మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్‌ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి.
పగిలిన మంజీరా పైపులైన్
Published Wed, Dec 2 2015 10:40 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
హైదరాబాద్: మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్‌ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి. దీంతో మంజీరా నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నగర వాసులకు తాగడానికి మంచి నీరులేక ఇబ్బందులు పడుతుంటే.. ఇలా మంజీరా నీటిని రోడ్డు పాలు చేస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement