తెలుగు సినిమాకు ఇది వెరీ గుడ్ 'వీకెండ్' అని చెప్పొచ్చు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకోవటంతో ఆడియన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే మూడు సినిమాల్లో ఎక్కువగా కలిసొచ్చింది మాత్రం విశాల్కే. డైనమైట్, భలే భలే మొగాడివోయ్ సినిమాలు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కావటంతో తెలుగు మార్కెట్ మీద తమ పట్టు చూపిస్తున్నాయి. డబ్బింగ్ సినిమాగా తెరకెక్కిన విశాల్ జయసూర్య కూడా ఈ రెండు సినిమాలకు పోటిగా మంచి ఓపెనింగ్స్ సాధిస్తుండటంతో విశాల్ ఆనందంలో తేలిపోతున్నాడు.
క్రైం పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన జయసూర్య తమిళ తో పాటు తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. విశాల్ కు బాగా కలిసొచ్చిన యాక్షన్ జానర్ లో, మల్లన ఫేం సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కింది. గత కొంత కాలంగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న విశాల్ మరోసారి తన డెసిషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ కోసం నానా తంటాలు పడుతుంటే విశాల్ మాత్రం టాలీవుడ్లో ఈజీగా హిట్ కొట్టేస్తున్నాడు.
మరోసారి జెండా పాతేశాడు
Published Sat, Sep 5 2015 9:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement