చికెన్‌ దుకాణం తెరవడానికి వెళ్లాడు.. అంతలోనే.. | Courier Boy Murder Mystery In Tamilnadu | Sakshi
Sakshi News home page

చికెన్‌ దుకాణం తెరవడానికి వెళ్లాడు.. అంతలోనే..

Oct 19 2021 8:29 AM | Updated on Oct 19 2021 8:30 AM

Courier Boy Murder Mystery In Tamilnadu - Sakshi

జగదీషన్‌ (ఫైల్‌)

సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, చికెన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆదివారంరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన శివన్‌వాయల్‌ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్‌కొండయూర్‌ గ్రామానికి చెందిన జగదీషన్‌(29). ప్రైవేటు కంపెనీలో కొరియర్‌ బాయ్‌గా పని చేస్తూ ఆదివారం తదితర సెలవు రోజుల్లో తిరువళ్లూరులోని పుంగానగర్‌లో చికెన్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం చికెన్‌ దుకాణం తెరవడానికి వెళ్లి ఆ తరువాత రాలేదు.

దీంతో తల్లిదండ్రులు జగదీషన్‌ సెల్‌ఫోన్‌లో సంప్రదించారు. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో సోమవారం శివన్‌వాయల్‌లోని త్రిపురసుందరి ఆలయం వద్ద రక్తపు మడుగులో జగదీషన్‌ పడివున్నట్లు గుర్తించి స్థానికులు తల్లిదండ్రులకు, వెంగల్‌ పోలీసులకు సమాచారం అందించారు.  

చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement