• పెద్ద నోట్ల రద్దు,చిల్లర సమస్యతో నిలిచిన చెల్లింపులు
• జిల్లాల్లో పంపిణీకి సిద్ధంగా ఉన్న
• రూ.70 కోట్లకు కొత్తనోట్ల కొరత
• మరో రూ.170కోట్ల బకారుులు విడుదల కాని వైనం
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు, మార్పిడి సమస్యతో ఉపాధి హామీ పనులపైనా తీవ్రంగా ప్రభావం పడింది. ఈ పథకం కింద పనులు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నా కూలీలు రావడం లేదు. సెప్టెంబర్‌లో చేసిన పనులకు సంబంధించి ఇవ్వాల్సిన వేతనం కూడా ఇప్పటికీ అందకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి ఉపాధి బకారుులు చెల్లించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.70 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులన్నీ క్షేత్రస్థారుులో అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నారుు.
కానీ పాత నోట్లు రద్దు కావడంతో పంపిణీ ప్రక్రియను నాలుగైదు రోజులుగా నిలిపివేశారు. అన్ని చోట్లా నోట్ల మార్పిడి కోసం జనం బారులు తీరి ఉంటుండడంతో.. బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీసు ఖాతాల ద్వారా వేతనాల సొమ్మును కూలీలకు అందించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని క్షేత్రస్థారుు సిబ్బంది చెబుతున్నారు. నేరుగా పంపిణీ చేద్దామనుకున్నా అంత మొత్తానికి కొత్త నోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు అంగీకరించడం లేదని అంటున్నారు.
మరో నెల బకారుులు కూడా..
ఇక అక్టోబరు నెలలో జరిగిన ఉపాధి పనుల నిమిత్తం కూలీలకు రూ.170 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ నిధులను సర్కారు విడుదల చేయలేదు. దీంతో ఓవైపు తమ వద్ద ఉన్న సొమ్మును పంపిణీ చేయలేక... మరోవైపు ప్రభుత్వం నుంచి మొత్తం బకారుులు విడుదలకాక కూలీలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. అరుుతే పనులు చేశాక రెండు నెలలవుతున్నా సొమ్ము చేతికి రాకపోతుండడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఉపాధి హామ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల జాబ్‌కార్డులు ఉండగా.. అందులో ఏటా ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 25 లక్షలకు పైమాటే.
అరుుతే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పనులకు వచ్చే వారి సంఖ్య నాలుగైదు రోజులుగా గణనీయంగా పడిపోరుుంది. శనివారం అన్ని జిల్లాల్లో కలిపి 15,545 మందే పనులకు రావడం గమనార్హం. దీంతో ఆయా జిల్లాల్లో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం కింద మొక్కల పెంపకం, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, ఇంకుడు గుంతలు, వ్యవసాయ కుంటల తవ్వకం తదితర కార్యక్రమాలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయారుు.