బాయ్ఫ్రెండ్కు హెచ్ఐవీ ఉందని కారుతో గుద్దేసి.. | Woman finds out boyfriend is HIV positive, runs him over | Sakshi
Sakshi News home page

బాయ్ఫ్రెండ్కు హెచ్ఐవీ ఉందని కారుతో గుద్దేసి..

Published Thu, Jun 16 2016 2:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

బాయ్ఫ్రెండ్కు హెచ్ఐవీ ఉందని కారుతో గుద్దేసి..

బాయ్ఫ్రెండ్కు హెచ్ఐవీ ఉందని కారుతో గుద్దేసి..

అరిజోనా: తన బాయ్ ఫ్రెండ్కు హెచ్ఐవీ ఉందని తెలిసి ఓ గర్ల్ఫ్రెండ్ అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. సైకిల్ పై వెళుతున్న అతడిని బలంగా కారుతో ఢీకొట్టి వెళ్లిపోయింది. దాంతో అతడు గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తు ఎగిరిపడ్డాడు. దాదాపు ఓ రెండు నిమిషాలపాటు అలాగే కదలకుండా పడిపోయిన అతడు మెల్లగా లేచి కొద్ది దూరం నడవగలిగి మరోసారి కుప్పకూలాడు. చుట్టుపక్కలవారి సహాయంతో తిరిగి ఆస్పత్రిలో చేరాడు. అదృష్టం కొద్ది ప్రాణాలుపోలేదు. అయితే, గాయాలు మాత్రం తీవ్రంగా అయ్యాయి.

ఒళ్లు గగుర్పొడిచేలా కనిపించిన ఈ దృశ్యం అరిజోనాలోని పోనిక్స్లో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డు కావడంతో అసలు విషయం బయటపడింది. ఈ రోడ్డు ప్రమాదంపై విచారణ జరిపిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నడిపిన వ్యక్తిని గుర్తించారు. మిస్టీ లీ విక్కీ అనే మహిళ ఆరోజు కారు నడిపిందని, ఆమె ఆ సైక్లిస్ట్ గర్ల్ ఫ్రెండ్ అని పోలీసులు కనిపెట్టారు. మరి ఎందుకు అలా చేసిందని వాకబు చేయగా అతడికి హెచ్ఐవీ ఉందని, ఆ విషయం తనతో చెప్పలేదనే ఆగ్రహంతో అతడిని చంపేయాలనుకుందని తెలిసింది. ఈ మేరకు పోలీసులు ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement