- వధువులుగా శ్రీ, భూదేవుల అలంకరణ ∙
- పట్టు వస్రా్తలు సమర్పించనున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
- కల్యాణ సంరంభానికి వేదికైన వాడపల్లి
వెంకన్న కల్యాణానికి తరలండి..
Published Thu, Apr 6 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
వాడపల్లి (ఆత్రేయపురం) :
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున భరద్వాజ గోత్ర పాలకుడు వేంకటేశ్వరుని సుగంధ ద్రవ్యాలు పూల పరిమళాలతో నవ వరునిగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడి గ్రామానికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలు, మేళతాళాలతో భార్గవ గోత్ర నామాలతో శ్రీదేవిని , కాశ్యప గోత్ర నామాలతో భూదేవిని వధువులుగా అలంకరించి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ అనంతరం దర్శనాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణ మూర్తి మాట్లాడుతూ చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారం వాడపల్లి ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, గోవింద నామస్మరణల మధ్య శ్రీ, భూ, వేంకటేశ్వరలకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సాయంత్రం 7 గంటలకు కల్యాణం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవం, పది గంటలకు గౌతమి గోదావరిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. స్వామి కల్యాణానికి శాసన మండలి డిప్యూటీ చైర్మ¯ŒS , ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు దంపతులు, ఆర్‌డీవో గణేష్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను స్వామికి బçహూకరిస్తారన్నారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవోలు ఏర్పాట్లు పూర్తిచేశారు.
Advertisement