chicken shop owner
-
చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లాడు.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆదివారంరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన శివన్‌వాయల్ వద్ద ఉద్రిక్తతకు దారి తీసింది. తిరువళ్లూరు జిల్లా మేల్‌కొండయూర్ గ్రామానికి చెందిన జగదీషన్(29). ప్రైవేటు కంపెనీలో కొరియర్ బాయ్‌గా పని చేస్తూ ఆదివారం తదితర సెలవు రోజుల్లో తిరువళ్లూరులోని పుంగానగర్‌లో చికెన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం చికెన్ దుకాణం తెరవడానికి వెళ్లి ఆ తరువాత రాలేదు. దీంతో తల్లిదండ్రులు జగదీషన్ సెల్ఫోన్లో సంప్రదించారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో సోమవారం శివన్‌వాయల్‌లోని త్రిపురసుందరి ఆలయం వద్ద రక్తపు మడుగులో జగదీషన్ పడివున్నట్లు గుర్తించి స్థానికులు తల్లిదండ్రులకు, వెంగల్ పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రియురాలు మరో యువకుడిని ప్రేమిస్తుందని తెలిసి.. -
ప్రాణం తీసిన పది రూపాయలు
ముంబై: పది రూపాయల విషయంలో చికెన్ షాపు యజమానికి, కస్టమర్లకు మధ్య తలెత్తిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మధ్య ముంబైలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో చికెన్ షాపు యజమాని ఫిరోజ్ షేక్(35) మరణించాడు.నిందితులు కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహూలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వడ పావ్ షాపులో పనిచేసే నిందితులు, షేక్ షాపులో రూ. 105ల చికెన్ తీసుకున్నారు. కానీ, షేక్ 115 రూపాయలను వసూలు చేశాడు. దీంతో పది రూపాయల విషయంలో వివాదం చెలరేగింది. నిందితులు ముగ్గురు షేక్‌పై దాడికి దిగడంతో ఆయన స్పృహ కోల్పోయాడు. నిందితుల్లో చౌదరిని స్థానికులు అక్కడే పట్టుకోగా, మిగిలిన ఇద్దరు పారిపోయారు. షేక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దర్ని వారి నివాసాల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులకు కోర్టు ఈనెల 30 వరకు పోలీసు కస్టడీ విధించినట్లు సమాచారం.