Young Woman Protest Infront Of Minor Boy House Over Love Issue In Warangal - Sakshi
Sakshi News home page

Warangal: మైనర్‌తో యువతి ప్రేమాయణం....మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉండటంతో!

Published Thu, Oct 13 2022 4:29 PM | Last Updated on Thu, Oct 13 2022 6:54 PM

Young Woman Protest Infront Of Minor Boy House Over Love Issue Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: అబ్బాయి మైనర్‌. అమ్మాయి మేజర్‌. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం తేజావత్‌ రాంసింగ్‌ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్‌ రాంసింగ్‌ తండాలోని ప్రియుడు(మైనర్‌) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్‌ రాంసింగ్‌ తండాకు చెందిన ఓ మైనర్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బీటెక్‌ చదువుతున్నారు.

గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్‌ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది.  అతడిని మైనర్‌గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్‌ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్‌ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు.
చదవండి: Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి..

దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది.  విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు.

మైనర్‌ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్‌ అయిన ఆమె మైనర్‌తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement