ఐదు అక్షరాల బూతు! | Why the outrage over Jyothika swearing in 'Naachiyaar' trailer | Sakshi
Sakshi News home page

ఐదు అక్షరాల బూతు!

Published Fri, Nov 17 2017 12:40 AM | Last Updated on Fri, Nov 17 2017 12:40 AM

 Why the outrage over Jyothika swearing in 'Naachiyaar' trailer - Sakshi

యస్‌.. అక్షరాలా ఐదు అక్షరాల బూతు. తమిళంలో అయితే ఆ బూతుకి ఇంకొన్ని అక్షరాలుంటాయి. జ్యోతిక ఏమాత్రం మొహమాటపడకుండా ఆ బూతు మాట అనేశారు. ఇది సినిమా కోసం మాట్లాడిన డైలాగే అయినా.. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో? విమర్శిస్తారేమో అనే భయం లేకుండా జ్యోతిక ఆ డైలాగ్‌ చెప్పేశారు. చెప్పించింది ఎవరో కాదు.. దర్శకుడు బాల. ‘శివపుత్రుడు’, ‘వాడు–వీడు’ వంటి విభిన్న చిత్రాలకు చిరునామా ఈ దర్శకుడు.

జ్యోతిక టైటిల్‌ రోల్‌లో తమిళంలో బాల ‘నాచ్చియార్‌’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. సంగీతదర్శకుడి నుంచి హీరోగా మారిన జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు. జ్యోతిక పోలీసాఫీసర్‌. జీవీ ఏమో మురికివాడలకు చెందిన కుర్రాడు. ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. ఒక కుర్రాణ్ణి (జీవీ) పోలీసులు తరిమి తరిమి పట్టుకుని, స్టేషన్‌కి తీసుకు వస్తారు. స్టేషన్‌లో పోలీసాఫీసర్‌ నాచ్చియార్‌ (జ్యోతిక) అతని చెంప చెళ్లుమనిపించి, ‘తెవి.....’ అని తిడుతుంది.

అంటే... ‘ల.....’ అని అర్థం. టీజర్‌ చివర్లో ఉన్న ఈ బూతు పదం విని, సెన్సార్‌ ఎలా ఒప్పుకుంటుంది? అని చర్చించుకుంటున్నారు. బలమైన సీన్‌ లేకపోతే బాల అలాంటి డైలాగులు పెట్టరన్నది కొందరి వాదన. మరి.. టీజర్‌ వరకే ఈ పదం ఉంటుందో? లేక సెన్సార్‌ కత్తెరకు గురై, సినిమాలో నిశ్శబ్దం అవుతుందో వేచి చూద్దాం. ఆ సంగతలా ఉంచితే... ఈ టీజర్‌లో జ్యోతిక కొన్ని సెకన్లే కనిపించినా, ఆమె నటనకు మార్కులు పడ్డాయి. మామూలుగానే బాలా సినిమాలంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఈ టీజర్‌ మరిన్ని అంచనాలను పెంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement