arora engineering collage
-
ఏడాది నుంచి రవళి వెంట పడుతున్నాడు
హైదరాబాద్ : ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ రవళి (17) ఆస్పత్రిలో కోలుకుంటోందని అరోరా కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత తెలిపారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపాయని ఆమె చెప్పారు. గత ఏడాది నుంచి ప్రదీప్ వెంట పడుతున్నట్లు రవళి వాంగ్మూలం ఇచ్చిందని ప్రిన్సిపల్ చెప్పారు. సోమవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందన్నారు. కళాశాల ఎంట్రన్స్ వద్ద రవళిపై దాడి జరిగిందని, తమ సెక్యూరిటీతో పాటు విద్యార్థులు గమనించి ప్రదీప్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అతడు కంగారులో తనవద్ద ఉన్న పాయిజన్ తాగినట్లు శ్రీలత తెలిపారు. రవళి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి అని, దసరా సెలవుల అనంతరం ఆమె ఈరోజే కాలేజీకి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటనపై సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు అందచేసినట్లు శ్రీలత తెలిపారు. కాగా ప్రదీప్ కొంతకాలంగా వెంటపడుతున్నట్లు రవళి చెప్పిందని ఆమె స్నేహితులు తెలిపారు. తనను ప్రేమించకపోతే భయపడుతూనే కాలేజీకి వచ్చిందన్నారు. ఈ సంఘటనపై ఫలక్‌నుమా ఏసీపీ మాట్లాడుతూ గత నాలుగేళ్ల నుంచి ప్రదీప్ ...రవళి వెంట పడుతున్నట్లు తెలిపారు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమంటూ రెండేళ్ల నుంచి వేధింపులు ఎక్కువ కావటంతో రవళి తల్లిదండ్రులు... ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు పెట్టినట్లు ఏసీపీ చెప్పారు. గత నెల 21న నిర్భయ చట్టం కింద ప్రదీప్‌పై కేసు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రవళి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు చెప్పారు. కాగా రవళి, ప్రదీప్.... నల్లకుంటలోని రాంనగర్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ప్రదీప్ బాలనగర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్‌లో కోర్సు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
రవళి పై దాడి చేసిన ప్రదీప్ మృతి
-
రవళిపై దాడి చేసిన ప్రదీప్ మృతి
హైదరాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థిని రవళిపై దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రదీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరోరా ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న రవళిపై ఈరోజు ఉదయం ప్రదీప్ వేట కొడవలితో దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం అతడు వెంట తెచ్చుకున్న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాలేజ్ డ్రెస్‌లో వచ్చిన అతడు పథకం ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా ప్రదీప్ ప్రేమించాలంటూ రవళి వెంటపడుతున్నట్లు సమాచారం. అయితే రవళి నిరాకరించటంతో ప్రదీప్ ఘటనకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో ప్రదీప్ పై ఆమె కుటుంబ సభ్యులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. -
ఇంజినీరింగ్ విద్యార్థినిపై వేట కొడవలితో దాడి
-
ఇంజినీరింగ్ విద్యార్థినిపై వేట కొడవలితో దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం దారుణం జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని రవిళిపై ప్రదీప్ అనే యువకుడు వేట కొడవలితో దాడి చేశాడు. అనంతరం అతడు విషం తాగాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవళితో పాటు, ప్రదీప్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. కళాశాలకు వెళుతున్న రవళిని ఈరోజు ఉదయం బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ప్రదీప్ కత్తితో దాడి చేయటంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. కాగా రవళి పరిస్థితిగా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రదీప్ గత కొంతకాలంగా ప్రేమించాలంటూ రవళిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిరాకరించటంతో కసి పెంచుకున్న అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు ఇరువరు రాంనగర్లో నివాసం ఉంటున్నారు.