
రవళి మృతదేహం
చైతన్యపురి: ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మన్మధకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వేణుగోపాల్ కుమార్తె రవళి(25)కి ఇబ్రహీంపట్నం మంచాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ శ్రీకాంత్‌తో రెండున్నర నెలల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం గ్రీన్‌పార్కు కాలనీలోని పుట్టింటికి వచ్చిన రవళి బుధవారం బాత్‌రూంలో షవర్ రాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవళి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు.