గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
Published Sun, Sep 25 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
వాడపల్లి (కొవ్వూరు రూరల్): వాడపల్లిలోని గోదావరి నది విఘ్నేశ్వర స్నానఘట్టం వద్ద శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కొవ్వూరు ఎస్సై గంగాభవాని తెలి పిన వివరాల ప్రకారం మృతురాలి వయసు 45 నుంచి 50 ఏళ్లు ఉండవచ్చని, గుర్తుపట్టలేని విధంగా మృతదేహం గోదావరి ఒడ్డున పడిఉం దన్నారు. శరీరంపై పసుపు రంగు చీర, జాకెట్, కుడి చేతి మణికట్టుపై ‘శ్రీ’ అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ లేదా ఎస్సై సెల్: 73826 23702కు సమాచారం అందించాలని కోరారు.
Advertisement
Advertisement