breaks
-
రైలులో అగ్ని ప్రమాదం
ముంబయి: మహారాష్ట్రలో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్ నుంచి అష్టికి వెళ్లే సబర్బన్ రైలులోని ఐదు కోచ్‌లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించామని వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
ఇండస్ట్రియల్ పార్క్‌లో భారీ అగ్ని ప్రమాదం
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్‌లోని వేర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం చెలరేగగా.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. నష్టానికి సంబంధించిన విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి Follow the Sakshi TV channel on WhatsApp: -
సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖర్గే..
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన సొంత నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయని విధంగా, పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఖర్గే. సోనియా గాంధీ హయాంలో ఇలా జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఎం చేశారు..? గౌర్హాజరుకు కారణం..: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవలేదు. తనకు కంటి సమస్య కారణంగా రావడం కుదరదని చెప్పారు. సెక్యూరిటీ సమస్యల వల్ల ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. ప్రధాని, రక్షణ మంత్రి, స్పీకర్లు వెళ్లేవరకు ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.. తాను ఇంటివద్ద, కాంగ్రెస్ అధికారిక భవనంలో జెండా ఎగురవేయాల్సిన ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పారు. సాంప్రదాయానికి విరుద్ధంగా..: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే క్షణాన రాజకీయాలకు వెళ్లకూడదనే నియమం పార్టీలో ఉండేది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులు పాటించారు. కానీ నేడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే భారత్ అభివృద్ధి చెందినట్లు చెప్పడంపై విమర్శలు కురిపించారు. కేవలం గతంలో ఏర్పాటు చేసిన పథకాలనే రూపుమార్చి కొత్త పేరుతో ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. చివరికి ప్రధాని వాజ్‌పేయి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని ఖర్గే అన్నారు. అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగమూర్తులను ఖర్గే కొనియాడారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అంబేద్కర్లను తలుచుకున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో గత ప్రధానులు చేసిన పనిని గుర్తు చేశారు. आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई। लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है। हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे। जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM — Mallikarjun Kharge (@kharge) August 15, 2023 అటు.. స్వాతంత్య్ర ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు భూతాలను దేశం నుంచి పారదోలాలని అన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో కొన్ని సమస్యలు వెంటాడాయని చెప్పారు. రాజరిక పాలన, ఇంకా ఓ పార్టీ కుటుంబానికి, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే మూలసూత్రాల మీద పనిచేసిందని కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
పార్కింగ్ కోసం గొడవ.. వీడియో వైరల్..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. pic.twitter.com/iTA7e29Hu6 — POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023 ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి.. -
తలా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా...
-
చెత్త ఫామ్...అయినా రికార్డులు సృష్టిస్తున్న హిట్ మ్యాన్
-
సిమ్రాన్ రికార్డును 22 సంవత్సరాల తర్వాత బ్రేక్ చేసిన శృతి హాసన్
-
భావోద్వేగ క్షణం: 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమ్మగొంతు విని....
ఒక్కక్షణం నిశబ్దం చాలా భరించలేని విధంగా ఉంటుంది. అలాగని గందరగోళంగా ఉన్నా భరించలేం. కానీ కొంతమంది పుట్టుకతో వినపడని వాళ్లు ఉంటారు. వాళ్లు ఆ నిశబ్దాన్నిఎలా భరించగలుగుతారో తెలియదు. ఆ నిశబ్దం కారణంగా వారు ఏమి గ్రహించలేక మాటలు కూడా నేర్చుకోవడం అసాధ్యంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి చిన్నప్పుడే ఒక ఆరోగ్య సమస్యతో వినికిడి శక్తిని కోల్పోయాడు. అలాంటి వ్యక్తి తొలిసారిగా తన తల్లి గొంతు వినగానే ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఎడ్వర్డో అనే వ్యక్తి మెనింజైటిస్ అనే వ్యాధి కారణంగా వినకిడి శక్తిని కోల్పోయాడు. దీంతో అతను దశాబ్దాలుగా నిశబ్దంలోనే గడిపాడు. ఎట్టకేలకు నిశబ్దాన్ని చీల్చుకుని ఒక చిన్న మైనర్ సర్జరీ తదనంతరం తొలిసారిగా తల్లి గొంతును విన్నాడు. 35 ఏళ్ల నిశబ్ద అనంతరం తొలిసారిగా తన అమ్మ గొంతు విని ఒక్కసారిగా భావోద్వేగంతో కళ్లు చెమ్మగిల్లాయి. ఈ మేరకు ఎడ్వర్డో తల్లి తన పక్కనే కూర్చిని పదేపదే తన కొడుకును పేరుతో పిలిస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉన్న మిగతా బంధువులంతా ఆ అద్భుత క్షణాన్ని చూస్తూ భావోద్వేగం చెందారు. సదరు వ్యక్తి తన చెవులు వినిపిస్తున్నందుకు ఆనందంతో తన కూతురు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎడ్వర్డో అమ్మ మీతో మాట్లాడుతోందని ఒకరు, ఇది హార్ట్ టచ్ చేసే ఘటన అని మరోకరు రకరకాలుగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...) -
కోవిడ్: కొత్త జంట పరార్
సాక్షి, కాజీపేట: కరోనా వైరస్ మహమ్మారి ఒకవైపువిజృంభిస్తోంటే.. మరోవైపు బాధ్యతగా ఉండాల్సిన పౌరులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు చేతికి వేసిన స్టాంప్ (క్వారంటైన్ మార్క్) ను కూడా లెక్క చేయకుండా ఓ కొత్త జంట పలువురి రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టిన వైనం కాజీపేట్ రైల్వేస్టేషన్లో వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులు అప్రమత్తంగా కావడంతో అలర్ట్ అయిన అధికారులు ఆ జంటను గాంధీ ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. రైలు ఉదయం 9.45 గంటలకు కాజీపేట స్టేషన్‌కు చేరుకుంది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉపయోగిస్తుండగా, సహ ప్రయాణికులు చేతిపై ఉన్న ముద్రను గమనించి టీటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాజీపేటలో రైలు ఆపి వైద్యులతో సహా ప్లాట్‌ఫాంపైకి వచ్చి వారిద్దరినీ అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వారు ప్రయాణిస్తున్న బీ-3 కోచ్‌లోని ప్రయాణికులను మరో బోగీలోకి పంపించారు. అలాగే బీ-3 కోచ్ ను శానిటైజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా వీరి ఢిల్లీకి బయలుదేరారని తెలిపారు. కాగా శనివారం నాటికి దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 271 కి చేరింది. -
రజినీ కాంత్‌ను దాటేసిన విజయ్
-
ఇక చాలు ఈ చీలికలు..!
ప్రగతి శక్తులు నేడొక రకం ‘ముక్కలు ముక్కల’ స్థితికి సంబరపడుతున్నాయి. చీలిక తరువాత చీలికకు ఉవ్విళ్లూరుతున్నాయి. ‘ఫ్రాగ్మెంటేషన్’ని ‘సెలబ్రేట్’ చేసుకుంటున్నాయి. ప్రతి విభజన దాని కదే గొప్ప అన్నట్టు చిందులేస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలుసుకోడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు. ప్రతి ప్రగతి శీలి తనలోకి తాను చూసుకుంటే చాలు. చీలికలు పేలికల క్రమంలో యెవరికి యెవరు ఉపయోగపడ్డారు, పడుతున్నారు? పండుగ భక్ష్యాలు వుట్టి మీద పెట్టి తలుపులు మూయడం మరిచిపోయిన ఇంట్లో కుక్కలు పిల్లులు దూరి నట్లు... విభజనోత్సాహం మన ఇళ్ల తలుపులను ప్రతీప శక్తులకు బార్లా తెరిచింది. ప్రజా పోరాటాల ఫలితాలు కుక్కలు, పిల్లుల పాలవుతున్నాయి. నయనతారా సెహగల్ లేదా అరుంధతీ రాయ్ యేవో కొన్ని బహుమతులు వెనక్కివ్వడం, అడవుల్లో కొన్ని తూటాలు పేల డం... వంటి చిన్న చిన్న ఘటనలు చరిత్రను మలుపు తిప్పలేవు. ప్రజలల్లోని అసంతృప్తిని నిరపాయకరంగా బయటికి పంపే సేఫ్టీ వాల్వులుగా పని చేస్తాయంతే. ప్రగతి శక్తుల మధ్య ఐక్యతకై ఒక వుద్యమమే జరగాలి. ఏది సత్తు ఏది చిత్తు అనేది ఉద్యమ గీటు రాయి మీదనే నిగ్గు తేలాలి. లేకుంటే.. మేమింతే, మేమిలాగే ప్రజల్ని పిండుకుంటాం, మేమిలాగే సనాతన అధర్మాల్ని నవీన ధర్మంగా ప్రచారం చేసి జనం మెదళ్లకు సంకెళ్లు బిగిస్తాం... మీరేమీ చేయలేరని ప్రతీప శక్తులు వికటహాసం చేస్తూనే ఉంటాయి. పౌర సమాజంలో అస్తిత్వ వుద్యమాలు ముందుకు వచ్చినప్పుడు జనం ముక్కలు ముక్కలుగా (ఫ్రాగ్మెంటెడ్గా) వ్యవహరించడం సహజమే. సహ సమూహాల్ని విస్మరించి ఎవరి సంగతి వారు చూసుకోడం సహజమే. అది అలాగే నిర్నిబంధంగా కొనం సాగదు. ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా.. దాన్ని ఎవరు వాడుకుంటారనే దాన్ని బట్టి ఆపైన సమాజ చలనం వుంటుంది. సహజ పరిణామం (స్పాంటేనిటీ) అనే దాన్ని కూడా తోసి రాజనలేం. తోసి రాజనరాదు కూడా. పిసికి పండు చేయడం కన్న చెట్టు మీద పండాక కోసుకోడమే సరైనది. పండు అయిన దాన్ని కోసుకోడం లేదా పండు కావడానికి తగిన దినుసులు అందించడం... అది మానవ యత్నమే. ఆ పని ఎవరు చేస్తారు... ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా... అనే దాన్ని బట్టి సమాజ చలనం వుంటుంది. ఈసారి ప్రగతి శక్తులు వెనుక బడ్డాయి. తమలో తాము కలహించుకుని మరింత ఫ్రాగ్మెంటేషన్కి లోనయ్యాయి. విడిపోవడమే ఉద్యమమైపోయింది. ఎందుకు విడిపోతున్నామో చూసుకోలేనంత మైమరుపు. విడిపోవద్దని, కలిసుందామనే వాళ్ల మాటను పెడచెవిని పెట్టాయి. ప్రగతి శక్తులు సంఘటనల తోక పట్టుకుని గోదారి యీదాలనుకుంటున్నాయి. సహజ గతిలో జరిగే పరిణామాలలో ప్రజానుకూలమైన వాటిని ఎంపిక చేసి, ఆ దిశగా సమాజాన్ని కదిలించాల్సిన పని చేయకపోవడం వల్ల ప్రతీప శక్తులది విజయమయ్యింది. జీవితం అన్న తరువాత మనుషులు... రకరకాలుగా కలిసి, విడివడి సమాజ గతిని ప్రభావితం చేస్తుంటారు. కదలికలు పైకి కని పించేంత సహజంగా జరగవు. సమాజం లోని నాయక శక్తులు వాటిలో కలుగజేసుకుంటూ వుంటాయి. ‘కలుగజేసుకోడం’ యివాళ యే దిశగా జరుగుతోంది? ప్రగతి శీలచలనానికి ఏయే శక్తులు కలవాలో వాళ్లు కలవడం లేదు. ఎవరెవరు కలవకూడదో వాళ్లు కలుస్తున్నారు. యీ దృశ్యాన్ని మార్చలేమా? యిది ప్రగతివాదులందరి ఆత్మావలోకన సమయం. ‘నేను ఆత్మ విమర్శ చేసుకునేదేమీ లేదు’ అనుకునే వారి రెక్కలు వారి ఆత్మలకు అంటుకుని విడవు. వాళ్లెప్పటికీ ఎగరలేరు. జనం జెండాలు ఎగరేయనూ లేరు. ముక్కలు ముక్కలైపోయాం. మనల్ని మనం కలిపి కుట్టుకుం దామా? కలిపి కుట్టుకోలేకపోతే మన ఆభిజాత్యాలే ఉంటాయి, మనం ఉండం! మునుపు మనల్ని ముక్కలు చేసుకున్నది మనమే కావొచ్చు. గతంలో మనల్ని ముక్కలు చేసిన సిద్ధాంతాలకు కర్తలం మనమే కావొచ్చు. మన కత్తుల పదును నిరూపించడానికి మన కుత్తుకలు మనం కోసుకునే వైఖరిని విడనాడితే, ప్రజల కోసం చేయాల్సిన త్యాగాలలో మొట్టమొదటిది భేషజాల త్యాగమేనని గుర్తించగలి గితే.. విభజనలకు అతీతంగా ఆలోచించగలుగుతామేమో. మడమ తిప్పని యోధులం అనిపించుకోడం గొప్ప ఏమీ కాదు. ఏమి తిప్పినా ఏమి తిప్పకపోయినా చివరికి ప్రజలు గెలవాలి. ఎవరూ గెలవని యుద్ధమంటూ ఏదీ వుండదు. ప్రగతి శక్తులకు ప్రతీప శక్తులకు మధ్య యుద్దం ఎన్నాళ్లు జరిగినా, ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ప్రజలే గెలవాలి. ప్రజలు గెలవడమంటే సమాజం ముందుకు పోవడమని అర్థం. కొన్ని ఒడిదుడుకులున్నా, సమాజం చలించేది ముందుకే. ప్రజల కోసం అవసరమైతే... ప్రగతి శక్తులు మడమ తిప్పడానికీ వెనుదీయవు. సొంత భేషజాలకు జన ప్రయోజనాల్ని బలి పెట్టవు. ఎలాగైనా గెలవాల్సిన వాళ్లు ప్రజలు. వారికెందుకు లేనిపోని యుద్ధ ధర్మాలు? ప్రతీప శక్తులు ఏనాడూ పాటించని ధర్మాలు? ప్రగతి నిరోధానికి అత్యాలంకారిక భాషలో రాసిన కావ్యాలు? జనం తమ కావ్యాలు తాము రాసుకుంటారు. అడుగడుగు ఐక్యత గేయాలు పాడుకుంటారు. ఇది మనల్ని మనం కలిపి కుట్టుకోవలసిన సమయం. లేకుంటే చస్తాం. యెస్, ఛస్తాం. ఉదాహరణకి యూపీలో దళిత శ్రేణులు బిఎస్పీతో మాత్రమే లేరు. భిన్న పక్షాల మధ్య చీలిపోయి ఉన్నారు. గత రెండు దశాబ్దాలలో సమాజంలో వచ్చిన ‘క్వాంటిటేటివ్’ మార్పులు దీనిక్కారణం. యివి ‘క్వాలిటేటివ్’ మార్పులు కావు గాని, రాజకీయ ఏకీకరణల మీద నిర్ణాయక ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు కావలసింది విభజన కాదు. ప్రగతి శక్తుల మధ్య ఐక్యత. అది సమస్య నుంచి సమస్య వరకు ఉండే ఐక్యతైనా ఫరవాలేదు. దళితుల్లో పెట్టుబడిదారులు రావాలి, దళిత కవుల్లోంచి కృష్ణ శాస్త్రులు రావాలి అనుకున్నాం. అప్పుడు గాని సమాజంలో దళి తులు సాధించుకుంటున్న ప్రజాతంత్ర స్థానం పదిలం కాదని అనుకున్నాం. సమాజం యింకా అంత ముందుకు పోలేదు. పేద కులాలలో కాస్త బాగుపడిన వాళ్లు ప్రతీప శక్తులతో కలిసి పోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది సహజం. తప్పు పట్టి ప్రయోజనం లేదు. కొత్త నేపథ్యంలో ప్రగతి శక్తులు తమను తాము కలిపి కుట్టుకోడానికి దారులు వెదకాలి. ఉన్నదాన్ని లేదని భ్రమించడం కన్న.. ఉన్న స్థితిలోనే గెలుపు దారులకై అన్వేషణ ఉపయోగకరం. హెచ్చార్కె వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : hrkkodidela@gmail.com -
కారు అద్దాలు పగుల గొట్టి చోరీ
హైదరాబాద్ : పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులకొట్టి దుండగులు రూ. 10 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన బోడుప్పల్‌లోని బుద్దానగర్లో చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విషాదాన్ని నింపిన రిజర్వాయర్ ఘటన
-
ఉపాధి పనులకూ బ్రేక్!
• పెద్ద నోట్ల రద్దు,చిల్లర సమస్యతో నిలిచిన చెల్లింపులు • జిల్లాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న • రూ.70 కోట్లకు కొత్తనోట్ల కొరత • మరో రూ.170కోట్ల బకారుులు విడుదల కాని వైనం సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, మార్పిడి సమస్యతో ఉపాధి హామీ పనులపైనా తీవ్రంగా ప్రభావం పడింది. ఈ పథకం కింద పనులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా కూలీలు రావడం లేదు. సెప్టెంబర్‌లో చేసిన పనులకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఉపాధి బకారుులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ క్షేత్రస్థారుులో అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నారుు. కానీ పాత నోట్లు రద్దు కావడంతో పంపిణీ ప్రక్రియను నాలుగైదు రోజులుగా నిలిపివేశారు. అన్ని చోట్లా నోట్ల మార్పిడి కోసం జనం బారులు తీరి ఉంటుండడంతో.. బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసు ఖాతాల ద్వారా వేతనాల సొమ్మును కూలీలకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని క్షేత్రస్థారుు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా పంపిణీ చేద్దామనుకున్నా అంత మొత్తానికి కొత్త నోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు అంగీకరించడం లేదని అంటున్నారు. మరో నెల బకారుులు కూడా.. ఇక అక్టోబరు నెలలో జరిగిన ఉపాధి పనుల నిమిత్తం కూలీలకు రూ.170 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ నిధులను సర్కారు విడుదల చేయలేదు. దీంతో ఓవైపు తమ వద్ద ఉన్న సొమ్మును పంపిణీ చేయలేక... మరోవైపు ప్రభుత్వం నుంచి మొత్తం బకారుులు విడుదలకాక కూలీలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అరుుతే పనులు చేశాక రెండు నెలలవుతున్నా సొమ్ము చేతికి రాకపోతుండడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఉపాధి హామ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. అందులో ఏటా ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 25 లక్షలకు పైమాటే. అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పనులకు వచ్చే వారి సంఖ్య నాలుగైదు రోజులుగా గణనీయంగా పడిపోరుుంది. శనివారం అన్ని జిల్లాల్లో కలిపి 15,545 మందే పనులకు రావడం గమనార్హం. దీంతో ఆయా జిల్లాల్లో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కింద మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటల తవ్వకం తదితర కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయారుు. -
కర్ణాల కుంటకు గండి
వృథాగా పోతోన్న నీరు తూతూ మంత్రంగా చెరువు పనులు నాణ్యత మరచిన కాంట్రాక్టర్ దుబ్బాక: అన్నదాతల ఆత్మహత్యలను నివారించడానికి, ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల నాణ్యత నవ్వలపాలవుతోంది. మండలంలో జరిగిన మిషన్ కాకతీయలో నాసిరకం పనులు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. కాంట్రాక్టర్ల లాభార్జనే ధ్యేయంగా ఐబీ అధికారుల పట్టింపులేని తనంతో మండల పరిధిలోని హబ్షీపూర్ గ్రామ కర్ణాల కుంట పనులు నాణ్యత లేకుండా చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద కుంట మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 27.15 లక్షలను కేటాయించగా ఇటీవలనే దీని మరమ్మతులు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీరు కుంటలోకి వచ్చి చేరుతోంది. ఫలితంగా కుంటకు 14 చోట్ల బుంగలు పడడంతో వర్షపు నీరంతా వృథాగా పోతోంది. కర్ణాల కుంటలోకి వచ్చి చేరుతున్న వర్షపు నీరును చూసి ఆయకట్టుదారులు ఎంతో సంబరపడ్డారు. ఆ సంబరం కొద్ది గంటల్లోనే ఆవిరైపోయింది. కట్ట నిర్మాణంలో నాణ్యత లోపించడంతోనే చెరువు కట్టకు బుంగలు ఏర్పడి నీరంతా వృథాగా పోతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కుంటకు పడిన గండ్ల విషయాన్ని ఆయకట్టుదారులు సదరు కాంట్రాక్టరుకు తెలపడంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి గండ్లను పూడ్చే ప్రయతం చేస్తున్నారు. కుంటకు పడిన బుంగల విషయంపై ఐబీ ఏఈ రాజేందర్‌ను వివరణ కోరగా బుంగలను పూడ్చాలని సదరు కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన చెరువు, కుంటల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారైనా క్షమించబోమని హెచ్చరించారు. -
రాజన్‌పై మౌనం వీడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ రాజన్ పునర్నియామకంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి మౌనం వీడారు. ఆర్ బీఐ గవర్నర్ గా రాజన్ రెండవసారి ఎంపికను సమర్థిస్తారా అని అడిగినపుడు.. ఈ విషయం పరిపాలనకు సంబంధించిన విషయమన్నారు. దీంట్లో మీడియాకు సంబంధంలేదని వ్యాఖ్యానించారు. రాజన్ పై బీజేపీ ఎంపీ, సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వరుస సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని స్పందించడం ఇదే మొదటిసారి. రాజన్ నియామకం ఎడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన వ్యవహారమని మోదీ తేల్చి చెప్పారు. ఈ విషయంలో మీడియాకు అంత ఆసక్తి అవసరం లేదనుకుంటున్నానంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. మరోవైపు సెప్టెంబర్ లోనే ఈ విషయాన్ని పరిశీలిద్దా మని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తో చెప్పారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది కనుక అప్పుడు చూద్దామన్నట్టు చెప్పారు. అయితే ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ రాజన్ ను తక్షణమే తొలగించాలంటూ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. రాజన్ ఉద్దేశపూర్వకంగానే దేశ ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తున్నారని, దేశంలో నిరుద్యోగం పెరిగిందంటూ తీవ్రమైన ఆరోపణల పరంపర ను కొనసాగించారు. ఈ విషయంలో పట్టువీడని స్వామి ..మోదీకి ఇప్పటికే రెండుసార్లు లేఖలు కూడా రాశారు. కాగా రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా రెండోసారి అర్హుడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు రాజన్ సమర్థతతపై అనేక సర్వేల్లో సానుకూలంగా స్పదించారు. రాజన్ మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ ముగియనుంది. -
వందేళ్ళ వయసులో '100 మీటర్ల' రికార్డు
వందేళ్ళ వయసులో వంద మీటర్ల పరుగు... ఊహించడానికే కష్టంగా కనిపిస్తుంది కదూ... కానీ ఆ పోటీల్లో పాల్గొని ఏకంగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఇడా కీలింగ్. వందేళ్ళు జీవించడమే ఓ రికార్డుగా మారుతున్న ఈ కాలంలో వందేళ్ళ వయసులో వందమీటర్ల రేసులో పాల్గొని ఆమె ప్రపంచ రికార్డును సాధించింది. 80 ఏళ్ళ ఇతర పోటీదారుతో రేసులో కేవలం అత్యంత తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసి ఇంతకు ముందున్న రికార్డును బ్రేక్ చేసింది. ఇడా కీలింగ్... వందేళ్ళ వయసులోనూ వంద మీటర్ల రేసులో పాల్గొనేందుకు వెనుకాడలేదు. పాల్గోవడమే కాదు ఏకంగా ఇంతకు ముందున్నజమైకా స్పింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.56 సెకన్లలో 100 మీటర్ల ప్రపంచ రికార్డును తిరగరాసింది. కేవలం 1 నిమిషం17.33 సెకన్లలో వంద మీటర్ల రేస్ ను అవలీలగా పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పెన్ రిలే కార్నివాల్ గా పిలిచే పెన్ రిలే పోటీలు అమెరికాలో నిర్వహించే అత్యంత పురాతన, అతి పెద్ద ట్రాక్, ఫీల్డ్ పోటీలు. ఇవి ప్రతి యేటా ఏప్రిల్ 21 నుంచి నిర్వహిస్తుంటారు. ఫిలడెల్ఫియా ఫ్రాంక్లిన్ ఫీల్డ్ లోని యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా 1895 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి పోటీల్లో పాల్గొని రికార్డును సాధించిన ఇడా కీలింగ్... రుచికోసం తినొద్దని, పోషక పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలని, రోజుకోసారైనా వ్యాయామం చేయాలని క్రీడాకారులతోపాటు, సాధారణ ప్రజలకూ సలహా ఇచ్చింది. అంతేకాదు మనల్ని మనమే ప్రేమించుకోవాలని, మనమేం చేయాలనుకుంటున్నామో అది చేయాలని, మనకోసం ఎవ్వరూ ఏమీ చేయరంటూ సూచించింది. పౌర హక్కుల ఉద్యమ సమయంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న కీలింగ్ కు నలుగురు కొడుకులుండేవారు. దశాబ్దాల క్రితమే భర్త మరణించగా.. ఇద్దరు కొడుకులు తీవ్ర మాదక ద్రవ్యాల అలవాటుతో మృతి చెందినట్లు ఓ పత్రిక అందించిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. వయసు మీరుతుంటే ఒంటిపై పడే రోగాలకు పరుగే తన ప్రధాన చికిత్సగా మార్చుకున్న కీలింగ్... మొదటిసారి 67 ఏళ్ళ వయసులో రేసింగ్ లో పాల్గొంది. ఆ తర్వాత తన పరుగును ఎప్పుడూ ఆపలేదని ఓహియో బీకన్ జర్నల్ లో నివేదించిన వివరాలను బట్టి తెలుస్తోంది. -
మసీదులోకి మహిళల ఎంట్రీకీ ఓకే!
తిరువనంతపురం: కేరళలోని ఓ ప్రసిద్ధ మసీదు ఓ చారిత్రక పరిణామానికి నాందిగా నిలిచింది. మసీదులోకి ప్రవేశానికి ముస్లిం మహిళలకు మొదటిసారి అనుమతి లభించింది. ప్రసిద్ధ తజతంగడి జుమ్మా మసీదు లో మొట్టమొదటిసారిగా కమిటీ తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు కూడా ప్రార్థనలు చేసుకునే అవకాశం కలిగింది. ఈ మేరకు ముస్లిం పెద్దలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. "తాజ్ జుమ మసీద్ " గా ప్రసిద్ధి చెందిన ఈ మసీదులోకి మహిళల ప్రవేశానికి ద్వారాలు తెరుస్తూ మసీదు కమిటీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల సాంప్రదాయానికి చరమ గీతం పాడుతూ మసీదు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతోంది. స్థానిక ముస్లిం కార్యకర్తలు నిరంతర ప్రచారం , ఉద్యమం తర్వాత ఈ ఘన విజయాన్ని సాధించారు కాగా మీనచిల్ నది ఒడ్డున కొట్టాయం కు సమీపంలో ఉన్న ఈ మసీదు భారత దేశంలోని అత్యంత పురాతనమైన మసీదులలో ఒకటి.1000 సంవత్సరాల కంటే ప్రాచీనమైన ఇది నిర్మాణ శోభకు,కొయ్య చెక్కడాలలో అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ మసీదు ఇస్లామిక్ ప్రవక్త ముహమ్మద్ అనుచరులచే కేరళకు వారి మొదటి ప్రయాణాల సందర్భంగా నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. -
వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు చిన్నారుల మృతి
-
పగిలిన మంజీరా పైపులైన్
హైదరాబాద్: మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి. దీంతో మంజీరా నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నగర వాసులకు తాగడానికి మంచి నీరులేక ఇబ్బందులు పడుతుంటే.. ఇలా మంజీరా నీటిని రోడ్డు పాలు చేస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
150 సెకన్లలో 140 కొబ్బరికాయలు ఫట్
-
రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ వద్ద రైలు పట్టాలు విరిగింది. వెంటనే గమనించిన రైల్వే అధికారులు ఆ రూట్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అయితే, అసలు పట్టా ఎందుకు విరిగిందో ఇంతవరకు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు విరిగిందా, లేక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. హుటాహుటిన రైల్వే సిబ్బంది మరమ్మతు పనులను చేపట్టారు. దీని కారణంగా పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మైఖేల్జాక్సన్ రికార్డును బ్రేక్ చేసిన తెలంగాణ విద్యార్థి
-
జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచరికార్డు
-
‘ఎనీవేర్’ ఎలా సార్..!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం హడా వుడిగా ప్రకటించిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’కు ఆదిలోనే హంసపాదు పడింది. భూములు, స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులను రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చం టూ జారీ చేసిన ఉత్తర్వులు పక్షం రోజులుగా ఎక్కడా అమలు కావట్లేదు. ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్’ (ఏ జిల్లాలో ఉన్న స్థిరాస్తులనైనా ఏ జిల్లాలోని సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలోనైనా)పై ఈ నెల నాలుగో తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టంలో పలు సవరణలు కూడా చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయిదు (జీవో నంబరు 21 నుంచి 25) ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఈ జీవోలు అమలుకు నోచుకోలేదు. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన ముందస్తు కసరత్తు, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు కారణం. లోపాలమయంగా సెంట్రల్ సర్వర్ ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌కు కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) సెంట్రల్ సర్వర్‌లో చేసిన మార్పులు లోపాలమయంగా ఉన్నాయి. దీంతో ఈ విధానం ద్వారా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తే అనేక సమస్యలు వస్తాయని, వీటికి బాధ్యత ఎవరిదంటూ క్షేత్రస్థాయి అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు, కార్డ్ సెంట్రల్ సర్వర్‌లో చేసిన మార్పులపై ఉన్నతాధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించగా.. సబ్రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు పలు ప్రశ్నలు సంధించారు. వాటిలో ముఖ్యమైనవి... పట్టణాల్లో నిషేధిత ఆస్తుల జాబితా (పీఓబీ) ఫ్లాట్ నంబర్ల వారీగా సెంట్రల్ సర్వర్‌లో లేదు. దీనివల్ల ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ అయితే అందుకు ఎవరు బాధ్యులవుతారు? భూముల రిజిస్ట్రేషన్ల నిషేధానికి (నిలుపుదలకు) సంబంధించి కోర్టులు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. దీనివల్ల కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకు ఎవరు బాధ్యులవుతారు. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఒక సర్వే నంబరులోని భూమిని రిజిస్ట్రేషన్ చేయవద్దని జిల్లా జడ్జి ఉత్తర్వులు ఇస్తారు. ఈ విషయం తెలియక గుంటూరు సబ్ రిజిస్ట్రారు చేస్తారు. ఇలా జరగకుండా తీసుకుంటున్న జాగ్రత్తలేవి? ఇప్పటి వరకూ మార్కెట్ విలువలకు సంబంధించి వచ్చే అప్పీళ్లపై జిల్లా రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకునే వారు. ఇకపై ఈ అంశంలో ఎవరు నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి పలు ప్రశ్నలు సంధించిన అధికారులు వీటి పరిష్కారానికి తీసుకోవా ల్సిన జాగ్రత్తలను కూడా సూచించారు. నాడే చెప్పిన ‘సాక్షి’ ముందు జాగ్రత్తలు లేకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అమల్లోకి తెస్తే ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ కావడమే కాకుండా పలు సమస్యలు ఉత్పన్నమవుతాయంటూ ‘సాక్షి’ మొదటే చెప్పింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వ భూములకు ఎసరు’ శీర్షికతో గత నెల 17న సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం విదితమే. సాక్షి పేర్కొన్న అంశాలను ఇప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రశ్నల రూపంలో సంధించారు. దీంతో ఈ సమస్యలను అధిగమించే మార్గాలతో సెంట్రల్ సర్వర్లోనూ, ఉత్తర్వుల్లోనూ మార్పులు చేసే వరకూ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ బదులు పాత విధానమే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
తోటి వేషాలు.. భక్తుల సంబరాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: గంగజాతర సందర్భంగా మూడో రోజైన శుక్రవారం తిరుపతిలో భక్తులు తోటివేషం ధరించి సందడి చేశారు. వీధి వీధినా వేషధారుల కోలాహలం కనిపించింది. నాడు తిరుపతిని పాలించిన దుష్ట పాలెగాడిని హతమార్చి, స్త్రీ జాతికి రక్షణ కల్పించేందుకు గంగమ్మగా ఆదిపరాశక్తి అవతరించింది. ఈ విషయం తెలుసుకుని దాక్కున్న పాలెగాడిని కనిపెట్టేందుకు గంగమ్మ రోజుకొక వేషంలో కనిపించిందనేది జాతరకు సంబంధించి స్థానిక గాథ. ఇందులో భాగంగా శుక్రవారం గంగమ్మ భక్తులు తోటి వేషాలు వేసుకున్నారు. శరీరమంతా బొగ్గుపొడి పూసుకుని, తెల్లటి బొట్లు పెట్టుకుని తలచుట్టూ, నడుము చుట్టూ వేపాకులు కట్టుకున్నారు. పాత పొరక, చేటను చేతపట్టుకుని ఎదురుపడ్డవారిని తిన్నగా మోదుతూ, బూతులు తిడుతూ నగర వీధుల్లో సందడి చేశారు. తోటి వేషధారులు తొలుత వేశాలమ్మ, పెద్దగంగమ్మను దర్శించుకుని తర్వాత తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం ముందున్న అమ్మవారి పాదాల వద్ద ప్రణమిల్లి పసుపు, కుంకుమ, మిరియాలు వేపాకు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కావడంతో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పొంగళ్లు పెట్టి గంగమ్మతల్లికి నైవేద్యాలు సమర్పించారు. కొందరు భక్తులు వేయికళ్ల దుత్తలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. దీనికి ముందు ఆలయంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలో అమ్మవారిని కొలువు తీర్చారు. వేలాదిమంది భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. కాగా గంగజాతరలో భాగంగా శనివారం దొరవేషాన్ని వేయనున్నారు. ఈ వేషాన్ని పిల్లలతో పాటు పెద్దలు ఎక్కువమంది వేస్తారు. -
లెజెండ్‌ను కలవర పెడుతున్న సంపూ....
-
ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్సురైలు
-
చెన్నై విమానశ్రయంలో మరోసారి ప్రమాదం
-
వ్యూహాత్మక మౌనం పాటించిన టీడీపీ