చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
వాడపల్లి(దామరచర్ల)
తెలంగాణా రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దామరచర్ల మండలం వాడపల్లి చెక్ పోస్టులపై శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సరిహద్దులో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ,రవాణా శాఖ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో కొంత మేర నగదు దొరికనట్లు సమాచారం.అయితే దీనిపై పూర్తివివరాలు తెలిపేందుకు సంబంధిత శాఖల అధికారులు నిరాకరించారు.