జైలు నుంచి విడుదల | gv prakash kumar jail shooting completed | Sakshi
Sakshi News home page

జైలు నుంచి విడుదల

Published Mon, Oct 1 2018 3:02 AM | Last Updated on Mon, Oct 1 2018 3:02 AM

gv prakash kumar jail shooting completed - Sakshi

జీవీ ప్రకాశ్‌కుమార్‌

జైలు నుంచి విడుదలయ్యారు నటుడు–సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌. ఏదైనా నేరం చేసి జైలుకి వెళ్లారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. జీవీ ప్రకాశ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలు’. వసంత బాలన్‌ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించి జీవీ ప్రకాశ్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. వసంతబాలన్‌ దర్శకత్వంలో 2006లో వచ్చిన ‘వెయిల్‌’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయం అయిన జీవీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో హీరోగా నటించారు. ఈ సినిమాకు కూడా జీవీనే స్వరకర్త. ‘‘జైలు’ సినిమా షూటింగ్‌ పూర్తయింది. సహకరించిన టీమ్‌కు థ్యాంక్స్‌. మంచి స్క్రిప్ట్‌’’ అన్నారు జీవీ. ఇందులో లోకల్‌ ప్రాబ్లమ్స్‌ను సాల్వ్‌ చేసే లోకల్‌ హీరోగా కనిపిస్తారు జీవీ ప్రకాశ్‌. ఈ సినిమానే కాకుండా దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నారు జీవీ ప్రకాశ్‌కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement