అలనాటి బాల నటుడికి ఎయిడ్స్ | 'Who's the Boss?' star Danny Pintauro is HIV positive | Sakshi
Sakshi News home page

అలనాటి బాల నటుడికి ఎయిడ్స్

Published Mon, Sep 28 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

అలనాటి బాల నటుడికి ఎయిడ్స్

అలనాటి బాల నటుడికి ఎయిడ్స్

లాస్ ఎంజెల్స్: అలనాటి హాలీవుడ్ బాల నటుడు, ప్రస్తుతం 'హు ఈజ్ ది బాస్' కార్యక్రమం స్టార్ డాన్నీ పింటారో ఒక్కసారిగా షాక్ గురయ్యే అంశం తెలిపాడు. తనకు ఎయిడ్స్ ఉందని బహిరంగంగా ప్రకటించాడు. గత పన్నేండేళ్లుగా ఈ వ్యాధి బారినపడి బాధపడుతున్నానని చెప్పాడు. గత శనివారం 'ఆప్రా: వేర్ ఆర్ దే నౌ' అనే ఎపిసోడ్ సందర్భంగా టాక్ షో క్వీన్ ఆప్రా విన్ఫ్రే తో మాట్లాడుతూ..

'నాకు హెచ్ఐవీ వైరస్ 2003లోనే సోకింది. చాలా కాలంగా ఈ విషయం బయటకు చెప్పుదామనుకున్నాను. కానీ చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఇదే సరైన సమయం అని భావించి చెబుతున్నాను' అంటూ తనకు హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిపాడు. గతంలో బాలనటుడిగా ఉన్న పింటారోకు ప్రస్తుతం 39 ఏళ్లు. 1997లో స్వలింగ సంపర్కుడిగా మారాడు. అప్పటి నుంచి గేలకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాడు. తాను గే పిల్లలకు స్ఫూర్తిగా ఉంటానని కూడా చెప్పాడు.

అయితే, తనకు హెచ్ఐవీ ఉందని తెలియడంతో కాస్త దిగ్భ్రాంతికి గురయ్యాడు. ప్రస్తుతం హెచ్ఐవీ సోకిన వ్యక్తులకు తనవంతు సేవలు అందిస్తానని, వారిపట్ల సానుభూతితో ఉంటానని చెప్పాడు. స్వలింగ సంపర్కుడైన పింటారో తనకు హెచ్ఐవీ సోకిన తర్వాత 2014లో పరిచయమైన విల్ టేబరస్ అనే మహిళను వివాహం చేసుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement