
విద్యార్థిని ఆత్మహత్య
గూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని గూడూరు పట్టణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని డీఆర్‌డబ్ల్యూ కాలేజీ వసతి గృహంలో రవళి (19) ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. రవళి, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రవళి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందినదిగా పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.