
కాళ్ల పారాణి ఆరకముందే...
హైదరాబాద్: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు విగతజీవిగా మారింది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. మెదక్ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన అనురాధ, లక్ష్మణ్‌గౌడ్‌ల కుమార్తె సుహాసిని... చండూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఈ నెల 15న వివాహం జరిగింది. బుధవారమే వీరిద్దరు చింతల్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు.
వృత్తిరీత్యా గ్యాస్ టెక్నీషియన్ అయిన శ్రీనివాస్ ఈ ఉదయం గుడికి వెళ్లాడు. తిరిగివచ్చేసరికి సుహాసిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనస్థలానికి వచ్చిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుహాసిని ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే అంతుపట్టడంలేదని పోలీసుంటున్నారు.