
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఓ వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై వేటకొడవలితో నరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాను రాను మనుషులలో మానవత్వం నశిస్తోందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. అక్కడ ఉన్న స్థానికులు ఒక మహిళని తమ కళ్ల ఎదురుగా పశువుని నరికినట్లు నరుకుతున్నా దగ్గరకి కూడా రాలేదు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని దిండిగల్ జిల్లా రాజపాలెంలో గత నెల 20న ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే తన భార్యపై దాడి చేశాడు. మదీశ్వరన్ అనే వ్యక్తి తన భార్య ప్రియను నడిరోడ్డులో తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో అత్యంత కిరాతంగా నరికాడు. ఆ మహిళ ఆర్థనాధాలు చేస్తున్నా అక్కడున్న స్థానికులందరూ ఈ దారుణాన్ని చూస్తూ ఉండిపోయారు. అతను పారిపోయాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. మదీశ్వరన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలు ప్రియా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరిణించింది. కుటుంబ కలహాలే దీనికి కారణమని తెలుస్తోంది. రాజపాలెం బస్టాండ్‌లో జరిగిన ఈ దారుణం సీసీ ఫుటేజీలో రికార్డవడం ద్వారా వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment