gudur
-
నిస్సి సూసైడ్ నోట్ లభ్యం.. లెటర్లో ఏముందంటే?
సాక్షి, తిరుపతి జిల్లా: గూడూరులోని పంబలేరు వాగులో నిస్సి మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్‌ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి లెటర్ రాసిన మృతురాలు.. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరిచిపోనని.. అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది.అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మరో వైపు, అందరినీ వదిలి వెళిపోతున్నా.. మిస్ యూ అంటూ నోట్ రాసి ఇంట్లోనే పెట్టింది. యువతి అదృశ్యం అనంతరం.. ఇంట్లో ఉన్న నోట్‌ను కుటుంబ సభ్యులు గుర్తించారు.కాగా, గూడూరులో యువతి అనుమానాస్పదంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న యువతి వివాహం జరగాల్సి ఉండగా, రెండు రోజుల క్రితం అదృశ్యమైంది.. ఇవాళ వాగులో మృతదేహం లభ్యమైంది. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలాగైనా వెళ్లాల్సిందే
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్ : సంక్రాంతి పండుగ వేళ...ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మహానగరం పల్లెబాట పట్టింది. వారం రోజులుగా సుమారు 30 లక్షల మందికి పైగా నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోయాయి. సొంత వాహనాల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సుమారు 8 లక్షల మందికి పైగా రైళ్లలో తరలివెళ్లినట్టు అధికారులు అంచనా వేశారు.ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏపీ వైపు వెళ్లే బస్సులను కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, లక్డీకాఫల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ మీదుగా నడిపారు. వరంగల్ వైపు వెళ్లే బస్సులను ఉప్పల్కే పరిమితం చేశారు.కొన్నింటిని సాగర్‌రోడ్డు, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ వరకు పరిమితం చేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో కలిపి 12 లక్షల మందికి పైగా వెళ్లారు. హైవేలన్నీ వాహనాలతో నిండుగా..: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం కూడా రద్దీ కొన సాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ బస్టాండ్ జంక్షన్ వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి రాత్రి 7 గంటల వరకు 65 వేల వాహనాలు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 వేల వాహనాలు వెళ్లాయి.హెదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా నుంచి సాధారణ రోజుల్లో 30వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, ఆదివారం 70 వేలకు పైగా వాహనాలు వెళ్లాయి. ఫాస్టాగ్ స్కానింగ్ ఆలస్యం కావడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు మల్టిజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. -
ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.పట్టించుకుంటే ఒట్టునియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్‌గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
వాహనాలతో కిక్కిరిసిన రహదారి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజాతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాహనాలతో కిక్కిరిసిపోయింది.యాదాద్రితో పాటు స్వర్ణగిరికి భక్తులు భారీగా తరలిరాగా, శుభకార్యాలు కూడా ఎక్కువగా ఉండడంతో 40వేల వరకు వాహనాలు గూడూరు టోల్‌ప్లాజా గుండా రాకపోకలు సాగించాయి. టోల్‌ప్లాజా వద్ద గూడూరు నుంచి పగిడిపల్లి వరకు వాహనాలు బారులుదీరాయి. -
బాబు మాట్లాడుతుండగా వెళ్లిపోయిన మహిళలు..!
-
గూడూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
-
ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదు..
-
తిరుపతి: వందే భారత్ రైలుపై రాళ్లదాడి..
గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో గురువారం దుండగులు వందే భారత్ రైలుపై రాళ్ల దాడిచేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఆర్పీఎఫ్ సీఐ సందీప్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న రైలు మధ్యాహ్నం గూడూరు దాటిన తరువాత కొండగుంట స్టేషన్ ప్రాంతానికి చేరుకుంటున్న సమయంలో కొందరు రాళ్లతో దాడిచేసినట్లు చెప్పారు. ఈ దాడిలో రైలు అద్దాలు పగిలాయని, లోపలి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఆర్పీఎఫ్ సీఐ చెప్పారు. -
తిరుపతి: గూడూరు జంక్షన్ సమీపంలో రైలులో మంటలు
-
తిరుపతి: నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు
సాక్షి, తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా.. గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లోనే రైలు నిలిచిపోయింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైల్వే అధికారులు. ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అబ్బాయి మైనర్, అమ్మాయి మేజర్.. ప్రేమించి మోసం చేశాడని!
సాక్షి, మహబూబాబాద్: అబ్బాయి మైనర్. అమ్మాయి మేజర్. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు చర్లతండాకు చెందిన బోడ సౌజన్య బుధవారం తేజావత్ రాంసింగ్ తండాలోని ప్రియుడు(మైనర్) ఇంటి ఎదుట బైఠాయించింది. సౌజన్య, తేజావత్ రాంసింగ్ తండాకు చెందిన ఓ మైనర్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నారు. గతేడాది వీరి మధ్యన మనస్పర్థలు వచ్చాయి. అనంతరం మైనర్ ఆమెను పెళ్లి చేసుకోనన్నాడు. దీంతో సౌజన్య పోలీసులను ఆశ్రయించింది. అతడిని మైనర్‌గా గుర్తించిన పోలీసులు పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని యువతికి సలహా ఇచ్చారు. దీంతో అతడు మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని, అప్పటి వరకు ఒకర్నొకరు కలుసుకోవద్దని పెద్దల సమక్షంలో పత్రాలు రాసుకున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ కలుసుకుంటూ వచ్చారు. ఇటీవల మైనర్ తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువతితో చెప్పాడు. చదవండి: Shamshabad: వాట్సాప్‌లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి.. దీంతో నాలుగు రోజుల క్రితం సౌజన్య అతడి ఇంటికి వచ్చింది. మూడ్రోజులు అతడి ఇంట్లోనే ఉంది. మంగళవారం ఉదయం సౌజన్యను బయటికి నెట్టి ఇంటికి తాళం వేసి కుటుంబీకులు వెళ్లిపోయారు. ఈవిషయాన్ని ఆమె చర్లతండాలోని తన తల్లిదండ్రులతో పాటు బంధువులకు చెప్పుకొని, అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. విషయం తెలుసుకున్న గూడూరు పోలీసులు ఆరా తీశారు. మైనర్ మరో ఏడాది తర్వాతైనా తనను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవాలని, లేదంటే తాను అదే ఇంటి ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతానంటూ ఆమె బైఠాయించింది. ఈవిషయమై పోలీసులను వివరణ కోరగా.. మేజర్ అయిన ఆమె మైనర్‌తో పెళ్లి కావాలంటే తామెలా చేస్తామని, పరారీలో ఉన్న మైనర్, అతడి తల్లిదండ్రులను రప్పించి సమస్యను పరిష్కరించుకోమని గ్రామపెద్దలకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. -
14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం
గూడూరు (తిరుపతి జిల్లా): కోడలికి తెలియకుండా ఆమె కుమార్తె(14)ను 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమైంది అత్త. ఈ ఘటన గూడూరులో చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. గూడూరు పట్టణం, రాణిపేటకు చెందిన నెల్లూరు సురేష్, నాయుడుపేటకు చెందిన రాజ్యలక్ష్మికి 2007లో వివాహమైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొన్నాళ్ల తర్వాత ఆస్తి విషయమై రాజ్యలక్ష్మి, అత్త సుజాతమ్మ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్యలక్ష్మి బిడ్డలను అత్తవద్దే వదిలి నాయుడుపేటలోని పుట్టింట్లో ఉండిపోయింది. అప్పుడప్పుడూ గూడూరుకు వచ్చి పిల్లలను చూసుకుని వెళ్లేది. ఈ ఏడాది మే 25వ తేదీన కోడలికి తెలియకుండా ఆమె కుమార్తె(14)ను అత్త సుజాతమ్మ వెంకటాచలం మండలం, పూడిపర్తికి చెందిన శ్రీనివాసతేజతో నిశ్చితార్థం జరిపించింది. విషయం తెలుసుకున్న రాజ్యలక్ష్మి పూడిపర్తికి వెళ్లి ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. తన బిడ్డ ఆచూకీ చెప్పాలని ప్రాధేయపడినా ఎవరూ కనికరించకపోవడంతో రాజ్యలక్ష్మి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ('ఛీ'టింగ్ టీడీపీ నేతలు.. సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట) -
విషాదం: పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థికి గుండెపోటు
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పెనువిషాదం చోటుచేసుకుంది. గూడూరు డీఆర్‌డబ్యూ్ల ఎగ్జామ్ సెంటర్ వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్ విద్యార్థికి గుండెపోటు వచ్చింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యపరీక్షలు నిర్వహించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. మృతి చెందిన విద్యార్థి సైదాపురంకు చెందిన సతీష్‌గా గుర్తించారు. చదవండి: (ఆర్టీసీ బస్సు బోల్తా.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు) -
కుమార్తె స్నేహితురాలిపై లైంగిక దాడి
గూడూరు (తిరుపతి): కూతురు స్నేహితురాలిపైనే ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రెండవ పట్టణ ఎస్ఐ తిరుపతయ్య తెలిపిన వివరాలివీ.. గూడూరు రూరల్ పరిధిలోని వేములపాళెంకు చెందిన వెంకటేశ్వర్లు ఓ ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న గూడూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక వెంకటేశ్వర్లు కుమార్తెకు స్నేహితురాలు. బుధవారం ఈ విద్యార్థిని కళాశాలకు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. అప్పటికే కుమార్తెను కళాశాలలో వదిలిన వెంకటేశ్వర్లు.. ఆ బాలిక రాకను గుర్తించి మాయమాటలతో రూరల్ ఏరియాలోని పారిచెర్ల వద్ద అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో స్థానికులు గమనించి కేకలు వేయడంతో వెంకటేశ్వర్లు పరారు కాగా.. బాలిక అక్కడి నుంచి ఇంటికి చేరుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనపై రెండవ పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ మేరకు బాలికను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుపతయ్య తెలిపారు. చదవండి: (కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..?) -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
సాక్షి, నెల్లూరు: గూడూరు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకున్న కేసును పోలీసులు చేధించారు. తనను దూరం పెట్టిందన్న ఆక్రోశంతో ప్రియురాలిని ప్రియుడే అంతం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమెను హత్యచేసి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో వెలుగు చూసిన కీలక విషయాలను ఏఎస్పీ వెకంటరత్నం బుధవారం వెల్లడించారు. తేజస్విని ,వెంకటేష్ ఇద్దరూ ప్రేమించుకున్నారని, వీరిద్దరి మధ్య రెండు నెలలుగా ఇద్దరి విభేదాలు వచ్చాయని ఆయన తెలిపారు. వెంకటేష్‌ను తేజస్విని దూరం పెట్టడంతో ఆ కసితోనే ప్రేయసిని హత్యచేయాలని నిందితుడు రెక్కీ నిర్వహించాడని పేర్కొన్నారు. తేజస్విని క్లాస్ మేట్ శివ ,స్నేహితుడు పృద్విరాజ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించారు. పథకం ప్రకారం ఇంటిలోకి చొరపడి తేజస్వినిని హత్యచేశాడని, ఆ తర్వాత వెంకటేష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడన్నారు. వెంకటేష్ ,పృథ్విరాజ్ ,శివలను అరెస్ట్ చేశామని, బైకు, కత్తి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం
-
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం
సాక్షి, నెల్లూరు: గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులను వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిగా పోలీసులు గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. సింగిల్ రోడ్డు కావడం, అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. -
బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
-
తేజస్వినిని వెంకటేశ్ హత్య చేశాడు: డీఎస్పీ
సాక్షి, నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ''తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్‌తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్‌కు దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వెంకటేష్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ ఇదిలాఉంటే తేజశ్విని కుటుంబసభ్యులను మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. 'ఇలాంటి ఘటనలను సమాజం తీవ్రంగా పరిగణించాలి. ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాది వెంకటేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలి' అని ఆమె పేర్కొన్నారు. -
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, నెల్లూరు: గూడూరు రెండు పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం బయటపడింది. యువతిని హత్య చేసి యువకుడు ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. యువతి గొంతుపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో యువకుడు చికిత్స పొందుతున్నాడు. -
‘చంద్రబాబు చాప్టర్ ముగిసింది’
సాక్షి, నెల్లూరు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని మంత్రులు అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జిల్లాలోని చిట్టమూరు మండలం కొత్త గుంట, గూడూరు నియోజకవర్గం పరిధిలో వాకాడు మండలం కేంద్రంలో ఆదివారం జరిగిన బహిరంగ సభల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, అనిల్‌కుమార్ యాదవ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజమండ్రి ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. 95 శాతానికి పైగా హామీలు అమలు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అర్హులందరికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని.. ఇప్పటికే 95 శాతానికి పైగా హామీలు అమలు చేశామని పేర్కొన్నారు. 90 శాతం ఓటింగ్ జరిగిన గ్రామానికి ప్రత్యేక పారితోషికం అందజేస్తామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలి.. మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో రెండో పంటకు నీళ్లిస్తామని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. డా.గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్సీలను చంద్రబాబు అవమానించారు.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ, వేషాలు వేసే పవన్‌తో ఉపఎన్నికలో ప్రచారం చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబును బీజేపీలో చేర్చే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. గూడూరు నుంచి వైఎస్సార్సీపీకి లక్ష మెజార్టీ రావాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సీలను చంద్రబాబు అవమానించారన్నారు. ఆ ఘనత వైఎస్ జగన్‌దే.. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దేనని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గూడూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీకి లక్ష మెజారిటీ రావాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. చంద్రబాబు చాప్టర్ ముగిసింది.. చంద్రబాబు చాప్టర్ ముగిసిందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కొత్త ఒరవడి తీసుకొచ్చారన్నారు. బడుగు బలహీనవర్గాలకు సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని మార్గాని భరత్ పేర్కొన్నారు. -
ప్లాస్మా దానం.. ప్రాణదానమే
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు అం డగా కోవిడ్ జయించిన వ్యక్తులు నిలవడం అభినందనీయమని తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ప్లాస్మా దానం చేయడమంటే కోవిడ్ బాధితులకు ప్రాణదానం చేయడమేనన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్మా దాతలను ఘనంగా సన్మానించారు. అపోలో చైర్ పర్సన్ సంగీతారెడ్డి, సన్‌షైన్ హాస్పిటల్ చైర్మన్ గురువారెడ్డిల చేతుల మీదు గా 50 మంది ప్లాస్మా దాతలకు సన్మానం చేసి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తాను, కరోనా బాధితులకు ప్లాస్మాదానం చేయించడం ద్వారా అండగా నిలవాలని భావించి అసోసియేషన్ ఏర్పాటు చేశానన్నారు. గత రెండు నెలలుగా అసోసియేషన్ నేతృత్వంలో ప్లాస్మా దాతల సమీకరణకు కృషి చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు 800 మంది నుంచి ప్లాస్మా సేకరించి, 1,200 మంది కోవిడ్ బాధితులకు ఇప్పించినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గూడూరు చేస్తున్న కృషిని పలువురు ప్లాస్మా దాతలు అభినందించారు. -
‘చెప్పుకోలేని బాధకు’..చలించిపోయారు..
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అక్కడ ఉన్న ఒకే టాయిలెట్‌తో ఇక్కట్లు పడుతున్న అంశం ప్రజాప్రతినిధులను కదిలించింది. ఈ ఇబ్బందిపై ‘చెప్పుకోలేని బాధ’శీర్షికతో శనివారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనానికి వారు చలించారు. రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ విద్యార్థినులు టాయిలెట్ కోసం చాంతాడంత క్యూలైన్ పాటించాల్సిన దుస్థితి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ చర్యల్లో భాగంగా తన ఎంపీ నిధుల నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు నిధులను విడుదల చేస్తానని ప్రకటిస్తూ ‘సాక్షి’కథనాన్ని ట్వీట్ చేశారు. టాయిలెట్ల నిర్మాణానికి తాను బాధ్యత తీసుకుని పూర్తి చేయిస్తానని, ఈ మేరకు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్లరామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఆ పాఠశాలలో టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.1.75లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏటీఆర్ కోరిన కేంద్రమంత్రి.. టాయిలెట్ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి స్పందించారు. సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్) తనకు సమర్పించాలని సూచించారు. అన్ని స్కూళ్లలో అవసరమైనన్ని టాయిలెట్లు : మంత్రి సబితారెడ్డి గూడూరు పాఠశాలలోని టాయిలెట్ల సమస్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆ జిల్లా కలెక్టర్‌తో ఫోనులో మాట్లాడారు. పాఠశాలలో అదనంగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గా మరుగుదొడ్లను నిర్మించాలని, ఈమేరకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మరోవైపు శనివారం ఆ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బృందం సందర్శించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించింది. వాళ్లది చెప్పుకోలేని బాధ... ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని పాలకులు చెబుతున్నా...ఆచరణలో కనిపించడం లేదు. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా గూడూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సుమారు 130మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే వీరందరికీ ఒకే టాయ్‌లెట్ (మూత్రశాల) ఉంది. అలాగే ప్రాథమిక పాఠశాలలో 80మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు ఉపాధ్యాయులకు కలుపుకుని ఇక్కడ కూడా ఒకే టాయ్‌లెట్ ఉంది. అత్యవసర పరిస్థితుల్లోనూ చాంతాడంత క్యూ కట్టాల్సిందే. ఏళ్ల తరబడి ఈ దుస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు టాయ్లెట్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు ముందుకు వచ్చారు. Sad to see this. Sufficient funds will be sanctioned from MPLAD Scheme to address this issue immediately . @SakshiNewsPaper@TNewstg @trspartyonline pic.twitter.com/zDMp0AuW3A — Santosh Kumar J (@MPsantoshtrs) October 26, 2019 -
మందిగిరి ఈవో రాంప్రసాద్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
-
గుడూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరప్రసాదరావు ప్రచారం
-
ప్రతి ఇంటికి నవరత్నాలను చేరుస్తా
-
ప్రాణం తీసిన అతివేగం
-
ముగిసిన 72వరోజు ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, నెల్లూరు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 73వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన కొండగుంట నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి పాలిచెర్ల, గాంధీనగర్ చేరుకుంటారు. భోజన విరామం అనంతరం ఇందిరమ్మ కాలనీ మీదగా గూడురు కోర్టు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తిమ్మసముద్రం క్రాస్ వద్ద ముగిసిన పాదయాత్ర నెల్లూరు జిల్లా గూడురు నియోజకవర్గం తిమ్మసముద్రం క్రాస్ వద్ద వైఎస్ జగన్ 72వ రోజు ప్రజాసంకల్పయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 14.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గుర్రంకొండ, ఆర్మనుపాడు, కాండ్ర, వెంకటేశుపల్లి మీదగా తిమ్మసముద్రం క్రాస్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 980.5 కిలోమీటర్లు నడిచారు. -
గూడూరులో ఎమ్మెల్యే సునీల్ ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటుపై గూడురు ఎమ్మెల్యే సునీల్ ఓవరాక్షన్ చేశారు. శనివారం గూడురు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా స్వాగతం పలుకుతూ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఎమ్మెల్యే.. స్థానికులను బెదిరించడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గెలవాలంటూ సవాల్ విసిరారు. కాగా వైఎస్ఆర్ సీపీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన సునీల్... ‘పచ్చ’ ప్రలోభాలతో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. -
నెల్లూరు జిల్లాలో కుక్కల స్వైర విహారం
-
పోలీస్ శాఖలో మరో ఫిర్కా
♦ గూడూరు సబ్ డివిజన్ విభజనకు ప్రతిపాదనలు ♦ నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం ♦ ఎర్ర చందనం, ఇసుక. సిలికా అక్రమ రవాణా నియంత్రణే కీలకం ♦ డీజీపీ నిర్ణయమే తరువాయి సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో మరో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పోలీస్ సబ్ డివిజన్‌గా ఉన్న గూడూరును రెండుగా విభజించాలని నిర్ణయించారు. ఇం దుకు రెవెన్యూ రికార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రతిపాదనలు పంపించారు. గూ డూరు ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ తోపాటు నేరాల నియంత్రణ కత్తిమీద సాములా మారిన నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనలు డీజీపీ పరిశీలనలో ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 5పోలీస్ సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 22 సర్కిల్స్, 64 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో ఆరు సర్కిల్స్, 20 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లాలోని మొత్తం స్టేషన్లలో 30 శాతం ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని పోలీస్ సబ్ డివిజన్ల పరిధితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెద్దది. రాష్ట్రంలోనే అతిపెద్ద సబ్ డివిజన్‌గా, భారీగా అక్రమ ఆదాయం పొందే కేంద్రంగా పేరొందింది. ఆదాయం అంతా ఇంతా కాదు జిల్లాలో సాగే అక్రమ వ్యాపారంలో అత్యధిక శాతం గూడూరు సబ్ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. ఎర్ర చందనం మొదలుకొని సిలికా, ఇసుక అక్రమ రవాణా అంతా ఇక్కడే నడుస్తుంది. అత్యధిక మామూళ్లు వచ్చే సబ్ డివిజన్ కావటంతో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ పనిచేస్తూ గత నెలలో వీఆర్‌కు బదిలీ అయిన డీఎస్పీ బి.శ్రీనివాస్‌పై పెద్దెత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ నెలకు రూ.50 లక్షలపైనే మామూళ్లు, ఇతర ఆదాయం ఉంటుందని అంచనా. తమిళనాడు నుంచి అక్రమంగా వచ్చే బియ్యం, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అక్రమ రవాణా దారుల నుంచి భారీగా మామూళ్లు అందుతాయి. ఇసుక రవాణా ఆదాయం రూ.లక్షల్లో ఉంటుంది. వెంకటగిరి స్టేషన్ పరిధిలో ఎర్ర చందనం కేసులు ఎక్కువ. గతంలో కొందరు పోలీస్లే ఎర్ర చందనం అక్రమ రవాణా వాహనాలకు పైలట్‌గా వ్యవహరించేవారు. దీనికి గాను రూ.లక్షల్లో ముడుపులు అందేవి. సిలికా ఇసుక అక్రమ రవాణా కూడా ఇక్కడే అధికంగా ఉంటుంది. ఇవి కాకుండా గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 250కి పైగా మద్యం షాపులు, 10 వరకు బార్లు ఉన్నాయి. వీటి నుంచి రూ.12 లక్షల వరకు అందుతాయి. ఇదిలావుంటే.. జాతీయ రహదారి పరిధి అత్యధికంగా దీని పరిధిలోనే ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఇక్కడి డీఎస్పీ పోస్టుకు డిమాండ్ ఉండేది. గత నెలలోనే ప్రతిపాదనలు గూడూరు సబ్ డివిజన్‌ను గూడూరు, నాయుడుపేట సబ్ డివిజన్లుగా విభజించాలని ప్రతిపాదించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట సర్కిల్స్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లతోపాటు ఓజిలి స్టేషన్‌ను కలిపి 7 స్టేషన్లు, రెండు సర్కిల్స్‌తో నాయుడుపేట సబ్ డివిజన్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనూ ప్రతిపాదనలు వెళ్లగా.. పురోగతి లేకపోవటంతో తాజాగా మరోసారి ప్రతిపాదనలు పంపారు. ఇక్కడి పరిస్థితిని డీజీపీకి వివరించిన ఉన్నతాధికారులు సబ్ డివిజన్‌ను విభజించాలని కోరారు. సాంకేతికపరమైన లాంఛనాలను పూర్తి చేసుకుని నెల రోజుల్లో కొత్త సబ్ డివిజన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
గిరిజనుడిపై పోలీసుల దాష్టీకం
- తన కళ్లెదుటే బూట్ కాళ్లతో తొక్కిపెట్టి.. - కొట్టారని బాధితుడి భార్య ఆరోపణ గూడూరు: కట్టుకథ చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి ఓ గిరిజనుడిని పోలీసులు చితకబాది మంచానపడేలా చేసిన సంఘటన గూడూరు రూరల్ పరిధిలోని నెల్లటూరు గిరిజనకాలనీలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు గూడూరు రూరల్ మండలం నెల్లటూరు గిరిజనకాలనీకి చెందిన నిడిగంటి శ్రీనివాసులు, అతని భార్య శ్యామలలను సోమవారం రాత్రి గూడూరు రూరల్ పోలీసులు ఓ కట్టుకథ చెప్పి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇంతకీ పోలీసులు చెప్పిన కట్టు కథేంటంటే శ్రీనివాసులు భార్య శ్యామల చిన్నాన నాగార్జున ఎవరిదో ఉంగరం దొంగిలించాడని, దాన్ని తీసుకొచ్చి వారి చేతికిచ్చాడంటూ క«థ అల్లారు. ఆ కథ చెప్పి గిరిజన దంపతులను రాత్రి 9 గంటల ప్రాంతంలో రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీరా స్టేషన్‌కు తీసుకొచ్చాక శ్రీనివాసులు భార్య శ్యామలది చిల్లకూరు కావడంతో ఆమె తండ్రి అయిన గడ్డం లక్ష్మయ్య ఏదో కేసులో నిందితుడని, అతనెక్కడున్నాడంటూ శ్యామలను గదమాయించారు. శ్రీనివాసులును కింద పడుకోబెట్టి కానిస్టేబుళ్లు బూటు కాళ్లతో తొక్కిపెట్టగా ఎస్సై అతి దారుణంగా తన కళ్లెదుటే లాఠీతో కాళ్లు పగిలేలా చితకబాదారని శ్యామల కంటతడిపెట్టింది. తన తండ్రి కేసులో ఉంటే పోలీసులు చిల్లకూరుకు వెళ్లి వాళ్లను విచారించాలే గానీ, ఎలాంటి సంబంధం లేని తన భర్తను కిరాతకంగా కొట్టి హింసించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ దెబ్బలకు తన భర్త కనీసం నడిచే స్థితిలో కూడా లేడని ఆమె రోధించింది. తన భర్త కూలిపనులకెళ్తేనే తాము బతకాలని, ఏ పాపం తెలీని తన భర్తను అన్యాయంగా చితకబాదారని కన్నీరుమున్నీరయింది. ఈ విషయం తమ గ్రామపెద్ద భాస్కర్‌రెడ్డికి చెప్పానని, ఆయన చెప్పినా కూడా వినకుండా మీ మామ ఎక్కుడున్నాడురా.. నీకు తెలుసంటూ మళ్లీ కొడుతూనే ఉన్నారని శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. తమను అర్ధరాత్రి 2 గంటలకు ఇంటికి పంపారని వాపోయింది. ఈ విషయంపై రూరల్ ఎస్సై బాబీని వివరణ కోరగా ఓ కేసులో నిందితుడైన శ్రీనివాసులు మామ ఆచూకీ కోసం అతన్ని తీసుకొచ్చామని, అతన్ని చూపించడంతో తిరిగి పంపేశామని తెలిపారు. -
సర్వేలతో సరి
►గూడూరు డివిజన్లో వరదలతో ఆనవాళ్లు కోల్పోయిన పొర్లుకట్టలు ►2,643 ఎకరాల్లో ఇసుకమేటలు ►3,670 ఎకరాల్లో దెబ్బతిన్న వరి ►రూ.4.84 కోట్ల నష్టం ►రెండేళ్లు గడిచినా పరిహారం ఊసే లేదు రెండేళ్ల క్రితం వచ్చిన వరదల్లో పలు నదుల పొర్లుకట్టల ఆనవాళ్లు కోల్పోయాయి. దీంతో వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేసి బంగా రం పండించే పొలాలు ఎడారులుగా మారాయి. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. సర్వేలతో సరిపెట్టిన ప్రభుత్వం రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఏ ఒక్క రైతుకూ నష్టపరిహారం చెల్లించలేదు. పొర్లు కట్టలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు: వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వరదలకు కోసుకుపోయిన పొర్లుకట్టల మరమ్మతు పనులు పలు చోట్ల ఇంకా ప్రారంభించకపోవడంతో రానున్న వర్షాకాలంలో వరదలొస్తే తమ గతేం కావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన వరదలతో పంటలు ధ్వంసం కావడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న నదుల పొర్లుకట్టలు కొట్టుకుపోయి, పొలాల్లో ఇసుకమేటలు ఏర్పడ్డాయి. డివిజన్లోని చల్ల కాలువ, కైవల్యానది, పంబలేరు, మామిడి కాలువ, స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పొలాలు వరద ఉద్ధృతికి కోసుకుపోయాయి. 3,670 ఎకరాల్లో దెబ్బతిన్న వరి గూడూరు డివిజన్లో వరదలకు 3,670 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. దీనికి సంబం ధించి ఎకరాకు రూ.15వేలు చొప్పున మొత్తం రూ.2.2 కోట్లు రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. అలాగే 2,643 ఎకరాల్లో ఇసుకమేటలు వేసంది. ఎకరాకు రూ.20 వేల చొప్పున రైతులకు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.2.64 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.లక్షల విలువ చేసే బంగారం పండించే పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోట, వాకాడు మండలాల్లో కొంతమేర పనుల చేపట్టారు. పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు. అలాగే వరదలతో నష్టపోయినందుకు రైతులకు ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వ లేదు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న పంబలేరు పొర్లుకట్టల పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయకపోతే వరద నీటితో నష్టపోయే ప్రమాదం ఉందని అన్నదాలు వాపోతున్నారు. రాబోయే వరదల ముప్పునుంచి తమ పొలాలను కాపాడాలని వారు కోరుతున్నారు. ఇసుక మేటలతో పొలాలు నాశనం రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు పలు చెరువులు తెగిపోయాయి. దీంతో వరదనీరు పంబలేరు, చల్లకాలువలు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో ఆయా నదుల పొర్లుకట్టలు పూర్తిగా కోసుకుపోయాయి. దీంతో వరదనీరు పొలాల మీదుగా పారి పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. దీంతో ఇక పంటలు పెట్టే వీలే లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని, పొలాల్లో ఇసుక మేటలు తీయించుకుందామని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. వరద ఉద్ధృతికి నదుల పొర్లుకట్టలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయాయి. పక్కనున్న పొలాలకు సమాంతరంగా నదులు పారాయి. దీంతో అక్కడక్కడా మలుపులవద్ద పొలాల్లోకే వరద నీరంతా పారి ఇసుకమేటలు వేసింది. దీంతో ఎకరా రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ పలికే పొలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పొర్లుకట్టలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మంత్రి కళాశాలకు సమీపంలో పూర్తయిన పనులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇంజినీరింగ్ కళాశాల కూడా పంబలేరు నది ఒడ్డుకు సమీపంలో ఉంది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న పొర్లు కట్టల పనులు మాత్రం పూర్తయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఆ దిశగా పనులు ప్రారంభమైన దాఖలాలు లేవు. పరిహారం విషయం పక్కన పెట్టినా.. పొర్లుకట్టల పనులైనా త్వరితగతిన ప్రారంభించి తమ విలువైన పొలాలను, తమ జీవనాధారాన్ని కాపాడాలని రైతులు కోరుతున్నారు. -
నాటుకు ఘాటెక్కువ
ఓ రకానికి ధర ఉంది.. అయితే దిగుబడి లేదు. మరో రకం ధర బాగా తగ్గిపోయింది. ఇది ప్రస్తుతం మిర్చి రైతుల పరిస్థితి. గతేడాది మిర్చి క్వింటా ధర సుమారు రూ.15 వేలకు పెరగడంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపారు. అయినా వారికి ఒరిగిందేమీ లేదు. ► మార్కెట్లో క్వింటా ధర రూ.25 వేలు ► అయితే గణనీయంగా తగ్గిన దిగుబడి ► హైబ్రిడ్ రకాల ధరలు పతనం గూడూరు : జిల్లాలో సాధారణంగా గతేడాదితో పోలిస్తే ఈసారి మిరపసాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది సాగు 2,145 హెక్టార్లు కాగా ఈ సంవత్సరం సుమారు 3000 హెక్టార్ల పైచిలుకే సాగు చేపట్టారు. గూడూరు, ఓజిలి, చిల్లకూరు, పెళ్లకూరు, బాలాయపల్లి, సైదాపురం, కోట, చిట్టమూరు తదితర మండలాల్లో విస్త్రతంగా పంట సాగులో ఉంది. పంట సాగుకు అధికంగానే ఖర్చవుతోంది. పురుగు మందులతోపాటు, కాంప్లెక్స్ ఎరువుల వాడకం కూడా ఎక్కువే. సాగు పూర్తయ్యే నాటికి రూ.50 వేల వరకు ఖర్చుపెట్టారు. నాటు మిరప బాగాపండితే ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు పండుతాయి. సరాసరిన 10 క్వింటాళ్లు పండినా ప్రస్తుతం ఉన్న ధరలను బట్టి ఎకరానికి రూ.2.50 లక్షలకు పైగానే ఫలసాయం వస్తుంది. దీంతో పెట్టుబడి ఖర్చులు పోను సుమారు రూ.2 లక్షల ఆదాయం రావాలి. అయితే పరిస్థితి తారుమారైంది. ఏంటో ఈ పరిస్థితి.. ప్రస్తుతం నాటు మిర్చి ధరలకు హైబ్రిడ్ మిర్చి ధరలకు నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నడూ లే ని విధంగా నాటు మిర్చి క్వింటా ధర రూ.25 వేలకు పైగా పలుకుతుండగా, హైబ్రిడ్ రకాల మిర్చి ధర గణనీ యంగా పడిపోయి క్వింటా కేవలం రూ.7 వేలు ఉంది. ఇక నాటు రకం సాగు చేసిన రైతులు దిగుబడులు అం తంత మాత్రంగా ఉండటంతో ఖర్చులకు సరిపోతుం ద ని చెబుతున్నారు. మార్కెట్లో నాటు రకం ఎండు మిర్చి ధర కిలోరూ.300 పలుకుతుండగా,హైబ్రీడ్ రకాల మిర్చి మాత్రం కిలో కేవలం రూ.100 పలుకుతోంది.ఈ తరహా లో వ్యత్యాసం ఎన్నడూ లేదని రైతులు వాపోతున్నారు. హైబ్రీడ్ సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం.. హైబ్రీడ్ రకం రెండెకరాల్లో సాగు చేస్తే రూ.1.60 లక్షలు పెట్టుబడులయ్యాయి. ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులైనా వస్తాయనే నమ్మకం లేకుండా పోతుంది. – నారాయణరెడి, కొండాగుంట, గూడూరు రూరల్ . ధరల్లో ఇంత తేడా ఎప్పుడూ లేదు.. సుమారుగా అందరం హైబ్రీడ్ రకాలే ఎక్కువగా సాగు చేశాం. పెట్టుబడులు మాత్రం ఏ రకానికైనా ఒక్కటే. అయితే ధరల్లో తేడా ఈ విధంగా ఉంటుం దనుకోలేదు. పెట్టుబడులు కూడా వస్తాయనే నమ్మకం లేకుండా ఉంది. - కస్తూరయ్య, చిట్టమూరు మండలం -
పీఆర్ కండ్రిగకు నేడు సచిన్ రాక
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ముత్యాలరాజు అన్ని శాఖల అధికారులతో సమావేశం గూడూరు: రాజ్యసభ సభ్యుడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం ఆయన దత్తత గ్రామమైన గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారి కండ్రిగకు రానున్నారు. ఈ మేరకు ఆ గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ముత్యాలరాజు ఇతర అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ చెన్నై విమానాశ్రయం నుంచి సచిన్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఉదయం 11.30 గంటలకు గూడూరు-తిరుపతి రహదారి పక్కనే చెమిర్తి రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం రెండేళ్ల క్రితం తాను కలుసుకున్న గోపాలయ్య, విజయమ్మల కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్దకే వెళ్లి మాట్లాడుతారన్నారు. పక్కనే ఉన్న పాఠశాల్లోని విద్యార్థులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ఉన్న సభా స్థలికి చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ 12.55 గంటలకు పూర్తి చేసుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆయన వెంట జేసీ ఇంతియాజ్, ఆర్డీఓ వెంకటసుబ్బయ్య, తహసీల్దార్ సత్యవతి తదితరులున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన గూడూరు రూరల్ పరిధిలోని పుట్టమరాజువారికండ్రిగలో సచిన్ టెండూల్కర్ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో ఽభద్రతా ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాస్‌తోపాటు ఏఆర్ డీఎస్పీ చెంచురెడ్డి, ఎస్బీ డీఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈ పర్యటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా బారికేడ్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. నలుగురు డీఎస్పీలు, 9 మంది సీఐలతోపాటు పలువురు ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తూ పఠిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వారి వెంట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై బాబి ఉన్నారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
గూడూరు : అడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గూడూరు రెండో పట్టణంలోని అరవ దళితవాడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నాగరాజు, పువ్వాయి దంపతుల రెండో కుమార్తె వైష్ణవి (9) మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు వీధులో ఆడుకుంటుంది. అక్కడే ఓ ఆటోకు పెయింట్ వేస్తున్న వారు విద్యుత్ పెయింట్ మిషన్‌ను ఆటో ఉంచారు. ప్రమాదశావత్తు పెయింట్ మిషన్‌కు ఉన్న విద్యుత్ వైర్లు స్లీవ్‌లు తెగి ఆటోకు అతుక్కోవడంతో ఆటోకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ ఆటోను పట్టుకోవడంతో అక్కడక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
రెండు లారీలు ఢీ
ఇద్దరికి గాయాలు గూడూరు: రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వివరాల మేరకు.. స్థానిక ఆదిశంకర కూడలి వద్ద బుధవారం విజయవాడ నుంచి కూరగాయల లోడుతో వస్తున్న లారీ గూడూరు పట్టణంలోకి మలుపు తిరుగుతుండగా, చెన్నై వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న లారీ వెనుకపైన ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నెల్లూరకు తరలించారు. ఎస్సై బాబి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను క్రేన్ సహాయంతో తొలగిస్తూండగా అది కూడా అదుపుతప్పి బోల్తాపడింది. అనంతరం మరో క్రేన్‌ను తెప్పించి వాటిని రహదారికి అడ్డులేకుండా తొలగించడంతో ట్రాఫిక్ సజావుగా సాగింది. -
క్రీడా స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యం
ఉత్సాహంగా 1–కె, 2–కె రన్ గూడూరు: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు 1–కె, 2–కె రన్ల లక్ష్యమని మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ అన్నారు. జిల్లా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కోట సునీల్‌కుమార్ సహకారంతో స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో విద్యార్థినులకు 1–కె రన్, విద్యార్థులకు 2–కె రన్లను బుధవారం ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, చైర్పర్సన్ ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఆటలకు దూరం అయ్యారన్నారు. వారిని క్రీడలపై మక్కువ పెంచేందుకు కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు జేడీ సుందరరావు మాట్లాడారు. అనంతరం బాలికలు, బాలుర విభాగాల్లో జీఎస్‌రాయలు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులైన హేమలత, మౌరేంద్రలకు నగదు, మెమోంటోలను అందజేశారు. అలాగే ద్వితీయ, తృతీయ, చతుర్ద, పంచమ స్థానాల్లో విజేతలకు నగదు, మెమోంటొలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సుందరరామయ్య, కార్యదర్శి జిలానీ పాల్గొన్నారు. -
12న జాతీయ లోక్ అదాలత్
గూడూరు: నవంబరు 12న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప అన్నారు. స్థానిక కోర్డులో గురువారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ, రూరల్ సీఐలు, ఎస్సైలతోపాటు సీనియర్ సివిల్ జడ్జి ఏడుకొండలు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దివాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కేపీ సాయిరాంలు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి లోక్ అదాలత్‌లోనూ కేసుల పరిష్కారంలో జిల్లాలోనే గూడూరు ప్రధమ స్థానంలో ఉందన్నారు. గతంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 138 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పుచ్చలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మెట్టు గ్రామం గిరిజన కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి (25) పుచ్చలపల్లి సమీపంలోని రావిగుంట చెరువు వద్ద జరుగుతున్న తూము నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ట్రాక్టర్ ద్వారా బొంత రాళ్లను తరలిస్తుండగా వాటిని లెక్కించే పని మణికి అప్పగించారు. రాళ్లను అన్లోడ్ చేస్తుండగా అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు ట్రాక్టర్‌కు తగలడంతో ట్రక్కును పట్టుకుని ఉన్న మణి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ మాత్రం దూకేయడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. మణికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆద్యంతం.. ఉత్కంఠభరితం
ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మహిళా విభాగంలో విన్నర్స్‌గా కృష్ణా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి పురుషుల విభాగంలో విన్నర్స్‌గా వైజాగ్, రన్నర్స్‌గా కృష్ణా గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి సహకారంతో నాలుగు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి పురుషుల, స్త్రీ విభాగ సీనియర్స్ వాలీబాల్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ప్రేక్షకులతో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్డేడియం కిక్కిరిసింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, స్పాన్సర్ కనుమూరు హరిచంద్రారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ప్రారంభమైన మహిళా విభాగ పోటీలో కృష్ణా జిల్లా విన్నర్స్‌గా నిలవగా, రన్నర్స్‌గా పశ్చిమ గోదావరి జిల్లా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో మూడు సెట్లలో కృష్ణా జట్టు ఆధిక్యతను నిలుపుకొంది. మూడో స్థానానికి జరిగిన పోరులో వైజాగ్, కర్నూలు జట్లు తలపడగా, మొదటి సెట్లో కర్నూలు విజయం సాధించింది. అనంతరం వరుసగా మూడు సెట్లలో విశాఖపట్నం విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో విజేతగా విశాఖపట్నం, రన్నర్స్‌గా కృష్ణా జిల్లాలు నిలిచాయి. మూడో స్థానానికి జరిగిన పోటీలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ప్రకాశం గెలుపొందింది. -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
గూడూరు: క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తేనే రాణించగలరని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే గనబాబు పేర్కొన్నారు. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం హోరాహోరీగా సాగాయి. పలు జిల్లాలకు చెందిన, పురుషులు, మహిళా జట్లకు ఉదయం 7.30 నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాజరైన గనబాబు మాట్లాడారు. గూడూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. సహకారం అందించిన కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో స్థానం సాధించిన వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, మునిగిరీష్, తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎస్పీ విశాల్ గున్నీ అట్టహాసంగా రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం గూడూరు: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ విశాల్‌గున్నీ పిలుపునిచ్చారు. స్థానిక అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను గురువారం ఎస్పీ ప్రారంభించారు. తొలుత స్పోర్ట్స్ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నారు. కేరళ యువతుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ గెలుపోటములు సహజమన్నారు. క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యమన్నారు. డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు గూడూరు వేదిక కావడం సంతోషకరమన్నారు. అనంతరం వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణారావు, శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి , ఎన్బీకేఆర్ విద్యా సంస్థల అధినేత నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, మునిగిరీష్, తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపాల్‌రావు, రొటేరియన్లు కేఎస్‌రెడ్డి, జానకిరాంరెడ్డి, సురేంద్రరెడ్డి, దయాకర్‌రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, లక్ష్మీ పీఎంరావు, తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలో శ్రీకాకుళం జట్టుపై విజయనగరం జట్టు, విశాఖపట్నంపై ప్రకాశం, గుంటూరుపై అనంతపూర్ జట్లు విజయం సాధించాయి. అలాగే స్త్రీల విభాగంలో చిత్తూరు జట్టుపై కృష్ణా జట్టు , తూర్పు గోదావరిపై పశ్చిమ గోదావరి జట్టు విజయం సాధించాయి. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు గూడూరు: అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రస్థాయి సీనియర్ పురుషులు, స్త్రీల వాలీబాల్ టోర్నమెంట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకుగాను 15 రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియంలో ఐదు కోర్టులు ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి పోటీల తరహాలో ఏర్పాట్లు, ప్రేక్షకులకు సీటింగ్ అరేంజ్మెంట్స్, రాత్రి వేళ పోటీలను నిర్వహించేందుకు అనువుగా ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారు. కోర్డు ప్రాంగణాలకు అన్ని వైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, భోజన వసతిని హరిచంద్రారెడ్డి ట్రస్ట్ తీసుకుంటోంది. క్రీడాకారుల్లో ఆసక్తి పెంపు -రవీంద్రబాబు, శాప్ డైరెక్టర్ గూడూరు లాంటి ప్రాంతాల్లో ఇలాంటి రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత క్రీడాకారుల్లో ఆసిక్తిని పెంపొందిచినట్లవుతుంది. జాతీయ స్థాయి పోటీలను తలపించేలా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది -కనుమూరు హరిచంద్రారెడ్డి , ట్రస్ట్ వ్యవస్థాపకుడు రాష్ట్ర స్థాయి పోటీలను గూడూరులో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఓజిలిలో జరిగిన సమ్మర్ క్యాంప్‌ను చూసినప్పటి నుంచీ ఇలాంటి టోర్నమెంట్‌ను గూడూరులో నిర్వహించాలనుకున్నా. ఇప్పటికి కార్యరూపం దాల్చింది. అనంతపురంలో జరగాల్సిన ఈ టోర్నమెంట్‌ను గూడూరులో జరిగేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఆదరణ పెరగాలి -కమలాకర్‌రెడ్డి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ వాలీబాల్ క్రీడకు ఇంకా ఆదరణ పెరగాలి. రాష్ట్రస్థాయి పోటీలను తిలకించడం ద్వారా క్రీడపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంత బడ్జెట్‌తో ఒకే స్పాన్సర్‌తో నిర్వహించడం ఇదే ప్రథమం. -
దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం
-మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోట: వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో పోర్టుకు అనుకూలంగా చట్టం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోర్టు రాకుండా అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పోర్టు సాధన కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఆయన వెంట పుచ్చలపల్లి సర్పంచ్ ఇంధ్రసేనయ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంకయ్య, కోట, వాకాడు మండలాల నాయకులు ఉన్నారు. -
జెండా పండగకు ముస్తాబు
గూడూరు: దసరా సందర్భంగా శుక్రవారం రాత్రి నిర్వహించే ఆంజనేయస్వామి జెండా మహోత్సవానికి గూడూరు పట్టణం ముస్తాబైంది. పట్టణంలోని ఏ ప్రాంతానికెళ్లినా వివిధ రకాల దేవతామూర్తుల ఆకృతులు, ఆర్చీల ద్వారా పలు సెట్టింగులతో కళకళలాడుతోంది. పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో గల కోనేరును గతంలో కనుమూరు హరిచంద్రారెడ్డి అధునాతనంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం జెండా పండగ సందర్భంగా కళ్లుమిరమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా కోనేరు వెలిగిపోతోంది. సంగం థియేటర్ ప్రాంతంలో కరణాల వీధి జెండా నిర్వాహకులు ఏర్పాటు చేసిన కటౌట్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తోంది. తూర్పువీధి, గమళ్లపాళెం ప్రాంతాల్లో ఆర్చీలను ఏర్పాటు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గూడూరు : పట్టణంలోని గ్రామ సేవకుల భవనం సమీపం ఓ దుకాణం మెట్లపై అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సుధాకర్ సమాచారం మేరకు.. మేరకు గూడూరు రూరల్ పరిధిలోని తిలక్‌నగర్‌కు చెందిన పద్మనాభరెడ్డి (45)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా పద్మనాభరెడ్డి అనారోగ్యంలో బాధపడుతున్నాడు. ఏం జరిగిందో కాని, ఓ దుకాణ మెట్లపై బోర్లా పడి మృతి చెందాడు. మృతుడి తలపై నుంచి రక్తం కారి ఉంది. దీంతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మృతుడి పక్కనే రెండు కవర్లలో పండ్లు, ఇతర సామగ్రి ఉంది. బజారుకు వచ్చి తిరిగి ఇంటికెళ్లే క్రమంలో అక్కడ పడిపోయి రక్తం కక్కుకుని మృతి చెందాడా.. లేక ఎవరైనా దాడి చేసి హతమార్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు వాలీబాల్ జట్ల ఎంపిక
గూడూరు: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా సీనియర్ వాలీబాల్ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన పురుషుల జట్టు ఎంపికలకు 50 మంది క్రీడాకారులు హాజరవగా, అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. అలాగే డీఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన మహిళల జట్టు ఎంపికకు 32 మంది క్రీడాకారిణిలు హాజరవగా, బాగా రాణించిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కమలాకర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల 6 నుంచి 9వ తేదీ వరకు గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి, హరిచంద్రారెడ్డి, క్రికెట్ క్లబ్ చైర్మన్ మునిగిరీష్, రాష్ట్ర వ్యాయామ ఉపాద్యాయుల సంఘం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, పీడీ సురేంద్రరెడ్డి, డీఆర్డబ్ల్యూ వ్యాయామ అధ్యాపకురాలు విజయకళ, తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు
గూడూరు: ఐఐటీలకు దీటుగా అటానమస్ కళాశాలలు పనిచేస్తున్నాయని ఆ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు, కర్నూలు పుల్లారెడ్డి కళాశాల అధినేత సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆదిశంకర ఇంజీనిరింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూ అనంతపూర్ పరిధిలో 141 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 11 కళాశాలలకు మాత్రమే అటానమస్ గుర్తింపు ఉందన్నారు. అటానమస్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు 80 నుంచి 90 మంది డాక్టరేట్స్, ప్రతి విభాగంలో ఒక ప్రొఫసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫసర్లను నియమించుకోవాలని సూచించారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని కోరారు. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ విషయంలో ఏకీకృత విధానాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ కార్యదర్శి, నంద్యాల ఆర్జీఎం కళాశాల చైర్మన్ శాంతిరాయుడు, అసోసియేషన్ వైస్ చైర్మన్, అన్నమాచార్య విద్యా సంస్థల అధినేత గంగిరెడ్డి, నేదురుమల్లి విద్యా సంస్థల చైర్మన్ రాంకుమార్‌రెడ్డి, ఆదిశంకర విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
గూడూరు : ఓ యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున రెండో పట్టణంలోని ఎగువవీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన వెడిచర్ల చైతన్యను శ్రీహరి అలియాస్ జెమిని, లక్ష్మీనారాయణ కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉండగా సీఐ, ఎస్సై నరేష్ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నిందితులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా వారిని అరెస్ట్ చేశామన్నారు. స్థానిక అరుంధతీయవాడకు చెందిన కనుపూరు రమణయ్య కుమారుడు శ్రీహరి అలియాస్ జెమిని వైన్ దుకాణం వద్ద కూల్ డ్రింక్స్ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. రెండో నిందితుడు ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలోని నాయుడుకాలువ కట్ట ప్రాంతానికి చెందిన పొంగూరు రమణయ్య కుమారుడు లక్ష్మీనారాయణ అలియాస్ నారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో జెమినికి హతుడు చైతన్య స్నేహితుడు మహేష్‌కు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో చైతన్య గతంలో పలుమార్లు తన స్నేహితుడు మహేష్ జోలికొస్తే చంపుతానని జెమినిని బెదిరించాడు. దీంతో జెమిని, లక్ష్మీనారాయణ చైతన్యను తుదముట్టించాలని అదను కోసం ఎదురు చూస్తుండగా గత సోమవారం అర్ధరాత్రి దాటాక సీవీజీ వైన్స్ ఎదురుగా చైతన్య ఎదురయ్యాడు. ఇదే అదనుగా భావించిన లక్ష్మీనారాయణ, జెమినీ కలిసి దుడ్డుకర్రతో చైతన్య తలపై కొట్టడంతో మృతి చెందాడు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై నరేష్ పాల్గొన్నారు. -
సెజ్ బాధితులకు అండగా పోరాడతాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోట: కర్లపూడి సెజ్ బాధితులకు అండగా నిలబడి పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఆదివారం కర్లపూడి గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కోస్టల్ కారిడార్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న భూములు వాటి స్థితిగతుల ఆధారంగా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారంగా చెల్లించాలన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో 11 వేల ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసిన విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమల కోసం గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, డివిజన్ కార్యదర్శి యాదగిరి, కోట మండల కార్యదర్శి పీవీ కృష్ణయ్య, కర్లపూడి సర్పంచ్ సన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి ఉన్నారు. సెజ్‌లు, సీపీఎం మధు, కోట -
ట్రాక్టర్ కిందపడి యువకుడి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలు గూడూరు : ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో దాని కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు రెండో పట్టణంలోని ఎస్ఆర్ఏ థియేటర్ ప్రాంతానికి చెందిన పందేటి మస్తాన్ (28), 1వ పట్టణంలోని రాణీపేట ప్రాంతానికి చెందిన ఏడుకొండలు మోటార్ బైక్‌పై టవర్‌క్లాక్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్నాడు. ముందు వెళ్లే ట్రాక్టర్‌ను అధిగమించే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొని అదుపు తప్పి ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మస్తాన్ తీవ్రంగా గాయపడగా, మోటార్ బైక్ నడుపుతున్న ఏడుకొండలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ మాత్రం వెళ్లిపోయింది. మస్తాన్, ఏడుకొండలు ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1వ పట్టణ ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకుదిక్కెవరు మస్తాన్ రెక్కాడితే కానీ ఆ కుటుంబానికి పూడగడవని పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో మస్తాన్ మృత్యువాత పడటంతో ఇక మాకు దిక్కెవరంటూ మృతుడి భార్య అపర్ణ తన ఇద్దరు కుమారులను పట్టుకుని బోరున విలపించింది. సెంట్రింగ్ పనులు చేస్తూ వచ్చే సంపాదనతో పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారని, మస్తాన్ పెద్ద కుమారుడు నిఖిల్‌కుమార్ 5వ తరగతి, భానుప్రసాద్ 3వ తరగతి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో చదువుతున్నారు. -
బ్యాంకు ఉద్యోగి దారుణహత్య
బావను గొడ్డలితో నరికి కడతేర్చిన బావమరిది గూడూరు : గొడవలతో విడిపోయి ఉన్న అక్కా, బావలను కలిపి వారి కాపురం చక్కబెట్టాల్సిన తమ్ముడే.. బావను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి, తన సోదరి ఐదోతనాన్ని కాలరాశాడు. స్వయానా తన అక్క భర్త అయిన రఘు (54)ను అతడి బావమరిది రవి గొడ్డలితో నరికి చంపి పరారైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి గూడూరు రెండో పట్టణంలోని జానకిరాంపేట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. జానకిరాంపేటకు చెందిన గంగాబత్తిన లింగయ్య, సుబ్బమ్మల కుమార్తె మహేశ్వరిని సంగీతం రఘుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. రఘు విద్యానగర్‌లో కాపురం ఉంటూ వాకాడులోని బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నినెలల క్రితం రఘుకు అతని భార్యకు మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. ఈ క్రమంలో రఘు వేరుగా ఒక గదిని అద్దెకు తీసుకుని ఉన్నాడు. ఈ క్రమంలో మహేశ్వరి పుట్టింటివారే వేరుగా ఎందుకుంటావని రఘుకు చెప్పి నాలుగునెలల క్రితం గూడూరుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రఘు గూడూరు నుంచి రోజూ బ్యాంకు వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రఘుకు అతని బావమరిది రవికి మధ్య గొడవ జరిగింది. రవి సోదరుడు ఈశ్వరయ్య, అతని భార్య సుజాతలతోపాటు తల్లి సుబ్బమ్మ వారి వద్దకు వచ్చి సర్ధిచెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ నిద్రిస్తున్న రఘుపై రవి గొడ్డలితో దాడిచేయగా అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సుబ్బారావు, ఎస్సై నరేస్లు చేరుకుని పరిశీలించారు. వివరాలు విచారించి కేసు నమోదు చేశారు. గతంలోనూ ఇంతే.. రవి గతంలో కూడా తన కన్న తండ్రి లింగయ్యపైనే కత్తితో దాడి చేసి నరికి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అలాగే రవిపై సస్పెక్టడ్ షీట్ కూడా ఉన్నట్లు ఎస్సై నరేష్ వెల్లడించారు. -
కళ్లల్లో కారం నీళ్లు కొట్టి.. సరుడు దోపిడీ
గూడూరు : ట్యాంక్ శుభ్రం చేస్తానని చెప్పి వచ్చి ఓ మహిళ కళ్లల్లో కారం కలిపిన నీళ్లు కొట్టి 4 సవర్ల సరుడును పట్టపగలు దోచుకెళ్లిన సంఘటన స్థానిక సన్నత్‌నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని సన్న™Œ నగర్ ప్రాంతంలో టీచర్ వెంకటేశ్వర్లు కుటుంబం నివాసం ఉంటుంది. సోమవారం ఆయన పాఠశాలకు వెళ్లాడు. ఇంటో ఆయన సతీమణి సుమతి ఒక్కటే ఉంది. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఇంటి తలుపు తట్టడంతో సుమతి తలుపు తీసింది. ఆ వ్యక్తి ట్యాంక్ క్లీన్ చేస్తానని చెప్పి మాట్లాడుతూ కారం కలిపిన నీటిని సుమతి కళ్లల్లో కొట్టి, ఆమె మెడలో ఉన్న నాలుగు సవర్ల సరుడును లాక్కెళ్లాడు. బాధితులు 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఉరివేసుకొని వివాహిత బలవన్మరణం
గూడూరు(బీబీనగర్): కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీస్‌లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నంపట్ల గ్రామానికి చెందిన సాదినేని శ్రీనివాస్ కూతురు కావ్య(22), గూడూరు గ్రామానికి చెందిన కొలను చంద్రారెడ్డి కుమారుడు కొలను మహిపాల్‌రెడ్డి 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో దంపతులిద్దరూ గూడూరులోనే చంద్రారెడ్డి ఇంటి సమీంలోనే మరో ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాప పుట్టిన అనంతరం ఇరు కుటుంబాల మధ్యన మాటలు కలవగా రాకపోకలు సాగుతున్నాయి. కాగా గత కొద్ది రోజలుగా కావ్య తన భర్త, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పుట్టింటికి పండుగలకు వెళ్లకపోవడం, తరుచూ ఇంట్లో వాగ్వాదం చేస్తూ మొండిగా ప్రవర్తిస్తూ వస్తుంది. దీంతో భర్త మహిపాల్‌రెడ్డి, తల్లిదండ్రులు మందలించడంతో కావ్య మనస్థాపానికి గురైంది. మంగళవారం ఉదయం మహిపాల్‌రెడ్డి తన కూతరును తీసుకొని కిరాణం తీసురావడానికి రోడ్డు పైకి వెళ్లాడు. ఇంతలో కావ్య ఇంట్లోని చున్నితో దూలానికి ఉరి వేసుకొని మృతి చెందింది. జరిగిన సంఘటనను స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రణీత్‌కుమార్ స్థానికులు, కుటంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపు తప్పి ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం
–మరొకరి పరిస్థితి విషమం గూడూరు : స్నేహితుడి బస్సు ఎక్కించేందుకు ఒకే మోటార్ బైక్‌పై నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అతి వేగంగా వెళ్తు మలుపు వద్ద అదుపు తప్పి ఒకరు మతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని పంబలేరు చప్టా వద్ద జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ఆదిశంకరా ఇంజనీరింగ్ కళాశాలలో ట్రిపుల్ఈ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి హాసిఫ్ గూడూరు నుంచి స్నేహితులైన శివ, క్రాంతితో కలిసి అనికేపల్లికి చెందిన ప్రవీణ్‌ను బస్సు ఎక్కించేందుకు జాతీయ రహదారిపై ఆదిశంకర కూడలి ప్రాంతానికి బయలుదేరారు. వారు అతి వేగంగా మోటార్ బైక్‌పై వస్తుండగా పంబలేరు చప్టా వద్దకు చేరుకునే సరికి మలుపు వద్ద అదుపు తప్పింది. దీంతో ఆ చప్టా వద్ద ఉన్న రాళ్లకు ఢీకొని పడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన నాయుడుపేట మండలం అన్నమేడుకు చెందిన శివ, హాసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలిస్తుండగా వారిలో శివ మార్గమధ్యలో మతి చెందాడు. శివ గూడూరులో గదిని అద్దెకు తీసుకుని చదువుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రాణం తీసింది ఆ నలుగురు విద్యార్థులు విపరీతమైన వేగంగా మోటార్‌సైకిల్‌పై కేకలు వేస్తూ, ఎస్ కటింగ్స్ ఇస్తూ వెళ్లారని, అప్పుడే ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనుకున్నామని ప్రత్యక్షంగా చూసిన వారు తెలిపారు. క్షణాల్లోనే అటు వైపు నుంచి వచ్చిన వారు మోటర్‌సైకిల్ బోల్తాపడిందని చెప్పడం.. అంతలోనే ఆటోలో క్షతగాత్రులను తీసుకురావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడాల్ సేవలపై ఆరా
చిల్లకూరు: ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిపై ఏర్పాటు చేసి రక్త సేవల విభాగం(మెడాల్) సేవలపై డిప్యూటీ డీఎం హెచ్ఓ ఈదూరు సుధాకర్ తనిఖీ చేశారు. సాక్షి ప్రధాన సంచికలో వచ్చిన కథనంతో గురువారం వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్త నమూనాలను అందజేసి ఫలితాలను ఎప్పుడు అందిస్తారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గూడూరు ఏరియా ఆసుపత్రి, చిల్లకూరు ఆరోగ్య కేంద్రాల్లోని మెడాల్ విభాగాలను తనిఖీ చేశానని, పొరపాట్లు చేయకూడదని సిబ్బందికి సూచించామన్నారు. అనవసరమైన పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట చిల్లకూరు వైద్యులు ఏడుకొండలు ఉన్నారు. -
కంటి ఆపరేషన్లు బంద్
10 రోజులుగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు పట్టించుకోని అధికారులు కంటి ఆపరేషన్లకు అవసరమైన బీఎస్ఎస్ (బయలాజిక్ సాల్ట్ సొల్యూషన్) లేకపోవడంతో శస్త్రచికిత్సలు బంద్ అయ్యాయి. 10 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, ప్రతి రోజూ ఆసుపత్రికి వచ్చి, ఆ మందు రాలేదని తెలుసుకుని తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడూరు: గూడూరు ఏరియా ఆసుపత్రిలో నేత్ర వైద్యనిపుణులుగా పనిచేసే వైద్యులు గోపీనాథ్ శస్త్రచికిత్సల్లో రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఆపరేషన్ల కోసం గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, కోట, వాకాడు తదితర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆసుపత్రిలో 10 రోజులుగా ఆపరేషన్‌కు అవసరమైన బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో ఆపరేషన్ల కోసం వచ్చిన వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. బీఎస్ఎస్ తెప్పించాల్సిన ఆసుపత్రి అదికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యులు చెపుతున్నారు. ఈ మేరకు డీపీఎంతో మాట్లాడం జరిగిందని, ఆమె కూడా పలు పర్యాయాలు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసినా వారు పంపలేదని, ఈ మందును బయట నుంచి తెప్పించకూడదని ఆమె చెపుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారుల స్పందించి బాగా ఆపరేషన్లు చేసే గూడూరు ఏరియా ఆసుపత్రి వైద్యులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన మందు సామగ్రిని సరఫరా చేయాలని కూడా కోరుతున్నారు. వాళ్లను తిప్పుకుంటుంటే బాధగా ఉంది : గోపీనాద్. నేత్ర వైద్యులు బీఎస్ఎస్ లేకపోవడంతో ఆపరేషన్లు ఆగిపోయాయి. అది ఎప్పుడొస్తుందో తెలీదు. దీంతో రోజూ వాళ్లు వస్తుంటే ఆ మందు రాకపోవడంతో వాళ్లను తిప్పాల్సి వస్తోంది. ఎన్ని సార్లు తిరగాలి : రమణయ్య, దగ్గవోలు ఆపరేషన్ కోసం రెండు సార్లు వచ్చాం. వస్తే ఆ మందు ఇంకా రాలేదు అంటున్నారు. ఎన్ని సార్లు తిరగగలం. అధికారులు సమస్యను పరిష్కరించాలి. -
గూడూరుకే గర్వకారణం...
గూడూరు: గూడూరు ప్రాంతానికి చెందిన చిన్నారి అమెరికాలో ప్రతిభ కనబర్చడం గూడూరుకే గర్వకారణమని డిస్కం డీఈ అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక ఎన్జీవో హోంలో ఆ చిన్నారిని బలిజ అభ్యదయ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సునీతా సేవా సంస్థ నిర్వాహకులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మిల మనుమరాలు అయిన కాట్రాజు నవ్య అనే విద్యార్థిని అమెరికాలో సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇలా నవ్య వరుసగా మూడు పర్యాయాలు మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్‌కుమార్, సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవయ్య, ప్రతినిధులు మదనమేటి రమణయ్య, సారంగం శ్రీనివాసులు, రామకష్ణ, వెంకటేశ్వర్లు, రమేష్ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయాలి
గూడూరు : రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు సీహెచ్ ప్రభాకర్ డిమాండ్‌చేశారు. గూడూరులోని సబ్‌కలెక్టర్ కార్యాయం సమీపంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కి బీజేపీ అదే తరహా ద్రోహం చేసిందన్నారు. పట్టణ కార్యదర్శి కాలేషా మాట్లాడుతూ ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రాభివద్ధి సాద్యమవుతుందన్నారు. జిల్లా సమితి సభ్యులు గౌస్‌బాష, ఏఐటీయూసీ డివిజన్, పట్టణ కార్యదర్శులు నారాయణ, రమణయ్య, సీతాభాస్కర్ పాల్గొన్నారు. -
మినీ బస్సు బోల్తా
11 మందికి తీవ్ర గాయాలు చిల్లకూరు : వారంతా ఏ రోజుకారోజు కూలీ పనులు చేసుకుని పొట్ట పోసుకునేవారు. పగలంతా కష్టపడి సాయంత్రం ఇంటికి చేరుకునేందుకు పనిచేస్తున్న కంపెనీ బస్సులో బయలు దేరిన కొద్దిసేపటికే ప్రమాదం బారిన పడి గాయాల పాలయ్యారు. మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల సమాచారం మేరకు కోట మండలంలో చిట్టేడులో ఉన్న జీవీఆర్ రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో చిల్లకూరు, గూడూరు రూరల్ ప్రాంతంలోని మేగనూరుకు చెందిన 23 మంది మహిళలు రోజు వారి పనులకు వెళుతుంటారు. వారంతా పనులు ముగించుకుని పరిశ్రమకు చెందిన మినీ బస్సులో వస్తుండగా మండలంలోని కమ్మవారిపాళెం సమీపంలోకి వచ్చే సరికే కోటకు వెళుతున్న ఓ మోటారు సైకిలిస్టు వేగంగా బస్సు సమీపంలోకి రావడంతో బస్సుడ్రైవర్ భాస్కర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో బస్సు పక్కకు ఒరిగిపోయి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న కూలీలు ఒకరిపై ఒకరు పడి పోవడంతో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో చిల్లకూరుకు చెందిన నారాయణమ్మకు తీవ్రగాయాలు కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ భాస్కర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. చిల్లకూరుకు చెందిన రమాదేవి, లక్ష్మమ్మ, సుజన, రాజమ్మలతో పాటు, మేగనూరుకు చెందిన యశోదమ్మ, స్రవంతి, వెంకటరమణమ్మ, బుజ్జమ్మ, పద్మమ్మలకు గాయాలు అయ్యాయి. వీరిని గూడూరు, కోటకు చెందిన 108 వాహనాల్లో గూడూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. నారాయణమ్మ, యశోదమ్మ, భాస్కర్‌ను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు. ఎమ్మెల్యే పరామర్శ మినీ బస్సు బోల్తాపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు అంకమ్మ, బాబి, సుధాకర్‌తో కలిసి ఆసుపత్రికి చేరకుని ప్రమాద విషయంపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పరిశ్రమ యజమానులతో మాట్లాడి నెల్లూరులో చికిత్స పొందుతున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. -
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
గూడూరు శివారు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్భాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి అదృశ్యమైన ఓ బాలిక సోమవారం ఉదయం ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వివరాలిలా.. మట్టెవాడకు చెందిన బాలిక స్థానిక కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం బాలిక తల్లి పాఠశాలకు వచ్చి, కూతురును కల్సి, తనకు జ్వరం వస్తోందని చెప్పింది. కూతురును బాగా చదువుకోమ్మని చెప్పి వెళ్లింది. కాగా, బాలిక రాత్రి ఎవరికీ చెప్పకుండా గేటు దూకి బయటికి వెళ్లిందని, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బ్రాహ్మణపల్లిలోని ఆమె పిన్ని ఇంటి వద్ద నిలబడి ఉందని తెలిసింది. ఆదే సమయంలో పాఠశాలకు పాల వ్యాన్ వస్తుండగా, ముందుగా వస్తున్న పనిమనిషికి బాలిక కనిపించింది. ‘ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావ్, ఏం చేస్తున్నావ్, ఎలా వచ్చావ్’ అని మందలించి తనతో పాఠశాలకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిని వివరణ కోరగా బాలిక తల్లిపై బెంగతో ఉదయం 3 గంటలకు గేటు దూకి పిన్ని వాళ్లింటికి వెళ్లిందని, గుర్తించిన పనిమనిషి వెంటనే పాఠశాలకు తీసుకొచ్చిందని తెలిపారు. -
లారీని ఢీకొన్న ట్రాక్టర్: ఒకరు మృతి
ముగ్గురి పరిస్థితి విషమం ఐదుగురికి తీవ్రగాయాలు చిల్లకూరు : ఉపాధి పనుల కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ లారీని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల సమాచారం మేరకు చేడిమాల పంచాయతీ నల్లాయగారిపాళెంకు చెందిన ఉపాధి కూలీలు గ్రామంలో కొంత మందికి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో పనులు చేస్తున్నారు. అక్కడికి వెళ్లేందుకు కూలీలు ట్రాక్టర్లో బయలు దేరారు. చేడిమాలకు సమీపంలోకి వచ్చే సరికే మలుపు వద్ద ముందు వెళుతున్న లారీ ఆకస్మికంగా ఆగింది. దీన్ని తప్పించబోయిన ట్రాక్టర్ డ్రైవర్ ముందు ఇంజను దాటుకున్నప్పటికి ట్రక్కు లారీకి తగిలి పక్కకు ఒరిగి పోయింది. దీంతో ట్రక్కులో కూర్చొన్న 30 మంది కూలీలు ఒకరిపై ఒకరు పడి పోయారు. ఎనిమిది మందికి త్రీవగాయాలు కాగా పలువురికి స్వల్పగాయాలయ్యాయి. వీరిని ఆటోల్లో స్థానికులు గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మందా ఈశ్వరమ్మ (38) మృతి చెందింది. బాణాల చెంగయ్య, తాబాక రమణమ్మ, పారిచెర్ల కృష్ణవేణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై అంకమ్మ, ఏఎస్ఐ నాగేశ్వరరావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలని ఆశ్రయమిస్తే..
బంగారు ఆభరాణాలు కాజేసిన యువతి గూడూరు : స్నేహితురాలని ఆశ్రయమిస్తే బంగారం కాజేసి పోలీసులకు చిక్కిందో యువతి. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్బారావు వెల్లడించిన వివరాల మేరకు.. గూడూరు రెండో పట్టణంలోని ఉడతా కుమారి రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తన తల్లి భువనేశ్వరితో కలసి జానకిరాంపేటలో నివసిస్తోంది. 20 రోజుల క్రితం మున్నీ అనే యువతి కుమారి ఇంటికొచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం కుమారి తన బంగారు ఆభరణాలను ధరించి ఓ ఫంక్షన్‌కు వెళ్లి వచ్చిన తర్వాత వాటిని భద్రపరచింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మున్నీ కన్ను నగలపై పడింది. అదను కోసం ఎదురుచూసి వాటిని కాజేసింది. ఈ నెల 24వ తేదీన నగలు కనిపించకపోవడంతో కుమారి ఆందోళనకు గురై వెంటనే రెండో పట్టణ ఎస్సై నరేష్‌కు ఫిర్యాదుచేసింది. మున్నీపై అనుమానం ఉందని వారికి చెప్పింది. పోలీసులు దర్యాప్తు చేయగా కుమారి నగలను మున్నీ కాజేసినట్లు విచారణలో తేలింది. సోమవారం మున్నీని అరె స్ట్ చేసి రూ.3.60 లక్షల విలువ చేసే 18 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నాం : కాకాణి
గూడూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతిని మాత్రమే అడ్డుకుంటున్నామనీ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వరిగొండ పంచాయతీలో ఎన్డీఆర్ అధినేతలు నిర్మించిన రెండు ఆర్వోప్లాంట్లను, ఎంపీ నిధులతో నిర్మించిన ఓ సీసీ రోడ్డు ను ఎమ్మెల్యే కాకాణి బుధవారం ప్రారంభించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ నాయకులు అడ్డుకొంటున్నారనీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఏ ఒక్కటీ నెరవేర్చలేక ప్రజ లకు ఏం సమాధానం చెప్పలేక సీఎం, ఆ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రూ.లక్ష కోట్లు అయి నా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటిం చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీలను కూడా పూర్తిస్థాయిలో మాఫీ చేయలేకపోయారన్నా రు. ఇంటింటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి ఏమయ్యాయో చెప్పాలన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పింఛన్లను, ఇళ్లను, ఇతర పథకాలను సొంత పార్టీ కార్యకర్తలకే దోచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గచర్య అన్నారు. గతంలో ఎమ్మెల్యేలకు ఏడాదికి రూ.కోటి నిధులు మంజూరు అయ్యేవన్నారు.కాని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఆ నిధులను సై తం నిలిపి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి అక్ర మ సంపాదనే ధ్యేయం తో ముందుకు సాగుతున్న చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హ త ఇక ఎంత మాత్రం లేదన్నారు.ఏరోజు ఎ న్నికలొచ్చినా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారాన్ని సాధించడం ఖాయమని కాకాణి స్పష్టం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడుమన్నెం చిరంజీవులగౌడ్, ఎంపీడీఓ సావిత్రమ్మ, ఎంపీటీసీ సభ్యులు కమతం సునీత, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి సుధీర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి దిలీప్‌రెడ్డి, మండల కన్వీనర్ పద్మనాభరెడ్డి,ఎన్డీఆర్ అధినేతలు ఆదికేశువులరెడ్డి, అమృతేష్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్యామలమ్మ, సురేష్‌రెడ్డి, రామ్మూర్తి, సుబ్బారావు, శంకరయ్యగౌడ్, జితేంద్రరెడ్డి, శేషమ్మ పాల్గొన్నారు. -
ఆడిటర్ల ఆటలు..
మహిళలపై ఇద్దరు సీనియర్ల వేధింపులు ఆడిట్ శాఖలో ఇష్టారాజ్యం అది ఆడిట్ శాఖ.. వారు ఏళ్ల తరబడి అక్కడే పాతుకుపోయిన సీనియర్లు.. తాము చేసే అక్రమాలకు తలూపితే ఓకే.. లేకపోతే ఎంప్లాయి డేటాలో భర్త పేరుదగ్గర మరొకరి పేరు నమోదు చేస్తారు.. దాన్ని సదరు మహిళ భర్తకు చూపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తారు.. ఏడి కళ్లావేళ్లా పడితే మళ్లీ పేరు సాధారణ స్థితికి తెస్తారు. ఇదేమని ప్రశ్నించిన అధికారిని సైతం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీరి చేష్టలకు విసిగిపోయిన మహిళా సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కాపీ ‘సాక్షి’కి చిక్కింది. నెల్లూరు (అర్బన్): నెల్లూరు జిల్లా గూడూరులో ఆడిటర్లుగా పని చేస్తున్న ఇద్దరు సీనియర్లు 2006 లో డిప్యుటేషన్‌పై నెల్లూరుకు వచ్చారు. డిప్యుటేషన్‌పై వచ్చిన వారిని మూడేళ్లకు మించి ఉంచకూడదు. ఈ నిబంధన ఆ ఇద్దరికి వర్తించలేదు. అప్పటి నుంచి వారి అవినీతికి అంతం లేకుండా పోయింది. 2012లో కార్పొరేషన్ చిరుద్యోగులు సుబ్బులు, జయరాం, మరో మహిళ తమ పెన్షన్ ఫైలు విషయంలో లంచం అడుగుతున్నారంటూ పత్రికలకు ఎక్కారు. దీంతో విచారణ చేసిన అధికారులు వారిద్దరినీ మళ్లీ గూడూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. వీరు 2014 బదిలీల్లో మళ్లీ నెల్లూరుకే వచ్చారు. వీరి మీద అభియోగాలున్న దృష్ట్యా ఒకరిని మండల పరిషత్ ఆడిట్ శాఖలో, మరొకరిని జిల్లా పరిషత్ ఆడిట్ శాఖలో నియమించారు. అక్కడా ఇదే పంథా కొనసాగిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో సీటు కోసం కుస్తీ వీరు రంగనాయకుల పేటలోని జిల్లా ఆడిట్ కార్యాలయంలో కుర్చీలపై కన్నేశారు. నిత్యం ఇతరులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాగైనా ఆదాయం తెచ్చి పెట్టే పాత సీట్లోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. 500 ఫిర్యాదులు వెళ్లినా చర్యలేవి? వీరిలో ఒకరిపై 500ల ఫిర్యాదులు వెళ్లినా చర్యల్లేవ్. విచారణ మూడేళ్లుగా సాగుతోంది. ఓ సీనియర్ ఏటా కార్పొరేషన్లో ఆడిట్ చేస్తారు. గతేడాది 12 మందితో కమిటీ వేసినా ఆయన ఒక్కరే ఆడిట్ చేశారు. వాటిలో అభ్యంతరాలున్నా లేనట్టు చూపించి డబ్బులు వసూలు చేసినట్టు విమర్శలున్నాయి. ఆడిట్లో అభ్యంతరాలున్నాయంటూ ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్ ఫైలుపై ఆరు నెలలు సంతకాలు చేయకుండా ఆపారు. ప్రస్తుతం కార్పొరేషన్లో ఇంజనీరింగ్ విభాగానికి ఆడిట్ పూర్తి చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సొంత ఇంట్లో ఉంటూ ఇన్‌కంటాక్స్ కోసం అద్దె ఇంట్లో ఉన్నట్టు రికార్డు చూపినట్టు ఆరోపణలున్నాయి. విజిలెన్స్ విచారణ ఏమైందో? మరొక అవినీతి ఆడిటర్‌పై కూడా విజిలెన్స్ విచారణ జరిగింది. జిల్లా ఆడిట్ అధికారి నివేదిక తయారు చేసి 2015లో ఒంగోలు డిప్యూటీ డెరైక్టర్‌కు పంపారు. అయినా ఆయనపై చర్యలు లేవు. ఆయన జెడ్పీ ఆడిటర్‌గా పని చే స్తూ మండల పరిషత్ ఆడిటింగ్ పనులను ఒకరికి బదులుగా చేసినట్టు ఆరోపణలున్నాయి. గతంలో వీరిపై డిప్యూటీ డెరైక్టర్ చిన్నపరెడ్డి విచారణ చేపట్టారు. సాక్షికి చిక్కిన బాధితురాలి ఫిర్యాదు కాపీ వీరి బాధలు పడలేని తోటి సీనియర్ ఆడిటర్ అయిన ఓ మహిళ తనను ఎలా మానసికంగా వేధిస్తున్నారో వివరిస్తూ రాష్ట్ర డెరైక్టర్‌తో పాటు డీడీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భర్తలేని తాను బిడ్డలతో గుట్టుగా ఉంటే తనను వేధిస్తున్నారని వివరించింది. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకొని మహిళా ఆడిటర్లకు రక్షణ కల్పించాలని కోరుతూ డిప్యూటీ డెరైక్టర్-ఒంగోలుకు పంపిన కాపీ ‘సాక్షి’కి చిక్కింది. వేధింపులకు గురిచేసిన కాపీ అందింది ఆడిట్ శాఖలో మహిళలను వేధిస్తుని మహిళ చేసిన ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టాం. డెరైక్టర్ పరిశీలించి చర్యలు తీసుకోవాలి. అదేంటి మీరే చర్యలు తీసుకుని డెరైక్టర్‌కు నివేదిక పంపాలి కదా? అని సాక్షి ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. -రాధాకృష్ణ, రీజనల్ డిప్యూటీ డెరైక్టర్, ఒంగోలు చర్యలు తీసుకోవాల్సింది డీడీనే నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టా. వారిపై చర్యలు చేపట్టేందుకు అధికారం లేదు. రీజినల్ డిప్యూటీ డైరె క్టర్ చర్యలు తీసుకోవాలి. -షణ్ముఖం, జిల్లా ఆడిట్ అధికారి -
సెల్ చార్జింగ్ పెడుతూ మహిళ మృతి
గూడూరు (వరంగల్ జిల్లా) : సెల్ చార్జింగ్ పెడుతూ ఓ మహిళ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా గూడూరు మండలం చిర్రకుంటతండాలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలం ఎల్లాయగూడెం గ్రామానికి చెందిన బానోతు సునీత (25) తన ఇద్దరు పిల్లలతో కలిసి రెండు రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వెళ్లింది. మంగళవారం తల్లి ఉండే ఇంట్లో సెల్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. సునీత తల్లి దేవ్లీ ఫిర్యాదు మేరకు ఎస్సై వై.సతీష్, విద్యుత్ ఏఈ రవికుమార్ అక్కడికి చేరుకున్నారు. కాగా సునీత భర్త ఆరు నెలల క్రితమే మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
నెల్లూరు: యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్తున్న ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రైలులోని రెండు బోగీల నుంచి విపరీతమైన పొగలు వచ్చాయి. దీంతో గూడూరు రైల్వే స్టేషన్లో రైలును ఆపేశారు. వెంటనే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. మంటలు వ్యాపించడానికి కల కారణాలు తెలియాల్సి ఉంది. -
గోదాములపై విజిలెన్స్ దాడులు
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా గూడూరులోని పలు పప్పుధాన్యాల గోదాములపై గురువారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 10 లక్షల విలువైన 24 క్వింటాళ్ల కందిపప్పు, 21 క్వింటాళ్ల మినప పప్పు, 34 క్వింటాళ్ల పెసరపప్పు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచి కృత్రిమ కొరతను సృష్టించినందుకుగాను యజమానిపై కేసు నమోదు చేశారు. -
వరికి ఊపిరి
జిల్లాలో భారీవర్షం గూడూరులో అత్యధికం 128.2 మిల్లీమీటర్లు రైతులకు కొంత ఊరట మచిలీపట్నం : తూర్పుకృష్ణాలో బుధవారం తెల్లవారుజాము ఒంటి గంట నుంచి 5గంటల వరకు భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా గూడూరు మండలంలో 128.2 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 103.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఉంగుటూరు మండలం 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 19.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తూర్పుకృష్ణాలో భారీ వర్షం కురవడంతో వరి పొలాల్లో నీరు చేరింది. ఇంత కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వరి పైరుకు కొంతమేర ఊపిరి పోసినట్లయ్యింది. రైతుల్లో ఆనందం.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయాల్సి ఉండగా ఇంత వరకు కాలువలకు సాగునీరు విడుదల చేయలేదు. వర్షాధారంగా, డ్రెయిన్లలోని నీటి ఆధారంగా 4.64 లక్షల ఎకరాల్లో ఎన్నో ఆశలతో వరిసాగు చేశారు. మరో 1.75 లక్షల ఎకరాల్లో వరిసాగు నిలిచిపోయింది. సెప్టెంబరు 20వ తేదీ నుంచి కాలువలను పూర్తిస్థాయిలో కట్టివేశారు. సాగునీటి ఎద్దడి తీవ్ర తరం కావడంతో మంత్రి కామినేని శ్రీనివాస్, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బోల్తా పడిన అంబులెన్స్
గూడూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : ప్రమాదానికి గురైనవారిని రక్షించడానికి వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు జాతీయరహదారి పై ఉన్న ఆదిశంకర కాలేజీ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల ప్రకారం.. గూడూరు నుంచి నెల్లూరు వెళ్తున్న అంబులెన్స్ కాలేజీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని వెంటనే మరో అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. -
హత్యకేసులో నలుగురికి యావజ్జీవం
గూడూరు (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : పొలం విషయమై సొంత సోదరుని చంపిన నేరానికిగాను నలుగురికి న్యాయస్థానం యావజ్జీవ కారాగారం విధించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు డక్కిలి మండలం చీకినేనిపల్లి గ్రామానికి చెందిన సుద్దరాశి శంకయ్య(45)కు అతని సోదరుడైన పోలయ్యకు మధ్య పొలం తగాదాలు నడుస్తున్నాయి. గొడవలు ముదిరిన నేపథ్యంలో 2011 సంవత్సరంలో సుద్దరాశి పోలయ్య, అతని భార్య సావిత్రమ్మ, కుమార్తె రాజమ్మతోపాటు పోలయ్య మరో సోదరుడు భాస్కర్ కలసి శంకరయ్యను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనపై శంకరయ్య భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు కావటంతో శుక్రవారం గూడూరు ఏడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గుర్రప్ప.. నలుగురు నిందితులు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. -
మహిళపై కత్తితో దాడి: చైన్ స్నాచింగ్
(గూడూరు అర్బన్) నెల్లూరు : గూడూరు పట్టణ నడిబొడ్డున ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సుబ్బమ్మ(40) అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం మహిళ మెడలో ఉన్న 3 సవర్ల బంగారు గొలుసుతో పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన సుబ్బమ్మను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
గూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని గూడూరు పట్టణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని డీఆర్డబ్ల్యూ కాలేజీ వసతి గృహంలో రవళి (19) ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. రవళి, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రవళి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందినదిగా పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ ఢీకొని బాలుడి మృతి
గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరులో ఓ లారీ బాలుడి ప్రాణాలు బలి తీసుకుంది. నగరంలోని ఎస్ఆర్ టాకీస్ సెంటర్ సమీపంలో సైకిల్‌పై వస్తున్న బాలుణ్ని సైదాపురం నుంచి కంకర లోడుతో వస్తున్న లారీ ఢీకొంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాలుడు (12) అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన బాలుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వెల్ఫేర్ హాస్టల్ లో ఫుడ్ పాయిజనింగ్..
గూడురు: కలుషితాహారం తిని 26 మంది విద్యార్థినులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం కృష్ణా జిల్లా గూడూరు మండలం కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో జరిగింది. వివరాలు.. ఆదివారం రాత్రి హాస్టల్లో విద్యార్థినిలు తిన్న ఆహారం వికటించింది. దీంతో సోమవారం తెల్లవారుజామున 26 మంది విద్యార్థినిలు విరేచనాలతో బాధపడ్డారు. బాధితులందరిని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా, ఆస్పత్రిని మండల ఎండీవో, ఎమ్మార్వో తదితరులు సందర్శించి విద్యార్థినిల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
వరకట్న వేధింపులతో నూతన వధువు ఆత్మహత్య
గూడూరు : వరకట్న వేధింపులతో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గూడూరు మండలంలోని రాములు తండా శివారు సాంబయ్యపల్లిలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి నానమ్మ, తాతయ్య, తండ్రి భద్య కథనం ప్రకారం... సాంబయ్యపల్లికి చెందిన మాలోతు భద్య కూతురు అనూష (19), నర్సంపేట డివిజన్ చెన్నారావుపేట మండలం పాపయ్యపేట శివారు పంతుల్యతండాకు చెందిన లావుడ్య బాలుకు రెండు నెలల క్రితం వివాహమైంది. ఆ సమయంలో వరకట్నంగా రూ.3లక్షలు ఒప్పుకోగా... అందు లో రూ. 2 లక్షలు ముట్టజెప్పారు. మిగతా డబ్బులు వచ్చే సం వత్సరం ఇస్తామని అనూష తల్లిదండ్రులు ఒప్పందం కుదుర్చుకున్నారు. కూతురు పెళ్లి అయిన తర్వాత తండ్రి భద్య తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులకు వెళ్లారు. సాంబయ్యపల్లిలో భద్య తల్లిదండ్రులు చావలి, ఈర్య ఉంటున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచే బాలు... అనూషను అనుమానించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బాలు తల్లిదండ్రులు జానకి, గరీభాఇవ్వాల్సి లక్ష వరకట్నం కూడా కావాలంటూ అనూషను దూషించేవారని చెప్పారు. రెండు రోజుల క్రితం భర్త, అత్తామామ వేధింపులకు తట్టుకోలేని అనూష సాం బయ్యపల్లిలోని నానమ్మ, తాత య్య దగ్గరకు వచ్చింది. అత్తగారింట్లో జరిగిన విషయాన్ని వారికి చెప్పి, మనోవేదనకు గురైంది. ఈ విషయాన్ని వారు కొడుకు భద్యకు తెలియజేశారు. బాలు, అతడి తల్లిదండ్రులతో మాట్లాడి అనూషను పంపించి రమ్మని భద్య వారికి చెప్పాడు. దీంతో కూలీకి వెళ్లొచ్చి మధ్యాహ్నం వచ్చాక అత్తగారింటికి తీసుకెళ్తాం...తయారు కమ్మని అనూషకు చెప్పి వెళ్లారు. తిరిగి వారు ఉదయం 10 గంటలకు ఇంటికి వచ్చే సరికి చీరతో ఉరి వేసుకుని మృతి చెంది ఉంది. వారు బోరున విలపించడంతో తండావాసులు అక్కడికి చేరుకున్నారు. సెల్ఫోన్లో కూతురు మృతి విషయాన్ని భద్యకు, పోలీసులకు తెలియజేశారు. మృతురాలి తండ్రి భద్య పిర్యా దు మేరకు వరకట్న వేధింపులతోపాటు భర్తపై అనుమాన వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చెన్నై- గూడూరు ప్యాసింజర్ రైలులో మంటలు
-
టీపీ గూడూరును దత్తత తీసుకుంటా
కొడవలూరు: ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆయన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయలనుకోవడం ప్రశంసనీయమని, ఆయన స్ఫూర్తితో తన స్వగ్రామమైన తోటపల్లిగూడూరును దత్తత తీసుకుని ఆయనతో పోటీపడి అభివృద్ధి చేస్తానని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మండలంలోని వెంకన్నపురంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వగ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కృష్ణయ్య అద్భుతమైన ప్రణాళిక రూపొందించారన్నారు. టీపీగూడూరును కూడా కృష్ణయ్య సూచనలు, సలహాల మేరకే అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాలో ఉన్న గ్రామాల్లో తొంబై శాతం గ్రామాలను దత్తత తీసుకొనేలా చేయడం బాధ్యతగా పెట్టుకొన్నట్లు తెలిపారు. దత్తత తీసుకొన్న గ్రామాలకు సొంత నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలు గ్రామంలో వంద శాతం అమలయ్యేలా చేస్తే చాలన్నారు. దత్తత తీసుకొన్న గ్రామ అభివృద్ధికి కృష్ణయ్య అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమానికి ఆయనను అంబాసిడర్‌గా పెట్టుకుంటామన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగపూర్, జపాన్ల నుంచి పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని తెలిపారు. జిల్లాలో పోర్టు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. సీఎం సహకారంతో జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సుగ్రామంలో మంచి మనుషులుండాలి ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిఒక్కరూ గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందించినపుడే ఏ గ్రామమైనా సుగ్రామమవుతుందన్నారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో వసతులు దుర్భరంగా ఉన్నాయన్నారు. నిర్వహణ లోపంతోనే ఈ దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసేలా మంత్రి కృషి చేయాలని కోరారు. రూ.2 కోట్ల జెడ్పీ నిధులతో జిల్లాలోని 50 పాఠశాలల్లో వసతులు మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ ఎం.జానకి, ఎమ్మెల్యేలు పి.శ్రీనివాసులురెడ్డి, కె.రామకృష్ణ, రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దుర్గాప్రసాదరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మాట్లాడారు. అభివృద్ధికి శ్రీకారం కొడవలూరు: వెంకన్నపురాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించక ముందు నుంచే కృష్ణయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందుకోసం ఒక ప్రణాళిక రూపొందించారు. రైతుల ధాన్యాన్ని కోసిన వెంటనే అమ్ముకోకుండా గోదాముల్లో భద్రపరచుకుని మంచి ధర వచ్చినపుడు అమ్ముకునేలా చేసేందుకు గ్రామంలో గిడ్డంగుల నిర్మాణానికి కృషిచేస్తున్నారు. పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు గ్రామంలోనే విక్రయించుకునేలా చర్యలు మొదలుపెట్టారు. ప్రశంసల జల్లు స్వగ్రామ అభివృద్ధికి కృష్ణయ్య రూపొందించిన ప్రణాళిక, చేస్తున్న కృషికి మంత్రి నారాయణ, కలెక్టర్ జానకితోసహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని తామంతా దత్తత గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. -
చంపాలని చూస్తాండు..
గూడూరు : కట్టుకున్నోడే తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, ఇంట్లో బంధించి తనను, తన ముగ్గురు పిల్లలను చంపాలని చూస్తున్నాడని ఓ మహిళ గూడూరు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విలేకరుల ఎదుట తన గోడును వెల్లబోసుకుంది. బాధితురాలు షేక్ సమీనాబేగం తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలంలోని బొద్దుగొండకు చెందిన తనకు 2009లో రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన షేక్ ఖాజాపాషాతో వివాహమైందని, పెళ్లి సమయంలో కట్నకానుకలుగా తన తల్లిదండ్రులు రూ.2లక్షలతోపాటు 6 తులాల బంగారం ఇచ్చారని చెప్పింది. అరుుతే, ఖాజాపాషా వికారాబాద్‌లో రౌడీషీటర్‌గా గుర్తింపు పొందాడని, ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియక పెళ్లి చేశారని సమీనాబేగం చెప్పింది. క్రూరుడైన ఖాజాపాషా నిత్యం వేధించేవాడని, అతడు పెట్టే ఇబ్బందులు ఎవరికైనా చె బితే తన తల్లిదండ్రులను చంపుతానని బెదిరించేవాడని, తమకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని, తల్లిదండ్రుల పేదరికాన్ని తెలిసి.. భర్త పెట్టే బాధలను భరిస్తూ కాపురం చేశానని ఆమె రోదిస్తూ చెప్పుకుంది. నాలుగేళ్లుగా తనను ఇంట్లో బంధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిపై 25 కేసులున్నాయని, ఓ కేసులో యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు ఉన్నందున, తన పుట్టింటి నుంచి రూ.5ల క్షలు అడిగి తేవాలని, లేకుంటే తనను, తన పిల్లలను చంపుతానని వేధిస్తున్నాడని వివరించింది. చివరకు మూడు రోజుల క్రితం.. ఖాజాపాషా ఇంట్లో లేని సమయంలో పిల్లలతో కలిసి ఇరుగుపొరుగు వారిని బస్‌చార్జీలను అడుక్కుని పుట్టింటికి చేరుకున్నానని సమీనాబేగం తెలిపింది. ఇంత కాలం తనకు బయటి ప్రపంచం అంటే ఏమిటో తెలియదని విలపించింది. చివరకు ఓ పెద్దమనిషి ద్వారా తల్లిదండ్రులకు తన బాధనంతా చెప్పుకుని పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన రోదన విన్న సీఐ వెంకటేశ్వర్రావు వెంటనే స్పందించి తన భర్త ఖాజాపాషాను పట్టుకొచ్చారని, అయినా తనను, తన పిల్లలను పోలీసుల ఎదుటనే చంపుతానంటున్నాడని, ఆ క్రూరమృగం నుంచి కాపాడాలని, తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది. సమీనాబేగం, ఆమె తల్లిదండ్రులు మహ్మద్ జిలాని, ఖాజాబేగం ఫిర్యాదు మేరకు ఖాజాపాషాపై కేసు నమోదు చేసి డీఎస్పీకి బదిలీ చేస్తున్నట్లు గూడూరు పోలీసులు తెలిపారు.