
ఏపీ ఎన్‌జీవోస్ రాకతో నిలిచిపోయిన పెళ్లి
ఎన్‌జీవోస్ ప్రతినిధులపై దాడి
పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ..
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో తాళికట్టే సమయానికి ఏపీ ఎన్‌జీవోస్(AP NGOs) ప్రతినిధులు వచ్చి మంగళవారం ఓ వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్‌సన్ అందించిన వివరాలు.. 2013లో హెచ్‌ఐవీ పాజిటివ్(HIV Positive) నిర్ధారణ అయి, ప్రస్తుతం 35 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడు.
అయితే ఓ యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో ఆరోగ్యంగా ఉన్న యువతిని అనారోగ్యం బారిన పడకుండా కాపాడేందుకు ఏపీ ఎన్‌జీవోస్(AP NGOs) మహిళా ప్రతినిధులు క్రిస్టియన్‌పేట వచ్చి చర్చి పాస్టర్‌కు వివరించారు. అమ్మాయి బంధువులతో పెళ్లి కొడుకుకు హెచ్‌ఐవీ(HIV Positive) ఉందని చెప్పడంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. వివాహం నిలిపివేయడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులతో గొడవకు దిగారు. వివాహం చేసే పాస్టర్, హెచ్‌ఐవీ పాజిటివ్ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని మాట్లాడడంతో పెళ్లికొడుకు బంధువులు అక్కడ ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు.
ఏపీఎన్‌జీవోస్ అధికారులు మేము బహిరంగం చేయాలను కోవడం లేదని, ఇక్కడ గొడవ చేయవద్దని మా వారు వేడుకుకున్నప్పటికీ వినకుండా వీరిపై దాడి చేశారని హెచ్‌ఐవీ డిస్ట్రిక్ ప్రాజెక్ట్ మేనేజర్ తెలిపారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు, ఘటనా స్థలానికి వచ్చారు. మా సిబ్బందిపై దాడిచేసి ఫోన్‌లు లాక్కున్నారని, మా ఎన్‌జీవోస్ ఫోన్‌లు ఇప్పించాలని ఆయన పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment