
కలకత్తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్‌లోని వేర్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం చెలరేగగా.. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
మంటలను ఆర్పడానికి అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు 11 ఫైర్ ఇంజిన్‌లు మంటలను ఆర్పుతున్నాయి. అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. నష్టానికి సంబంధించిన విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. భారత్ వ్యూహాత్మక వైఖరి
Comments
Please login to add a commentAdd a comment