venkanna swamy
-
మహిమాన్వితుడు తంటికొండ వెంకన్న
గోకవరం(జగ్గంపేట) : మండలంలోని తంటికొండ గ్రామంలో వెంకటగిరి కొండపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొండపై స్వయంభువుడుగా వెలసిన స్వామి కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందాడు. ప్రహ్లాదుని మొరను ఆలకించిన శ్రీమహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరించడానికి నరసింహ అవతారం ధరించాడు. స్తంభంలోంచి బయటకు వచ్చి వాడిగోళ్లను ఆ హరిద్వేషిని అంతమొందిచాక మహారౌద్ర రూపంలో కొండలు కోనలు తిరిగాడు. ఆ సమయంలో తంటికొండను పావనం చేసి ఉండవచ్చని భక్తుల నమ్మకం. ఏటా భక్తుల రాకతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో స్వామి వారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మ¯ŒS బద్దిరెడ్డి అచ్చన్నదొర, ఈఓ బీడీపీ రామారావుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థల పురాణం : స్థానిక ఐతిహ్యం ప్రకారం.. పూర్వం గ్రామంలో ఉన్న కొండపై దివ్యతేజస్సు కనిపించేది. అక్కడికి వెళ్లాలంటే జనానికి జంకు. ఆ కాంతి తమను భస్మం చేస్తుందేమోనన్న భయం. తరువాత కాలంలో కొందరు యువకులు ధైర్యం చేసి నిత్యం కనిపించే తేజస్సు కోసం కొండంతా గాలించగా దివ్యకాంతితో అలరారుతున్న పాదముద్ర దర్శనమిచ్చింది. నిర్మానుష్యమైన కొండపై కాలిగుర్తు కనిపించడం దైవసంకల్పమని భావించి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ భక్తుడి కలలో కనిపించి ‘నేను నారసింహుడి అవతారంలో ఈ కొండపై సంచరించాను. అప్పుడే ఆ పాదముద్ర పడింది. ఈ ప్రాంతం భవిష్యత్తులో మహిమాన్విత క్షేత్రమవుతుందని, ఇక్కడ వేంకటేశ్వరుని ఆలయం నిర్మించండి’ అని ఆదేశించాడు. మరోచోట ఆవు కాళ్ల ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. విష్ణుమూర్తి గోరూపంలో సంచరిస్తుండగా ఆ గుర్తులు పడ్డాయని భక్తుల భావన. 1961లో కొండపై ఆలయ నిర్మాణానికి ప్రతిష్ఠ జరిపారు. నాటి నుంచి నేటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. -
వెంకన్న కల్యాణానికి తరలండి..
వధువులుగా శ్రీ, భూదేవుల అలంకరణ ∙ పట్టు వస్రా్తలు సమర్పించనున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు కల్యాణ సంరంభానికి వేదికైన వాడపల్లి వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు గురువారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున భరద్వాజ గోత్ర పాలకుడు వేంకటేశ్వరుని సుగంధ ద్రవ్యాలు పూల పరిమళాలతో నవ వరునిగా అలంకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడి గ్రామానికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాలు, మేళతాళాలతో భార్గవ గోత్ర నామాలతో శ్రీదేవిని , కాశ్యప గోత్ర నామాలతో భూదేవిని వధువులుగా అలంకరించి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటలకు స్వామి వారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ అనంతరం దర్శనాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఈవో బీహెచ్వీ రమణ మూర్తి మాట్లాడుతూ చైత్రశుద్ధ ఏకాదశి శుక్రవారం వాడపల్లి ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాలు, గోవింద నామస్మరణల మధ్య శ్రీ, భూ, వేంకటేశ్వరలకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం సాయంత్రం 7 గంటలకు కల్యాణం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవం, పది గంటలకు గౌతమి గోదావరిలో హంస వాహనంపై తెప్పోత్సవం నిర్వహిస్తామన్నారు. స్వామి కల్యాణానికి శాసన మండలి డిప్యూటీ చైర్మ¯ŒS , ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం దంపతులు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు దంపతులు, ఆర్డీవో గణేష్కుమార్తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను స్వామికి బçహూకరిస్తారన్నారు. ఆలయ కమిటీ చైర్మ¯ŒS కరుటూరి నరసింహరావు, ఈవోలు ఏర్పాట్లు పూర్తిచేశారు.