Ravali
-
ఎంపీ బరిలో కోకాపేట ఆంటీ
-
పెళ్లం కొడుతోంది..
-
వెల్లుల్లి ధరలకు వామ్మో అంటున్న రవళి
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?
ఈమె అచ్చ తెలుగు హీరోయిన్. పుట్టి పెరిగింది అంతా ఉమ్మడి ఆంధ్రాలోనే. పద్దెనిమిదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. బోలెడన్ని హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు రవళి. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని పేరు. 'పెళ్లి సందడి' రవళి అంటే మాత్రం చాలామంది గుర్తుపట్టేస్తారు. అవును పైన ఫొటోలో కనిపస్తున్నది ఆమెనే. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో పుట్టిన ఈమె.. 1990లో 'జడ్జిమెంట్' అనే మలయాళ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో 'జయభేరి' మూవీలో హీరోయిన్గా చేసింది. తొలుత నాలుగేళ్ల పాటు ఈమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎప్పుడైతే 'పెళ్లి సందడి' చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) 1996లో వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా.. రవళి కెరీర్‌కి బూస్టప్ ఇచ్చింది. దీంతో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. రవళి చేసిన చిత్రాల్లో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు, మర్ద్(హిందీ) తదితర చిత్రాలు ఈమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు మూవీస్ చేసింది. 2011లో 'మాయగాడు' అనే సినిమాలో చివరగా నటించింది. రవళి వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రవళికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీరియల్ నటి హరిత.. రవళికి అక్క అవుతుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తిరుమల దర్శనానికి వచ్చే రవళి.. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు చూసి తొలుత ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తుపట్టి, ఈమె ఆమెనా అని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) -
తలా పది ఓట్లు అంటున్న రవళి
-
ఫైనల్ మ్యాచ్.. సంబరంలో రవళి
-
పాము పిజ్జాలు అమ్ముతున్న రవళి
-
అప్పుడెట్లుండె ఎలక్షన్స్..ఇప్పుడెట్లుండె ఎలక్షన్స్
-
ముక్కా చుక్కా..లక్కీ డ్రా
-
పాల్ పార్టీలో చేరుతా..ఎమ్మెల్యే అవుతా..
-
చిట్టినాయుడుకి చిట్టిప్రశ్నలు..లోకేష్ ఫ్రస్టేషన్
-
స్టార్ హీరోయిన్ రవళి కెరీర్ ముగిసిపోవడానికి కారణమిదే!
సినిమాల్లో కనిపిస్తే చాలనుకునేవారు కొందరైతే సినిమా ఇండస్ట్రీనే ఏలేయాలనుకునేవాళ్లు మరికొందరు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది సినీనటి విజయదుర్గ. 1987లో తన ముగ్గురు పిల్లల్ని చేతపట్టుకుని చెన్నపట్నం(ప్రస్తుత చెన్నై) వెళ్లింది. కష్టాలను లెక్కచేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఛాన్సులు చేజిక్కించుకుంది, విజయాలను అందుకుంది. ఆమె ఇద్దరు కూతుర్లు రవళి, హరితలు కూడా నటనారంగంలో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. మా అసలు పేర్లు ఇవీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నా అసలు పేరు కనకదుర్గ. మాది గుడివాడ. చెన్నైలో ఓసారి దసరా నవరాత్రులకు వెళ్లాను. అక్కడి వాతావరణం నచ్చడంతో పిల్లలను తీసుకుని చెన్నై షిఫ్ట్ అయ్యాను. పిల్లల్ని క్లాసికల్ డ్యాన్స్‌లో శిక్షణ ఇప్పించాను. అక్కడికి వెళ్లిన నాలుగు నెలలకే.. రఘువరన్ హీరోగా ఎస్పీ ముత్తరామన్ డైరెక్ట్ చేసిన ఓ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికే కనకదుర్గ పేరిట ఓ నటి ఉండటంతో నా పేరును విజయదుర్గగా మార్చారు. నటి హరిత దంపతులు పెళ్లి సందడితో ఫుల్ క్రేజ్ తమిళంలో 15, తెలుగులోనూ దాదాపు 15 చిత్రాలు చేశాను. నా కూతురు హరిత(అసలు పేరు శాంతి) మొదట హీరోయిన్గా చేసింది. పొట్టిగా ఉందంటూ తనకు సిస్టర్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ప్రస్తుతం తను బుల్లితెరపై రాణిస్తోంది. ఆ తర్వాత నా కొడుకు విజయ్ (అసలు పేరు శేషు) హీరోగా ఓ సినిమా చేశాడు, కానీ అది విడుదల చేయలేదు. పెళ్లి సందడి సినిమాకు నా కూతురు రవళి(అసలు పేరు శైలజ)కి రూ.50 వేలు ఇచ్చారు. తర్వాత మాత్రం లక్షల్లో అందుకుంది. ఆ ప్రచారం వల్లే కెరీర్ నాశనం తన కెరీర్ ఊపులో ఉన్న సమయంలో రవళి లావైపోయిందని వార్తలు రాశారు. ఆ ప్రచారం వల్ల తన కెరీర్ నాశనమైంది. చెప్పుకోదగ్గ పాత్రలు, సినిమాలు రాలేదు. పెళ్లి చేసుకుని సినిమాలు మానేద్దామనుకుంది. ఆ సమయంలో చిరంజీవి స్టాలిన్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని చిత్రాలు చేసి 2011లో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. త్వరలోనే తను రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. నా ఆస్తి అంతా ముగ్గురికీ సమానంగా పంచాను. నా దగ్గర సెంటు భూమి కూడా పెట్టుకోలేదు. ఉన్నదంతా ఇచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం, ముందు సహజీవనం చేస్తా, అప్పుడే పచ్చబొట్టు వేయించుకుంటా! -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లిసందడి హీరోయిన్ రవళి
ఒకప్పటి హీరోయిన్ రవళి గుర్తుందా? అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రవళి ముఖ్యంగా ‘పెళ్లిసందడి’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సహా తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో సూపర్ క్రేజ్‌ను దక్కించుకుంది. 18 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన రవళి ఇప్పటివరకు రీఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా తిరుమలలో దర్శనమిచ్చిన ఈమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పడు అందచందాలతో అలరించిన రవళి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న(అక్టోబర్ 10) పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే 25 ఏళ్ల శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా! ఈ వేడుకలో ఒకప్పుటి హీరోయిన్ రవళిని చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అతిథులుగా వచ్చిన చిరు, వెంకటేశ్‌లు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు. తన అందం, అభినయంతో 90లలో హీరోయిన్గా చక్రం తిప్పిన రవళి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అంతేగాక తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ ముందుగా ‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకున్నారు. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నాను అంటూ సరదాగా చమత్కరించారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే.. ఆ తర్వాత రవళి మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. రావొద్దని కాదు కానీ.. వచ్చిన నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశాను. అయినా రాఘవేంద్ర రావు పిలిచిన తర్వాత రాకుండా ఉండలేను, ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఎలా ఉన్నా వస్తాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె పెళ్లి సందD హీరో రోషన్, శ్రీలీలా, మూవీ టీంకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ మూవీని రూపొందించారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..
సాక్షి, భీమదేవరపల్లి: ‘అమ్మా.. నన్ను క్షమించండి, నేను సంతోషంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో ఎవరున్నారో మీకు తెలుసు. నేను నా భర్తతో ఉండలేకపోతున్నా... ప్రతీ క్షణం నరకం అనుభవిస్తున్నా’అంటూ ఓ నవ వధువు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్ కూతురు రవళికి భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన ఐలబోయిన రాజుతో ఈనెల 11వ తేదీన వివాహం జరిగింది. అయితే రవళి ఇంతకుముందే ఓ యువకుడిని ప్రేమించినా, తల్లిదండ్రుల ఒత్తిడితో రాజును వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రవళి ఆత్మహత్యకు పాల్పడింది. చదవండి: (సఖి సెంటర్లో నవ వధువు ఆత్మహత్య) -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
గోవింద్రాజ్, కిరణ్ మేడసాని, త్రిశంక్, అభిషేక్, లావణ్య, ఫరీనా, రవళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అన్నది ట్యాగ్‌లైన్ . అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి. వెంకట్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘తన ఆలోచనే కరెక్ట్ అని భావించి తాను తీసే సినిమా యూనిట్‌ను ముప్పతిప్పులు పెట్టే ఓ డైరెక్టర్ చివరకు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథని వినోదాత్మకంగా తెరకెక్కించాం. ప్రధాన పాత్రలో గోవింద్ రాజ్ నటించారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్.జి, కెమెరా: బొబ్బిలి సంతోష్ రెడ్డి. -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
రవళికి కన్నీటి వీడ్కోలు
సంగెం: ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన రవళికి కన్నీటి వీడ్కోలు పలికారు. మంగళవారం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అశ్రు నివాళులర్పించారు. గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావు ఏకైక కూతురు రవళిపై తోటి విద్యార్థి ఫిబ్రవరి 27న హన్మకొండలోని రాంనగర్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రవళి చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం స్వ గ్రామానికి.. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి హన్మకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, శ్రీధర్‌రావు పంచానామా నిర్వహించిన తర్వాత పోస్టుమార్టమ్ చేపట్టారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులు రవళి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య రామచంద్రాపురం గ్రామానికి తీçసుకు వచ్చారు. విద్యార్థి్థని మృతదేహాన్ని చూడగానే బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా గొల్లుమన్నారు. మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రవళిపై దాడి చేసిన నిందితుడిని కాల్చి చంపాలని గట్టిగా నినాదాలు చేశారు. అరటి మొక్కతో పెళ్లి.. రవళి మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం అరటి మొక్కతో పెళ్లి జరిపించారు. అయ్యగారు పెళ్లి తంతు జరిపిస్తుండగా రవళి తల్లితండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బందోబస్తు మధ్య అంత్యక్రియలు.. రవళి మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరచెరువు శ్మశాన వాటిక వరకు పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా తరలించారు. తండ్రి సుధాకర్‌రావు తలకొరివి పెట్టి రవళి చితికి నిప్పంటించాడు. అయ్యో రవళి అంటూ అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అశ్రు నయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మామునూర్ ఏసీపీ జి.శ్యాంసుందర్, హన్మకొండ, గీసుకొండ, పర్వతగిరి సీఐలు సంపత్‌రావు, సంజీవరావు, శ్రీధర్‌రావు, సంగెం, ఐనవోలు ఎస్సైలు నాగరాజు, నర్సింహరావు, 40 మంది కానిస్టేబుళ్లు, 8 మంది మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. కడసారి చూపుకు నోచుకోలేక.. కన్నకూతురును కడసారి చూసుకోని పరిస్థితి మరే తల్లితండ్రులకూ రావద్దని రవళి తల్లితండ్రులు పద్మ, సుధాకర్‌రావు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పెట్రోలు దాడిలో పూర్తిగా కళ్లు, ముఖం కాలిపోయిన కూతురు ముఖంను చూసుకోలేకపోయామని బావురుమన్నారు. -
ఆరని మంట.. మోగని రవళి
రవళి... తమ జీవితాలకు ఆనంద రవళి అవుతుందని కలలు కన్నారు ఆమె అమ్మానాన్నలు. అందెలు ఘల్లుమంటూ రవళి ఇంట్లో తిరుగుతుంటే సంతోషాల హరివిల్లును చూశారా అమ్మానాన్నలు. ఒక్కగానొక్క బిడ్డ. ఆమె ప్రతి వేడుకా ఆ ఇంటికి ఆనందాల డోలికగానే సాగింది. ఓణీ ఫంక్షన్లో పెళ్లి కూతురిలా అలంకరించి ఫొటో తీసుకున్నారు ఆమె అమ్మానాన్న పద్మ, సుధాకర్. తాము చదువుకోలేదు. ఉన్న కొద్దిపాటి పొలంలో సాగు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. కూతురిని చదివించాలనేది వాళ్ల కల. రోజూ రవళిని కాలేజ్‌కి పంపించి గోడ మీదున్న ఓణీ ఫంక్షన్ ఫొటోను చూస్తూ డిగ్రీ పూర్తయిన వెంటనే సంబంధాలు చూడాలి. బంధువులందరినీ పిలుచుకుని మంచి వరుడితో ఆమె పెళ్లి వైభవంగా చేయాలని చెప్పుకునేవాళ్లు పద్మ, సుధాకర్‌లు. వాళ్లు అనుకున్నట్లే నిన్న (మంగళవారం) రవళికి పెళ్లి చేశారు వరుడిని వెతక్కుండానే. అరటి చెట్టుతో పెళ్లి చేశారామెకి. కాదు... ఆమెకి కాదు... ఆమె మృతదేహానికి. (ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి) రవళిది వరంగల్ జిల్లా, సంగం మండలం, రామచంద్రాపురం. రెండు నెలల కిందట ఇంట్లో చెప్పింది... కాలేజ్‌లో ఓ కుర్రాడు తనను వేధిస్తున్నాడని. అతడు అదే ఊరికి చెందిన అన్వేష్. ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. తన అమ్మానాన్న, మేనమామ సాక్షిగా ‘ఇక ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అని తలవంచుకున్నాడు అన్వేష్. పెద్దవాళ్లు మందలించడంతో తప్పు తెలుసుకున్నాడనే అనుకున్నారంతా. ఇక్కడే అందరి అంచనాలూ తారుమారయ్యాయి. అతడి మౌనం కార్చిచ్చులా రవళిని దహించి వేస్తుందని అతడు రవళి మీద పెట్రోల్ పోసి తగల పెట్టే వరకు ఎవరూ ఊహించ లేదు. (పేట్రేగిన ప్రేమోన్మాదం) సున్నితమైన శరీరం భగ్గున మండిపోయింది. 85 శాతం బర్న్స్. కళ్లు మండిపోయాయి. ఊపిరి తిత్తులు మాడిపోయాయి. ఇంకేం మిగిలి ఉంది జీవించడానికి. దేహంలో ప్రతి అవయవమూ బతుకుపోరాటం చేసే శక్తిలేనంతగా బొగ్గయిపోయాయి. ఆరు రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి తాను గెలవలేకపోతున్నానని లోకానికి చెప్పింది రవళి. హాస్పిటల్ వాళ్లు దేహం మొత్తానికి తెల్లటి వస్త్రాన్ని చుట్టి అమ్మానాన్నల చేతుల్లో పెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డను అందుకున్నంత భద్రంగా అందుకున్నారు అమ్మానాన్నలు ప్రాణం లేని రవళిని. చివరి చూపు లేదు ఇంటికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. బంధువులంతా వచ్చారు. ఆమె ముఖాన్ని కళ్లారా చూసుకుందామని కట్లు విప్పిన వాళ్లకు కళ్లు బైర్లుకమ్మాయి. తల్లి స్పృహ తప్పి పడిపోయింది. రవళి ముఖం... ముఖంలా లేదు. చూడలేక కప్పేయాల్సి వచ్చింది. అంతిమ సంస్కారాలు మొదలయ్యాయి. అరటి చెట్టుతో పెళ్లి చేశారు. అక్షింతలు వేస్తూ ‘నీ పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తామనుకున్నామే కానీ ఇలా జరిగిందేమిటి తల్లీ’ అని బంధువులంతా భోరున ఏడుస్తూ ఉంటే అక్కడున్న వాళ్లందరి గుండెలు తరుక్కుపోయాయి. ఏ బిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లు తుడుచుకున్నారు. రవళి మృతదేహానికి అరటి చెట్టుతో పెళ్లి చేస్తున్న దృశ్యం ఓ ఉన్మాది చేతిలో కాలిపోయిన జీవితం రవళిది. మరే తల్లికీ ఇలాంటి గర్భశోకం రాకూడదని గుండెలవిసేలా ఏడుస్తోంది రవళి తల్లి. బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేని తల్లి మనసు గంటకోసారి స్పృహ కోల్పోతోంది. స్పృహలోకి వచ్చిన ప్రతిసారీ ఒకటే మాట... ‘అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. ఒక తల్లి కన్న బిడ్డ ప్రాణాలు తీసే హక్కు అతడికెక్కడిది? ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష అందరికీ కనువిప్పు కావాలి. అట్లాంటి చట్టాల్లేకపోతే చట్టాలు మార్చుకుని మరీ శిక్ష వేయండి’ అంటూ పలవరిస్తోంది. - గజ్జెల శ్రీనివాస్, సాక్షి, సంగెం, వరంగల్ రూరల్ మా చెల్లికి దిక్కెవరు నాకు, మా చెల్లికి కలిపి ఒక్కర్తే అమ్మాయి. రవళికి ఆడపిల్లకు చేసుకునే వేడుకలన్నీ ఇద్దరం కలిసి చేసుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడిలా అయింది. మా చెల్లికి మెలకువ వస్తే ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పద్మను కాపాడుకోవడం ఎలాగో తెలియడం లేదు. ప్రభుత్వం వాడిని(అన్వేష్) శిక్షించాలి. ఇలాంటి ఉన్మాదులు ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడడానికి భయపడేటట్లు శిక్షించాలి. - రమ, రవళి పెద్దమ్మ -
రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన రవళికి మంగళవారం గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం పూర్తి చేశారు. అనంతరం రవళి మృత దేహాన్ని వరంగల్ జిల్లా రామచంద్రపురానికి తరలించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆస్పత్రి వద్ద రవళి కుటుంబాన్ని పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రవళి ఆరోగ్యం మొదటి నుంచి విషమంగానే ఉంది. ప్రభుత్వమే అన్ని రకాల వైద్య ఖర్చులను భరించింది. రవళిని బతికించడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తాము. రవళి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామ’ని హామి ఇచ్చారు. అంతేకాక రవళి తల్లిదండ్రులు కోరిక ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామి ఇచ్చారు. (అతడ్ని కూడా అదే విధంగా చంపాలి : రవళి తండ్రి) -
మృత్యువుతో పోరాడి ఓడిన రవళి
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి మృతి
వరంగల్ క్రైం: ప్రేమను నిరాకరించిదనన్న అక్కసుతో పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీ వ్రంగా గాయపడిన తోపుచర్ల రవళి(22) మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం యశోద ఆస్పత్రిలో కన్ను మూసింది. హన్మకొండ రాంగనర్‌లో ఫిబ్రవరి 27న లలితారెడ్డి హాస్టల్ ముందు ప్రేమోన్మాది పెండ్యాల సాయిఅన్వేష్ చేతిలో దాడికి గురైన విద్యార్థిని ఆరు రోజుల పాటు నరకం అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరింది. ఐసీయూలో ఆరు రోజుల నరకయాతన.. ఫిబ్రవరి 27వ తేదీన హన్మకొండలోని రాంనగర్లో ఉదయం 9.05 గంటలకు హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్న రవళిపై ప్రేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత చివరగా తన స్నేహితురాలు కావ్యతో నిందితుని వివరాలు చెప్పింది. ఆ తరువాత ఎంజీఎం ఆస్పత్రికి ఉదయం 9.30 గంటలకు చేరుకున్న రవళి మధ్యాహ్నం 12 గంటల వరకు చికిత్స పొందింది. మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా 3.15 గంటలకు యశోద ఆస్ప త్రిలో ఐసీయూలో చేర్చారు. అప్పటి నుంచి సోమవారం సాయంత్రం 6.10 గంటల వరకు ప్రాణా లతో పోరాడింది. ఆరు రోజుల పాటు నరకయాతన అనుభవించి చివరకు రవళి ప్రాణాలను వదిలింది. శ్వాస నాళాలు ఉబ్బి.. పెట్రోల్ దాడిలో గాయపడిన రవళి ముఖం ఎక్కువ మొత్తంలో కాలిపోయింది. తీవ్రమైన గాయాల వల్ల శ్వాసనాళాలు ఉబ్బిపోయాయి. చర్మంపై ఉన్న మూడు పొరలు పూర్తి స్థాయిలో దెబ్బతిని, ఊపిరితిత్తులు పాడైపోయాయి. ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. శ్వాస నాళాలు దెబ్బతినడం వల్ల శ్వాస తీసుకోలేక మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఐసీయూలో ఆరు రోజుల పాటు వెంటిలేటర్‌పైనే చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నేడు గాంధీలో పోస్టుమార్టం.. మృతదేహానికి సోమవారం పంచనామా అనంతరం ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు. సెంట్రల్ జైల్లో ప్రేమోన్మాది సాయిఅన్వేష్ 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపిం చారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటంతో నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. హన్మకొండ ఇన్స్పెక్టర్ సంపత్‌రావు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్‌లో పంచనామా నిర్వహించిన తరువాతనే పోస్టుమార్టం చేపడుతారు. ఆరు రోజుల పాటు హన్మకొండ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ ఎస్సై రవళి ఆరోగ్య పరిస్థితిని దగ్గర ఉండి పర్యవేక్షించారు. సెంట్రల్ జైల్లో పేమోన్మాది సాయిఅన్వేష్ పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చిన ప్రేమోన్మాది సాయిఅన్వేష్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నారు. హన్మకొండ పోలీసులు 27న దాడి జరిగిన తరువాత 28వ తేదీన మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. న్యాయమూర్తి 14 రోజుల రిమైండ్ విధించారు. మృతురాలు రవళి ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడు సాయిఅన్వేష్పై ఐసీసీ 341, 354–డీ, 326–ఏ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రవళి మృతి చెందటం నిందితుడు సాయి అన్వేష్‌పై 302 కింద హత్య కేసు నమోదు చేయనున్నారు. రవళి మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం పాలకుర్తి: ఇటీవల హన్మకొండలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ రవళి సోమవారం మృతి చెందింది. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తిలో విలేకరులతో మాట్లాడారు. రవళి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రవళి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అత్యంత భాధకరం పెట్రోల్ దాడిలో గాయపడి చికిత్స పొందుతూ రవళి మృతి చెందటం అత్యంత బాధాకరం. ప్రేమోన్మాది సాయిఅన్వేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ సంపత్‌రావును హైదరాబాద్‌కు పంపించి పోస్టుమార్టం నిర్వహిస్తాం. పోలీసు శాఖాపరంగా సరైన అధారాలు కోర్టుకు అందజేసి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటాను. యువతులు, మహిళలను ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. షీ టీమ్స్, 100కు డయల్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రవీందర్, సీపీ సంగెం : రవళి స్వగ్రామం రామచంద్రాపురంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సంగెం ఎస్సై ఎం.నాగరాజు పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మంగళవారం రవళి మృతదేçహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్న క్రమంలో ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. మరో తల్లికి గర్భశోకం లేకుండా చూడాలి.. ప్రేమ పేరుతో రవళిని వేధించి చివరకు పెట్రోల్ పోసి నిప్పటించి తన పైశాచికానికి బలి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి. అతడికి విధించిన శిక్షను చూసి మరో మృగాడు ఏ ఆడపిల్ల వైపు కూడా కన్నెత్తి చూడకూడదు. రవళి తల్లితండ్రులకు కలిగిన గర్భశోకం మరే తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. ప్రేమ పేరుతో వేధించే వారి పట్ల చట్టాలు కఠినంగా అమలు చేయాలి. బొంపల్లి జయశ్రీ, సర్పంచ్, రామచంద్రాపురం ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి.. సమాజంలో అన్ని రంగాల్లో మగవారితో సమానంగా ముందుకు పోతున్న ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. దీంతో వారిని కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రేమ పేరుతో వేధించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఒక్కగానోక్క కూతురును పొట్టన పెట్టుకున్న అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలి. రవళి తల్లిదండ్రులకు తగిన న్యాయం జరిగేలా అతనిని శిక్షించాలి. కత్తి రాధిక, ఎంపీటీసీ సభ్యురాలు,రామచంద్రాపురం -
ప్రేమోన్మాది చేతిలో గాయపడిన రవళి మృతి
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆరు రోజుల నుంచి సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవళి (22) సోమవారం సాయంత్రం మృతి చెందింది. పెట్రోల్ దాడిలో గాయపడిన బాధితురాలిని చికిత్స కోసం ఫిబ్రవరి 27న ఆస్పత్రిలో చేర్చారు. పెట్రోల్ మంటలకు శరీరంలో 70 శాతం కాలిపోయింది. కంటిచూపు దెబ్బతింది. రక్తనాళాలు సహా పలు అంతర్గత అవయవాలు పాడయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగబారి ఉబ్బిపోయాయి. శ్వాస తీసు కోవడం కష్టంగా మారడంతో ఆమెను గత ఆరు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం అప్పగిస్తామని అధికారులు చెప్పినట్లు రవళి బంధువులు తెలిపారు. ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి.. వరంగల్జిల్లా రూరల్ సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల పద్మ, సుధాకర్‌రావుల కుమార్తె రవళి. హన్మకొండ రాంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ కాలేజీల్లో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. కాలేజీకి సమీపంలోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఫిబ్రవరి 27న హాస్టల్ నుంచి స్నేహితులతో కలిసి కాలేజీకి వెళ్తుండగా, అదే కాలేజీలో బీకాం ఫైనలియర్ చదువుతున్న పెండ్యాల సాయి అన్వేష్ (24) ఆమెను అడ్డగించి, తనను ప్రేమించాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో అప్పటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను రవళిపై పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. చికిత్స కోసం రవళిని తొలుత వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. గత ఆరు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ విషయం తెలిసి ఆమె బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్వేష్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
అతడ్ని కూడా అదే విధంగా చంపాలి : రవళి తండ్రి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందిడంతో ఆమె తండ్రి సుధాకర్ కన్నీరు మున్నీరయ్యారు. కూతురుని ఎంతో గారాభంగా పెంచుకున్నానని.. అలాంటి తన కూతురుని అన్వేష్ పొట్టన బెట్టుకున్నాడని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఒక్కగానొక్క కూతురుని అకారణంగా చంపేశాడని.. అన్వేష్‌ను కూడా పెట్రోల్ పోసి చంపేయాలని డిమాండ్ చేశారు. అన్వేష్ తన కూతురుని చాలా రోజుల నుంచి వేధించాడని, పోలీసులు అన్వేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచిందని వాపోయారు. రేపు రవళి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. చదవండి : ప్రేమోన్మాది దాడి: రవళి మృతి -
ప్రేమోన్మాది దాడి : చికిత్స పొందుతూ రవళి మృతి
-
చికిత్స పొందుతూ రవళి మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సోమవారం సాయంత్రం కన్నుమూసింది. గత కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంటూ వచ్చింది. పెట్రోల్ మంటల్లో శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో ఊపిరితీసుకోవటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో వెంటిలేషన్ సహాయంతో డాక్టర్లు కృత్తిమ శ్వాస అందించినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం రవళి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పోస్ట్‌మార్టం జరిగే అవకాశం ఉంది. అసలేం జరిగింది : రవళి, సాయి అన్వేష్ సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్.. ఫిబ్రవరి 27న కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు. సాయశక్తులా ప్రయత్నించాం : యశోద డాక్టర్ల బృందం పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవళిని బతికించటానికి సాయశక్తులా ప్రయత్నించామని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రవళికి 70 శాతం లోతైన కాలిన గాయాలయ్యాయని తెలిపారు. శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో కృత్రిమ శ్వాస అందించామన్నారు. రక్తం తగ్గిపోవటం, రెనల్ సట్డౌన్ (మూత్రపిండాల పనితీరు దెబ్బతినటం), న్యూట్రో ఫెనిక్ సెస్పిస్తో ఆమె మరణం సంభవించిందని వెల్లడించారు. -
రవళి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రవళి ఆరోగ్యం విషమంగా ఉందని ... గత నాలుగు రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. పెట్రోల్ మంటల్లో శ్వాసనాళాలు కాలిపోవడంతో శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో రవళి ఉండటంతో.. వెంటిలేషన్ సహాయంతో కృత్తిమ శ్వాస అందిస్తున్నామన్నారు. కళ్లు దెబ్బతినడంతో చూపు కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతo ఆమె కోలుకోవడం కష్టమేనని వైద్యులు అంటున్నారు. రవళి, సాయి అన్వేష్ సంగెం మండలం లోహితలోని కాకతీయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇంటర్ చదువుతున్న సమయంలో వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. వీరిమధ్య కొనసాగిన ప్రేమ డిగ్రీలోకి వచ్చిన తర్వాత క్రమంగా తగ్గడం మొదలైంది. దీంతో రవళిపై అన్వేష్ కోపం పెంచుకున్నాడు. ప్రేమను కొనసాగించాల్సిందేనంటూ రవళిపై ఒత్తిడి తెచ్చాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా. అన్వేష్ వేధింపులు ఎక్కువవడంతో.. రెండు నెలల క్రితం ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో రవళి తల్లిదండ్రులు సాయి అన్వేష్ తల్లిదండ్రులకు చెప్పి.. వారి గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో అన్వేష్‌ను హెచ్చరించారు. దీంతో తాను ఇకపై రవళి జోలికి వెళ్లనంటూ అన్వేష్ లిఖితపూర్వకంగా మాటిచ్చాడు. అయితే తన ఊర్లో పరువు తీసిందనే కారణంతో.. కక్ష పెంచుకున్న అన్వేష్.. ఫిబ్రవరి 27న కళాశాల సమీపంలో పెట్రోల్‌తో మాటువేసి దారుణానికి పాల్పడ్డాడు. చదవండి : యశోద ఆసుపత్రికి రవళి వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్ దాడి పేట్రేగిన ప్రేమోన్మాదం -
యశోద ఆసుపత్రికి రవళి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. రవళి గాయాలను పరిశీలించిన అనంతరం వైద్యులు చికిత్స ప్రారంభించారు. రవళికి మెరుగైన వైద్యం అందించాలంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యశోద ఆసుపత్రి యాజమాన్యంతో అంతకుముందు మాట్లాడారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆటంకం కలగకుండా వైద్యం కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు(బుధవారం) సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి రవళి ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని, యువతి కుటుంబసభ్యులతో మాట్లాడనున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో చదువుతున్న రవళి అనే విద్యార్థినిపై అదే కళాశాలలో చదువుతున్న సాయి అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇంతటి ఘోరానికి పాల్పడ్డ సాయి అన్వేష్‌ను తోటి విద్యార్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన రవళిని మొదట ఎంజీఎంకు ఆ తర్వాత యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. వరంగల్‌లో విద్యార్థినిపై పెట్రోల్ దాడి -
ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
సాక్షి, హైదరాబాద్ : వాళ్ల వివాహం ఆదర్శంగా నిలిచింది. అబ్బాయి ఎత్తు 5.4 అడుగులు, అమ్మాయి ఎత్తు 3.2 అడుగులు... వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఆదర్శ జంటగా నిలిచారు. ముషీరాబాద్‌లోని హెరిటేజ్ ఫంక్షన్ ప్యాలెస్ ఈ వేడుకకు వేదికైంది. గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్ (25)ది సిద్దిపేట. తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి మృతి చెందడంతో కొంతకాలంగా అక్క దగ్గరే ఉంటూ పీజీ పూర్తి చేశాడు. ఇక పెళ్లి కుమార్తె వీరవల్లి రవళి (22). తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ. వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం. రవళికి ఒక సోదరుడు ఉండగా, వీరిద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. వధూవరులు ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. -
రెండున్నర నెలల క్రితం వివాహం.. ఆత్మహత్య
చైతన్యపురి: ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మన్మధకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వేణుగోపాల్ కుమార్తె రవళి(25)కి ఇబ్రహీంపట్నం మంచాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ శ్రీకాంత్‌తో రెండున్నర నెలల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం గ్రీన్‌పార్కు కాలనీలోని పుట్టింటికి వచ్చిన రవళి బుధవారం బాత్రూంలో షవర్ రాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవళి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. -
200 ఏళ్ల క్రితం కథతో...
కౌశిక్ అంగారిక హీరోగా నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో వియాన్ జీ, గీతా కౌశిక్ నిర్మించిన సినిమా ‘దమయంతి’. అర్చనా సింగ్, రవళి, అనిక, ఆగస్టీన్ కీలక పాత్రలు చేశారు. హీరో కౌశిక్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. టీజర్‌ను రిలీజ్ చేసిన నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఈ సినిమాతో దర్శకునిగా మారాడు. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగై్జట్ అయ్యాను. 200 ఏళ్ల కిందటి సబ్జెక్ట్‌ను వర్తమాన కాలానికి లింక్ చేసి సినిమా చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి’’ అన్నారు. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్‌గారికి ధన్యవాదాలు. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెటిక్ స్పర్శతోపాటు థ్రిల్లింగ్ మిళితమై ఉన్న సినిమా ఇది. టీమ్ అందరు బాగా సహకరించారు. నటించినవారందరికీ సమప్రాధాన్యం ఉంది. కథ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్. ‘‘డైరెక్టర్‌ను నమ్మి ఈ సినిమా చేశాను. ఈ సినిమా క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మ్యూజిక్ బాగా వచ్చింది. వచ్చే నెలలో ఆడియోను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చి తీరుతుంది’’ అన్నారు కౌశిక్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఈ చిత్ర నిర్మాత గీతకౌశిక్. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్. ఆత్రేయ. -
రవళించిన మానవత్వం..
♦ రవళిని ఆదుకునేందుకు ♦ ముందుకొచ్చిన ఆపన్న హస్తాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మానవత్వం పరిమళించింది. ‘అమ్మ పొమ్మంది.. ఊరు రమ్మంది’ అంటూ ఈ నెల 13న ‘సాక్షి’ ప్రచురించిన కథ నానికి పలువురు స్పందించారు. 12 ఏళ్ల చిన్నారి రవళిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంకి చెందిన చిన్నారి రవళి తల్లికి మతిస్థిమితంలేదు. ఆమె తండ్రికి కూడా దూరమైంది. దీనిపై సాక్షి ప్రచురించిన కథనం పలువురిని కదిలించింది. ఆ పాపను దత్తత తీసుకుంటామని, చదివిస్తామని ముందుకొచ్చారు. ఆమెను బాలసదన్‌లో ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచాలన్న ఆలోచన తో, ఉన్నతాధికారుల సహా యంతో ఆమెకు ఆశ్రయాన్ని కల్పించారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్. సత్యనారాయణ చేతుల మీదుగా ఆమెకు బ్యాంకు అకౌంట్ బుక్ అందజేశారు. రవళికి సాయం చేయాలనుకునేవారు అకౌంట్ నంబర్ 624561 63545లో నగదు జమ చేయవచ్చు. దాతలు అకౌంట్ వివరాల కోసం నల్లగొండలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రకాశం బజార్ శాఖ)లో సంప్రదించవచ్చు. -
అమ్మ పొమ్మంది... ఊరు రమ్మంది
కడుపు తీపి అన్నమాట ఉంది కదా. అలాంటప్పుడు ‘కడుపుచేదు’ కూడా ఉండే ఉండవచ్చు. కానీ ఆ చేదు చాలా అరుదు. ఆ చేదుకు కారణాలూ ఉండవచ్చు. మాతృత్వపు మమకారం ఎలా చేదెక్కిందో తెలిపే కథే చిన్నారి రవళి వ్యథ. రవళి కథ చదవండి. మానవత్వం రవళిస్తే ఆమెను చదివించండి. రవళికి పన్నెండేళ్లు. చెంపకు చారెడేసి కళ్లు. నోరు విప్పిందంటే ఆరిందాలా కబుర్లు. ఆమె కథ వింటే మాత్రం ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. కన్నపేగే కాలనాగైన గాథ ఆమెది. కడుపున పడగానే కన్నతండ్రి విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమె తల్లి మానసికంగా దెబ్బతింది. చివరకు కన్నకూతురినే కట్టేసి కొట్టేంతగా కరడుగట్టిపోయింది. అదే రవళికి శాపమైంది. కడుపులో పెట్టుకోవాల్సిన తల్లి కడుపు మాడ్చింది. కాళ్లూ చేతులు కట్టేసి, గొడ్డుకారం పెట్టి, గొడ్డును బాదినట్లు బాదింది. కన్నతల్లి చేతిలోనే కష్టాలు పడుతున్న ఆమెను ఊరు ఊరంతా ఏకమై ఆదుకుంది. కన్నీళ్లు పెట్టించే రవళి కథ ఆమె మాటల్లోనే... అమ్మ నుంచి కాపాడేవారు లేరు... నా పేరు సంగిశెట్టి రవళి. మాది నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం. నాన్న పేరు దేవదాసు. అమ్మ పుష్ప. నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మమ్మల్ని విడిచేసి వెళ్లాడు. అప్పట్నుంచి అమ్మకు మానసిక సమస్య. పిచ్చిపిచ్చిగా చేస్తుండేది. నన్ను బాగా కొట్టేది. దాంతో మా అమ్మమ్మే నన్ను బడికి పంపుతుండేది. మతి సరిగా లేక మా అమ్మమ్మనూ కొట్టేది మా అమ్మ. అయినా అమ్మమ్మ లెక్కచేయలేదు. మా అమ్మ చేతులకు తన చేతులు అడ్డువేసి నన్ను ఇంగ్లిష్ మీడియంలో చదివించింది. ఐదేళ్ల కిందట మా అమ్మమ్మ చనిపోయింది. కిడ్నీలు పాడైపోయి చనిపోయిందని ఊళ్లోవాళ్లు అనుకున్నారు. అప్పట్నుంచీ నా జీవితమే మారిపోయింది. పని చేసినా కొట్టడమే... చేయకున్నా కొట్టడమే... అమ్మమ్మ చనిపోయాక మా అమ్మ నన్ను బడికి పంపలేదు. పనికి పంపింది. ఐదేళ్ల నుంచీ పనికి పోతున్నా. మనసు బాగలేకపోవడం వల్లనో ఏమోగానీ... నన్ను ఇంట్లోకి తోలి, కాళ్లూచేతులూ కట్టేసి, కంట్లో కారం పెట్టి కొట్టేది మా అమ్మ. ఒకరోజు ఆమె కొడుతూ ఉంటే అమెను అడ్డుకోడానికి ప్రయత్నించా. ఆ టైమ్‌లో అమ్మ కాలు విరిగింది. నేను పనిలోకి వెళ్తే వచ్చే పైసలతోనే ఆమె కాలిని బాగుచేయించా. అమ్మ అంతగా కొడుతుంటే తట్టుకోలేకపోయేదాన్ని. పైసలు తీసుకోకపోయినా... మా మామలు మా పైసలు తీసుకున్నారని వాళ్లపై కేసులు పెట్టింది మా అమ్మ. వాళ్ల నుంచి నలభైవేలు తీసుకుంది. అవి పూర్త్తయ్యే వరకూ ఖర్చు పెట్టింది. నేను పత్తి ఏరడానికి పోయేదాన్ని. అల్లం తీసేందుకూ, పొలాలకు మందు పెట్టేందుకు వెళ్లేదాన్ని. పైసలు తేవడం తేవడమే. అమ్మ కొట్టడం కొట్టటమే. ఊర్లో వాళ్లనూ తిట్టేది... ఒకనాడు నన్ను గదిలో పెట్టి కొడుతుంటే పొరుగువాళ్లు చూడలేకపోయారు. వాళ్లు చెప్పడంతో మా అత్తమ్మ నన్ను వెంటబెట్టుకొని వెళ్లింది. దాంతో మా అమ్మ అత్తమ్మ మీద కిడ్నాప్ కేసు పెట్టింది. మా మామ మీద కూడా కేసులు పెట్టింది. నన్ను తీసుకెళ్లిన పొరుగువాళ్ల ఇండ్ల మీదకు వెళ్లి వాళ్ల మీద దుమ్మెత్తి పోసేది. దాంతో మాకెందుకులే అని వాళ్లు నన్ను వదిలేశారు. కొన్నాళ్లు గవండ్ల వీరమ్మ తన దగ్గర ఉంచుకుంది. కానీ, అక్కడ కూడా ఉండనీయలేదు. నా దోస్తులు కావ్య, పూజిత, సమతలు కూడా నన్ను తీసుకెళ్లి అన్నం పెట్టేవాళ్లు. ఎండాకాలం వాళ్ల ఇళ్లలోనే ఉండేదాన్ని. వాళ్ల అమ్మ వాళ్లు కూడా నన్ను ఏమీ అనకపోయేవాళ్లు. కానీ మా అమ్మకు భయపడి మళ్లీ మా ఇంటికి పంపించేవాళ్లు. అందుకే ఎవరూ దగ్గర ఉంచుకోవడం లేదని చచ్చిపోవాలనుకున్నా. బావిలో పడిపోయి ప్రాణాలు వదలదలచుకున్నా. ఆ సారు వచ్చి తీసుకొచ్చిండు అప్పుడు చాంద్‌పాషా సారు వచ్చి నన్ను తీసుకుపోయాడు. ఒకరోజు వాళ్లింట్లనే ఉంచుకున్నాడు. తెల్లారి ఈడకు (బాలసదన్‌కు) తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇక్కడ బాగనే ఉన్నా. అయితే, మా అమ్మ ఎటన్నా వెళ్లిపోతే నేను మా ఊరికి వెళ్లి అక్కడ చదువుకుంట. వారానికోసారి పనికిపోయి పైసలు తెచ్చుకుంటా. అయితే నా అన్న వాళ్లు లేరు.. మా పాలివాళ్లు ఉన్నారు. వాళ్ల దగ్గర ఉంటా. కానీ మా అమ్మ దగ్గర నన్ను ఉంచొద్దు. మా అమ్మ అంటే నాకు కోపం. మా నాన్న కూడా ఓసారి నన్ను తీస్కపోతనని వచ్చిండు. కానీ అప్పుడు మా అమ్మ పంపలేదు. ఇప్పుడు మా నాన్న కూడా నాకు సంబంధం లేదంటున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మా పెద్దమ్మ తీసుకెళతనంటోంది. కానీ, మా అమ్మకు భయపడుతోంది. అందుకే నేను ఎక్కడికీ పోను. నా దోస్తులందరూ చదువుకుంటున్నారు. నేనూ చదువుకుంటా. మూడో తరగతి వరకు చదివా. ఇప్పుడు ఐదో తరగతిలో చేరతా. ఎందుకంటే 12 ఏళ్లకు మూడో తరగతి అంటే అందరూ ఎక్కిరిస్తారు. నా దోస్తులంతా ఎనిమిది చదువుతున్నరు. నేను మాత్రం ఐదు చదువుతా. మంచిగ చదువుకుంట. మంచి ఉద్యోగం తెచ్చుకుంట. - మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షిప్రతినిధి, నల్లగొండ ఊర్లో వాళ్ల అనుమతితోనే తీసుకువచ్చాను మూడు రోజుల కిందట రవళి వాళ్ల అమ్మ నా దగ్గరకు వచ్చింది. మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. మీ అమ్మాయి ఎక్కడికి పోదులే నేను పంపిస్తా అని చెప్పాను. అయితే రవళిని వాళ్ల అమ్మ కొట్టేదని ఆ తర్వాత తెలిసింది. ఒకనాడు ఊర్లో ఉన్న వాళ్లే నా దగ్గరకు తీసుకొచ్చి ఈ అమ్మాయిని ప్రభుత్వానికి అప్పగించాలని అడిగారు. ఆ అమ్మాయితో మాట్లాడుతుంటేనే బావి దగ్గరికి వెళ్లి చచ్చిపోవాలని ప్రయత్నించింది. అందరం కలిసి అడ్డుకున్నాం. ఏదో సర్దిజెప్పి పంపినం. కానీ తెల్లారి గ్రామంలోని మహిళలే మళ్లీ నా దగ్గరకు రవళిని తీసుకువచ్చి ఎప్పుడు తీసుకెళ్తున్నవని అడిగారు. అక్కడి నుంచి మా ఇంటికి తీసుకెళ్లా. తెల్లారి గ్రామ సర్పంచ్, పెద్ద మనుషుల అనుమతి తీసుకున్నా. అక్కడి నుంచి ఎమ్మార్వో ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువచ్చా. ఆయన శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఇప్పుడు బాలసదన్‌లో ఉంది. హిందూ పండుగలయినా, ముస్లిం పండుగలయినా ఈ అమ్మాయిని నేను మా ఇంటికి తీసుకెళ్తా. అమ్మాయి బాగా చదువుకుని స్థిరపడితే నా జన్మకు అది చాలు. - ఎస్కే. చాంద్‌పాషా, గ్రామ రెవెన్యూ అధికారి, దత్తప్పగూడెం. -
విద్యార్థిని రవళి ఎందుకు చనిపోయింది..?
-
విద్యార్థిని ఆత్మహత్య
గూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని గూడూరు పట్టణంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని డీఆర్డబ్ల్యూ కాలేజీ వసతి గృహంలో రవళి (19) ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. రవళి, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రవళి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెనుబర్తి గ్రామానికి చెందినదిగా పోలీసులు నిర్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏడాది నుంచి రవళి వెంట పడుతున్నాడు
హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి (17) ఆస్పత్రిలో కోలుకుంటోందని అరోరా కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపాయని ఆమె చెప్పారు. గత ఏడాది నుంచి ప్రదీప్ వెంట పడుతున్నట్లు రవళి వాంగ్మూలం ఇచ్చిందని ప్రిన్సిపల్ చెప్పారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. కళాశాల ఎంట్రన్స్ వద్ద రవళిపై దాడి జరిగిందని, తమ సెక్యూరిటీతో పాటు విద్యార్థులు గమనించి ప్రదీప్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అతడు కంగారులో తనవద్ద ఉన్న పాయిజన్ తాగినట్లు శ్రీలత తెలిపారు. రవళి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి అని, దసరా సెలవుల అనంతరం ఆమె ఈరోజే కాలేజీకి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు అందచేసినట్లు శ్రీలత తెలిపారు. కాగా ప్రదీప్ కొంతకాలంగా వెంటపడుతున్నట్లు రవళి చెప్పిందని ఆమె స్నేహితులు తెలిపారు. తనను ప్రేమించకపోతే భయపడుతూనే కాలేజీకి వచ్చిందన్నారు. ఈ సంఘటనపై ఫలక్‌నుమా ఏసీపీ మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుంచి ప్రదీప్ ...రవళి వెంట పడుతున్నట్లు తెలిపారు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమంటూ రెండేళ్ల నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో రవళి తల్లిదండ్రులు... ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు పెట్టినట్లు ఏసీపీ చెప్పారు. గత నెల 21న నిర్భయ చట్టం కింద ప్రదీప్‌పై కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రవళి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు చెప్పారు. కాగా రవళి, ప్రదీప్.... నల్లకుంటలోని రాంనగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రదీప్ బాలనగర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్‌లో కోర్సు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
రవళిపై దాడి చేసిన ప్రదీప్ మృతి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని రవళిపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రదీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రవళిపై ఈరోజు ఉదయం ప్రదీప్ వేట కొడవలితో దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడు వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజ్ డ్రెస్‌లో వచ్చిన అతడు పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ప్రదీప్ ప్రేమించాలంటూ రవళి వెంటపడుతున్నట్లు సమాచారం. అయితే రవళి నిరాకరించటంతో ప్రదీప్ ఘటనకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో ప్రదీప్ పై ఆమె కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. -
మనమే చొరవ చూపాలి
‘‘ఏంటే... ఎప్పుడూ అలా ఒంటరిగా ఉంటావ్. సరదాగా ఉండొచ్చుగా’’... ఆఫీసు నుంచి వస్తూనే స్నేహితురాలితో అంది రవళి. ‘‘ఎలా ఉంటాను? ఇక్కడ నాకెవరూ తెలీదు. పైగా కొత్త ప్రదేశం. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’... దిగులుగా అంది గాయత్రి. రవళి నవ్వింది. గాయత్రి సమస్య ఆమెకు తెలుసు. డిగ్రీ పూర్తిచేసి కంప్యూటర్ కోర్సు చేయడానికి పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చింది. ఇక్కడి అమ్మాయిల దూకుడు చూసి వచ్చీ రావడంతోనే కంగారుపడింది. వాళ్లలా తాను లేను కాబట్టి, వాళ్లతో కలవలేనని ముందే మనసులో పెట్టేసుకుంది. దాంతో గదిలోనే ముడుచుకుని కూచుంటోంది. ఆ బెరుకును వీలైనంత త్వరగా వీడకపోతే ఆమె ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని రవళికి అర్థమైంది. అందుకే గాయత్రికి కొన్ని విషయాలు చెప్పింది. అవేంటంటే... మనుషుల మీద ఆసక్తి పెంచుకోవాలి. వాళ్లెవరు, ఎలా ఉన్నారు, వాళ్లు ఏం చేస్తారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు అనేవన్నీ పరిశీలించాలి. దాన్నిబట్టి వాళ్లతో మనం ఎలా మెలగాలో మనకు అర్థమవుతుంది. అందరూ నీలాంటివాళ్లే అని అనుకోవాలి. అంటే... అందరికీ పుట్టుకతోనే అన్నీ రావు. వాళ్లు కూడా మనలాంటి వాళ్లే అయి ఉండొచ్చు. తర్వాత అన్నీ నేర్చుకుని ఉండొచ్చు. ప్రయత్నిస్తే మనమూ అలా అవుతాం కదా! నీ బలహీనతలను ఒప్పేసుకోవాలి. ఇతరుల్లా తయారవడం, మాట్లాడటం మనకు రాకపోవచ్చు. దానికి సిగ్గుపడి దూరంగా ఉండిపోనక్కర్లేదు. నాక్కూడా అలా ఉండటం నేర్పిస్తావా అని అడగవచ్చు, నేర్చుకోవచ్చు. అభిమానించడం నేర్చుకోవాలి. ఒక మనిషితో మనం మాట్లాడాలంటే ముందు వారి మీద ఇష్టం పెంచుకోవాలి. ఇష్టం దూరాన్ని తగ్గిస్తుంది. అభిమానం ఉన్నప్పుడు అవతలివాళ్లు ఒక మాట అన్నా నొచ్చుకోం. మెచ్చుకోలు మంచి బంధాన్ని పెంచుతుంది. అవతలివారి దగ్గరకు వెళ్లి... మీ మాట తీరు బాగుంటుంది, మీరు చక్కగా ఉంటారు అంటూ ప్రశంసిస్తే వాళ్లు మన లోపాలను ఎత్తి చూపరు. మనకు దగ్గరవుతారు. మనమే ముందుండాలి. పరిచయం చేసుకోవడంలోనైనా, పలకరించడంలోనైనా, స్నేహం చేయడంలోనైనా మొదటి అడుగు మనమే వేయాలి. వాళ్లంతా ఎప్పటి నుంచో ఉన్నవాళ్లు. కొత్తగా వచ్చినవాళ్లని కలుపుకోవాల్సిన అవసరం వారికి లేకపోవచ్చు. కాని వారి తోడు కొత్తగా వచ్చినవారికి అవసరం. అందుకే ఎవరో పలకరిస్తారని చూడకుండా మనమే వాళ్లకి హాయ్ చెప్పాలి. నాలుగుసార్లు పలకరిస్తే ఐదోసారి వాళ్లే మనల్ని పలకరిస్తారు. పరిచయం పెరిగి స్నేహితులవుతారు. సరళ మాటలతో ఎక్కడ లేని హుషారొచ్చేసింది గాయత్రికి. తను చెప్పినవన్నీ చేయాలని నిర్ణయించుకుంది. వారం పది రోజుల్లోనే ఫలితం కనిపించింది. ఇప్పుడామెకి అందరూ స్నేహితులే. సరళ చెప్పినవి గాయత్రికే కాదు... అందరికీ పనికొస్తాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి! -
అలిగి వెళ్లి.. శవమై తేలింది
కంభం రూరల్, న్యూస్‌లైన్ : పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇవ్వబోగా లెక్చరర్ మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిన విద్యార్థిని ఆదివారం శవమై తేలింది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రవళి గత శుక్రవారం జరిగిన యూనిట్ పరీక్షలో పేపర్ సమయానికి ఇవ్వలేదు. రవళిని మందలించిన లెక్చరర్.. ఆమె రాసిన పేపర్ తీసుకోకుండానే వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన రవళి (16) మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లింది. తన వద్ద ఉన్న విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి నేరుగా కంభం చెరువు కట్టకు వెళ్లింది. ఎవరూ గమనించని సమయంలో పెద్దకంభం తూము వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియని రవళి తల్లిదండ్రులు కుమార్తె కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులను వాకబు చేసినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో రవళి బంధువులు శనివారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడానికి లెక్చరరే కారణమని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచారు. రవళి ఆచూకీ తెలిసేంత వరకూ ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కంభ చెరువులో ఎవరిదో మృతదేహం ఉందని ఆదివారం ఉదయం ప్రచారం జరిగింది. బంధువులు వెళ్లి మృతదేహాన్ని చూసి రవళిదిగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఎస్సై రామకోటయ్య సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.