మహబూబాబాద్ : వరంగల్ జిల్లా మహబూబాబాద్ వద్ద రైలు పట్టాలు విరిగింది. వెంటనే గమనించిన రైల్వే అధికారులు ఆ రూట్లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పిందని తెలుస్తోంది. అయితే, అసలు పట్టా ఎందుకు విరిగిందో ఇంతవరకు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు విరిగిందా, లేక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.
హుటాహుటిన రైల్వే సిబ్బంది మరమ్మతు పనులను చేపట్టారు. దీని కారణంగా పలు రైళ్లకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.