HIV positive
-
ఒకే సిరంజీ.. హెచ్ఐవీ సోకడంతో బయటకు నెట్టేశారు
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలో ఓ డాక్టర్ పేషెంట్లందరికీ ఒకే సిరంజీతో సూది మందులు ఇవ్వగా.. ఓ బాలికకు హెచ్ఐవీ సోకింది. అయితే బాలికకు హెచ్ఐవీ నిర్ధారణ అయ్యాక సిబ్బంది ఆమెను బలవంతంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. బాధిత తల్లిదండ్రుల కథనం ప్రకారం.. యూపీ ఎటాహ్ జిల్లా రాణి అవంతి బాయి లోధా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్ అప్పటికే కొందరు షేషంట్లకు వాడిన సిరంజీతో ఇంజెక్షన్ చేశాడు. ఆ సమయంలో పేరెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేసినా.. సిబ్బంది పట్టించుకోకుండా ఇంజెక్షన్ వేశాడు. ఆ తర్వాత అదే సిరంజీని మరికొందరికి వాడాడు కూడా. ఆపై కొన్నిరోజులకు చిన్నారికి రక్త పరీక్షల్లో హెచ్‌ఐవీగా తేలింది. దీంతో రాత్రికి రాత్రే ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ ఘటనపై శనివారం ఆమె తల్లిదండ్రులు జిల్లా న్యాయాధికారి(కలెక్టర్) అంకిత్ కుమార్ అగర్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాథక్ స్పందిస్తూ.. ఘటనపై సమగ్ర వివరణ కోరామని, డాక్టర్‌ది తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. मेडिकल कॉलेज,एटा में चिकित्सक द्वारा एक ही सिरिंज से कई मरीजों को इंजेक्शन लगाए जाने एवं एक बच्चे की जाँच रिपोर्ट एचआईवी पॉजिटिव मिलने संबंधी प्रकरण का तत्काल संज्ञान लेते हुए मेरे द्वारा प्रधानाचार्य,स्वशासी राजकीय मेडिकल कॉलेज एटा से उक्त संबंध में स्पष्टीकरण मांगा गया है (1/2) — Brajesh Pathak (@brajeshpathakup) March 4, 2023 -
ఎయిడ్స్ విజృంభణ.. 3,380 మంది మృతి!
ఖమ్మం వైద్యవిభాగం : జిల్లాలో ఎయిడ్స్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ప్రతీనెల మరణాలు నమోదవుతున్నాయి. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా నివారణ చర్యలు తీసుకుంటున్నా వ్యాధి వ్యాప్తి ఆగడం లేదు. అయితే, ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు అంతగా లేకపోవటంతో వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రతీనెల 50కి పైగా హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే! అనధికారికంగా చాలా మంది వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 1న ఎయిడ్స్ డేగా జరుపుకుంటున్న నేపథ్యాన కథనం. 3,380 మంది బాధితులు మృతి జిల్లాలో ఎయిడ్స్ బారిన పడి మృతి చెందే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2006 నుండి ఇప్పటి వరకు 3,380 మంది మృతి చెందగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 310 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 47,487 మందికి హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు జరపగా 310 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ఇందులో 28,105 గర్భిణుల్లో పరీక్షలు చేయగా11 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. అలాగే, 15 ఏళ్లలోపు పిల్లలు 80 మంది వ్యాధితో బాధపడుతున్నారు. కాగా, హెచ్ఐవీ బాధితుల కోసం జాగృతి, ఇతర స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నాయి. ఇక జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కోసం నాలుగు ఐసీటీసీ కేంద్రాలు, 36 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలు, ఒక ఏఆర్టీ కేంద్రం, రెండు లింక్ ఏఆర్టీ కేంద్రాలు, ఒక సురక్ష క్లినిక్, 9 రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యాన అటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యాన మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి్సన ఆవశ్యకత ఉందని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 16,307 పాజిటివ్ కేసులు జిల్లాలో గత ఏడాది 15,995 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతం సంఖ్య పెరిగింది. ఇప్పు డు జిల్లాలో 16,307 పాజిటివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా తెలుస్తోంది. వీరు ఖమ్మం ఏఆర్టీ కేంద్రంలో పేర్లు నమోదు చేసుకున్న వారే కాగా, పేర్లు నమోదు చేసుకోని వారి కూడా ఉంటారని సమాచారం. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారిలో ప్రతీనెల క్రమం తప్పకుండా 6,160 మంది మందులు వాడుతుండగా, 2,780 మంది పెన్షన్ పొందుతున్నారు. తెలంగాణలో ఎయిడ్స్ బాధితుల్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్ తర్వాత ఖమ్మం మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఎయిడ్స్‌ను తరిమికొట్టేందుకు కృషి జిల్లా నుంచి ఎయిడ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. వ్యాప్తిని అరికట్టేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మందుల కొరత లేకుండా చూస్తూ, బాధితులందరూ మందులు వాడేలా చూస్తున్నాం. పీహెచ్‌సీలకు వచ్చే వారిలో 10 శాతం తక్కువ కాకుండా హెచ్ఐవీ టెస్టులు చేయిస్తున్నాము. ర్యాలీలు, కళాజాతాల ద్వారా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ ఎల్. ప్రవీణ, అడిషనల్ డీఎంహెచ్ఓ, ఎయిడ్స్ అండ్ లెప్రసీ -
తలసీమియా బాధిత చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్.. అసలేం జరిగిందంటే..
సాక్షి, హైదరాబాద్: తలసీమియాతో బాధపడుతున్న తమ మూడేళ్ల కుమారుడికి ఓ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించడంతో(బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్) హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిందని, దీనికి కారణమైన బ్లడ్ బ్యాంక్‌పై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ మొగిలిచర్ల రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. పుట్టిన సమయంలో బాలుడిని పరీక్షించిన నిలోఫర్ వైద్యులు తలసేమియాతో బాధ పడుతున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు బాలుడికి గత రెండున్నరేళ్లుగా విద్యానగర్ అచ్యుతా రెడ్డి మార్గ్‌లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల 20న కూడా అతడికి రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఓ ఆస్పత్రిలో బాలునికి రక్త పరీక్షలు చేయించగా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. అనుమానంతో మరో ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేయించగా అక్కడ అదే ఫలితం రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రెండు ఆస్పత్రుల్లోనూ రక్త పరీక్షలు చేయించుకోగా వారికి నెగిటివ్ అని వచ్చింది. ఈ విషయమై సదరు బ్లడ్ బ్యాంక్ వైద్యులను ప్రశ్నించగా తాము అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతే దాతల నుంచి రక్తం సేకరిస్తామని చెప్పారు. తమ వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. దీంతో బాధిత బాలుడి తండ్రి నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు బ్లడ్ బ్యాంక్ నుంచి రికార్డులు తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. రక్తం ఎక్కించుకుంటున్న వారిలో ఆందోళన ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తం ఎక్కించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. తమకు హెచ్ఐవీ సోకిందేమోననే అనుమానంతో వారు ల్యాబ్‌లకు పరుగులు తీస్తూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారని సమాచారం. ఎలాంటి పొరపాటు జరుగలేదు రక్తం సేకరించే ముందు దాతలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే రక్తం సేకరిస్తాం. మా బ్లడ్ బ్యాంక్‌లో 20 పడకల ఆస్పత్రి ఉంది. తలసీమియా బాధితులకు ఉచితంగా రక్తం ఎక్కిస్తాం. గత రెండున్నరేళ్లలో బాధిత బాలుడికి బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రిలో 42 సార్లు రక్తం ఎక్కించాం. ఈ క్రమంలో గత నెలలో బాలుడిని పరీక్షించి హెచ్ఐవీ సోకిందని అతడి తండ్రికి ముందే చెప్పాం. బాలుడికి హెచ్ఐవీ సోకడంలో తమ బ్లడ్ బ్యాంక్ తప్పిదం ఏమీ లేదు. హెచ్ఐవీ సోకిన వారిలో విండో పీరియడ్ ఉంటుంది, ఆ విండో పీరియడ్ తర్వాతనే వ్యాధి నిర్ధారణ అవుతుంది. బ్లడ్ బ్యాంక్ ఆస్పత్రి రికార్డులు పూర్తిగా నల్లకుంట పోలీసులకు చూపించాం. – డాక్టర్ పిచ్చి రెడ్డి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ -
డబ్బు ఇవ్వలేదని.. జబ్బు అంటగట్టింది
ప్రొద్దుటూరు: కాన్పు చేసినందుకు డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో బాలింతకు ఏకంగా ఎయిడ్స్ వ్యాధిని అంటకట్టింది ఒక ఎఫ్ఎన్ఓ (స్టాఫ్‌నర్స్ సహాయకురాలు). దీంతో భార్య, పసికందు తనకు వద్దని భర్త తీవ్ర ఆవేదనతో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తీరిగ్గా వచ్చిన ఎఫ్ఎన్ఓ ఆమెకు ఎయిడ్స్ లేదని, డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఆ వ్యాధి సోకినట్లు చెప్పానని తెలిపింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం, సోమాపురం గ్రామానికి చెందిన బొజ్జ సుభాషిణి పురిటి నొప్పులు రావడంతో ఆదివారం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె సాధారణ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొంత సేపటి తర్వాత ఎఫ్ఎన్ఓ లత వారి వద్దకు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని అడిగింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి తెలిపింది. ఈ క్రమంలో సుభాషిణి, పసికందును చూసేందుకు సోమవారం ఆమె భర్త గురుప్రసాద్, అత్త జిల్లా ఆస్పత్రికి వచ్చారు. ఇంతలోనే వారి వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత మీ భార్యకు ఎయిడ్స్ ఉందని గురుప్రసాద్‌కు చెప్పింది. భార్య, పాప వద్దని రోదిస్తూ వెళ్లిపోయిన భర్త భార్యకు ఎయిడ్స్ ఉందని ఆమె చెప్పడంతో భర్త తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. రోదిస్తూ ఆస్పత్రిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొద్ది సేపటి తర్వాత తేరుకొని నాకు భార్య, బిడ్డ వద్దని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. దీంతో సుభాషిణి ఏడుస్తూ ఉండిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చిన ఎఫ్ఎన్ఓ లత నాకు డబ్బులు ఇవ్వనందుకే నీకు ఎయిడ్స్ ఉందని చెప్పానని, ఎలాంటి వ్యాధి లేదని తెలిపింది. ఈ విషయం మీ అత్త, భర్తకు చెప్పు అని సూచించి తిన్నగా అక్కడి నుంచి జారుకుంది. లతపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కాన్పు అయిన వారి వద్ద డబ్బు డిమాండు చేస్తోందని పలు మార్లు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు చర్యలు తీసుకోకుండా మందలించి పంపిస్తూ వచ్చారు. సుభాషిణి గర్భం దాల్చిన నాటి నుంచి జిల్లా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకునేది. ఈ క్రమంలోనే ఆమెకు ఈ ఏడాది జనవరి 31 హెచ్ఐవీ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం కూడా ఆమెకు మరోసారి పరీక్షలు చేయగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారు..ఇప్పుడేం చేయాలి ‘డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. రూ. 2 వేల కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా.. ఇప్పుడు నా పరిస్థితి ఏంటీ’ అని సుభాషిణి రోదించసాగింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో ఉదయం నుంచి ఎఫ్ఎన్ఓ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మా అత్తోళ్లు నన్ను వద్దంటున్నారని గుండె పగిలేలా విలపిస్తోంది. డబ్బు కోసం లేని జబ్బును తనకు అంట కట్టిందని ఆమె తెలిపింది. తనను, తన కుంటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురి చేసిన ఎఫ్ఎన్ఓ లతపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని సుభాషిణి జిల్లా అధికారులను వేడుకుంటోంది. ఈ విషయమై ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లతపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం ఈ విషయమై ఇప్పటికే విచారణ చేశాను. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించాం. జనవరి 31న, ఈ రోజు హెచ్ఐవీ పరీక్షలు చేయగా ఆమెకు నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – డేవిడ్ సెల్విన్‌రాజ్, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
హెచ్ఐవీ బాధితులకు పెళ్లి చేసిన కలెక్టర్
సాక్షి, బరంపురం(ఒడిశా): ఇద్దరూ భయంకరమైన రోగంతో పీడించబడుతున్నారు. ఏ క్షణాన మృత్యువు కబలిస్తుందో తెలియని విషమ పరిస్థితి. చంద్రుడిపై ఆవాసం ఏర్పాటు చేసేంతలా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎదిగినా.. సాటి మనుషులుగా వారిని ఆమోదించని సమాజం. వీటన్నిటినీ ఎదుర్కొని ఒక్కటయ్యింది ఓ కొత్త జంట. భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైన ఇద్దరు యువతీ, యువకులు వివాహ బంధంతో తమ పవిత్ర బంధానికి శ్రీకారం చుట్టారు. గోపాల్‌పూర్‌లోని శ్రాద్ధ సంజీవని హెచ్ఐవీ సేవాశ్రమం దీనికి వేదికైంది. స్వయంగా బరంపురం కలెక్టర్ విజయ్ అమృత కులంగా పెళ్లి పెద్దగా వ్యవహరించి, వివాహ తంతు నిర్వహించడం విశేషం. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆశీర్వదించారు. ఇలాగే 5–టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి విభాగం ప్రాజెక్ట్ చైర్మన్ సింధ్ దత్తాత్రేయ బహుసాహిబ్, బరంపురం మున్సిపాల్ కమిషనర్ శిద్ధేశ్వర్ బలిరామ్ బందరా, సబ్ కలెక్టర్ కీర్తి హాసన్ పాల్గొన్నారు. చదవండి: మొతేరాకు మోదీ పేరు, పప్పులో కాలేసిన భారత నెటిజన్లు పీఎం,సీఎం సార్లు.. నెట్వర్క్ సదుపాయం కల్పించండి! -
హెచ్ఐవీ బ్లడ్ కలకలం.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హెచ్ఐవీ బారిన పడగా.. తన కారణంగా రెండు జీవితాలు హెచ్ఐవీకి బలికావాల్సి వస్తోందని రక్తం దానం చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలొదిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులంటే వణకు పుట్టేలా చేస్తోంది. సాక్షి, చెన్నై : గర్భిణికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఎక్కించిన వివాదం పెనుభూతంగా మారిపోగా ఇందుకు కారకులైన బ్లడ్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వం మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిస సంగతి తెలిసిందే. కాగా, రక్తదానం చేసిన యువకుడు (19) తీవ్ర మనస్తాపంతో ఎలుకలమందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలొదిలాడు. అయితే, మృతుడి తల్లిదండ్రులు తమ కుమారుడి మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. (ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్!) బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన తమ కొడుకు శుక్రవారం వరకు బాగానే ఉన్నాడని తెలిపారు. డాక్టర్లు వచ్చి ఏదో సూదిమందు ఇచ్చిన తర్వాతనే అతని ఆరోగ్యం క్షీణించిందని ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మృతి వెనుక కారణాలను వెలికితీసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ స్వీకరించిన హైకోర్టు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో సోమవారం పలు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో పోస్టుమార్టం చేయాలనీ, ఆ ప్రక్రియనంతా వీడియోలో చిత్రీకరించాలని రాజాజీ ప్రభుత్వాస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. అయితే, హెచ్ఐవీ సోకిన శరీరానికి 72 గంటలలోపు పోస్టుమార్టం చేయడం కుదరదని ఆస్పత్రి డీన్ షణ్ముగసుందరం కోర్టుకు విన్నవించారు. అలా చేస్తే డాక్టర్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనల ప్రకారమే పోస్టుమార్టం చేయాలని కోర్టు వెల్లడించింది. వీడియో చిత్రీకరణ చేయాలని పునరుద్ఘాటించింది. (మరో గర్భిణికి హెచ్ఐవీ రక్తం) -
పాజిటివ్ పీపుల్ - ది రియల్ హీరోస్
సాక్షి : ఈ వ్యాసం వ్రాసే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల ప్రాధాన్యత సంతరించుకొన్న గ్లోబర్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్ ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీల ప్రాధాన్యతను వారి యొక్క పాత్రను తెలియజేస్తూ అప్పుడే జరిగిన ‘‘అమరావతి డిక్లరేషన్’’. ఈ రెండు ఈవెంట్లలో స్త్రీలు ప్రముఖ పాత్రను పోషించం ఎంతైనా హర్షింపదగ్గ విషయం. ఇదే సమయంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినం కూడా జరుగుతున్నది. ఆలోచన చేస్తే ఎయిడ్స్‌ని ధైర్యంగా ఎదుర్కొని, తాము జీవిస్తూ, తమ కుటుంబాలను పోషిస్తూ సమాజానికి సేవ చేస్తున్న రియల్ హీరోలు ఎందరో గుర్తుకు వస్తున్నారు. ఎయిడ్స్‌ను గురించి నాకు అవగాహన, దానిని డీల్ చేయటంలో నాకు స్ఫూర్తినిచ్చిన నా రియల్ హీరో(పేరు వ్రాయడం లేదు) గురించి వ్రాయాలని అనిపించింది. ఆమె వయస్సు దాదాపు 30 సంవత్సరాలు ఉండేది. తాను పాజిటివ్ పర్సన్ అని తెలిసిన తరువాతనే మా ఇద్దరి పరిచయం ఇంకా బలపడింది. తనను చూస్తే ఆమె చాలా ఆరోగ్యంగా అందరి కంటే హుషారుగా పనిచేసేది. ఆమె తన కుటుంబాన్ని పోషిస్తూ ఎందరో పాజిటివ్ పర్సన్స్‌ని ధైర్యంగా ముందుకు నడిపించేది. ఆత్మనూన్యత అనే పదం ఆమె దరిదాపుల్లో ఉండేది కాదు. మేము అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం, ఒకరి గ్లాసులో ఒకరం నీళ్ళు త్రాగేవాళ్ళం. నా రియల్ హీరో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ మీద పూర్తి పరిజ్ఞానం కలిగి, ఎయిడ్స్ ఎలా వస్తుందో దానిని ఎలా నివారించాలో చక్కని క్లాసులు నిర్వహించేది. ఆమె, ఆమె లాంటి ఎందరో నా పాజిటివ్ సోదరీలు, సోదరులు ఇచ్చిన స్ఫూర్తి నా జీవితంలో ఎలాంటి క్లిష్టపరిస్థితిని అయినా ఎదుర్కొగలనని ధైర్యాన్నిచ్చింది. ప్రస్తుతం ఆమె మా మధ్యలో లేకపోయిన ఆమె మాకు ఇచ్చిన స్ఫూర్తి చూయించిన ధృడ సంకల్పం ఎప్పటికీ మరువలేనిది. ఈ సందర్భంగా పాజిటివ్ పర్సన్స్‌తో సమాజం, సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వాలు పాజిటివ్ పర్సన్స్‌తో ఎలా కలిసి జీవించాలో అంతర్జాతీయ శ్రామిక సంస్థ(ILO) భారత ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంధ సంస్థలు పాటిస్తున్న నియమనిబంధనలను క్రోడికరిస్తున్నాను. 1. మనం పని చేసే ప్రాంతాలలో హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రబలకుండా యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి మీద సిబ్బందికి పూర్తి అవగాహన కలిపించాలి. 2. మనతో పని చేస్తున్న మన సహచర పాజిటివ్ పర్సన్స్ ఎలాంటి వివక్షతకు గురికాకుండా మనందరితో సమానంగా చూసుకోవాలి. దీనికి పూర్తి బాధ్యత యాజమాన్యం తీసుకోవాలి. 3. ఆఫీసులో పని ప్రాంతాలలో స్త్రీలు లింగ వివక్షతకు గురికాకుండా చూడాలి. 4.పనిచేసే ప్రాంతాలలో పాజిటివ్ పర్సన్స్‌కి ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. 5. సిబ్బంది నియామక సమయాల్లో HIV/AIDS సంబంధిత వ్యక్తిగత విషయాలు అడుగకూడదు. 6. HIV/AIDS ఉందని తెలిస్తే ఆ విషయాన్ని గుప్తంగా ఉంచాలి. ఎటువంటి పరిస్థితుల్లో బహిరంగపరచకూడదు. HIV/AIDS ఉన్నవారు పనిలో చేరవచ్చును.. అదే విధంగా పనిలో కొనసాగవచ్చు. HIV/AIDS ఉన్నదని ఒక వ్యక్తిని పనిలో నుంచి తీసివేయ్యటానికి వీలులేదు. ఉద్యోగం అన్నది అతడు లేక ఆమె యొక్క జీవన భద్రత హక్కు, ఆరోగ్యకరమైన ఆహారం, మందులు వేసుకుంటే ఎన్నిరోజులైన పనిచేయవచ్చును. 7. పాజిటివ్ పర్సన్స్‌కు వీలైనంత వరకు ఒత్తిడిలేని పనిని ఇవ్వాలి. వారి ఆరోగ్యం, పౌష్టికాహారం గురించి ఆలోచించాలి. అందరూ కలిసి ఆరోగ్యకరమైన పని వాతావరణంలో పని చేయుటకు యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ నెల 2017లో కేంద్ర ప్రభుత్వం HIV/AIDS సంబంధించి ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో ముఖ్యంగా పాజిటివ్ పర్సన్స్ ఎలాంటి వివక్షకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది, వ్యవస్థలది, సంస్థలది. ముఖ్యంగా HIV/AIDS సోకిన వ్యక్తిని దూరంగా ఉంచడం, వేరే ఇంటిలో ఉంచడం, పనిలో వారి మీద వివక్షత చూపడం లాంటి విషయాలు జరుగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. చట్టాలు ఒకప్రక్కన ఉన్నప్పటికీ మన ఆలోచన విధానాలలో మార్పు ఎంతైన ఉన్నది. HIV/AIDS ఉన్న వ్యక్తితో కలిసి భోజనం చేసినా, వారి బట్టలు వేసుకున్నా, కలిసి ప్రయాణం చేసినా HIV/AIDS రాదు. వారిని మన కుటుంబంలో, మన పనిలో ఒక భాగంగా చూడాలని ‘‘నా ఆరోగ్యం- నా హక్కు’’ అనే నినాదంతో HIV/AIDS ను ధైర్యంగా ఎదుర్కొని దానిని నివారిద్దాం. గ్రేస్ నిర్మల మల్లెల సామాజిక కార్యకర్త 9059407946 -
'నేను డర్టీ అయ్యాను..నన్నెవరూ ప్రేమించరు'
అరిజోనా: కొంతమంది జీవితాలు పరిశీలిస్తే నిజంగా విధిరాత ఉందేమో అనిపిస్తుంటుంది. కళ్లముందే అందనంత ఎత్తులో ఉన్నవారు ఒక్కోసారి అమాంతంపడిపోతారు. అది కూడా ఇంకెప్పటికీ లేవనంత స్థితిలోకి దిగజారేలా. అచ్చం ఇలాంటి సంఘటన ఓ అందాల భామ జీవితంలో చోటుచేసుకుంది. ఎరిన్ డాల్బీ అనే మహిళ 1996 ప్రాంతంలో ఒక వెలుగు వెలిగింది. మిస్ అరిజోనాగా బంగారు కిరీటాన్ని దక్కించుకుంది. కానీ, ఆ ముచ్చట ఎంతోకాలం నిలవలేదు. స్నేహితుల పుణ్యమో.. వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదమో మొత్తానికి మత్తుపదార్థాలకు బానిసగా మారింది. అది కూడా మిస్ అరిజోనాగా నిలిచిన మూడేళ్లకే. 1999లో ఆమె డ్రగ్స్ బానిసత్వం విపరీతంగా మారి 2010 వరకు అంటే దాదాపు పదేళ్లపాటు కొనసాగింది. ఆ పదేళ్లలో ఏమేం చేసిందో ఆమెకే తెలియలేదు. మత్తులో తూగింది. 34 ఏళ్లు వచ్చేసరికి ఇక ఆమె సమాజంలో ఎక్కువగా తిరగలేనని గుర్తించింది. కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండలేనని నిర్ధారించుకుంది. ఎందుకంటే అనారోగ్యం కారణంగా వైద్యుల వద్దకు వెళ్లిన ఆమెకు ఓ భయంకరమైన విషయం తెలిసిందే. ఆమె హెచ్ఐవీ బారిన పడినట్లు వైద్యులు చెప్పారు. ఆ సమయంలో తన మనసులో తనకుతాను 'నేను పనికిమాలినదాన్ని.. నేను పూర్తిగా చెడిపోయాను. ఇక నన్నెవరూ ప్రేమించరు. నేను చనిపోతాను' అని అనుకొని కుమిలిపోయింది. ఆమె ఆలోచన తీవ్రతను ముందే గమనించిన వైద్యులు మానసిక వైద్యుడిని ఆమె వద్దకు పంపించడంతో అతడు ఆమెకు ధైర్యం నూరిపోశాడు. మళ్లీ సాధారణ జీవితం గడపవచ్చని బోధించి ధైర్యం చెప్పాడు. ప్రత్యేకమైన వైద్యం చేయించుకోవడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించవొచ్చన్నాడు. అతడు చెప్పిన ప్రకారం ఆమె నడుచుకుంది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఆమెకు తొమ్మిది నెలల బాబు, భర్తతో కలిసి ఆనందంగా ఉంటూ హెచ్ఐవీపై సమాజానికి అవగాహన కల్పించే పోరాటాన్ని చేస్తూ హాయిగా జీవితాన్ని గడుపుతోంది. -
బాయ్‌ఫ్రెండ్‌కు హెచ్ఐవీ ఉందని కారుతో గుద్దేసి..
అరిజోనా: తన బాయ్ ఫ్రెండ్‌కు హెచ్ఐవీ ఉందని తెలిసి ఓ గర్ల్‌ఫ్రెండ్ అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. సైకిల్ పై వెళుతున్న అతడిని బలంగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో అతడు గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తు ఎగిరిపడ్డాడు. దాదాపు ఓ రెండు నిమిషాలపాటు అలాగే కదలకుండా పడిపోయిన అతడు మెల్లగా లేచి కొద్ది దూరం నడవగలిగి మరోసారి కుప్పకూలాడు. చుట్టుపక్కలవారి సహాయంతో తిరిగి ఆస్పత్రిలో చేరాడు. అదృష్టం కొద్ది ప్రాణాలుపోలేదు. అయితే, గాయాలు మాత్రం తీవ్రంగా అయ్యాయి. ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించిన ఈ దృశ్యం అరిజోనాలోని పోనిక్స్లో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు. మిస్టీ లీ విక్కీ అనే మహిళ ఆరోజు కారు నడిపిందని, ఆమె ఆ సైక్లిస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని పోలీసులు కనిపెట్టారు. మరి ఎందుకు అలా చేసిందని వాకబు చేయగా అతడికి హెచ్ఐవీ ఉందని, ఆ విషయం తనతో చెప్పలేదనే ఆగ్రహంతో అతడిని చంపేయాలనుకుందని తెలిసింది. ఈ మేరకు పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారు. -
అమ్మానాన్న పొమ్మన్నారు... కలెక్టర్ ఆదుకున్నారు!
తిరువనంతపురం: హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం.. ఆ తర్వాత వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి(20) నెమ్మదిగా కోలుకుంటోంది. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో గత నెలలో చోటచేసుకుంది. కన్నవాళ్లు కాదన్నా... జిల్లా కలెక్టర్ పి బాలకిరణ్ ఆమెకు అండగా నిలిచారు. ఆ యువతి(20) తిరిగి తన చదువును కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ యువతిని తిరిగి కాలేజీలో జాయిన్ చేసి ఆమెకు మనోధైర్యాన్ని అందించారు. తనకు అన్ని విధాలా సాయం చేసిన కలెక్టర్ కు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపింది. కలెక్టర్ బుధవారం కాలేజీ విద్యార్థులు, ఆమె తల్లిదండ్రులకు హెచ్ఐవీపై అవగాహనా కల్పించడంతో పాటు యువతికి సహకరించాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అసలు విషయం ఇది.. తనకు సోకిన వ్యాధి గురించిన విషయాన్ని ఇటీవలే ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థిని బయటపెట్టింది. ఆమెతో ఉండేందుకు తోటి విద్యార్థులు నిరాకరించారు. తోటి విద్యార్థినులు రూమ్స్ ఖాళీ చేయడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఆ కాలేజీ యాజమాన్యం అక్కడ నుంచి పంపేసింది. హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి వెళ్లగొట్టారు. కాలేజీ నుంచి పంపించిన విషయాన్ని ప్రిన్సిపాల్ పీఏ జునైద్ కూడా అంగీకరించారు. అయితే ఆ విద్యార్థిని ఇక ఏ గత్యంతరం లేక కన్నవారి వద్దకు వెళ్లింది. అక్కడ కూడా ఆమెకు ఆదరణ కరువైంది. తనకు ఎవరూ అండగా లేరని మనస్తాపం చెందిన యువతి గత నెలలో ఆత్మహత్యకు యత్నించింది. చివరకు ఎలాగోలాగ ప్రాణాలతో బయటపడింది. -
హెచ్ఐవి పాజిటివ్ అని గెంటేశారు
కోలకత్తా: హెచ్ఐవి పాజిటివ్ అని తేలిన ఓ చిన్నారిని స్కూలు నుంచి గెంటేసిన వైనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఓ వైపు ఎయిడ్స్ అంటువ్యాధి కాదని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాల ఇంత అమానుషంగా ప్రవర్తించడం వివాదాన్ని రేపింది. రాష్ట్ర రాజధాని నగరం కోలకతాకు కూతవేటు దూరంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూలు నుంచి గెంటేశారు. కాగా ఆ విద్యార్థి తల్లి ....తనకు, తన కుమారుడికి వ్యాధి ఉన్న సంగతిని ముందే స్కూలు యాజమాన్యానికి తెలిపింది. తాను ఎయిడ్స్ వ్యాధి అవగాహన సంస్థలో పనిచేస్తున్నాననే సమాచారాన్ని కూడా ఇచ్చింది. అయితే ముందు ఎలాంటి అభ్యంతరం చెప్పని యాజమాన్యం, తరువాత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి, పిల్లవాడిని క్లాసులకు రావద్దంటూ ఆదేశించింది. తోటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... బాధిత విద్యార్థిని అందరూ చూస్తుండగానే రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నా స్కూల్ యాజమాన్యం ఏమాత్రం అడ్డుకోలేదు. దీనికితోడు మళ్లీ స్కూలు రావద్దంటూ ఆచిన్నారిని ఆదేశించి దారుణంగా అవమానించింది. విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తన చర్యను యాజమాన్యం సమర్ధించుకుంది. దీనిపై విద్యార్థి తల్లి అభ్యంతరం వ్యక్తం చేసింది. పిల్లల తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు అమానుషంగా ప్రవర్తించడాన్ని తప్పు బట్టింది. -
అలనాటి బాల నటుడికి ఎయిడ్స్
లాస్ ఎంజెల్స్: అలనాటి హాలీవుడ్ బాల నటుడు, ప్రస్తుతం 'హు ఈజ్ ది బాస్' కార్యక్రమం స్టార్ డాన్నీ పింటారో ఒక్కసారిగా షాక్ గురయ్యే అంశం తెలిపాడు. తనకు ఎయిడ్స్ ఉందని బహిరంగంగా ప్రకటించాడు. గత పన్నేండేళ్లుగా ఈ వ్యాధి బారినపడి బాధపడుతున్నానని చెప్పాడు. గత శనివారం 'ఆప్రా: వేర్ ఆర్ దే నౌ' అనే ఎపిసోడ్ సందర్భంగా టాక్ షో క్వీన్ ఆప్రా విన్ఫ్రే తో మాట్లాడుతూ.. 'నాకు హెచ్ఐవీ వైరస్ 2003లోనే సోకింది. చాలా కాలంగా ఈ విషయం బయటకు చెప్పుదామనుకున్నాను. కానీ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఇదే సరైన సమయం అని భావించి చెబుతున్నాను' అంటూ తనకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపాడు. గతంలో బాలనటుడిగా ఉన్న పింటారోకు ప్రస్తుతం 39 ఏళ్లు. 1997లో స్వలింగ సంపర్కుడిగా మారాడు. అప్పటి నుంచి గేలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తాను గే పిల్లలకు స్ఫూర్తిగా ఉంటానని కూడా చెప్పాడు. అయితే, తనకు హెచ్ఐవీ ఉందని తెలియడంతో కాస్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. ప్రస్తుతం హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు తనవంతు సేవలు అందిస్తానని, వారిపట్ల సానుభూతితో ఉంటానని చెప్పాడు. స్వలింగ సంపర్కుడైన పింటారో తనకు హెచ్ఐవీ సోకిన తర్వాత 2014లో పరిచయమైన విల్ టేబరస్ అనే మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం. -
'నేను పాజిటివ్... నన్ను తాకండి'
మనుషులలో మానవత్వం రోజురోజుకు తగ్గిపోతుందని అందరు అంటుంటారు... కానీ సామాజిక స్పందనపై చేసిన ఓ సంఘటన అది తప్పు అని నిరూపించింది. జేన్ అంటిన్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం హెచ్ఐవీ సంక్రమించింది. అయితే తనకు ఆ వ్యాధి ఉందని చెబితే చుట్టుపక్కల వాళ్లు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని అతడు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిచ్చింది. ఈ తతంగాన్ని కెమెరాలో బంధించి ఆ తర్వాత వివరాలను నెట్ లో అప్లోడ్ చేయడంతో వీడియో హల్ చల్ చేస్తుంది. 'నేను హెచ్ఐవీ పాజిటివ్.. నన్ను తాకండి' అని రాసిన రెండు కాపీలు జేన్ తనకు ఇరువైపులా ఉంచి రద్దీగా ఉన్న ఓ స్ట్రీట్ లో నిలుచుంటాడు. తొలుత కొద్ది క్షణాలు ఎవరూ అతడిని తాకరు. ఆ తర్వాత ఒక్కక్కరుగా చాలా మంది అతనికి తాకుతారు. అతడిని తాకిన వారిలో చిన్నారులు, యువతీయువకులు, ఇతర అన్ని వయసుల వారు ఉండటం గమనార్హం. మరికొంతమంది ఏకంగా అతడిని కౌగిలించుకుని తమ ప్రేమను, సానుభూతిని తెలిపి మానవత్వాన్ని చాటుకోవడం విశేషం. తనను తాకిన వారందరికి జేన్ కృతజ్ఞతలు చెబుతుంటాడు. తన మనసులోని బాధను మరిచిపోయి, అతని కళ్లు చెమ్మగిల్లుతాయి. అవి కన్నీళ్లు ఏ మాత్రం కావు.. కొత్త వ్యక్తులు తను ఎవరో తెలియనప్పటికీ వారు చూపించిన అప్యాయతకి జేన్ ఆనందభాష్పాలు రాల్చాడు. -
శుభ పరిణామం
నల్లగొండ టౌన్ :జిల్లాలో గత ఐదేళ్లలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఎయిడ్స్ నివారణ కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస చేపట్టిన శుభంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా హెచ్ఐవీ పరీక్షల సంఖ్య పెరుగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య ఏటేటా తగ్గుతూ రావడం శుభపరిణామంగా వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పీపీటీసీటీలు 5, ఐసీటీసీలు 14, ఎఫ్ఐఐసీటీసీలు 37, పీపీపీలు 11, మొబైల్ ఐసీటీసీ 1సెంటర్‌తో పాటు మొత్తం 68 సెంటర్లలో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్ ఆస్పత్రిలో ఏఆర్టీ సెంటర్, అదే విధంగా భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట ఏరియా ఆస్పత్రుల్లో మూడు లింక్డ్ ఏఆర్టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటి ద్వారా హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ఉచితంగా వైద్య పరీక్షలు , గ్రూప్, వ్యక్తిగత కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తున్నారు. దీంతో పాటు ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 కౌంట్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. పరీక్షలు ఇలా.. జిల్లాలోని 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఫిసిలిటీ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్అండ్ టెస్టింగ్ సెంటర్(ఎఫ్‌ఐసీటీసీ)లు, జిల్లాలోని 11 ప్రైవేటు ఆస్పత్రులలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సెంటర్(పీపీపీ)లు ఉన్నాయి. ఈ కేంద్రాలలో గర్భిణులు, సామాన్య ప్రజ లు, ప్రమాదకర ప్రవర్తన కలిగిన వ్యక్తులకు ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు పరీక్ష లు నిర్వహిస్తున్నారు. అలాగే హెచ్ఐవీ పాజిటీవ్ కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అవగాహన కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రస్తుతం హెచ్ఐవీ పాజి టివ్ కేసుల నమోదు సంఖ్య తగ్గింది. ఐసీటీసీలతో పాటు మిగతా సెంటర్లలో ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలను నిర్వహించి పాజిటివ్ అని తేలితే వారిని జిల్లా కేంద్రంలోని ఏఆర్టీ సెంటర్‌కు పంపిస్తారు. ఏఆర్టీ సెంటర్లోని వైద్యాధికారులు వారికి ఉచితంగా సీడీ-4 కౌంట్ పరీక్షలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అలాగే అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో సీడీ-4 కౌంట్ పరీక్షలను నిర్వహించి 250 కంటే సీడీ-4 కణాలు తక్కువ ఉన్నవారికి ఎన్ఎన్ఆర్టీఐ, ఎన్ఆర్టీఐ మందులను అందజేస్తూ వారిని పరిశీలన, సంరక్షణ, కౌన్సెలింగ్ కోసం జిల్లాలోని మూడు ఆదరణ సంరక్షణ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడుతున్న వ్యక్తులకు వారి దగ్గరలోని లింక్డ్ ఏఆర్టీ సెంటర్లకు పంపించి మందులను ఉచితంగా అందజేస్తున్నారు. ఏఆర్టీ సెంటర్లలో క్రమతప్పకుండా వాడిన వేలాది మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల్లో సీడీ-4, బరువులో పెరుగుదల లేని వారిని వైద్యులు , కౌన్సిలర్లు పరీక్షించి సెకండ్‌లైన్ మందుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పిత్రికి పంపిస్తారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు, జిల్లా ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విరివిగా అవగాహన కల్పించడంతో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుతూ వస్తుంది. జిల్లాలో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల నమోదు వివరాలు సంవత్సరం పరీక్షల సంఖ్య పాజిటివ్ కేసులు శాతం 2002-03 4066 386 9.05 2003-04 8919 689 7.73 2004-05 14875 1017 6.84 2005-06 19571 1473 7.53 2006-07 32557 2164 6.65 2007-08 39003 2519 6.46 2008-09 48925 2821 5.77 2009-10 59345 2670 4.50 2010 -11 77042 2537 3.29 2011-12 101930 2300 2.26 2012-13 106221 2013 1.90 2013-14మార్చి వరకు 91368 1682 1.90