sickle
-
కొడవలి.. బతుకు వారధి
కణకణ మండే అగ్ని కీలల నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. పిడికిళ్లు బలంగా బిగించి మలాటు(పెద్ద సుత్తి వంటి సాధనం)లతో ఇనుప కమ్మెలపై కార్మికులు గట్టిగా కొడుతున్న శబ్దాలు ఆ ఊళ్లో సర్వసాధారణం. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో రైతన్నకు ఉపయోగపడే కొడవళ్లతో పాటు, ఇతర పనిముట్ల తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తూంటుంది నడకుదురు గ్రామం. కాకినాడ సిటీ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే ఎక్కువ మంది రైతుల అడుగులు నడకుదురు గ్రామం వైపే పడతాయి. కాకినాడ సిటీకి కూతవేటు దూరాన.. కరప మండలంలో ఉన్న ఈ ఊరు పంట కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీకి పెట్టింది పేరు. వరి, మినుముతో పాటు, గడ్డి కోతలకు అవసరమైన కొడవళ్లను, ఇతర పనిముట్లను నడకుదురు గ్రామంలో తయారు చేస్తూంటారు. సుమారు 80 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. ప్రస్తుతం నాణ్యమైన కొడవళ్లను నైపుణ్యంతో తయారు చేయడంలో మూడో తరం కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ గ్రామంలో 4 కుటుంబాలకు చెందిన వారు 46 మందికి పైగా ఐదుకు పైగా కొలుముల్లో పని చేస్తున్నారు. నడకుదురులో తయారైన కొడవళ్లు తెలుగు రాష్ట్రాల నలుమూలలకూ సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు సైతం ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతున్నాయి. గిట్టుబాటు కాక.. కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్ బద్దలను రాజమహేంద్రవరం, మండపేట, విశాఖపట్నంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలోల లెక్కన కొనుగోలు చేసి, దిగుమతి చేసుకుంటారు. ఏటా ముడి సరకు ధరలు పెరుగుతున్నా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. బేల్ బద్దల లోడు గత ఏడాది రూ.58 వేల నుంచి రూ.60 వేలు ఉండగా ఈ సంవత్సరం రూ.65 వేలకు పెరిగింది. దీంతో పాటు కొడవలి తయారీకి అవసరమైన బొగ్గులు, చెక్కతో పాటు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. తమ శ్రమ వృథా అవుతోందని, వస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తయారైన కొడవళ్లకు అమర్చేందుకు చెక్కతో చేసిన పిడులు అవసరమవుతాయి. ఈ పిడులు తయారు చేసేందుకు గతంలో గ్రామంలోనే ప్రత్యేకంగా కార్మికులుండేవారు. వేరే ఉపాధి అవకాశాలతో కొంత మంది, శ్రమకు తగిన ఫలితం దక్కక మరి కొంతమంది ఈ వృత్తికి దూరమయ్యారు. కొలిమిలో కాలి.. కొడవలిగా మారి.. కొడవళ్లు తయారు చేసే కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుంటూంటారు. తొలుత ముడి ఇనుప బద్దీలను కొలిమిలో ఎర్రగా కాలుస్తారు. అనంతరం, ఆ ఇనుప బద్దలను మలాటులతో బలంగా కొట్టి, కొడవలి ఆకృతిలోకి మలుస్తారు. ఆ తర్వాత దానికి సాన పట్టి, నొక్కులు కొట్టి, చెక్క పిడులు అమరుస్తారు. ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లు తయారు చేస్తూంటారు. వీటిని రూ.40, రూ.60, రూ.80, రూ.120 ధరల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తారు. గతంలో నడకుదురు గ్రామంలో సీజన్లో 80 వేలకు పైగా కొడవళ్లు తయారు చేసేవారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో కొడవళ్లకు గిరాకీ తగ్గింది. దీంతో ఈ కార్మికులు వ్యవసాయ, ఇంటి పనులకు ఉపయోగించే గునపాలు, పారలు, కత్తిపీటల వంటి వాటితో పాటు పంచాయతీ కార్మికులు వినియోగించే వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. యాంత్రీకరణతో తగ్గిన డిమాండ్ వ్యవసాయంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న యాంత్రీకరణ కొడవళ్ల తయారీపై కొంత మేర ప్రభావం చూపింది. గతంలో నడకుదురు నుంచి వేలాదిగా కొడవళ్ల అమ్మకాలు జరిగేవి. ప్రస్తుత్తం వీటికి డిమాండ్ బాగా తగ్గిందని, దీంతో పని వారు కూడా రావడం లేదని తయారీదార్లు చెబుతున్నారు. తమ కార్ఖానాల్లో ఏడాదంతా కొడవళ్లు తయారు చేసినా.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నాలుగు నెలలూ పని ఒత్తిడి అధికంగా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందని, దీంతో ఉపాధి తగ్గి, తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు వివిధ రకాల సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఆదుకొనేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆవిధంగా ఆదుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు. సబ్సిడీపై రుణాలివ్వాలి గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. నాటికి, నేటికి ముడి సరకుల ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మేము చేసే కొడవళ్లకు గిరాకీ ఉన్నా.. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మాపై దృష్టి సారించి, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలి. సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ముడి వస్తువులకు సబ్సిడీ కూడా ఇవ్వాలి. – కణిత నాగేశ్వరరావు, కొడవళ్ల తయారీదారు, నడకుదురు నాణ్యత పాటిస్తాం నడకుదురులో మా మూడు కుటుంబాలకు చెందిన వారు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తూంటారు. నాణ్యమైన ముడి ఇనుమును ఉపయోగించటంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కొడవళ్లు తయారు చేస్తాం. దీంతో అవి ఎక్కువ కాలం రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లనే మా నడకుదురు కొడవళ్లకు మంచి పేరు ఉంది. పంట కోత యంత్రాలు రావడంతో కొన్నాళ్లుగా కొడవళ్లకు డిమాండ్ తగ్గింది. – కణితి రాంబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు, నడకుదురు -
సర్రుమని తెగే పదును.. చురుకైన పనితనం
రేగిడి(శ్రీకాకుళం జిల్లా): సాగులో ఆధునిక పద్ధతులు వచ్చినప్పటికీ వరికోతపనుల్లో మాత్రం కొడవలిదే ప్రధానపాత్ర. తరతరాలుగా కొడవలి లేనిదే వరి పంట ఇంటికి చేరదంటే అతిశయోక్తి కాదు. సర్రుమని తెగే పదునుతో పాటు చురుకైన పనితనం రేగిడి మండలంలోని వండాన పేట గ్రామం కొడవలి సొంతం, గ్రామంలో ఎన్నో ఏళ్లుగా కొడవలి తయారీ కుటీర పరిశ్రమలు ఉన్నాయి. గ్రామానికి చెందిన కనీసం పది కుటుంబాల వండ్రంగులు వాటిని తయారు చేస్తున్నారు. విజయవాడ నుంచి ముడిసరుకును ఇక్కడికి తీసుకువస్తారు. ముడిసరుకును బాగా కర్రబొగ్గు మధ్యలో వేడి చేసి కరిగించి కొడవలిగా మారుస్తారు. దానికి పదును పెట్టడంతో పాటు కక్కుర్లు వేస్తారు. కుడిచేతి వాటం ఉన్నవారితో పాటు పాటు ఎడమచేతి వాటం వారు కూడా ఈ కొడవలితో అవలీలగా వరి కోత కోయగలరు. సుమారు 60 మందికిపైగా కూలీలు ఈ పనిద్వారా లబ్ధిపొందుతున్నారు. నిత్యం వారికి పని ఉంటుంది. అన్‌సీజన్‌లో తయారు చేసిన వాటితో పాటు ప్రస్తుతం తయారుచేస్తున్నవి కూడా హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ధరతో పాటు డిమాండ్ ఇక్కడ తయారు చేసిన కొడవలి బరువు 300 గ్రాములు ఉంటుంది. దాని పిడిని ఇరుడుకర్రతో వేస్తారు. ఒక దాని తయారీకి గంట సమయం పడుతుంది. రోజుకు సగటున నలుగురు కూలీలు 15 నుంచి 18 వరకు తయారు చేసేందుకు అవకాశం ఉంది. ఒక దాని ధర రూ. 300 నుంచి రూ.350లు ఉంటుంది. విజయవాడ, చీరాల, ఒంగోలు, ఒడిశా, కోల్కత్తా తదితర ప్రాంతాలకు కూడా ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లే ముఠామేస్త్రీలు కూడా ఇక్కడి నుంచి కొడవళ్లు తీసుకుపోయి ఆయా ప్రాంతాల్లో ఒక్కోటి రూ.500కు విక్రయిస్తుంటారు. నిత్యం డిమాండ్ ఖరీఫ్ కోతల సీజన్ ప్రారంభం కావడంతో హాట్‌కేక్‌ల్లా అమ్ముడవుతున్నాయి. కొడవలి తయారీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నాం. ప్రతి నెల రూ.15వేల వరకూ ఆదాయం వస్తుంది. - మేటికోటి రామకృష్ణ, తయారీదారు, వండానపేట బంధువులకు పంపిస్తాం ఇక్కడి కొడవలితో కోత బాగా వేగంగా అవుతుంది. ఏటా కొత్తవి కొని ఇతర జిల్లాల్లో ఉన్న బంధువులకు పంపిస్తాం. ఈ ఏడాది పంపించడానికి 20కిపైగా కొనుగోలు చేశాను. - పైల తవిటినాయుడు, రైతు, చాటాయివలస -
తవ్వకాల్లో బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు!
ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఆడ వాంపైర్(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది. యూరప్ దేశం పోలాండ్లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న నిర్జన ప్రదేశంలో ఈ వ్యాంపైర్ సమాధిని గుర్తించారు. టోరన్లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 17వ శతాబ్దానికి చెందిన ఒక యువతి అస్థిపంజరంగా నిర్ధారించుకున్నారు. మెడ చుట్టురా కొడవలి చుట్టి, ఆమె ఎడమ పాదం బొటనవేలుకి తాళం వేసి ఉంది. ఆగష్టులోనే ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు. వ్యాంపైర్ అంటే.. కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచి. పగలు సాధారణం రూపం లేదంటే అసలుకే కనిపించకుండా తిరుగుతూ.. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. మెడపై వ్యాంపైర్ గనుక కొరికితే.. అవతలి వాళ్లూ వ్యాంపైర్లుగా మారిపోతారని, లేదంటే ఎముకల గూడుగా మిగిలిపోతారని.. చాలా కథల్లో, సినిమాల్లో చూసే ఉంటారు. కానీ, వ్యాంపైర్ల ఉనికి, మనుగడ అనేది ఇప్పటిదాకా కేవలం జానపద కథలుగానే, ఫిక్షన్ క్యారెక్టర్‌గానే ప్రచారంలో ఉంది. చాలామందికి అదొక నమ్మకంగానే మిగిలిపోయింది. పరిశోధకులు ఏమన్నారంటే.. 17వ శతాబ్దంలో పాశ్చాత్య ప్రపంచంలో మూఢనమ్మకాలు తారాస్థాయిలో ఉండేవి. బహుశా.. ఆ యువతిని వాంపైర్‌గా అనుమానించి అంత ఘోరంగా చంపేసి ఉంటారు. ఆమెను వ్యాంపైర్‌గా భావించి.. ఎక్కడ సమాధి నుంచి లేచి వస్తుందో అనే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచేశారు. ఒకవేళ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే.. తల తెగిపోతుందని అలా చేసి ఉంటారు. అలాగే ఆమె పాదానికి తాళం కూడా వేశారు. ఆరోజుల్లో మూఢనమ్మకాలు అలా ఉండేవి’’ అని తెలిపారు ఈ పరిశోధనకు నేృతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ డారియుస్జ్ పోలిన్స్కి. అయినప్పటికీ తమ పరిశోధన ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. అయితే.. గతంలో యూరప్ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది. ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్ మరణం.. ఆకాశంలో అద్భుతం -
కణకణమండే అగ్ని కీలలు.. కొడ‘వళ్లు వంచి శ్రమించే’ శ్రామికులు
ఈ చిత్రంలోని ఇతని పేరు పుసులూరి బుజ్జిబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు. వ్యవసాయ సీజన్లో రోజుకు వంద నుంచి 150 కొడవళ్లు తయారు చేసి సాన పట్టి, కుక్కు పెడతారు. సుమారు రూ.500 నుంచి రూ.700 వరకు సంపాదిస్తారు. ఈ సీజన్లో నిత్యం పని ఉంటుందని, కుటుంబాలు సక్రమంగా సాగిపోతాయని బుజ్జిబాబు ఆనందంగా చెబుతున్నారు. మామూలు రోజుల్లో నామమాత్రంగా పని ఉంటుందని పేర్కొన్నారు. కణకణమండే అగ్ని కీలలు.. అందులో నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. లయబద్ధమైన సుత్తుల సవ్వడులు.. బలంగా బిగిసే పిడికిళ్లు.. కొడ‘వళ్లు వంచి’.. సానబట్టే చేయి తిరిగిన శ్రామికులు.. పేటేరు గ్రామంలో నిత్యం కనిపించే దృశ్యాలివీ.. కొడవళ్ల తయారీకి ఈ గ్రామం పెట్టింది పేరు. రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే రేపల్లె మండలం పేటేరు గ్రామం వైపు రైతులు, వ్యాపారుల అడుగులు పడతాయి. వ్యవసాయ పనులకు అవసరమైన కొడవళ్ల తయారీకి ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకే కాక ఇతర రాష్ట్రాలకూ ఇక్కడి నుంచి కొడవళ్లు ఎగుమతి అవుతాయి. ఈ గ్రామంలో సుమారు 70 ఏళ్ల క్రితం కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. మూడు తరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి ఇక్కడి శ్రామికులు జీవనం సాగిస్తున్నారు. కొడవలి తయారీలో అద్భుత నైపుణ్యం సాధించారు. వీరు జీవించే కాలనీ శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో 40కుపైగా కార్ఖానా(కొలిమి)లు ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 200 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. తయారీ ఎలాగంటే.. ముడి ఇనుపబద్ధలను కొలిమిలో కాల్చి కార్మికులు కొడవలిని తయారు చేస్తారు. అనంతరం దానికి సానబెట్టి నొక్కులు కొట్టి పట్టుకునేందుకు అనువుగా చివరన చెక్కలను అమరుస్తారు. సీజన్లో ఒక్కొక్క కొలిమిలో రోజుకు సుమారుగా 500 వరకు కొడవళ్లు తయారు చేస్తుంటారు. ఇవి మూడు సైజుల్లో ఉంటాయి. సైజును బట్టి ధర ఉంటుంది. చిన్నసైజు రూ.30, మధ్యస్తంగా ఉన్నవి రూ.60, పెద్దవి రూ.90 వరకు విక్రయిస్తారు. ప్రతి నెలా గ్రామంలో లక్షకుపైగా కొడవళ్లు తయారవుతాయని అంచనా. అత్యాధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చినా కొడవళ్లకు గిరాకీ తగ్గలేదు. ముడిసరుకు దిగుమతి బేల్ కట్లకు ఉపయోగించి పనికిరాని పడవేసే ఇనుప బద్దలను చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచే కాకుండా విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలో రూ.30లెక్కన కొని ఇక్కడి కార్ఖానాల యజమానులు దిగుమతి చేసుకుంటారు. బొగ్గులు, చెక్క సిద్ధం చేసుకుని కొడవళ్లు తయారు చేస్తారు. అయితే ప్రస్తుతం ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని, దీనికి రవాణా చార్జీలు అదనంగా పడుతున్నాయని యజమానులు చెబుతున్నారు. వందల మంది కార్మికులు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తుంటారు. కత్తులు తయారీలో నాణ్యమైన ముడి ఇసుమును ఉపయోగించటం వల్ల ఎక్కువ కాలం మన్నుతాయి. అందుకే ఇక్కడ తయారైన కొడవళ్లకు మంచి గిరాకీ ఉంది. – చందోలు రవికుమార్, శ్రామికనగర్, పేటేరు కొడవళ్లు అమ్ముతా వ్యవసాయ సీజన్లో పేటేరు నుంచి కొడవళ్లు తీసుకువెళ్లి మా జిల్లాలో అమ్మకాలు చేస్తుంటాం. పేటేరు కొడవళ్లు మన్నికగా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా తీసుకువెళ్తున్నాం. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పేటేరు రావాల్సిందే. – సత్యనారాయణ, వ్యాపారి తుని, తూర్పుగోదావరి -
కొడవళ్ల కార్ఖానా.. పేటేరు
సాక్షి, అమరావతి బ్యూరో/రేపల్లె: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే చాలు.. గుంటూరు జిల్లా తీర ప్రాంతమైన రేపల్లె మండలం పేటేరు వైపు అన్నదాతల చూపంతా. వరి కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీలో ఆ ఊరికి మంచి పేరు ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడి కొడవళ్ల తయారీ ప్రాంతం.. శ్రామికనగర్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో నిపుణులైన కార్మికులు రూపొందించే కొడవళ్లకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడ ఉన్న 40కు పైగా కార్ఖానాల్లో కొడవళ్ల తయారీపై ఆధారపడి దాదాపు 150 కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. ఏడాది పొడవునా పనిచేస్తూ.. ఖరీఫ్, రబీ సీజన్లలో కోతలకు అవసరమైన కొడవళ్లను అందిస్తున్నాయి. చెన్నై, విశాఖ నుంచి దిగుమతి కొడవలి తయారీకి ప్రధాన ముడిసరుకు.. ఐరన్ బేళ్ల కట్లకు ఉపయోగించి పనికిరాని ఇనుముగా పడవేసే బేల్ బద్దలు. చెన్నై, విశాఖపట్నం, కాకినాడ పోర్టులు, విజయవాడ వంటి నగరాల నుంచి వీటిని కిలోల వంతున కొనుగోలు చేస్తారు. ముడి ఇనుము పేటేరుకు చేరే సరికి కిలో రూ.30 ధర పడుతోంది. కొలిమికి అవసరమైన బొగ్గులు, కొడవలి పిడికి అవసరమైన కలప ధరలు, రవాణా చార్జీలు అదనం. కొడవలికి నొక్కు పెడుతున్న కార్మికుడు వరికోత యంత్రాలతో తగ్గుతున్న గిరాకీ వ్యవసాయంలో ఆధునిక యంత్ర పరికరాల వాడకం కొడవళ్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. వరికోత యంత్రాల రాకతో కూలీల అవసరం క్రమంగా తగ్గుతోంది. అందుకు తగినట్టుగానే కొడవళ్లకు డిమాండ్ పడిపోతోంది. నెలకు లక్షకుపైగా కొడవళ్లు ఆరు దశాబ్దాలుగా పేటేరు శ్రామికనగర్ కొడవళ్లను తయారుచేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని జంపనికి చెందిన జేమ్స్ అలియాస్ జంపని జేమ్స్ ఇందుకు ఆద్యుడు. కొడవళ్ల తయారీని వృత్తిగా చేసుకొని ఆయన పేటేరులో స్థిరపడ్డారు. ఆయన నుంచి చందోలు సుబ్బారావు, తదితరులు నేర్చుకున్నారు. కొడవలి తయారీలో ముందుగా ఇనుప బద్దను కొలిమిలో కాల్చి కొడవలి ఆకారంలో మలుస్తారు. కోతకు తగినట్టుగా సానపట్టి నొక్కులు కొడతారు. చేతితో పట్టుకునేందుకు వీలుగా చెక్కపిడిని అమర్చుతారు. ఇలా మూడు దశల్లో కొడవలి సిద్ధమవుతుంది. ఒక్కో కొలిమిలో రోజుకు 200 వరకు కొడవళ్లు తయారవుతాయి. నెలకు కనీసం లక్షకు పైగా కొడవళ్లను ఇక్కడ సిద్ధం చేస్తుంటారు. మూడు కేటగిరీల్లో చేసే కొడవళ్లను నాణ్యత ప్రకారం.. ఒక్కోటి రూ.30, 60, 90కు విక్రయిస్తుంటారు. ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి పెరుగుతున్న ముడి సరుకుల ధరలకు అనుగుణంగా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. దీంతో ఆశించిన స్థాయిలో రాబడి రావడం లేదు. ప్రభుత్వం కొడవళ్ల తయారీని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలి. ముడిసరుకును రాయితీతో సరఫరా చేయాలి. – చందోలు సుబ్బారావు,శ్రామికనగర్ ముడిసరుకు సరఫరా చేయాలి రోజంతా శ్రమించినా కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. ముడిసరుకు కొనుగోలు చేసేందుకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ సంస్థలతో ముడిసరుకును సరఫరా చేస్తే బాగుంటుంది. – పసులూరి బుజ్జి, శ్రామికనగర్ బ్యాంకు అధికారుల వైఖరితో జాప్యం కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసే రుణాల చెల్లింపులో బ్యాంకులు జాప్యం చేస్తున్నాయి. రుణాలను సత్వరం ఇస్తే బ్యాంకుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. – చందోలు రవికుమార్, శ్రామికనగర్ -
లింగ నిర్ధారణ కోసం భార్య కడుపు కోసి..
లక్నో: ఎన్ని శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఆడ పిల్లపై చిన్న చూపు మాత్రం పోవడం లేదు. అవసాన దశలో కొడుకులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో తెలిపే ఘటనలు ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. అయినా మార్పు రాదు. నేటికి కొందరు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడ పిల్ల అయితే అబార్షన్లు చేపిస్తున్నారు. ఎంత కఠిన చట్టాలు వచ్చినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉంది ఆడపిల్లో, మగ పిల్లాడో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె పొట్టని చీల్చాడు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుదాన్‌లో చోటు చేసుకుంది. పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకును కనాలనేది అతడి కోరిక. ఈ క్రమంలో అతడి భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలాగని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు. (చదవండి: కొట్టి చంపి.. గోతంలో వేసి..!) పొట్టలో ఉంది ఆడో, మగో తెలుసుకునేందుకు కొడవలితో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చర్యకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు ఆమెను బరేలీలోని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‌ను అరెస్ట్ చేశారు. -
పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై దాడి
చెన్నై : పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతిపై దాడి చేయడమే తనను తాను గాయపర్చుకున్న సంఘటన తమిళనాడు చెట్పట్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈరోడ్‌కు చెందిన యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో సదరు యువకుడు.. తనను ప్రేమించాల్సిందిగా యువతిని కోరాడు. కానీ అందుకామె ఒప్పుకోలేదు. ఈ విషయం గురించి ఇంట్లో వారికి కూడా చెప్పింది. దాంతో వారు ఆ యువకుడిని హెచ్చరించి వదిలేశారు. కానీ అతను మాత్రం యువతిని వేధించడం మానలేదు. ఈ క్రమంలో రాత్రి యువతి చెన్నైలోని చెట్పట్ రైల్వే స్టేషన్లో ఉండగా.. సదరు యువకుడు ఆమె దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అందుకు యువతి ససేమిరా అనడంతో.. వెంట తెచ్చుకున్న కొడవలితో యువతి మీద దాడి చేసి గాయపర్చాడు. అనంతరం తనను తాను గాయపర్చుకుని రైల్వే ట్రాక్ మీద పడి పోయాడు. జరిగిన దారుణం చూసి షాక్‌కు గురయిన జనాలు.. తేరుకుని పోలీసులుకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులిద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని.. కానీ యువతికి మాత్రం గొంతు మీద గాయం కావడంతో మాట్లాడానికి ఇబ్బంది పడుతుందని తెలిపారు. కోలుకున్న తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. -
దారుణం: నడిరోడ్డుపై భార్యను నరికిన భర్త
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక మహిళని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా రాజపాలెంలో గత నెల 20న ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే తన భార్యపై దాడి చేశాడు. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతంగా నరికాడు. ఆ మహిళ ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు. అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరిణించింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డవడం ద్వారా వెలుగులోకి వచ్చింది. -
తల్లిని హతమార్చిన కొడుకు
వేముల(వైఎస్సార్ జిల్లా): కన్న కుమారుడే తల్లిని హత మార్చిన ఘటన వైఎస్సార్ జిల్లా వేముల మండలం వేల్పుల గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బయమ్మ కుమారుడు రవిశంకర్‌రెడ్డి తాగుడుకు బానిసై ప్రతిరోజు డబ్బులకోసం తల్లిని వేధించేవాడు. బుధవారం తెల్లవారుజామున డబ్బులు ఇవ్వాలని తల్లిని డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న రవిశంకర్‌రెడ్డి ఆగ్రహానికి గురయ్యాడు. కొడవలితో తల్లి మెడపై నరికడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటనకు సంబంధించి సమీప బంధువు గంగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేముల ఎస్సై నరేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలిపై వేట కొడవలితో దాడి
తెగిపోయిన ఎడమ అరచెయ్యి గుత్తి : అనంతపురం జిల్లా గుత్తిలో ప్రియురాలిపై ప్రియుడు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె ఎడమ అరచెయ్యి తెగిపడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో నివాసముంటున్న శివకు వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధలు రావడంతో ఏడాది కిందట విడిపోయారు. అనంతరం మంచాలు అల్లేందుకు బత్తలపల్లికి వెళ్లిన శివకు అక్కడ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోఒకరికొకరు దగ్గరయ్యారు. తొమ్మిది నెలల కిందట ఆమెను శివ గుత్తికి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆమె ఇతరులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటం, కొందరితో సన్నిహితంగా మెలుగుతుండటంతో సహించలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఆమెలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక అపరిచిత వ్యక్తితో ఇంటి వద్ద మాట్లాడుతున్న సమయంలో శివ గమనించాడు. కోపంతో ఇంటిలోని వేట కొడవలి తీసుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. లక్ష్మి ఎడమ అరచెయ్యి తెగిపడింది. తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు రెఫర్ చేశారు. ప్రియురాలిపై దాడి చేసిన అనంతరం ప్రియుడు శివ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ గౌడ్ చెప్పారు. -
వేటకొడవలితో దాడి..ఒకరు మృతి
గుంటూరు: క్రోసూరు మండలం భయ్యవరంలో దారుణం చోటు చేసుకుంది.ఆస్తి విషయంలో జరిగిన ఘర్షణలో లింగయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, మరదలిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో అత్త కోటేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. భార్య వెంకాయమ్మ, మరదలు పద్మ పరిస్థితి విషమంగా ఉంది. లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఉలిక్కిపడ్డ బుక్కరాయసముద్రం
దారుణం ► వివాదంలో ఉన్న భూమి దున్నేందుకు ప్రయత్నం ► అభ్యంతరం తెలిపిన చిన్నాన్నను వేటకొడవలితో నరికి చంపిన వైనం ► ఆపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు ఆస్తి.. బంధాలు, బంధుత్వాలను విడదీస్తుంది. విధ్వేషాలను పెంచుతుంది. కక్షలకు ఆజ్యం పోస్తుంది. అవసరమైతే ప్రాణాలు తీస్తుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చిన్నాన్ననే వేటకొడవలితో నరికి చంపి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు వరుసకు కొడుకయ్యే ఓ వ్యక్తి. ఈ సంఘటనతో ఊరు ఉలిక్కిపడింది. రెండు కుటుంబాల మధ్య తలెత్తిన కక్షలకు ఓ నిండు ప్రాణం బలైపోవడం సంచలనం సృష్టించింది. - బుక్కరాయసముద్రం బుక్కరాయసముద్రానికి చెందిన బసన్న(65)ను అతని అన్న కుమారుడైన వెంకటేశ్ విచక్షణారహితంగా వేటకొడవలితో చంపడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవరకొండ గ్రామ సర్వే నంబర్ 376లో ఎనిమిదెకరాల పొలం ఉండగా, పై రెండు కుటుంబాల మధ్య మూడేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పొలాన్ని చూసేందుకు వెళ్లగా... సోమవారం ఉదయమే బసన్న తన మనవుడు వాసుతో కలసి బైక్‌లో పొలం చూసేందుకు వెళ్లారు. అప్పటికే అక్కడ వెంకటేశ్ తన భార్య ఎర్రమ్మతో కలసి ట్రాక్టర్‌తో దున్నుతుండడాన్ని గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి ప్రశ్నించారు. వివాదంలో ఉండగానే పొలాన్ని ఎలా దున్నుతావంటూ నిలదీశారు. ఈ విషయంగా మారి మధ్య మాటామాటా పెరిగింది. రేయ్.. నువ్విక్కడి నుంచి వెళ్లిపో... బసన్న మనవడు వాసుని ‘రేయ్ నువ్విక్కడి నుంచి వెళ్లిపో.. అంటూ వెంకటేశ్ గట్టిగా అరిచాడు. ఆ తరువాత తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో బసన్నపై విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత భార్య ఎర్రమ్మను ఇంటికి పంపేసి, నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు వెంకటేశ్. బోరుమన్న కుటుంబ సభ్యులు విషయం తెలిసిన వెంటనే బసన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల వారు భారీగా పొలం వద్దకు చేరుకున్నారు. పొలంలోనే రక్తపు మడుగులో పడి ఉన్న బసన్నను చూసి అతని గుండెలపై పడి కుటుంబ సభ్యులు రోదించారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. రంగంలోకి పోలీసులు ఇన్చార్జ్ ఎస్ఐ శివ, ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, భాస్కర్, సిబ్బంది నేర స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వేటకొడవళ్లతో దాడి: ఇద్దరికి తీవ్రగాయాలు
ధర్మవరం రూరల్ (అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్ మండలంలోని కేతిరెడ్డి కాలనీలో బాషా అనే వ్యక్తి వేటకొడవళ్లతో దాడిచేయగా మౌలాలి, షఫీ అనే ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాషా అనే వ్యక్తి తన చెల్లెలి కోసం కేతిరెడ్డి కాలనీలో ఇందిరమ్మ ఇల్లు కట్టించాడు. అయితే బావ మౌలాలి, ఆయన సోదరుడు షఫీతో గొడవ పడిన బాషా తన ఇల్లు తనకు ఇచ్చేయమని శనివారం మధ్యాహ్నం గొడవపడ్డాడు. ఆగ్రహించిన బాషా వేటకొడవళ్లతో ఇద్దరిపై దాడి చేసి నరికాడు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడిపై వేట కొడవళ్లతో దాడి
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి చంద్రయ్య కాలనీలో ఓ చేనేత కార్మికుడిపై అతని మామ, మరో ఇద్దరు సోమవారం సాయంత్రం వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక సమచారం మేరకు.. కురబల కోట మండలం బోయపల్లికి చెందిన అప్పులప్ప (35) మదనపల్లి చంద్రయ్య కాలనీలో నివసిస్తూ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి శ్యామల, విజయలక్ష్మి అనే ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. కాగా అప్పులప్పకు అతని రెండో భార్య విజయలక్ష్మి, తండ్రి లక్ష్మయ్యతో గొడవ జరిగింది. దీంతో లక్ష్మయ్య, గంగాధర్, వెంకటరమణ అనే ముగ్గురు అప్పులప్పపై వేటకొడవళ్లతో దాడి చేసి నరికారు. ఈ దాడిలో చేతులు తెగిపోగా, గొంతు భాగంలోనూ తీవ్ర గాయం అయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయాకు తరలించారు. -
తల్లిపై కొడవలితో దాడి
భివండీ, న్యూస్ల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిపై కొడుకు కొడవలితో దాడిచేయడంతో తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... కామత్‌ఘర్ ప్రాంతానికి చెందిన భారత్ బారడ్ (33), తన సోదరుడు రఘునాథ్‌ల మధ్య గొడవ జరుగుతుండగా, తల్లి పుష్ప బారడ్ (62), వారిని విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో భారత్ తల్లిపై కొడవలితో దాడిచేశాడు. ఆమె కూతురు జయశ్రీ, రఘునాధ్ ముఖాలపై భారత్ భార్య శారద కారం చల్లింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని స్థానిక నిర్మయ్ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. -
రవళి పై దాడి చేసిన ప్రదీప్ మృతి
-
ఇంజినీరింగ్ విద్యార్థినిపై వేట కొడవలితో దాడి
-
ఇంజినీరింగ్ విద్యార్థినిపై వేట కొడవలితో దాడి
హైదరాబాద్ : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం దారుణం జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని రవిళిపై ప్రదీప్ అనే యువకుడు వేట కొడవలితో దాడి చేశాడు. అనంతరం అతడు విషం తాగాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవళితో పాటు, ప్రదీప్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. కళాశాలకు వెళుతున్న రవళిని ఈరోజు ఉదయం బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ప్రదీప్ కత్తితో దాడి చేయటంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. కాగా రవళి పరిస్థితిగా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రదీప్ గత కొంతకాలంగా ప్రేమించాలంటూ రవళిని వేధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె నిరాకరించటంతో కసి పెంచుకున్న అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరు ఇరువరు రాంనగర్లో నివాసం ఉంటున్నారు. -
బిడ్డలపై తాగుబోతు తండ్రి దాడి
- ఇద్దరు బాలికలు మృతి - కుమారుడి పరిస్థితి విషమం బెంగళూరు : ఓ తాగుబోతు.. అభం శుభం ఎరుగని తన ముగ్గురు బిడ్డలపై కొడవలి దాడి చేశాడు. తమకు ఏమైనా కష్టం వస్తే ఆదుకోవాల్సిన తండ్రే.. కొడవలితో తమపై దాడి చేయడంతో వారు నిర్ఘాంతపోయారు. మద్యం మత్తులో ఆ చిన్నారులను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. ఈ అఘాయిత్యంలో ఇద్దరు బాలికలు మరణించగా.. కుమారుడు కొన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మాగడి రోడ్డు బ్యాడరహళ్ళి సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. తావరకెరె పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తుమకూరు సమీపంలోని నిడసాలె గ్రామంలో రమేష్, గౌరమ్మ నివాసముంటున్నారు. వీరికి ధరణి (14), మోనీషా (11), మోనికా (9) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు వరుసగా తొమ్మిది, ఆరు, నాల్గవ తరగతులు చదువుతున్నారు. రమేష్ ఫైనాన్స్‌లో రెండు ఆటోలో కొనుగోలు చేశాడు. కంతులు సరిగా కట్టకపోవడంతో ఫైనాన్స్ వారు వాటిని తీసుకెళ్లిపోయారు. అనంతరం ఓ ప్రైవేట్ కంపెనీలో రమేష్ ఉద్యోగంలో చేరాడు. మద్యానికి బానిసైన అతను నిత్యం గౌరమ్మతో గొడవ పడేవాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి 7.30 గంటలకు గౌరమ్మతో గొడవపడ్డాడు. విసుగుచెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లిపోయింది. దీంతో మరింత ఆగ్రహించిన రమేష్.. కొడవలితో తన ముగ్గురు బిడ్డలపై ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్తుండగా.. గౌరమ్మ వచ్చింది. అతని దుస్తులకు రక్తం మరకలు ఉండటంతో అనుమానం వచ్చిన ఆమె అతని చేతిలోని తాళం లాక్కొని ఇంట్లోకి వెళ్లింది. అప్పటికే మోనికా, మోనీషా చనిపోయి ఉండటాన్ని చూసి కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు వారు రమేష్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. కొన ఊపిరితో ఉన్న ధరణిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషయంగా ఉందని, రమేష్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు మంగళవారం తెలిపారు.