సూర్య కోసం సూర్య | Suriya as Chief Guest for Care of Surya Audio | Sakshi
Sakshi News home page

సూర్య కోసం సూర్య

Published Fri, Oct 20 2017 10:20 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

Suriya Care of Surya - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ ను మలుపు తిప్పే బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా కూడా నిరాశపరచటంతో తదుపరి చిత్రం కేరాఫ్ సూర్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందీప్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న కేరాఫ్ సూర్య పనుల్లో బిజీగా ఉన్నాడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఆడియో వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ నటుడు సూర్య ముఖ్య అతిథి హాజరు కానున్నారట. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement