Bride Suicide
-
నిజామాబాద్: పెళ్లికుమార్తె రవళి ఆత్మహత్య కేసులో వరుడు అరెస్ట్
-
వరుడు నచ్చకపోయినా వివాహం.. పెళ్లయిన పదిరోజులకే..
తిరువొత్తియూరు (చెన్నై): వరుడు నచ్చకపోవడంతో వివాహమైన పది రోజులకు ఓ నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సేలం జిల్లా సంగ గిరి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మే రకు.. సేలం జిల్లా సంగగిరి సమీపంలోని దేవయూరు నల్లకినరు గ్రామానికి చెందిన పళనిస్వామి కుమారుడు జీవానందం (27) మొబైల్ ఫోన్ సర్వీస్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి ఈరోడ్ జిల్లా కాడప్పనూర్ పంచాయతీ గుదిరైకాల్మేడుకు చెందిన కుప్పుస్వామి కుమా ర్తె విమలాదేవి (20)తో ఈ నెల 5వ తేదీన వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో ఉంటున్న విమలాదేవి బుధవారం రాత్రి హఠా త్తుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్ష కోసం ఎడప్పాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహమైన పది రోజులకే యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పోలీసులు జరిపిన విచారణలో వరుడు నచ్చకపోయినా తల్లిదండ్రులు నిర్బంధంగా విమలాదేవికి వివాహం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: (ప్రేమకు నిరాకరించిందన్న కక్షతో నవ వధువు దారుణ హత్య) -
ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. వరుడికి వాట్సాప్‌లో ఫొటోలు పంపిన ప్రియుడు, దాంతో
ద్వారకాతిరుమల: ప్రియురాలి వివాహాన్ని చెడగొట్టేందుకు ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను కాబోయే భర్తకు వాట్సాప్‌లో పంపాడు ఆమె ప్రియుడు. దీంతో మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకోగా బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. జాజులకుంటకు చెందిన బత్తుల అలేఖ్య (24) ఇంటి వద్ద ఉంటూ ప్రైవేట్‌గా చదువుతోంది. రెండేళ్ల క్రితం ఆమె డీఎడ్ చదువుతుండగా నల్లజర్లకు చెందిన కారు డ్రైవర్ బైపే రవితేజతో ప్రేమలో పడింది. ఇంట్లో విషయం తెలవడంతో ఈనెల 1న కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ముంగమూరి బుచ్చిబాబుతో ఆమె పెళ్లి కుదిర్చారు. ఈనెల 4న నిశ్చితార్థ వేడుక జరగ్గా, (ఈనెల 8న) బుధవారం భోజనాలు, 9న గురువారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలిసిన ప్రియుడు రవితేజ ఆమె వివాహాన్ని చెడగొట్టాలని భావించి తనతో అలేఖ్య సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు, చాటింగ్, వాయిస్ మెసేజ్‌లను అతడి స్నేహితుడు మరై సునీల్ సెల్‌ఫోన్ నుంచి పెళ్లికొడుకు ఫోన్‌కు వాట్సాప్ ద్వారా ఈనెల 7న పంపాడు. దీంతో మనస్తాపం చెందిన అలేఖ్య ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబసభ్యులు గుర్తించి తలుపులు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రవితేజ, సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. -
నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. అతడి కోసమే ఇలా..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు. ఇదీ జరిగింది.. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
వైజాగ్ సృజన ఉదంతం మరవకముందే మహబూబ్‌నగర్‌లో లక్ష్మి!
సాక్షి, మహబూబ్‌నగర్: వైజాగ్ మదురవాడ నవవధువు సృజన ఘటన మరువకముందే మరో విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపంతో ఓ నవ వధువు వివాహం జరిగిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పాతతోట ప్రాంతానికి చెందిన లక్ష్మికి అనంతపూర్ జిల్లాకు చెందిన మల్లికార్జున్‌తో గురువారం వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా ఎంతో హుషారుగా కనిపించిన నవవధువు లక్ష్మి.. ఒక్కసారిగా పెళ్లింట విషాదాన్ని నింపింది. వివాహమైన కాసేపటికే నవ వధువు.. బాత్రూమ్లోకి వెళ్లి పేను విరుగుడుకు వేసే మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఎంతకీ బాత్ రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో లక్ష్మి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఆమె స్పృహలేకుండా కిందపడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. లక్ష్మి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, లక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: నిజామాబాద్‌లో వైద్యురాలు అనుమానాస్పద మృతి -
సఖి సెంటర్లో నవ వధువు ఆత్మహత్య
సాక్షి, జనగామ: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటను వారి కుటుంబాలు కాదు పొమ్మనడంతో.. ప్రేమికురాలు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రం సఖి సెంటర్లో చోటు చేసుకుంది. జనగామ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ(20), అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్ (20) ప్రేమించుకున్నారు. ఈనెల 16న ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లో ఈ నెల 22న శ్రీలేఖ, మనోహర్ ప్రేమ వివాహం చేసుకుని, రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. ఇరువురి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించగా కొత్త జంటను తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో శ్రీలేఖను రక్షణ కోసం జనగామలోని సఖి సెంటర్‌కు పంపించారు. సఖి సెంటర్లో మానసిక వేదనకు గురైన శ్రీలేఖ.. టాయిలెట్ డోర్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. -
నవవధువు ఆత్మహత్య
కీసర: భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్ (25) ప్రేమించుకొని ఏడు నెలల క్రితం ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. ఈసీఐఎల్ కమలానగర్లో ఇంటిని అద్దెకు తీసుకొని కొన్ని నెలలు ఉన్నారు. మూడు నెలల క్రితం రాంపల్లి పరిధిలోని పీసీఆర్ ఎన్‌క్లేవ్‌కు మకాం మార్చారు. కాగా పెళ్లైన కొన్ని నెలల నుంచే భర్త అక్షయ్‌కుమార్, అత్తమామలు జగ్జీవన్, రమాదేవి.. త్రినయనిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో త్రినయని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. విష యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి తండ్రి రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెల క్రితం వివాహం.. వధువు మృతి
కర్నూలు,ఆదోని రూరల్: మండల పరిధిలోని గణేకల్ గ్రామానికి చెందిన నవ వధువు జయలక్ష్మి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద ఎల్లప్ప కూతురు జయలక్ష్మిని కౌతాళం మండలం మల్లనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మన్నతో నెల క్రితం వివాహం జరిపించారు. జయలక్ష్మి కడుపునొప్పి తాళలేక శనివారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యులు రెఫర్ చేయగా అక్కడ కోలుకోలేక మృతిచెందిందని ఎస్ఐ వివరించారు. -
ఐదో రోజే నవవధువు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్(29) ఈ నెల 8న పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నారు. శనివారం ఉదయం దంపతులిద్దరూ దేవి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి వెలుపల సెల్వరాజ్ బంధువులతో మాట్లాడుతున్నాడు. ఇంట్లోకి వెళ్లిన దేవి హఠాత్తుగా తలుపులు వేసుకుంది. సమయం గడుస్తున్నా బయటకు రాకపోవడంతో తలుపు తట్టారు. స్పందన లేకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఇంటి దూలానికి దేవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆమెను హుటాహుటిన తారాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సెల్వరాజ్, దేవి తల్లిదండ్రులు బోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి.. -
నెల రోజుల క్రితం పెళ్లి.. కొద్ది రోజులకే
తుర్కపల్లి (ఆలేరు) : వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన నవవధువు మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూష(22)కు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్‌తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని భర్త జనార్దన్, అత్త కృష్ణ కుమారి, మామ భరత్‌కుమార్, ఆడపడుచు వేదవతిలు అనూషను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అత్తగారింట్లోనే ఈ నెల 5న గుర్తు తెలియని ద్రావకం తాగి పుట్టింటికి వచ్చింది. (కాళ్ల పారాణి ఆరకముందే... ) కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అనూష ఆరోగ్యం మెరుగు పడడంతో 6వ తేదీన వాసాలమర్రిలోని పుట్టింటికి తీసుకువచ్చారు. అదే రోజు మధ్యాహ్నం అనూషకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. (కొత్త జంటకు షాక్: వధువుకు కరోనా) -
నవ వధువు ఆత్మహత్య
గచ్చిబౌలి: మనస్తాపానికి గురైన నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆర్.శ్రీనివాస్ వివరాల ప్రకారం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అర్చిడ్స్లో నివాసం ఉండే శేష సంతోషి కుమారి (26) భర్త పాండురంగా రావుతో బుధవారం గొడవ పడింది. సాయంత్రం వాకింగ్ చేస్తానని వెళ్లి 6వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
అత్త అల్లుడి అక్రమ బంధం.. వధువు ఆత్మహత్య
మీర్‌పేట: భర్త, తల్లి ప్రవర్తన వల్ల మానసిక వేదనకు గురైన ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ యాదయ్య తెలిపిన మేరకు.. మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. అనిత క్యాటరింగ్ పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ప్రేమ్ నవీన్‌కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో నవీన్‌కుమార్ తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు. ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన (19)ను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది. వివాహమైన తరువాత కూడా నవీన్‌కుమార్ అనితల వివాహేతర సంబంధం కొనసాగింది. ఇది గమనించిన వందన విడిగా ఉందామని పలుమార్లు భర్తకు చెప్పగా, ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించింది. దీంతో తల్లి మోసం.. భర్త ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి సూసైడ్‌నోట్ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చాటింగ్, న్యూడ్ ఫొటొలంటూ రేట్లు) -
నవ వధువు ఆత్మహత్య
కర్ణాటక, బొమ్మనహళ్లి: వరకట్నం వేధింపులు భరించలేక పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఉరికి వేలాడింది. ఈ ఘటన బెంగళూరు నగరంలోని శుక్రవారం చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం వినూతతో కిరణ్‌కుమార్‌కు వివాహం జరిగింది. బ్యాడరహళ్లిలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం కిరణ్‌తో పాటు అతని తల్లి నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో కిరణ్‌కు కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆయనలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వినూత శుక్రవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే వినూత తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నవ వధువు బలవన్మరణం
హస్తినాపురం: ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మలక్‌పేటకు చెందిన కొటిక లక్ష్మి, చంద్రశేఖర్ దంపతుల కుమార్తె పల్లవి(28)కి గత డిసెంబర్ 8న నల్గొండ జిల్లా, మునుగోడు పట్టణానికి చెందిన సామవరపు సంతోష్‌తో వివాహం జరిగింది. నూతన దంపతులు శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లవి తన బెడ్ రూంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రికి వెళ్లిన ఆమె అత్తమామలు పల్లవికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పక్కింటి వారికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వారు కిటికీలోంచి చూడగా పల్లవి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని మృతురాలి అత్తమాలకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులు తాళలేక.. నవవధువు ఆత్మహత్య
అంబర్‌పేట: అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపూనగర్‌కు చెందిన షేక్ అబ్దుల్ రసూల్ కుమార్తె మోబిన్ ఖలీదా(32)కు నెల రోజుల క్రితం చాంద్రాయణగుట్ట ఫూల్‌బాగ్‌కు చెందిన ఖైసర్ కుమారుడు మహ్మద్ సాబెర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 12 తులాల బంగారం, 30 తులాల వెండి కట్నంగా ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అత్తింటివారు అదనపు కట్నం కోసం ఖలీదాను వేధిçస్తున్నారు. ఇళ్లు కొనివ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆమె ఈ నెల 27న పుట్టింటికి వచ్చింది. అప్పటినుంచి మనస్తాపపానికిలోనైన ఖలీదా సోమవారం రాత్రి ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నవవధువు ఆత్మహత్య
అడ్డగుట్ట: వరకట్న వేధింపులు తాళలేక నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వెంకటేశ్వర్ లాలాగూడ క్యారేజ్ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితం ఆలేర్లోని కొలన్పాకకు చెందిన మమత(లాస్య)(20)తో వివాహం జరిగింది. కట్న కానుకలు రూ. 3లక్షలు, ఒక ప్లాట్ ఇచ్చి పెళ్లి చేశారు. నెల రోజులపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తరువాత భర్త, అత్త, ఆడపడుచులు వరకట్నం విషయంలో మమతను నిత్యం వేధింపులకు గురి చేస్తుండేవారు. వేధింపులు ఎక్కువవ్వడంతో మమత తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం భర్త టిఫిన్ తీసుకురావడానికి బయటకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో మమత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చందానగర్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చక్కలగూడెం గ్రామానికి చెందిన నర్సింహులు, మల్లమ్మల చిన్న కుమార్తె సంధ్య (24) అదే గ్రామానికి చెందిన వెంకట్‌ను ప్రేమించి 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. వెంకట్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి వెంకట్ భార్య సంధ్యను కట్నం తీసుకురావాలని లేకపోతే తన పేరు మీద భూమిని రాయించాలని వేధిస్తున్నాడు.దీంతో సంధ్య శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లైన నాలుగు నెలలకే..
కర్ణాటక,కృష్ణరాజపురం : పెళ్లైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బుధవారం సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేష న్ పరిధిలో చోటు చేసుకుంది. జయలక్ష్మి (24)అనే మహిళకు నాలుగు నెలల క్రితం బెంగళూరు నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న కిరణ్‌కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి ఇద్దరు ఉత్తరహళ్లిలో నివాసం ఉంటున్నారు. బుధవా రం భర్త కార్యాలయానికి వెళ్లిన అనంతరం జయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సుబ్రహ్మణ్య పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. ఉరికి వేలాడుతున్న జయలక్ష్మి -
నవ వధువు ఆత్మహత్య
ఉప్పల్: పెళ్లై నాలుగు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రామంతాపూర్ వివేక్‌నగర్‌లో నివాసముడే చెంబేటి రాజేష్‌కు దిల్సుఖ్నగర్ నివాసి రాశి(23)తో నాలుగు నెలల క్రితం వివాహమైంది. రాజేష్ హిమాయత్‌నగర్‌లోని బోన్సాయి మొక్కల గార్డెన్లో పనిచేస్తాడు. నిత్యం మద్యం తాగుతున్న ఇతడికి భార్యకు గొడవలు జరిగేవి. గురువారం కూడా మద్యం తాగవద్దని రాశి భర్తను వారించడంతో మళ్లీ ఫోన్ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫోన్ పేట్టేసి గదిలోకి వెళ్లి అత్త చూస్తుండగానే గడియ పెట్టుకుంది. ఈలోపు రాజేష్ తల్లికి ఫోన్‌చేసి విషయం చెప్పగా అప్పటికే గదిలోకి వెళ్లిన రాశి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇష్టం లేని పెళ్లి చేశారని.. నవ వధువు
చాదర్‌ఘాట్: ఇష్టం లేని పెళ్లి చేసినందుకు మనస్తాపానికి లోనైన ఓనవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్ మలక్‌పేట, సాయిబాబా నగర్‌కు చెందిన చందుకు రాంనగర్‌కు చెందిన లక్ష్మీ (22)తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. సోమవారం ఉదయం చందు బయటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న లక్ష్మి చున్నీతో కిటికీకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండున్నర నెలల క్రితం వివాహం.. ఆత్మహత్య
చైతన్యపురి: ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మన్మధకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రీన్‌పార్కు కాలనీకి చెందిన వేణుగోపాల్ కుమార్తె రవళి(25)కి ఇబ్రహీంపట్నం మంచాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ శ్రీకాంత్‌తో రెండున్నర నెలల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల క్రితం గ్రీన్‌పార్కు కాలనీలోని పుట్టింటికి వచ్చిన రవళి బుధవారం బాత్రూంలో షవర్ రాడ్డుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రవళి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. -
అత్తింటి వేధింపులతో నవ వధువు ఆత్మహత్య
గుంటూరు,పెనమలూరు: పెళ్లి జరిగి ఐదునెలలు కాకముందే వివాహిత అత్తింటి వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంది. పెదపులిపాక గ్రామానికి చెందిన మట్టా బ్యూలా అలియాస్ అనుషా (20) గత జూన్ 28వ తేదీన ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మట్టా శ్రీనివాస్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి సందరగా కట్నకానుకలు ఇచ్చారు. వీరు కొండపల్లిలో కాపురం ఉంటున్నారు. భార్యభర్తలు ఆటోనగర్‌లో పని చేస్తున్నారు. అయితే పెళ్లి జరిగిన కొద్దిరోజులకే బ్యూలాకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇచ్చిన కట్నం చాలలేదని అత్తమామలు ఇబ్బంది పెడుతుండగా, బ్యూలా పై లేనిపోని అనుమానాలతో భర్త వేధించసాగాడు. దీంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాగా సోమవారం రాత్రి బ్యూలా తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను అత్తింటి వారు వేధిస్తున్నారని, తనను పుట్టింటికి తీసుకు వెళ్లాలని కోరింది. దీంతో బ్యూలా తండ్రి దేవరపల్లి శేష య్య బ్యూలాను మంగళవారం కొండపల్లి నుంచి పెదపులిపాకకు తీసుకు వచ్చాడు. కాగా మధ్యహ్నం బ్యూలా నిద్రపోతానని బెడ్రూమ్లోకి వెళ్లి పడుకుంది. సాయంత్రం అయినా బ్యూలా లేవలేదని ఆమె గదిలోకి వెళ్లి కుటుంబ సభ్యులు చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉంది.అత్తింటి వారిపై కేసుకాగా ఈ ఘటన పై బ్యూలా తండ్రి దేవరపల్లి శేషయ్య ఫిర్యాదు మేరకు బ్యూలా భర్త శ్రీనివాస్, అత్త నిర్మల, మామ లాజర్ పై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. -
నవ వధువు ఆత్మహత్య
తమిళనాడు, తిరువొత్తియూరు: వివాహమైన రెండు రోజులకే నవ వధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెతో పాటు విషం తాగిన చిన్నాన్న పరిస్థితి విషమంగా ఉంది. తేని జిల్లా చిన్నమనూరు సమీపం పులికుత్తి గ్రామానికి చెందిన పాండియన్ (46) కూలీ. అతని కుమార్తె రమ్య (23). ఈమెకు పెరియకులం సమీపం సరత్తుపట్టికి చెందిన రంగరాజ్ (29)తో 11వ తేదీ వివాహమైంది. సోమవారం మరవలి కోసం పులికుత్తికి దంపతులు వచ్చారు. తరువాత పులికుత్తిలో ఉన్న బంధువు ఇంటికి విందుకు వెళ్లారు. వధువు వెంట ఆమె చిన్నాన్న ముత్తుకృష్ణన్ (27) వెళ్లాడు. తరువాత కొద్ది సమయానికే ముత్తుకృష్ణన్, రమ్య స్పృహతప్పారు. బంధువులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇద్దరూ విషం తాగినట్టు తెలిపారు. చికిత్స పొందుతూ రమ్య మృతి చెందగా ముత్తుకృష్ణన్‌ను మెరుగైన చికిత్స కోసం మదురై ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రమ్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై చిన్నమనూరు పోలీసుస్టేషన్లో రమ్య తండ్రి పాండియన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
నవ వధువు ఆత్మహత్య
విశాఖపట్నం, రోలుగుంట(చోడవరం): పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. భర్త వద్ద రెండు నెలలు ఉండి, ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వచ్చింది. శ్రావణ మాసం రావడంతో అత్తవారు కోడలిని తమ ఇంటికి పంపించాలని కోరారు. మరో వారంలో కుమార్తెను అత్తవారింటికి పంపించేం దుకు ఆ తల్లి అన్నీ సిద్ధం చేసుకుని కుమార్తెతో బుధవారం రాత్రి ఆ విషయం చెప్పింది. మరి ఆ రాత్రి నవవధువు భూలక్ష్మి(19) ఏమనుకుందో, ఏమో గాని గురువారం రోలుగుంట సమీపంలో చెక్కల మిల్లు వద్ద బావిలో శవమై తేలింది. ఈ సంఘటన మండలవాసులను కలచివేస్తుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం కొండపాలెం గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబు, మణమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఆరేళ్ల వయస్సు దాటిన తరువాత సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు స్వామిని, కుమార్తె భూలక్ష్మిని తల్లి మణమ్మ కూలిపనులు చేస్తూ పోషించింది. కుమార్తెకు మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామానికి చెందిన అధికారి అప్పలనాయుడు, వరలక్ష్మిల కుమారుడు శ్రీనుతో ఈ ఏడాది మే 3వ తేదీన వివాహం జరిపించింది. అందరూ ఆనందించారు. అయితే విధి వక్రీకరించింది. ఆషాఢమాసానికి తన ఇంటికి వచ్చిన బిడ్డ, శ్రావణమాసంలో ఆనందంగా అత్తవారింటికి వెళుతుందని తల్లి పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె గుండెలు ఆవిసేలా రోదించింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని గురువారం స్థానిక పోలీసులకు మణమ్మ ఫిర్యాదు చేసింది. వివాహబంధంపై అంగాహన లేకే ఇలా చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ఐ హరికృష్ణ, మండల మేజిస్ట్రేట్ పి.అప్పలనాయుడితో కలసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను విచా రించారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కాళ్ల పారాణి ఆరకముందే..
వారం రోజుల క్రితం బంధుమిత్రుల మధ్య ఆమె వివాహం ఘనంగా జరిగింది. తమ కుమార్తెకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులు చాలా సంతోషించారు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం లాంఛనాలతో మెట్టినింటికి సాగనంపారు. అయితే తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో దిగాలు చెందింది. దీంతో భర్త విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సర్ది చెప్పారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆమె ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులు, బంధువులను శోకసంద్రంలో ముంచింది. సాక్షి, గడివేముల: కర్నూలు జిల్లా మండలంలోని కరిమద్దెల గ్రామంలో బుధవారం ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..బండిఆత్మకూరు మండలం బి.కోడూరుకు చెందిన ముల్లా చిన్నమౌలాలికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జమీల(19)కు కరిమద్దెల గ్రామానికి చెందిన ఉసేన్‌బాషాతో ఈ నెల 12న నిఖా జరిగింది. 13న వలిమా తర్వాత 14న పుట్టింటికి చేరుకుంది. తర్వాత ఈ నెల16 మెట్టినింటికి వచ్చింది. రెండు రోజులుగా ఆమె దిగాలుగా ఉండడంతో భర్త ఆమె తల్లిదండ్రులకు విషయం తెలియజేశాడు. దీంతో వారు తమ కుమార్తెకు నచ్చజెప్పారు. అయితే మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త చుట్టుపక్కల వారితో కలిసి తలుపును ధ్వంసం చేసి ఉరికి వేలాడుతున్న ఆమెను కిందికి దించాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుడిని పరీక్షించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించాడు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
నవ వధువు బలవన్మరణం
పొదిలి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో నూతన వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక టైలర్స్ కాలనీలో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం మేరకు తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన అనూష (19)కు పట్టణంలోని టైలర్స్ కాలనీకి చెందిన వేముల మంగమ్మ, నరసింహులు కుమారుడు వేముల సాయిబాబుతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. టైలర్స్ కాలనీలో సొంత గృహంలో కొత్త దంపతులు నివాసం ఉంటున్నారు. పక్కనే ఉన్న మరో సొంత భవనంలో అత్త, మామలు ఉంటున్నారు. మృతురాలి భర్త దివ్యాంగుడైన సాయిబాబు పట్టణంలో నెట్ వర్కు సెంటర్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సెంటర్‌కు వెళ్లే సమయంలో భార్య తనకు నీరసంగా ఉందని కొబ్బరి నీళ్లు తెచ్చివ్వాలని అడిగింది. తీసుకుని వచ్చిన అనంతరం సాయిబాబు నెట్ వర్కు సెంటర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అనూష ఉరి వేసుకుని మృతి చెందింది. అత్త మంగమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా వేల్లాడుతూ మృత దేహం కనిపించింది. వెంటనే కుమారుడు సాయిబాబుకు, పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్ విద్యాసాగరుడు ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. ఆర్ఐ సుబ్బరాయుడు, వీఆర్ఓ మురళి, సుబ్బారావు వివరాలు నమోదు చేశారు.