
రవళిపై దాడి చేసిన ప్రదీప్ మృతి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని రవళిపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రదీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రవళిపై ఈరోజు ఉదయం ప్రదీప్ వేట కొడవలితో దాడి చేసిన విషయం తెలిసిందే.
అనంతరం అతడు వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజ్ డ్రెస్లో వచ్చిన అతడు పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ప్రదీప్ ప్రేమించాలంటూ రవళి వెంటపడుతున్నట్లు సమాచారం. అయితే రవళి నిరాకరించటంతో ప్రదీప్ ఘటనకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో ప్రదీప్ పై ఆమె కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.