడంతో కొన్ని రోజులు దర్శకుడు సుశీంద్రన్ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చూపించారు. -
మార్చి 29న గోలీసోడా –2
తమిళసినిమా: గోలీసోడా–2 చిత్రం ఈ నెల 29న విడుదలకు ముస్తాబవుతోంది. ఎలాంటి కాస్టింగ్, అంచనాలు లేకుండా ఇంతకు ముందు విడుదలైన గోలీసోడా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు విజయ్‌మిల్టన్ తాజాగా తెరకెక్కించిన చిత్రం గోలీసోడా –2. దీంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి నమ్మకంతోనే గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ అధినేత వి.సత్యమూర్తి పొందారు. ఇంతకుముందు ‘తప్పుదండా’ చిత్రాన్ని నిర్మించి, కథానాయకుడిగా నటించిన సత్యమూర్తి దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించిన నెంజిల్ తుణివిరుందాళ్, విజయ్‌సేతుపతి, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన ఒరు నల్లనాళ్ పాత్తు సోల్రేన్ చిత్రాలను తమిళనాడులో విడుదల చేశారు. ప్రస్తుతం తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్ పతాకంపై ఓడవుమ్ ముడియాదు ఒళియవుమ్ ముడియాదు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యమూర్తి గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొందడం విశేషం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ విజయ్‌మిల్టన్ చిత్రాలు సాంకేతిక విలువలతో, ఆసక్తికరమైన కథాంశాలతో కూడి ఉంటాయన్నారు. అందుకే ఆయన చిత్రాలంటే తనకు ప్రత్యేక ఆసక్తి అని పేర్కొన్నారు. తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను పొంది సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు గౌతమ్‌మీనన్ వాయిస్ఓవర్ ఇచ్చిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విశేష ఆదరణ పొందుతోందని, విజయ్విల్లన్ ఆయన యూనిట్‌పై నమ్మకంతోనూ గోలీసోడా–2 చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు వి.సత్యమూర్తి తెలిపారు. -
సూర్య కోసం సూర్య
తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా కూడా నిరాశపరచటంతో తదుపరి చిత్రం కేరాఫ్ సూర్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందీప్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న కేరాఫ్ సూర్య పనుల్లో బిజీగా ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ నటుడు సూర్య ముఖ్య అతిథి హాజరు కానున్నారట. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. -
ఆ కోరిక నెరవేరింది
తమిళసినిమా: తెలుగులో చిత్రం చేయాలన్న కోరిక కేరాఫ్ సూర్యతో నెరవేరిందని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. వెన్నెల కబడ్డీ కుళు చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కించిన నాన్ మహాన్ అల్ల చిత్రం తెలుగులో నాపేరు శివ పేరుతో అనువాదం అయ్యి రెండు భాషల్లోనూ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తాను తెలుగులో చిత్రం చేయాలని కోరుకున్నా అది నెరవేరలేదని దర్శకుడు సుశీంద్రన్ సోమవారం విలేకరులతో వెల్లడించారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని తమిళంలో నెంజిల్ తుణివిరుందాల్, తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో తెరక్కెంచారు. నటుడు సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ దీపావళి పండుగ అంటే తకు చాలా ఇష్టం అన్నారు. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రాన్ని చూసేందుకు స్నేహితునితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా తొలిసారిగా దీపావళి పండగను ఎంజాయ్ చేశానన్నారు. ఆ తరువాత చెన్నైకి రావడంతో కొన్నేళ్లు దీపావళికి దూరంగా ఉన్నానని, మళ్లీ తన తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు చిత్ర విడుదల సందర్భంగా 2009లో దీపావళి వేడుకను జరుపుకున్నాన్నారు. అప్పటి నుంచి వరసగా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నాన్నారు. పాండినాడు చిత్రం 2013లో దీపావళి సందర్భంగా విడుదలై తనకు ఘన విజయాన్ని అందించిందన్నారు. కాగా తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్ను ఈ దీపావళికి విడదల చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం ఎంజీనా అనే చిత్రం నిర్మాణంలో ఉందని సుశీంద్రన్ తెలిపారు. -
దిల్ ఉన్నోడు!
సాక్షి, చెన్నై : దిల్లున్న దర్శకుడు సుశీంద్రన్. తొలి చిత్రం వెన్నెలా, కబడ్డీ,కుళ్లు నుంచి ఆయన చిత్రాలను పరిశీలిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. తాజాగా సుశీంద్రన్ మరోసారి సాహసం చేసి తెరకెక్కించిన చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. గుండెల్లో దమ్ముంటే అనే అర్థంతో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌కిషన్, సాధిక హీరోహీరోయిన్లగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో మెహ్రీన్, విక్రాంత్, అప్పుకుట్టి, హరీష్ ఉత్తమన్, వినోద్‌కిషన్, మహేంద్రన్, అరుళ్దాస్, దిలీపన్ నటించారు. అన్నై ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, లక్ష్మణ్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక సత్యం థియేటర్లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు కార్తీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దర్శకుడు సుశీంద్రన్ తో కలిసి నాన్ మహాన్ అల్ల చిత్రం చేశానన్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు సుశీంద్రన్ వినిపించినట్లు మరో దర్శకుడి నుంచి తాను వినలేదన్నారు. అంత చక్కగా కథను వినిపించారని చెప్పారు. ఈ చిత్ర సంగీతదర్శకుడు డి.ఇమాన్ గుర్తు పట్టలేనంతగా మారిపోయారని, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ల చాలా స్మార్ట్‌గా తయారయ్యారని ప్రశంసించారు.ఆయన సంగీత దర్శకత్వంలో తానింత వరకూ పని చేయలేదని, త్వరలోనే అలాంటి అవకాశం రానుందని తెలిపారు. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత కార్తీ సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారన్న గమనార్హం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు సుశీంద్రన్ ను దిల్లున్న దర్శకుడిగా పేర్కొన్నారు. -
ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు
సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక్కరే దర్శకత్వం వహిస్తుంటారు. అరుదుగా దర్శక ద్వయం కలిసి చిత్రం చేస్తుంటారు. అలాంటిది ఒకే చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేస్తే కచ్చితంగా అది వైవిధ్యభరిత కథా చిత్రమే అవుతుంది. అదీ ఈ తరం ఆశా దర్శకులైన పా.రంజిత్, పసంగ పాండిరాజ్, సుశీంద్రన్ ముగ్గురు యువ దర్శకులు కలిస్తే ఆ చిత్రం ఒక కొత్త ప్రయోగమే అవుతుంది. అలాంటి వినూత్న ప్రయోగానికి ఈ దర్శక త్రయం సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ చిత్రం మూడు కథలతో కూడి ఉంటుందట. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నట్లు టాక్. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక పూర్వంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులు వారివారి తాజా చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతారని భావించవచ్చు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు పాండిరాజ్ తన పసంగ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
నా చిత్రంలో కొందరు హీరోలు నటించనన్నారు
నా చిత్రంలో నటించడానికి కొందరు హీరోలు అంగీకరించలేదని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఆయన తాజా చిత్రం మావీరన్ కిట్టు. విష్ణువిశాల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీదివ్య హీరోరుున్‌గా నటించారు. నటుడు పార్తీబన్ ముఖ్య పాత్రను పోషించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారంలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడుతూ ఇది మూడేళ్ల క్రితం తయారు చేసుకున్న కథ అని తెలిపారు. ఈ కథను నటుడు పార్తీబన్‌కు చెప్పగా తానీ చిత్రంలో తప్పకుండా నటిస్తానని అన్నారన్నారు. అరుుతే పలువురు నటులు ఇందుకు నిరాకరించారని అన్నారు. అందుకు వారు చెప్పిన కారణం ఇందులో పార్తీబన్ పాత్రకు అధిక ప్రాధాన్యత ఉందని, ఆ పాత్రను తగ్గించమని కోరినట్టు తెలిపారు. అందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఆ తరువాత నటుడు విష్ణు విశాల్ నటించడానికి ముందు కొచ్చారని తెలిపారు. ఇది 1980లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం అని తెలిపారు. ఐఏఎస్ అధికారి కావాలని ఆశ పడిన ఓ యువకుడు ఎరుర్కొనే సమస్యల ఇతివృత్తమే మావీరన్ కిట్టు చిత్రం అని తెలిపారు. ఓల్డ్ పీరియడ్ కథా చిత్రం కావడంతో లొకేషన్స, డస్రు తదిరత విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. చిత్రంలో చివరి అరగంట ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందన్నారు. కమర్షియల్ గానూ విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని సుశీంద్రన్ వ్యక్తం చేశారు. -
ఆయన చిత్రాలు నేచురల్‌గా ఉంటాయి - సందీప్ కిషన్
‘‘నా స్నేహితుడు, శ్రేయోభిలాషి చక్రి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తుండటం హ్యాపీగా ఉంది. కృష్ణవంశీ వంటి గొప్ప డెరైక్టర్‌తో పనిచేస్తున్న టైమ్‌లోనే సుశీంద్రన్‌గారి దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్, మెహరీన్ జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరా బాద్‌లో ప్రారంభమైంది. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి ఇవ్వగా, నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో నిర్మాత ఎ.యం.రత్నం క్లాప్ ఇవ్వగా, ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సుశీంద్రన్ గారి చిత్రాలు చాలా నేచురల్‌గా ఉంటాయి. ఆయన తీసిన ‘నా పేరు శివ’కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ముచ్చటగా మూడోసారి తమన్‌తో పని చేయడం సంతోషాన్నిస్తోంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న చిత్రమిది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, జనవరి, ఫిబ్రవరిలో పూర్తి చేస్తాం. ఏప్రిల్ లేదా మేలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తర్వాత తెలుగులో నా రెండో చిత్రమిది. ఈ చిత్రంతోనే తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతుండటం నా లక్’’ అని మెహరీన్ అన్నారు. -
మరోసారి జెండా పాతేశాడు
తెలుగు సినిమాకు ఇది వెరీ గుడ్ 'వీకెండ్' అని చెప్పొచ్చు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకోవటంతో ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే మూడు సినిమాల్లో ఎక్కువగా కలిసొచ్చింది మాత్రం విశాల్‌కే. డైనమైట్, భలే భలే మొగాడివోయ్ సినిమాలు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద తమ పట్టు చూపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాగా తెరకెక్కిన విశాల్ జయసూర్య కూడా ఈ రెండు సినిమాలకు పోటిగా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుండటంతో విశాల్ ఆనందంలో తేలిపోతున్నాడు. క్రైం పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జయసూర్య తమిళ తో పాటు తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. విశాల్ కు బాగా కలిసొచ్చిన యాక్షన్ జానర్ లో, మల్లన ఫేం సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. గత కొంత కాలంగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న విశాల్ మరోసారి తన డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ కోసం నానా తంటాలు పడుతుంటే విశాల్ మాత్రం టాలీవుడ్లో ఈజీగా హిట్ కొట్టేస్తున్నాడు. -
'ప్రేమించాలి' ప్రెస్ మీట్
-
ప్రేమించాలి మూవి స్టిల్స్