GV prakaskumar
-
జైలు నుంచి విడుదల
జైలు నుంచి విడుదలయ్యారు నటుడు–సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఏదైనా నేరం చేసి జైలుకి వెళ్లారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. జీవీ ప్రకాశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలు’. వసంత బాలన్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించి జీవీ ప్రకాశ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వసంతబాలన్ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘వెయిల్’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయం అయిన జీవీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కూడా జీవీనే స్వరకర్త. ‘‘జైలు’ సినిమా షూటింగ్ పూర్తయింది. సహకరించిన టీమ్‌కు థ్యాంక్స్. మంచి స్క్రిప్ట్’’ అన్నారు జీవీ. ఇందులో లోకల్ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేసే లోకల్ హీరోగా కనిపిస్తారు జీవీ ప్రకాశ్. ఈ సినిమానే కాకుండా దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు జీవీ ప్రకాశ్‌కుమార్. -
ఐదు అక్షరాల బూతు!
యస్.. అక్షరాలా ఐదు అక్షరాల బూతు. తమిళంలో అయితే ఆ బూతుకి ఇంకొన్ని అక్షరాలుంటాయి. జ్యోతిక ఏమాత్రం మొహమాటపడకుండా ఆ బూతు మాట అనేశారు. ఇది సినిమా కోసం మాట్లాడిన డైలాగే అయినా.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో? విమర్శిస్తారేమో అనే భయం లేకుండా జ్యోతిక ఆ డైలాగ్ చెప్పేశారు. చెప్పించింది ఎవరో కాదు.. దర్శకుడు బాల. ‘శివపుత్రుడు’, ‘వాడు–వీడు’ వంటి విభిన్న చిత్రాలకు చిరునామా ఈ దర్శకుడు. జ్యోతిక టైటిల్ రోల్లో తమిళంలో బాల ‘నాచ్చియార్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. సంగీతదర్శకుడి నుంచి హీరోగా మారిన జీవీ ప్రకాశ్‌కుమార్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. జ్యోతిక పోలీసాఫీసర్. జీవీ ఏమో మురికివాడలకు చెందిన కుర్రాడు. ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఒక కుర్రాణ్ణి (జీవీ) పోలీసులు తరిమి తరిమి పట్టుకుని, స్టేషన్‌కి తీసుకు వస్తారు. స్టేషన్లో పోలీసాఫీసర్ నాచ్చియార్ (జ్యోతిక) అతని చెంప చెళ్లుమనిపించి, ‘తెవి.....’ అని తిడుతుంది. అంటే... ‘ల.....’ అని అర్థం. టీజర్ చివర్లో ఉన్న ఈ బూతు పదం విని, సెన్సార్ ఎలా ఒప్పుకుంటుంది? అని చర్చించుకుంటున్నారు. బలమైన సీన్ లేకపోతే బాల అలాంటి డైలాగులు పెట్టరన్నది కొందరి వాదన. మరి.. టీజర్ వరకే ఈ పదం ఉంటుందో? లేక సెన్సార్ కత్తెరకు గురై, సినిమాలో నిశ్శబ్దం అవుతుందో వేచి చూద్దాం. ఆ సంగతలా ఉంచితే... ఈ టీజర్లో జ్యోతిక కొన్ని సెకన్లే కనిపించినా, ఆమె నటనకు మార్కులు పడ్డాయి. మామూలుగానే బాలా సినిమాలంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ టీజర్ మరిన్ని అంచనాలను పెంచింది. -
అతిథి పాత్రలో ప్రియా ఆనంద్
ప్రముఖతారలు ఇతర హీరోయిన్ల చిత్రాల్లో అతిథిగా మెరవడం కొత్తేమి కాదు. కొన్ని కీలక సన్నివేశాల్లోనూ లేక, ఓ ప్రత్యేక పాటలోనూ మెరుస్తూ ఉంటారు. అందుకు వారికి పారితోషికం కూడా ఘనంగానే ముట్టుతుంది. అలా నటి ప్రియా ఆనంద్ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో అతిథి పాత్రలో తళుక్కున మెరవబోతుంది. ప్రియా ఆనంద్‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. గౌతమ్ కార్తీక్‌తో నటించిన వై రాజా వై ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రం ఓకే అనిపించుకున్నా ప్రియా ఆనంద్‌కు మాత్రం పెద్దగా పేరు రాలేదు. దీంతో ప్రస్తుతం కొత్తగా అవకాశాల్లేవు. సరిగ్గా ఇలాంటి సమయంలో అనుకోకుండా వచ్చిన అతిథి పాత్రను ప్రియ ఒప్పేసుకుందట. ఈ చిత్రంలో జీవీకే జంటగా నటి ఆనంది నటిస్తుంది. దీని గురించి దర్శకుడు ఆధిక్ తెలుపుతూ త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో నటి ప్రియా ఆనంద్ నటించడం అన్నది నిజమేనన్నారు. అయితే ఈ పాత్రను గెస్ట్ పాత్ర అనలేమని అన్నారు. అలాగే ఆమెకీ చిత్రంలో పాట కూడా ఉండదని చెప్పారు. అయితే నటించేది కొన్ని సన్నివేశాలైనా అవి చిత్రాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయని అన్నారు. ఈ పాత్ర గురించి ప్రియకు వివరించగా వెంటనే నటించడానికి రెడీ అందని అన్నారు. -
అంతా అబద్దం
విజయం ఎంతటి వారిలోనైనా మార్పు తెస్తుంది. అదే విధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు. నటి ప్రియా ఆనంద్ ఇందుకు అతీతం కాదంటోంది కోలీవుడ్. ఎదుర్ నీచ్చిల్ చిత్రం ముందు వరకు అవకాశాల కోసం ఈ భామ ఎదురు చూసింది. అయితే ఎదుర్ నీచ్చిల్ విజయంతో అవకాశాలు ప్రియా ఆనంద్‌ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం మూడు చిత్రాలు చేతిలో ఉండడంతో ఈ జాణ తన పారితోషికాన్ని ఏకంగా రూ.50 లక్షలకు పెంచేసిందట. సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. అవాక్కైన నిర్మాత ఆమెకు బదులు శ్రీదివ్యను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారని టాక్. ఈ విషయాన్ని ప్రియా ఆనంద్ ఖండించింది. తాను పారితోషికం భారీగా పెంచేశానంటూ అబద్దపు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇటీవల కథలే వినలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికే ఏడాదికిపైగా పడుతుందని వివరించింది. ఈ చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే నూతన అవకాశాలను అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అలాంటిది తానేదో పారితోషికాన్ని భారీగా పెంచాననే ప్రచారం అబద్దమని పేర్కొంది.