phone switched off
-
వస్తామన్న బస్సు రానే వచ్చింది.. తండ్రిని ఆగం పట్టిచ్చిన ఆన్లైన్ గేమ్స్!
భిక్కనూరు (నిజామాబాద్): మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యాపారి భార్య, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆనంద్‌గౌడ్ వారి ఆచూకీని నాలుగు గంటల్లోనే కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏమి జరిగిందంటే.. తిప్పాపూర్ గ్రామానికి చెందిన వ్యా పారి వీరమల్లి శ్రీనివాస్‌కు భార్య శాలిని అలియాస్ అశ్విని, ఇద్దరు కుమారులు వరుణ్, లోకేష్‌లు ఉన్నారు. శాలిని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని ఈనెల ఒకటవ తేదీ తిప్పాపూర్ నుంచి కరీంనగర్ వెళ్లి అక్కడ తండ్రిని పరామర్శించి 3వ తేదీ కరీంనగర్లో బస్సు ఎక్కి కామారెడ్డికి మధ్యాహ్నం 3.50 గంటలకు చేరుకుంది. తన భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి తిప్పాపూర్ రావడానికి రామాయంపేటలో బయలుదేరుతున్నానని భిక్కనూరు నుంచి తనను తిప్పాపూర్ తీసుకెళ్లాలని సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన భిక్కనూరు బస్టాండ్‌కు వచ్చాడు. బస్సులో రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో తీవ్ర ఆందోళన చెందారు. చదవండి👉 ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం ఆమె కుమారులు సెల్ఫోన్లో గేమ్ ఆడటంతో చార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ఆఫ్ ఆయ్యింది. కాగా తండ్రి మీద ఉన్న మమకారంతో ఆమె తిరిగి కరీంనగర్ వెళ్ళాలని నిర్ణయించి కుమారులతో కలిసి సిరిసిల్లి బస్సు ఎక్కారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్ళారు. అయితే ఎస్సై ఆనంద్‌గౌడ్ తీవ్రంగా కృషి చేసి ఫోన్ సిగ్నల్ ఆధారంగా సిరిసిల్లలో ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు. చదవండి👉🏻 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్ -
ఒక్కరోజు స్విచ్చాఫ్.. కబుర్లన్నీ ఇంట్లో వాళ్లతోనే!
వారంలో ఓ రోజు ఫోన్, టీవీ, కంప్యూటర్, ట్యాబ్, ల్యాప్‌టాప్ అన్నింటికీ సెలవు ప్రకటించి తీరాలి. మెదడుకు రెక్కలు విచ్చుకుని విహరించే అవకాశం కల్పించాలి. ఒకేసారి రోజంతా అన్ని స్క్రీన్లకూ ఆఫ్ అంటే కొంత కష్టం కావచ్చు. టీవీ, కంప్యూటర్లైతే మన చేతిలోనే ఉంటాయి. ఫోన్ కాల్స్ మన చేతిలో ఉండవు. ఇంట్లో ఒక ఫోన్ స్విచాఫ్‌లో ఉంటే ‘ఫోన్ ఆఫ్‌లో ఉందేమిటి’ అంటూ మరొకరి ఫోన్‌కు కాల్స్ వస్తుంటాయి. కాబట్టి మొదట్లో ఒక గంటతో మొదలు పెట్టండి. రెగ్యులర్‌గా ఫోన్ చేసే స్నేహితులు, బంధువులకు ‘ఇది స్విచాఫ్ అవర్’ అని మెసేజ్ పెట్టేసి ఫోన్ బంద్ చేయాలి. గంటతో మొదలు పెట్టి క్రమంగా ‘స్విచాఫ్ డే’గా మార్చాలి. ‘స్విచాఫ్ డే’ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకునే రోజవుతుంది. కుటుంబ బంధాలు ఆనందాల హరివిల్లుగా మారుతాయి. అనగనగా ఓ రోజు కాదు. ఈ ఆధునిక కాలంలోనే ఓ రోజు ఫోన్ లేకుండా గడిపితే ఎలా ఉంటుంది. వారంలో ఓ రోజు పనికి సెలవు తీసుకున్నట్లే ఇది కూడా. పనికి దూరంగా ఉన్నట్లే ఫోన్‌కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది? మెదడు ఓపెన్ అవుతుంది. సొంతంగా ఆలోచించడం మొదలవుతుంది. ఒకదానితో మరొక విషయాన్ని బేరీజు వేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ మాత్రపు ఖాళీని మెదడుకు ఇచ్చి చూద్దాం. సెలవు రోజు ఇంటికి అవసరమైన వస్తువులు తెచ్చుకోవడం లేదా ఆర్డర్ చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఆ రోజుకు ఫోన్ ముట్టుకోవద్దు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టి కాలనీలో రోడ్లన్నీ చుట్టి వస్తే... మనం నివసించే ప్రదేశం ఎలా ఉందో తెలుస్తుంది. కొత్తగా కడుతున్న ఓ భవనం కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో ఏముండేది? ఓ ప్రశ్న మదిలో మెదలుతుంది. కానీ సమాధానమే తట్టదు. గడచిన పదేళ్లుగా ఇదే కాలనీలో ఉన్నప్పటికీ వారంలో పది–పదిహేను సార్లు ఇదే దారిలో ప్రయాణించినప్పటికీ మనం ఈ ప్రదేశానికి చిరపరిచితులం కాలేకపోయామా అనే సందేహం కూడా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రదేశానికి మనం చిరపరిచితులయ్యాం, కానీ మనకే ఈ ప్రదేశం చిరపరిచితంగా మారలేకపోయింది. ఒక్క రోజైనా చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుని ఈ దారిలో నడిచి ఉంటే కదా! ఏ విషయమైనా మెదడు గ్రహింపునకు వచ్చేది. అనుక్షణం కళ్లు, చెవులు, మెదడు ఫోన్‌తో ఎంగేజ్ అయి ఉంటాయి. అలవాటు పడిన దారిలో దేహం యాంత్రికంగా సాగిపోతూ ఉంటుంది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా టీవీ స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచంలోని విషయాలన్నింటినీ మెదడులోకి గుప్పించడంలోనే రోజు పూర్తవుతుంటే... ఇక మెదడు సొంతంగా ఆలోచించేదెప్పుడు? ఆ మాత్రం వెసులుబాటు దొరికినప్పుడే మెదడు తన సృజనాత్మకతను బయటపెడుతుంది. చదవండి: Health Tips: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా.. అయితే.. అందులోని ఆ గుణం వల్ల.. -
చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లాడు.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆదివారంరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన శివన్‌వాయల్ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్‌కొండయూర్ గ్రామానికి చెందిన జగదీషన్(29). ప్రైవేటు కంపెనీలో కొరియర్ బాయ్‌గా పని చేస్తూ ఆదివారం తదితర సెలవు రోజుల్లో తిరువళ్లూరులోని పుంగానగర్‌లో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లి ఆ తరువాత రాలేదు. దీంతో తల్లిదండ్రులు జగదీషన్ సెల్ఫోన్లో సంప్రదించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో సోమవారం శివన్‌వాయల్‌లోని త్రిపురసుందరి ఆలయం వద్ద రక్తపు మడుగులో జగదీషన్ పడివున్నట్లు గుర్తించి స్థానికులు తల్లిదండ్రులకు, వెంగల్ పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
సమంత ఫోన్ స్విచ్ ఆఫ్
సమంత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతోంది. ఏమిటీ అర్థం కాలేదు కదూ అలా ఎందుకో తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్లాల్సిందే. సమంత నటిగా ఎంట్రీ ఇచ్చింది ఇక్కడే అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చెన్నై చిన్నదాన్ని తొలుత ఆదరించింది మాత్రం తెలుగు సినిమానే. టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సమంతకు సొంతగడ్డపై సక్సెస్ లేదన్న చింత లేకపోలేదు. దీంతో ప్రస్తుతం తన దృష్టిని పూర్తిగా కోలీవుడ్‌పై దాల్చింది. రీఎంట్రీలనూ తొలి చిత్రం అంజాన్ అపజయాన్నే మిగిల్చింది.ఆ తరువాత చిత్రం కత్తి సూపర్ సక్సెస్‌ను అందించింది. అది చాలు అమ్మడు దూసుకుపోవడానికి అన్నట్లుగా ఇప్పుడిక్కడ టాప్ హీరోల భారీ చిత్రాలన్నీ ఈ బ్యూటీ కైవశమే. విక్రమ్‌తో నటించిన పత్తు ఎండ్రదుకుళ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ధనుష్ సరసన వీఐపీ2, సూర్యకు జంటగా 24, విజయ్ 59వ చిత్రంలో ఆయనకు జోడీగా ద్విభాషా చిత్రం బ్రహ్మోత్సవంలో మహేశ్‌బాబుతో, వడచెన్నై చిత్రంలో ధనుష్‌కు జంటగా అంటూ చేతినిండా చిత్రాలతో ఊపిరాడనంత బిజీగా ఉంది. దీంతో సమంతలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నది కోలీవుడ్ వర్గాల మధ్య జరుగుతున్న హాట్ టాపిక్. ఇంతకు ముందు మార్కెట్‌ను అందుకోవాలని హద్దులు మీరి అందాలారబోసింది. ఇప్పుడా విషయంలో పరిమితులు విధించుకోవాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా పారితోషికం విషయంతో ఖరాఖండీగా వ్యవహరించడం మొదలెట్టిందట. ఇంతకు ముందు కొందరు సగం పారితోషికం చెల్లించి మిగిలింది ఇదుగో అదుగో అనడంతో గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు చిత్రషూటింగ్ నాలుగు రోజుల్లో పూర్తి అవుతుందనగానే పారితోషికం పూర్తిగా సెటిల్ చెయ్యాలని ముందుగాను దర్శక నిర్మాతలు నిబంధనలు విధిస్తోందట. గ్లామర్‌లో హద్దులు పాటిస్తునందున పారితోషికంలో కోతలంటే ఒప్పుకునేదిలేదంటూ ముందుగానే నిర్మోహమాటంగా చెప్పేస్తోందట. అలాగే పూర్తి పారితోషికం అందకుంటే చివరి నాలుగు రోజుల షూటింగ్ కోసం ఎవరైనా ఫోన్ చేస్తే సమంత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందట.