
ఇంజినీరింగ్ విద్యార్థినిపై వేట కొడవలితో దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం దారుణం జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని రవిళిపై ప్రదీప్ అనే యువకుడు వేట కొడవలితో దాడి చేశాడు. అనంతరం అతడు విషం తాగాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవళితో పాటు, ప్రదీప్ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు.
కళాశాలకు వెళుతున్న రవళిని ఈరోజు ఉదయం బైక్పై హెల్మెట్ ధరించి వచ్చిన ప్రదీప్ కత్తితో దాడి చేయటంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. కాగా రవళి పరిస్థితిగా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రదీప్ గత కొంతకాలంగా ప్రేమించాలంటూ రవళిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిరాకరించటంతో కసి పెంచుకున్న అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు ఇరువరు రాంనగర్లో నివాసం ఉంటున్నారు.