ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన సొంత నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయని విధంగా, పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఖర్గే. సోనియా గాంధీ హయాంలో ఇలా జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఎం చేశారు..?
గౌర్హాజరుకు కారణం..:
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవలేదు. తనకు కంటి సమస్య కారణంగా రావడం కుదరదని చెప్పారు. సెక్యూరిటీ సమస్యల వల్ల ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. ప్రధాని, రక్షణ మంత్రి, స్పీకర్‌లు వెళ్లేవరకు ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.. తాను ఇంటివద్ద, కాంగ్రెస్ అధికారిక భవనంలో జెండా ఎగురవేయాల్సిన ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పారు.
సాంప్రదాయానికి విరుద్ధంగా..:
స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే క్షణాన రాజకీయాలకు వెళ్లకూడదనే నియమం పార్టీలో ఉండేది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులు పాటించారు. కానీ నేడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే భారత్ అభివృద్ధి చెందినట్లు చెప్పడంపై విమర్శలు కురిపించారు. కేవలం గతంలో ఏర్పాటు చేసిన పథకాలనే రూపుమార్చి కొత్త పేరుతో ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. చివరికి ప్రధాని వాజ్‌పేయి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని ఖర్గే అన్నారు.
అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగమూర్తులను ఖర్గే కొనియాడారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అంబేద్కర్‌లను తలుచుకున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో గత ప్రధానులు చేసిన పనిని గుర్తు చేశారు.
आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई।
— Mallikarjun Kharge (@kharge) August 15, 2023
लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है।
हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे।
जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM
అటు.. స్వాతంత్య్ర ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు భూతాలను దేశం నుంచి పారదోలాలని అన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో కొన్ని సమస్యలు వెంటాడాయని చెప్పారు. రాజరిక పాలన, ఇంకా ఓ పార్టీ కుటుంబానికి, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే మూలసూత్రాల మీద పనిచేసిందని కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment