chintal
-
ఇంట్లో చనిపోయిన మహిళతోనే వారంపాటుగా సాధారణ జీవితం
-
శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్‌కు అమర్చిన మార్బుల్స్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. ► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని ► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: Warangal: ఏపీ ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు శరవేగంగా రహదారుల విస్తరణ ► ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఎన్‌హెచ్ 44 నుంచి పెద్దషాపూర్ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్‌పేట్ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ► ఎన్ 44 మదనపల్లి క్రాస్ రోడ్డు నుంచి ముచ్చింతల్ మీదుగా చిన్న తూప్రాన్ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా.. తాగునీరు ► రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ట్రాన్స్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్ సమీపంలో 33/11కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్ ప్రధాన లైన్ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఆవుపేడతో పిడకలు సిద్ధం ► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు. పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్.. ► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్‌లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్‌షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. వెదురు బొంగులు.. తాటి కమ్మలతో.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. ► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు. -
యాసిడ్ దాడి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుటంబ కలహాల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్లు తేల్చారు. బాధితురాలి దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 12 గంటల్లో యాసిడ్ దాడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. భాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. జీడిమెట్ల పరిధి చింతల్లో ఉన్న సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోన్న సూర్యకుమారిపై గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాసిడ్ దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని కూకట్‌పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నారు. సూర్య కుమారి అక్క కుమారుడే ఈ దాడి చేసినట్లు సమాచారం. -
వ్యభిచార గృహంపై దాడులు
హైదరాబాద్ : నగరంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేపట్టారు. చింతల్‌లోని ప్రసూననగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై పోలీసులు బుధవారం అర్థరాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాబ్బాబు.. ఎలాగైనా ఆపండి..!
రోడ్డుపాలవుతున్న గోదావరి జలాలు.. పైపులైన్‌కు పగిలి 48 గంటలైనా పట్టించుకోని అధికారులు.. లీకేజీని అరికట్టాలని కాంట్రాక్టర్లను బతిమాలుతున్న వైనం చింతల్: నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి జలాల పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిష్ర్పమోజనంగా మారుతోంది. ఈ నెల 1వ తేదీ అర్థరాత్రి చింతల్ హెచ్ఎంటి వాటర్‌ట్యాంక్ సమీపంలో భారీ పైపులైన్ పగిలిపోవడంతో నీళ్లు ప్రధాన రహదారిని ముంచేశాయి. శనివారం ఉదయం 10 గంటలకు తాపీగా అక్కడికి చేరుకున్న వాటర్‌వర్క్స్ అధికారులు సరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అయినా లీకేజీలు ఆగకపోవడంతో వాటర్ వర్క్స్ అధికారులు స్థానిక కాంట్రాక్టర్‌ను సంప్రదించగా, తాను మేజర్ పైపులైన్ పనులు చేయలేనని చెప్పడంతో అధికారులు ఇతర కాంట్రాక్టర్ల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడం, సోమవారం కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రులు, జలమండలి ఉన్నతాధికారులు ఆరు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసేందుకు ఆ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న అధికారులు ఎలాగైనా పనులు పూర్తి చేయాలని పలువురు కాంట్రాక్టర్లను కాళ్లవేళ్ల పడుతున్నట్లు సమాచారం. ఇదే పైపులైన్‌కు నెల రోజుల్లో రెండు ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టడం గమనార్హం. -
నగరంలో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు గంటల అనంతరం వదిలిపెట్టారు. ఈ సంఘటన నగరంలోని చింతల్ సాయి నగర్ కాలనీలో సోమవారం కలకలం రేపింది. స్థానిక కాలనీకి చెందిన శ్రీను, సింగమ్మల కుమారుడు నాలుగేళ్ల సాయి నవదీప్ ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతకగా.. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుచిత్ర వద్ద వదిలి వెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బాలుడు సురక్షితంగా వారి వద్దకు చేరుకున్నాడు. దీంతో బాధితులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
హైదరాబాద్ : చింతల్లో ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. చింతల్ గౌతమి టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న డి.ప్రీతి(16), పి.ప్రేమ్(15) అనే విద్యార్థినీ విద్యార్థులు సోమవారం సాయంత్రం నుంచి కనపడుటలేదు. సోమవారం స్కూలుకు వెళ్లిన వారు రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
పగిలిన మంజీరా పైపులైన్
హైదరాబాద్: మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి. దీంతో మంజీరా నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నగర వాసులకు తాగడానికి మంచి నీరులేక ఇబ్బందులు పడుతుంటే.. ఇలా మంజీరా నీటిని రోడ్డు పాలు చేస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బస్సు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: నగరంలోని చింతల్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. వివరాలు.. చింతల్ ఐడీపీఎల్ చౌరస్తాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. చింతల్లో నివాసం ఉండే రాంబాబు హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం బైక్‌పై హైటెక్‌సిటీకి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది -
భద్రం.. పడుతారు
హైదరాబాద్ సిటీ: బైక్‌పై ఒక్కరు లేదా ఇద్దరు వెళ్తారు కానీ.. మేము కొంచెం వేరు.. మాకు ఏ నిబంధనలు వర్తించవు అన్నట్లు ఐదుగురు యువకులు ఒకే బైక్‌పై ప్రయాణించారు. తేడా వస్తే.. ఏమవుతుందో పరిస్థితి ఆలోచించినట్లు లేరు వీరు. ఒక పక్క రోడ్డు ప్రమాదాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నా.. ఇలాంటి సాహసాలను మాత్రం మారడం లేదు. తాజాగా ఆదివారం హైదరాబాద్ నగరంలోని చింతల్లో ఒకే బైకుపై ఐదుమంది యువకులు వెళ్తున్న ఫొటో 'సాక్షి' కెమెరాకు చిక్కింది. అయితే, ఐదుగురిలో ఒక యువకుడు మాత్రం కెమెరా కంటికి కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. -
కాళ్ల పారాణి ఆరకముందే...
హైదరాబాద్: కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు విగతజీవిగా మారింది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్లో జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. మెదక్ జిల్లా వెంకటాపూర్‌కు చెందిన అనురాధ, లక్ష్మణ్గౌడ్ల కుమార్తె సుహాసిని... చండూర్‌కు చెందిన శ్రీనివాస్‌తో ఈ నెల 15న వివాహం జరిగింది. బుధవారమే వీరిద్దరు చింతల్లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. వృత్తిరీత్యా గ్యాస్ టెక్నీషియన్ అయిన శ్రీనివాస్ ఈ ఉదయం గుడికి వెళ్లాడు. తిరిగివచ్చేసరికి సుహాసిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనస్థలానికి వచ్చిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుహాసిని ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే అంతుపట్టడంలేదని పోలీసుంటున్నారు. -
పబ్లిక్ మీటింగ్‌లో సంక్షేమ పథకాల ఎర