కూతురు ఓ నిరుపేదను పెళ్లి చేసుకుందని..  | Newly Married Couple Assassinated By Womans Father In Tamilnadu | Sakshi
Sakshi News home page

నిరుపేద, పైగా చదువూ లేదు.. కూతురు, అల్లుడిని కడతేర్చాడు

Published Tue, Jul 26 2022 2:00 PM | Last Updated on Wed, Jul 27 2022 7:51 AM

Newly Married Couple Assassinated By Womans Father In Tamilnadu - Sakshi

చెన్నై: పెద్దగా చదువుకోని, నిరుపేద యువకుడిని తన కూతురు పెళ్లి చేసుకుందనే కోపంతో ఆమె తండ్రి వారిద్దరినీ హత్య చేశాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా ట్యుటికోరిన్‌లో ఈ పరువు హత్య దారుణం చోటుచేసుకుంది.

ఎస్సీ వర్గానికి చెందిన మానిక్‌రాజ్‌(26), రేష్మా(20) జూన్‌ 29న వివాహం చేసుకుని, ఎటో వెళ్లిపోయారు. చివరికి గ్రామస్తులు జోక్యం చేసుకుని ఆ దంపతుల జోలికి వెళ్లవద్దని రేష్మా కుటుంబాన్ని ఒప్పించారు. దీంతో, వారు నాలుగు రోజుల క్రితం తిరిగి సొంతూరులోని మానిక్‌రాజ్‌ ఇంటికి వచ్చి ఉంటున్నారు.

సోమవారం వారు ఆ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. రేష్మా తండ్రి ముత్తుకుట్టిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రేష్మా కాలేజీలో చదువుకుంటుండగా, రోజుకూలీగా పనిచేసుకునే మానిక్‌రాజ్‌ స్కూలు విద్యతోనే ఆపేశాడు. అతడు నచ్చకనే రేష్మా కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  

(చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement