అంతా అబద్దం
అంతా అబద్దం
Published Sun, Oct 20 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
విజయం ఎంతటి వారిలోనైనా మార్పు తెస్తుంది. అదే విధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు అతీతం కాదంటోంది కోలీవుడ్. ఎదుర్ నీచ్చిల్ చిత్రం ముందు వరకు అవకాశాల కోసం ఈ భామ ఎదురు చూసింది. అయితే ఎదుర్ నీచ్చిల్ విజయంతో అవకాశాలు ప్రియా ఆనంద్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మూడు చిత్రాలు చేతిలో ఉండడంతో ఈ జాణ తన పారితోషికాన్ని ఏకంగా రూ.50 లక్షలకు పెంచేసిందట.
సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. అవాక్కైన నిర్మాత ఆమెకు బదులు శ్రీదివ్యను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారని టాక్. ఈ విషయాన్ని ప్రియా ఆనంద్ ఖండించింది. తాను పారితోషికం భారీగా పెంచేశానంటూ అబద్దపు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇటీవల కథలే వినలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికే ఏడాదికిపైగా పడుతుందని వివరించింది. ఈ చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే నూతన అవకాశాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాంటిది తానేదో పారితోషికాన్ని భారీగా పెంచాననే ప్రచారం అబద్దమని పేర్కొంది.
Advertisement
Advertisement