ఆస్పత్రిలో దర్శకుడు సుశీంద్రన్
తమిళనాడు ,పెరంబూరు: ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్ ఆ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఆపై వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు యువ స్టార్ హీరోలతో చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన కెనడీ క్లబ్, ఛాంపియన్ చిత్రాలు ఇటీవలే విడుదలయ్యాయి. కాగా ఈయన నిత్యం ఉదయాన్నే వాకింగ్ వంటి ఎక్సర్‌సైజులు చేస్తారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళుతుండగా బైక్‌లో వచ్చిన వ్యక్తి సుశీంద్రన్‌ను ఢీకొన్నారు. దీంతో కింద పడిన సుశీంద్రన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక విరిగింది. దీంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.గాయాలు తీవ్రం కావడంతో కొన్ని రోజులు దర్శకుడు సుశీంద్రన్ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment