tradition
-
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
ఆ దేశాల్లో న్యూ ఈయర్కి ఎలా స్వాగతం పలుకుతారో తెలుసా..!
కొత్త సంవత్సరం వేడుకలను కోలాహలంగా జరుపుకోవడం చాలాకాలంగా కొనసాగుతోంది. సంవత్సర ఆరంభ దినాన పాత అలవాట్లను వదిలేస్తామని కొత్తగా తీర్మానాలు చేసుకోవడం, కొత్త డైరీలను ప్రారంభించడం, కొత్త సంవత్సరం సందర్భంగా కేకు కోసి, బంధుమిత్రులతో పంచుకోవడం, ఆత్మీయులతో కలసి విందు వినోదాలు జరుపుకోవడం, పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్ధతులే! కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా పాటించే ప్రత్యేక ఆచారాలు, పద్ధతులు కూడా ఉన్నాయి. ఇవి కొంత వింతగా ఉంటాయి. ఇలాంటి వింత ఆచారాల గురించి, కొత్త సంవత్సరం ముచ్చట్లు గురించి తెలుసుకుందాం.టమాలీల కానుకఆత్మీయులకు ఇంట్లో వండిన టమాలీలను కానుకగా ఇవ్వడం మెక్సికన్ల ఆచారం. టమాలీ స్పానిష్ సంప్రదాయ వంటకం. టమాలీల తయారీలో మొక్కజొన్న పిండితో పాటు కూరగాయల ముక్కలు, మాంసం, సుగంధద్రవ్యాలు ఉపయోగిస్తారు. కొత్త సంవత్సరం జరుపుకొనే విందు కార్యక్రమాల్లో ఈ టమాలీలను స్థానికంగా ‘మెనుడో’ అని పిలుచుకునే సూప్‌తో కలిపి వడ్డిస్తారు. మెక్సికన్లు టమాలీలను అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. పన్నెండు ద్రాక్షలుడిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలు కొడుతుండగా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ ఒక్కొక్కరు పన్నెండు ద్రాక్షలను ఆరగించడం స్పానిష్ ఆచారం. స్పెయిన్‌లో మాత్రమే కాదు, స్పానిష్ ప్రజలు ఎక్కువగా నివసించే లాటిన్ అమెరికా దేశాల్లోను, కరీబియన్ దీవుల్లోను ఈ ఆచారాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. పన్నెండు ద్రాక్షలను కొత్త సంవత్సరంలోని పన్నెండు నెలలకు సంకేతంగా భావిస్తారు. స్పెయిన్‌లోని అలకాంటీ ప్రాంతానికి చెందిన ద్రాక్షతోటల యజమానులు 1895లో ఈ ఆచారాన్ని ప్రారంభించారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభం నాటికి ఈ ఆచారం స్పానిష్ ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి గడియారం పన్నెండు గంటలు కొడుతుండగా, ఒక్కో గంటకు ఒక్కో ద్రాక్ష చొప్పున పన్నెండు ద్రాక్షలు తినే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. స్పానిష్ ప్రజలు ఈ తంతు తర్వాతనే కేకు కోయడం, బాణసంచా కాల్చడం వంటి సంబరాలు జరుపుకుంటారు.ద్వారానికి ఉల్లిపాయలుకొత్త సంవత్సరం సందర్భంగా గ్రీకు ప్రజలు చర్చిలలో ప్రార్థనలు జరిపి, ఇళ్లకు చేరుకున్న తర్వాత, ఇళ్ల ప్రవేశ ద్వారాలకు, గుమ్మాలకు ఉల్లిపాయలను వేలాడదీస్తారు. ఉల్లిపాయలను ఇలా వేలాడదీయడం వల్ల ఇంట్లోని వారికి ఆయురారోగ్య వృద్ధి, వంశాభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ఇలా వేలాడదీసిన ఉల్లి΄పాయలను మరునాడు వేకువ జామునే తొలగిస్తారు. ద్వారాల నుంచి తొలగించిన ఉల్లిపాయలతో ఇంట్లో నిద్రిస్తున్న పిల్లల నుదుటికి తట్టి, వారిని నిద్రలేపుతారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టిదోషాలు తొలగిపోతాయని వారి నమ్మకం.సోబా నూడుల్స్‌తో ప్రారంభంకొత్త సంవత్సరం రోజున జపాన్‌లో వేడి వేడి సోబా నూడుల్స్ తింటారు. ఈ ఆచారాన్ని జపానీస్ ప్రజలు పన్నెండో శతాబ్ది నుంచి కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పొడవాటి ఈ నూడుల్స్‌ను కొరికి తినడం వల్ల పాత ఏడాదిలోని చెడును కొరికి పారేసినట్లేనని జపానీస్ ప్రజలు భావిస్తారు. వేడి వేడి సూప్‌లో ఉడికించిన సోబా నూడుల్స్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని, శీతకాలంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని పురాతన జపానీస్ పాకశాస్త్ర గ్రంథాలు చెబుతుండటం విశేషం.అన్నీ గుండ్రమైనవేకొత్త సంవత్సరం సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రజలు గుండ్రని వస్తువులను సేకరించడాన్ని, గుండ్రని డిజైన్లు ఉన్న దుస్తులు ధరించడాన్ని, గుండ్రని పండ్లు, ఆహార పదార్థాలు తినడాన్ని శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా గుండ్రంగా ఉండే పుచ్చకాయలు, యాపిల్, ద్రాక్ష, కివీ, దానిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను, గుండ్రంగా ఉండే డోనట్స్, కుకీస్, గుడ్లు తింటారు. అలాగే, గుండ్రంగా ఉండే నాణేలను సేకరించి దాచుకుంటారు. గుండ్రంగా ఉండే లాకెట్లను ధరిస్తారు. గుండ్రమైన వస్తువులను పరిపూర్ణమైన జీవితానికి సంకేతంగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున అన్నీ గుండ్రంగా ఉండేటట్లు చూసుకుంటే జీవితంలో పరిపూర్ణత సాధించగలుగుతామని వీరి విశ్వాసం.కొత్త సంవత్సరం కానుకలుకొత్త సంవత్సరం సందర్భంగా ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకోవడం చాలా చోట్ల ఉన్న పద్ధతే అయినా, జర్మనీలో మాత్రం దీనిని తప్పనిసరి ఆచారంగా పాటిస్తారు. జర్మన్లు కొత్త సంవత్సర వేడుకలకు హాజరైన తమ ఆత్మీయులకు కానుకలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ కానుకల్లో పుస్తకాలు, పెన్నులు వంటి సర్వసాధారణమైన వస్తువుల నుంచి ఖరీదైన వజ్రాభరణాల వంటివి కూడా ఉంటాయి. జర్మన్లు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూనే, షాంపేన్ లేదా స్పార్మింగ్ వైన్‌ను రుచి చూస్తారు. దీనివల్ల సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని వారి నమ్మకం. జర్మన్లకు మరో వింత ఆచారం కూడా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా చిన్న చిన్న సీసపు విగ్రహాలను కరిగించి, కరిగిన సీసాన్ని నీట్లోకి పోస్తారు. నీటిలో ఆ సీసం సంతరించుకునే ఆకారాన్ని బట్టి, కొత్త సంవత్సరంలో జీవితం ఎలా ఉండబోతుందో జోస్యం చెబుతారు. ధవళవస్త్ర ధారణకొత్త సంవత్సరం వేడుకల్లో బ్రెజిల్ ప్రజలు ధవళవస్త్రాలను ధరిస్తారు. బ్రెజిల్లో జరిగే కొత్త సంవత్సరం వేడుకల్లో ఎక్కడ చూసినా, తెలుపు దుస్తులు ధరించిన జనాలే కనిపిస్తారు. సంవత్సర ప్రారంభ దినాన తెలుపు దుస్తులను ధరించడం వల్ల సంతవ్సరమంతా ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడుస్తుందని బ్రెజిలియన్ల నమ్మకం. తెలుపు దుస్తులు ధరించి చర్చిలకు వెళ్లి ్ర΄ార్థనలు జరుపుతారు. అనంతరం కొత్త సంవత్సరం వేడుకలను విందు వినోదాలతో ఆర్భాటంగా జరుపుకుంటారు.దిష్టిబొమ్మల దహనంఆఫ్రికన్ దేశమైన ఈక్వడార్‌లో కొత్త సంవత్సరం సందర్భంగా ఇళ్ల ముందు వీథుల్లో దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. పాత కాగితాలు, కట్టెల పొట్టు, చిరిగిన దుస్తులు నింపి, మానవాకారాల్లో దిష్టిబొమ్మలను తయారు చేస్తారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి పన్నెండు గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ దిష్టిబొమ్మలను గడచిన సంవత్సరంలో ఎదురైన కష్టాలకు, నష్టాలకు, దురదృష్టాలకు సంకేతంగా భావిస్తారు. వీటిని తగులబెట్టడం ద్వారా కొత్త సంవత్సరంలో అదృష్టం కలసివస్తుందని నమ్ముతారు. ఇంకొన్ని వింత ఆచారాలుకొత్త సంవత్సరానికి సంబంధించి ఇంకొన్ని వింత ఆచారాలు కూడా ఉన్నాయి. ఐర్లండ్‌లో ప్రజలు బ్రెడ్ స్లైస్‌తో ఇంటి తలుపులను, కిటికీలను, గోడలను కొడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని నమ్ముతారు. ఆచార సంప్రదాయాలు ఎలా ఉన్నా, కొత్త సంవత్సరం అంటేనే ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త సంరంభం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ హ్యాపీస్ 2025పాత్రల మోతతో స్వాగతంకొత్త సంవత్సరానికి ఇంగ్లండ్, ఐర్లండ్లలోని కొన్ని ప్రాంతాల ప్రజలు విచిత్రంగా స్వాగతం పలుకుతారు. ఇంట్లోని గిన్నెలు, మూకుళ్లు, తపేలాలు వంటి వంటపాత్రలపై గరిటెలతో మోత మోగిస్తూ చేసే చప్పుళ్లతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. వంట΄ాత్రలను మోగిస్తూ రణగొణ ధ్వనులను చేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు పారితాయని వారి నమ్మకం. తొలుత ఈ ఆచారం ఐర్లండ్‌లో ప్రారంభమైందని చెబుతారు. తర్వాతి కాలంలో ఐర్లండ్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు కూడా ఈ ఆచారం వ్యాపించింది.గుమ్మడి సూప్ స్వేచ్ఛా చిహ్నంహైతీలో కొత్త సంవత్సరాన్ని గుమ్మడి సూప్ సేవించడంతో రంభిస్తారు. వీరికి జనవరి1 స్వాతంత్య్ర దినోత్సవం కూడా! గుమ్మడి సూప్‌ను హైతీయన్లు ‘సూప్ జోమో’ అంటారు. స్వాతంత్య్రానికి ముందు హైతీని పాలించిన స్పానిష్, ఫ్రెంచ్ వలస పాలకుల హయాంలో గుమ్మడి సూప్‌ను రుచి చూడటానికి స్థానిక నల్లజాతి ప్రజలకు అనుమతి లేదు. అందుకే స్వాతంత్య్రం పొందిన తర్వాత హైతీయన్లు స్వేచ్ఛా చిహ్నంగా గుమ్మడి సూప్ సేవనంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం ఆచారంగా మార్చుకున్నారు. -
Wedding trends: పెళ్లి వేళ.. చిత్రకళ..
నగరానికి చెందిన ఆలేటి సాయిరాం ప్రమోధిని రెడ్డి, పటేల్ నర్సింహారెడ్డి తమ పెళ్లి వేడుకను ప్రత్యక్షంగా చిత్రీకరించడానికి ఒక పెయింటర్‌ను నియమించుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం అందించే లైవ్ టెలికాస్ట్ గురించి విన్నాం కానీ.. లైవ్ పెయింటింగ్ వినలేదు అనుకుంటే మీరింకా వెడ్డింగ్ ట్రెండ్స్‌లో అప్డేట్ కాలేదన్నమాటే.. వధూవరులు ఓవైపు రంగుల కలల్లో తేలిపోతుంటే.. మరోవైపు సప్తవర్ణాల చిత్ర ‘కళ’ ఆ ఇద్దరి అనుబంధం సాక్షిగా పెళ్ళి వేడుకను అల్లుకుపోతోంది. ఫొటోగ్రఫీ మామూలేగానీ.. లైవ్ పెయింటింగ్ పెడుతున్నారా లేదా..? అని వెడ్డింగ్ ప్లానర్స్ను అడిగే రోజులు వచ్చేశాయంటే.. ఇప్పుడు, వివాహ వేడుకల్లో చిత్రకళకు పెరుగుతున్న అర్థం చేసుకోవచ్చు. అడ్డుతెరతో ఆరంభం.. పెళ్లి వేడుకల సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డుతెరను కళాత్మకంగా రూపొందించడంతో ఓ రకంగా పెళ్లిళ్లలో చిత్రకళకు ప్రాధాన్యత మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత అతిథుల పోట్రైట్లు గీసి రిటర్న్ గిఫ్టŠస్‌గా ఇవ్వడం వంటివి ఒకటొకటిగా ఆరి్టస్టులను వెడ్డింగ్స్‌కు దగ్గర చేశాయి. టర్మరిక్ ఆర్ట్.. ఓ వైవిధ్యం.. ఇటీవలి కాలంలో పెళ్లిళ్లలో కొత్త ఆర్టిస్టిక్ ట్రెండ్‌గా సందడి చేస్తోంది టర్మరిక్ ఆర్ట్. దీనిలో భాగంగా చిత్రకారులు వధూవరుల రూపాలను కాన్వాస్‌పై ఇని్వజబుల్గా ప్రత్యేకమైన విధానంలో చిత్రిస్తారు. ఆ తర్వాత దాన్ని పెళ్లి వేడుకల్లో ప్రదర్శిస్తారు. వచి్చన అతిథులంతా దాని దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న రంగులను చేతులకు అద్దుకుని హస్తముద్రలు ఆ కాన్వాస్ పై వేస్తూ ఉండగా.. వధూవరుల రూపాలు దానిపై ప్రత్యక్షమవ్వడం ఓ ఆసక్తికరమైన వర్ణ వైవిధ్యం. ప్రత్యక్ష.. పెయింటింగ్.. పెళ్లి వేడుకలో ఓ వైపుగా కూర్చుని వధూవరులకు సంబంధించిన ముఖ్య ఘట్టాలను చిత్రించడం కూడా ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. పెళ్లికూతురును పెళ్లి బుట్టలో తీసుకువెళ్లడం, దంపతులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర–బెల్లం ఉంచడం, మంగళసూత్రం కట్టడం, సంప్రదాయ ఆటలు ఆడడం వంటి అపురూప సందర్భాలను ఒడిసిపట్టుకోవడానికి వీడియో, ఫొటోగ్రాఫర్ల తరహాలో ఆరి్టస్టులు కూడా ఇప్పుడు తలమునకలవుతున్నారు. ఔత్సాహిక ఆరి్టస్టులకు డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో యువ ఆరి్టస్ట్ కీర్తన షెడ్యూల్ ఫుల్ బిజీగా మారిపోయింది. ‘దంపతులు మా కళాకృతిని చూసిన ప్రతిసారీ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మురిసిపోతారు’ అని కీర్తన చెప్పింది. ఆమె గత ఏడాది ఒక పెళ్లి సమయంలో వధూవరుల మధ్య ఉంచే అడ్డు తెరను అందంగా చిత్రించింది. ఆ తర్వాత నవంబర్‌లో తన మొదటి ప్రత్యక్ష (లైవ్) వెడ్డింగ్ పెయింటింగ్‌ను రూపొందించింది. అవి సోషల్ మీడియా ద్వారా ఆదరణకు నోచుకోవడంతో ఇప్పటి వరకూ నగరంతో పాటు బెంగళూరు, విజయవాడ, ఖమ్మం, కరీంనగర్లో మొత్తం 60 అడ్డుతెర చిత్రాలు, 13 వివాహ వేడుకల లైవ్ పెయింటింగ్ వర్క్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ‘ఒక పెయింటింగ్ ఫొటోకు దొరకని వివరాలను క్యాప్చర్ చేస్తుంది. దీంతో పాటు మానవ స్పర్శ కూడా అందులో ఉంది’ అంటోంది సిటీకి చెందిన ఆర్టిస్ట్ రేష్మ. లైవ్ ఈవెంట్ పెయింటింగ్‌కు పేరొందిన ఈ యువతి.. ‘కొన్నిసార్లు మండపం దగ్గర లేదా స్క్రీన్ ముందు ఆరి్టస్టులు వారికి కేటాయించిన స్థలంలో కూర్చుంటారు. వేడుక జరుగుతున్నప్పుడు చూస్తూ స్కెచ్/పెయింట్ చేస్తారు. ఆ క్షణాలలో అక్కడి భావోద్వేగాలు, జ్ఞాపకాల కోసం ప్రధాన సన్నివేశాలను చిత్రించడానికి వాటర్ కలర్లను ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఈవెంట్, డెకర్ స్నాప్‌షాట్ కోసం యాక్రిలిక్లను కూడా వాడతారు. ప్రస్తుతం ఈ తరహా ఆర్ట్‌వర్క్‌ల ధర 20,000 నుంచి రూ.2 లక్షల వరకూ ఉంటుంది అదే విధంగా అవుట్‌స్టేషన్ నుంచి రప్పించే పేరొందిన ఆరి్టస్ట్ అయితే ప్రయాణ వసతి ఖర్చులను కూడా క్లయింటే భరించాలి.కష్టమే కానీ.. గొప్ప సంతృప్తి..సాధారణంగా ఆరి్టస్ట్కి ఏకాగ్రత చాలా ముఖ్యం. అయితే పెళ్లిలో మన వర్క్స్ చూస్తూ వ్యాఖ్యానిస్తూ లేదా ప్రశ్నలు అడుగుతూ వచ్చిన వారు అంతరాయం కలిగిస్తూ ఉంటారు. ధ్యాస చెదరకుండా ఉండాలి. అదే సమయంలో అతిథులతో మర్యాదగా ప్రవర్తించాలి. కష్టమే అయినా గొప్ప సంతృప్తి ఇందులో లభిస్తుంది. – సత్యవర్షి, ఆర్టిస్ట్యువ చిత్రకారులకు ప్రోత్సాహకరం.. ప్రస్తుతం నేను లైవ్ వెడ్డింగ్ పెయింటింగ్‌తో పాటు టర్మరిక్ ఆర్ట్ వర్క్ కూడా అందిస్తున్నాను. ఈ లైవ్ వెడ్డింగ్ ఆర్ట్ ట్రెండ్ మాలాంటి ఔత్సాహిక చిత్రకారులకు బాగా ప్రోత్సాహకరంగా ఉంటోంది. పెళ్లి వేడుకల్ని నేరుగా చూస్తూ చిత్రించడం అనేది సరదాగా ఉంటుంది. అదే సమయంలో అది ఒక సవాల్ కూడా. – గ్రీష్మ, ఆర్టిస్ట్ -
Diwali 2024 పలు కారణాల పండగ
ఎంతో విస్తృతీ, వైవిధ్యం గల భారతదేశంలో, భిన్నత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి దీపావళి పండగ ఒక ప్రతీక. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఈ పండగ జరుపుకుంటారు. కానీ ఈ పండగ ప్రాశస్త్యానికీ, ప్రాముఖ్యతకూ వెనక కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది.దక్షిణ భారతంలో నరకాసుర వధ కథ ప్రసిద్ధం. సత్యభామా సహితుడై, శ్రీకృష్ణుడు ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు నరకుడిని సంహరించాడు. కనుక అది నరక చతుర్దశి. ఆ మరునాటి విజయోత్సవ దినం దీపావళి. కానీ ఉత్తర భారతంలో ఈ కథ తెలిసిన వారే అరుదు. ఉత్తర భారతంలో, రావణ సంహారం జరిపి రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ దినంగా దీపావళి అమావాస్యకు గుర్తింపు. అందుకే ఆరోజు మహోత్సవం. అంతటి మహోత్సవం గనక చిన్న దీపావళి (చతుర్దశి), పెద్ద దీపావళి అని రెండు రోజులు జరుగుతుంది. తూర్పున వంగ దేశంలో దీపావళి అమావాస్య... కాళీ పూజ పర్వదినం. పశ్చిమాన గుజరాత్ వాసులకు దీపావళి అమావాస్య సంవత్సరాంతం. అమావాస్య ముగుస్తూనే నూతన సంవత్సరాది. రాజస్థాన్‌లో చాలా ప్రాంతాలలో దీపావళి అమావాస్య నాడే ఉగాది. ఆరోజు వైభవంగా లక్ష్మీ పూజ చేసి, కొత్త పద్దు పుస్తకాలకు శ్రీకారం చుట్టడం భాగ్యప్రదమని అక్కడి వ్యాపారస్థులు భావిస్తారు.జైనులకు దీపావళి అయిదు రోజుల పండగ. జైన ప్రవక్త మహావీరుడు, నేటికి సరిగ్గా 2,550 సంవత్సరాల క్రితం, దీపావళి అమావాస్యనాడు మోక్ష ప్రాప్తి (నిర్వాణం) పొందాడు. అమావాస్య ముందు త్రయోదశి నాడు ఆయన తన శిష్యులకు ఆఖరి బోధనలు ఆరంభించాడు. ఆ త్రయోదశి ‘ధన్య త్రయోదశి’ (ధన్–తేరస్). ఆ రోజు వాళ్ళు ధ్యానాది సాధనలలో గడిపే పవిత్ర దినం. కాలగతిలో ‘ధన్–తేరస్’ను ధన త్రయోదశిగా జరుపుకొనే ఆనవాయితీ అనేక ప్రాంతాలలో ఆరంభమైంది.అమావాస్య నాడు మహావీరుడనే మహత్తరమైన ‘జ్ఞాన జ్యోతి’ అంతర్ధానమవటం వల్ల కలిగిన అంధకారాన్ని ఆయన శిష్యగణం దివ్వెల వరసలు (దీప– ఆవళులు) వెలిగించి తొలగించటానికి చేసే ప్రయత్నంగా ఈ దీపావళులకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. వర్ధమానుడు దూరమవడంతో, దుఃఖ సాగరంలో మునిగి, చేష్టలుడిగిన నంది వర్ధనుడనే రాజును, శుక్ల విదియనాడు, ఆయన సోదరి సుదర్శన తన ఇంటికి ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, వైరాగ్య బోధన చేసి ఊరడించిన సందర్భం ‘భాయి–దూజ్’.దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు! – ఎం. మారుతి శాస్త్రి -
శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు, ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయం గురించి తెలుసుకుందాం.నవరాత్రి వేడుకల్లో భాగంగా గుజరాత్లో పురుషులు ఆనాదిగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. 200 సంవత్సరాల నాటి శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నవమిరోజు సంప్రదాయ బద్ధంగా మహిళల్లా దుస్తులు ధరిస్తారు. అంతేకాదు చీర కట్టుకొని అష్టమి రోజు రాత్రం జానపద నృత్యమైన షేరీ , గర్బా నృత్యం చేస్తారు. ‘సాదుబా మాత’ను పూజిస్తారు. ( Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!)తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 200 ఏళ్ల క్రితం, ‘సదుబెన్’ అనే మహిళను ఒక మొఘల్ కులీనుడు లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. దీంతో బారోట్ సమాజంలోని పురుషులను రక్షణ కోరింది. దీనికి సదరు పురుషులు సాయం చేసేందుకు నిరాకరిస్తారు. ఫలితంగా ఆమె బిడ్డను కోల్పోతుంది. ఈ బాధ, దుఃఖం, ఆవేదనతో భవిష్యత్ తరాల పురుషులు పిరికిపందలుగా మారతారని శపించి 'సతీ'ని పాటించింది. (మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!)ఇదీ చదవండి: శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యంఆ శాపం చాలా శక్తివంతమైందిగా అక్కడి వారు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే ఈ ఈ ఆచారాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. సాదుమాను శాంతింప చేసేందుకు, ఆమెను గౌరవించుకునేందుకు ఒక ఆలయాన్ని నిర్మించారు. నవమి రోజు ప్రత్యేక పూజలు చేసి భవిష్యత్తరాన్ని కాపాడాలని వేడుకుంటారు. -
Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!
దసరా.. అన్ని వర్గాల వారికీ ఆనందాన్ని పంచే పండగ! ఎన్నో సెంటిమెంట్లను సరదాలను, మెసుకొచ్చే శుభదినం. కొత్త బట్టలు, కొత్త కార్లు, కొత్త ఇల్లు, సరికొత్త ఆభరణాలు కొత్త మొబైల్, ఇలా కొంగొత్తగా వేడుక ఉండాలని ఆరాట పడతారు. కొత్త వ్యాపారాలు చేసే వారు దసరా ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయల్లా విలసిల్లాలని మొక్కుకుంటారు. అంతేనా ఉద్యోగులకు బోనస్‌లు, బహుమతులు అబ్బో.. ఆ సందడే వేరు! మనసంతా షాపింగ్సరదా అంటేముందుగా గుర్తొచ్చేది షాపింగ్. ఆఫ్లైన్లైనా ఆన్లైన్లైనా షాపింగ్ మాత్రం మస్ట్. దీన్ని క్యాష్ చేసుకునేందుక రకకరకాల ఆఫర్లతో మురిపిస్తుంటాయి కంపెనీలు. ఏ మాత్రం హడావిడి లేకుండా, జాగ్రత్తగా షాపింగ్ చేసేయ్యడమే. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మనకి కావలన్నపుడు నచ్చినవి దొరక్క, డీలా పడ్డం కాదు, చీప్‌గా దొరికినపుడు దక్కించుకోవడమే ఇదీ లేటెస్ట్ ట్రెండ్కలిసొచ్చే సెలవులుదసరా అంటే పిల్లలకు కూడా చాలా సంబరం. ఎందుకంటే దాదాపు పది రోజులు ఎంచక్కా సెలవులొస్తాయి. అమ్మచేతి కమ్మనైన వంటలు (అపుడపుడు మొట్టికాయలు కూడా) తినేయొచ్చు. కొత్త బట్టలొస్తాయి, కొత్త బొమ్మలూ వస్తాయి. సన్నిహిత బంధువుల పిల్లకాయలొస్తారు. ఇంకేంముంది ఇల్లు పీకి పందిరేయడమే.స్వీట్లుస్వీట్లు లేని దసరా ఊహించుకోగలమా? చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ జగన్మాతను పూజించుకోవడంతోపాటు, నోరు తీపి చేసుకోవడం ఆనవాయితీ. లడ్డూలు, జిలేబీలు, గులాబ్ జామూన్ పూతరేకులతోపాటు, జంతికలు, కారప్పూస, సఖినాలు ఇలా రకరకాల పిండి వంటల తయారీలో మహిళలు ఫుల్ బిజీగా ఉంటారు. ఇక దసరా నాడు, గారెలూ, బజ్జీలూ, వడలు, ఇక ఆ తరువాత కోడికూర, మటన్ మంచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దసరా భక్తిదసరా' అనే 'దశ' అంటే 'పది' ,'హర' అంటే 'ఓటమి' అనే రెండు సంస్కృత పదాలనుంచి వచ్చింది. దసరా నవరాత్రులు, లేదా దేవీ నవర్రాతులు పేరుతో తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మను కొలుస్తారు. ఈ శరన్నవ రాత్రల్లో దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి దేవాలయాలు సర్వంగా సుందరంగా ముస్తాబవుతాయి. రాముడు (విష్ణువు ఎనిమిదవ అవతారం), శని యుగంలో జన్మించిన పది తలల రాక్షసుడు రావణుడిని సహరించిన శుభ సందర్భాన్ని, పాండవుల అజ్ఞాత వాసం వీడి, శమీ వృక్షం మీదున్న ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాన్ని కూడా దసరాగా జరుపుకుంటారు. ఇందులో భాగమే రావణ దహనం, శమీ పూజలు తొమ్మిది రోజులు, తొమ్మిది అవతారాలుఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా పాటిస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చిన పండుగు కనుక శరన్నరాత్రులు అంటారు. ఈ సమయంలో అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. తొమ్మిది రకాల పైవేద్యాలు సమర్పిస్తారు. మహాకాళి, మహాలక్ష్మి. మహా సరస్వతి, నందయ, రక్త దంతి, శాకంబరి దుర్గ, మాతంగి, భ్రమరి అవతారాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. బాలాత్రిపుర సుందరి , గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, సరస్వతి మహిషాసరమర్ధిని, దర్గమ్మ, రాజరాజేశ్వరి, మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. బొమ్మల కొలువుదసరా సంబరాల్లో బొమ్మల కొలువు మరో ముఖ్యమైన ఆచారం. ఈ బొమ్మల కొలువును తీర్చిదిద్దడంలో మహిళలు, అమ్మాయిలు తమ కళాత్మక దృష్టిని ప్రదర్శిస్తారు. ఇది కేవలం భక్తిప్రధానమే కాక, విజ్ఞానదాయకంగా, వినోదాత్మకంగా సంస్కృతీ సంపన్నమైన ఆచారాలకు ప్రతిబింబంగా ఉంటుంది. -
పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!
పెళ్లితంతులో తోడిపెళ్లి కూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా చిన్న పిల్లలను కూర్చొబెడతాం. వాళ్లు సిగ్గుపడిపోతూ..బుల్లి నవ్వులతో ఏదో సాధించిన వాళ్లలా పెట్టే వారి ముఖాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలా ఎందుకు కూర్చొబెడతారనేది తెలియదు. అదీగాక ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ఆచారిస్తున్నారనేది కూడా కచ్చితంగా తెలియదు. కానీ ఈ సంప్రదాయం గురించి పలు ఆసక్తికర కథనాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అవేంటో చూద్దామా..!పూర్వం తోడి పెళ్లికూతురుగా వధువు స్నేహితురాలు లేదా సన్నిహిత బంధువులు ఉండేవారు కాదట. ఆమె సేవకులు అనుసరించేవారట. అంటే వధువు ఇష్టమైన పనిమనిషి ఆమెను అనుసరించేదట. అంతేగాదు ఆ కాలం పెళ్లైన మహిళ కూడా ఆ సేవకురాలు అత్తారింటిలో అడుగుపెట్టేదట. అక్కడ ఆమెకు కొత్త ప్రదేశం కావాల్సిన పనుల్లో సహయం చేసేదట. అలాగే ఒకవేళ నెలతప్పితే సపర్యలు చేసేందుకు ఇలా తోడి పెళ్లికూతురు అనే సంప్రదాయం వచ్చిందని కథనం. మరొక కథనం ప్రకారం..తోడి పెళ్లికూతురుని దుష్ట శక్తులు, చెడు ఉద్దేశ్యాలు ఉన్నవాళ్లని గందరగోళ పరిచేందుకు లేదా వారి దృష్టి పోవడానికి ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇక్కడ ఇరువురు ఒకే విధమైన దుస్తులు ధరిస్తారు గానీ, ఆభరణాలు, అలంకరణ హైలేట్‌గా కనిపించేది అసలైన వధువే. అంటే ఇక్కడ వధువు అందమైనదనో లేక హైలెట్‌గా కనిపించేందుకు ఇలా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబుతున్నారు. అంతేకాదు ఈ సంప్రదాయం పురాతన రోమన్ కాలం నుంచి కూడా ఉందట. ఇక పండితుల ప్రకారం..ఇది వరకు కొందరు రాజులు పెద్ద మనిషి అయిన పిల్లలను ఎత్తుకు పోయేవారట. వారే పాలకులు కావడంతో ఎదిరించడం సామాన్య ప్రజల వల్ల అయ్యేది కాదు. అందుకు పరిష్కారంగా ఈ సంప్రదాయం తీసుకొచ్చారని చెబతున్నారు. అంటే ఇక్కడ ..పెళ్లైన వారిని ఎవ్వరూ కన్నెత్తి చూడటం, ముట్టుకోవడం వంటివి చేసేవారు కాదు. అంతేగాదు ఈ కారణం చేతనే రజస్వల కాకముందే పెళ్లి చేయడం లేదా బాల్య వివాహాలు చేయడం అనే సంప్రదాయం వచ్చిందని చెబుతున్నారు. మన పెద్దవాళ్లు ఏ ఉద్దేశ్యంతో ఈ ఆచారం తీసుకొచ్చారనేది స్పష్టం కాకున్న..చిన్నారులను ఇలా తోడి పెళ్లికూతురు లేదా తోడి పెళ్లికొడుకుగా సిద్ధం చేయడం, దీనికి తోడు పెద్దలు విసిరే ఛలోక్తులు, జోకులు భలే సరదా సరదాగా ఉంటాయి కదూ..!.(చదవండి: ఆయనే రుషి..అక్షర కార్మికుడు..!: విజ్ఞాన మూలంను గౌరవించే రోజు) -
ప్రకృతి ఒడిలో పల్లవించే సంగీతం
వాయిద్యాలు వారికి సరిగమలు తెలియవు. శృతి లయలు అసలే తెలీదు. కానీ శ్రవణానందంగా పాడగలరు. శ్రోతలను రంజింపజేయగలరు. తకిట తథిమి అనే సప్తపదులు నేర్చుకోలేదు. కానీ లయ బద్ధంగా అడుగులు వేయగలరు. సంప్రదాయ నృత్యరీతుల్లో ఎన్ని మార్పులొచ్చినా... తరతరాలుగా అలవాటైన పద విన్యాసాలనే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ప్రకృతిని పరవశింపజేస్తున్నారు. ఇందుకోసం వినియోగించే వాయిద్య పరికరాలు కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే. ఇంతగొప్ప నైపుణ్యం గలిగిన వీరు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో జీవిస్తున్నారు. పురాతనంగా వస్తున్న సంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగిస్తూప్రకృతి ప్రసాదించిన అడవితల్లి ఒడిలో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి జీవనం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న కొండరెడ్డి గిరిజనుల జీవనశైలి విచిత్రంగా ఉంటుంది. సంస్కృతీ, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వీరికి బయటి ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే వారికి ఆలవాలం. చుట్టూ కొండకోనలు వాగు వంకలతో అలరారే గిరి పల్లెల్లో ప్రకృతి నేరి్పన సంగీతం, నాట్యంతోనే జీవితాన్ని ఆనందంగా మలచుకుంటున్నారు.గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రేరేలయ్య.. రేల... రేరేలా... రేలా..’ అంటూ పాడుకుంటే... కొండరెడ్లు ‘జొన్నకూడు.. జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చ పండగ, మామిడి పండగ, చింత పండగ, భూదేవి పండగల్లో పాడుకుంటారు. అలాగే పెళ్లిళ్ల సమయంలో కొండరెడ్లు ‘కళ్లేడమ్మ.. కళ్లేడమ్మ.. గోగుల పిల్లకు.. కెచ్చెల పిల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా డోలు వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇప్పటికీ గిరిపల్లెల్లో పండుగలు, శుభ కార్యాల్లో ఆదివాసీ గిరిజన సంప్రదాయ డోలు, కొమ్ముల నృత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. సొంతంగా వాయిద్య పరికరాల తయారీ కొండరెడ్డి గిరిజనులు వాయిద్య పరికరా లు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్ల తో డప్పుల నమూనాలను తయారు చేసి వాటికి మేక చర్మాలను అతికించి వాయి ద్య పరికరాలను తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. ప్రతి ఏటా గ్రామాల్లో పండగ సమయాల్లో నృత్యాలు చేస్తారు. బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగ నాడు వీరి ఆటపాటలతో కొండలు ప్రతిధ్వనిస్తుంటాయి. పోడు వ్యవసాయమే జీవనాధారం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో సుమారు 11వేల మంది కొండరెడ్డి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునే వీరు పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప కొండ దిగి బయట ప్రపంచం వైపు రారు. ఆయా గ్రామాల్లో అందరూ కలిసి కట్టుగా ఉంటూ అన్ని శుభకార్యాలను వారి సంప్రదాయంలో ఎంతో వైభవంగా చేసుకుంటారు. పూర్వికుల నుంచి వస్తున్న సంప్రదాయం మా పూర్వీకుల నుంచి గ్రామాల్లో శుభకార్యాలకు డోలు కొయ్య నృత్యాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్నే మేం కొనసాగిస్తున్నాం. సమాజంలోని మార్పుల వల్ల ఎన్ని కొత్త రకాల వాయిద్యాలు వచ్చినా మా డోలు కొయ్యి వాయిద్యమే మాకు వినసొంపుగా ఉంటుంది. అందులోనే మాకు సంతోషం ఉంటుంది. మాకు ప్రకృతి నేరి్పన సంగీతమిది. – బొల్లి విశ్వనాథరెడ్డి ఆ నృత్యాల్లో అందరం మైమరచిపోతాం మా గిరిజన గ్రామాల్లో ఏటా వేసవిలో బాట పండగ, పప్పు పండగ, మామిడి పండగతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో మేం తయారు చేసుకొన్న వాయిద్య పరికరాలు వాయిస్తూ లయబద్ధంగా నృత్యాలు చేస్తాం. ఆ సమయంలో చిన్నాపెద్ద తేడా ఉండదు. అందరూ కలసి సంతోషంగా ఆనందంగా నృత్యాలు చేస్తాం. ఇది మా పూర్వికుల నుంచి వస్తున్న ఆచారం. – గోగుల గంగరాజు రెడ్డి -
Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
దెయ్యాల వివాహ సంప్రదాయం గురించి విన్నారా!. ఏంటిదీ ఈ రోజుల్లోనా అనుకోకుండా కొన్ని చోట్ల దీన్ని పాటిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఏకంగా ఆ వివాహతంతు గురించి మ్యాట్రిమోనియల్ సైటల్లోనే ప్రకటన ఇచ్చింది ఓ కుటుంబం. అది విని అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ ప్రకటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..సోషల్ మీడియాలో ఓ వినియోగదారుడు 2022లో ఈ ట్వీట్ గురించి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాను అలాంటి వివాహానికి హాజరయ్యానని చెప్పుకొచ్చాడు. ఇది మీకు పనికిరాని విషయంగా అనిపించొచ్చు. కానీ ఇలాంటివి ఈ రోజుల్లో కూడా ఉన్నాయా? ఇలాంటి సంప్రదాయల్ని పాటిస్తున్నారా అనే విషయం గురించి తెలియజేయడం కోసం ఇది షేర్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇలాంటి సంప్రదాయాలు భారత్‌లో ఎక్కువగా కేరళ, కర్ణాటకలో నిర్వహిస్తుంటారు. అలానే ఓ కేరళ కుటుంబం ఏకంగా 30 సంవత్సరాల క్రితం చనిపోయిన వధువు తగిన వరుడు కావాలంటూ ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత చనిపోయిన వరుడు కుటుంబం ఆచూకి లభించగానే..చాలా ఏళ్ల క్రితం చనిపోయిన ఆ వధువరులిద్దరికి వివాహతంతు జరిపి ఇరుకుటుంబ సభ్యులు ఒకరింటికి ఒకరు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. ముఖ్యంగా ఇలా కడుపులో శిశువుతో చనిపోయిన మహిళకి, యుక్త వయసు రాకుండానే చనిపోయిన పిల్లలకు ఇలాంటి తంతు జరిపిస్తారట. ఇలా చేస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో వృద్ధిలో ఉంటుందనేది పెద్దల నమ్మకం. వాళ్ల దృష్టిలో పిల్లల తమను విడిచిపెట్టిపోలేదని ఆత్మల రూపంలో తమ వెంటే ఉన్నారని భావించి ఇలా చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ దీన్ని పాటించడం విశేషం.(చదవండి: రోల్స్ రాయిస్ కార్లతో వీధులు ఊడిపించిన భారతీయ రాజు! ఎందుకో తెలుసా) -
చిన్నవాళ్లైనా... తప్పులు మన్నించమని కాళ్లపై పడతారు!
భారతదేశంలో అనే వివాహ ఆచారాలు,సంప్రదాయాలు ఆచరణలో ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకునే రిజిస్టర్ పెళ్లిళ్లు, వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం అనేది ప్రధానంగా చూస్తాం. అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను అత్తారింటికి పంపించే సన్నివేశం ఆమె కుటుంబ సభ్యుల్ని మాత్రమే కాదు అక్కడనుంచి వారందరి చేత కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా గుజరాత్‌లోని ఒక వివాహ ఆచారం కూడా ఇదే కోవలో నిలిచింది. గుజరాత్‌లోని కచ్ పటేల్ కమ్యూనిటీ సంప్రదాయం ప్రకారం కుమార్తె వివాహ సమయంలో,కుటుంబ సభ్యులందరూ పెళ్లి కుమార్తె కాళ్లు మొక్కుతారట. ఆమె పట్ల ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమించమని అందరూ అడుగుతారట. అలా ఆమె పాదాలను తాకి మన్నించమని వేడుకొని ఆమె పట్ల సంస్కారాన్ని గౌరవాన్ని చాటుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్విటర్లో షేర్ అవుతోంది. రాము జీఎస్వీ ట్విటర్ హ్యాండిల్లో ఇది షేర్ అయింది. WILL BRING YOU TEARS: This is the custom of the Kutch Patel community of Gujarat. At the time of marriage, all the members of the family touch the feet of the DAUGHTER and ask for forgiveness if there was any mistake in behaving towards her. What a culture & respect to the Girl. pic.twitter.com/Klp4ocxgMr — Ramu GSV (Modi Family) (@gsv_ramu) March 12, 2024 -
మహాశివరాత్రి: ఈ ఆలయాన్ని సందర్శిస్తే.. ఏడాదిలో వివాహం!
భారతదేశంలో వివాహం అనేక ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి ఒక్కరికీ అదొక సామాజిక అవసరం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి పెళ్లి వయసు వచ్చిన వివాహం కావడం లేదని ఆందోళనకు గురవుతుంటారు. అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూ ఉంటాయి. వీటినుంచి విముక్తి కోసం రకరకాల పూజలు, శాంతులు చేస్తూ ఉంటారు. జాతకాలు, దోషాలు అంటూ నానా తంటాలు పడుతుంటారు. కానీ ఈ శివాలయానికి వెళితే సంవత్సరం తిరిగే లోపే వివాహం అవుతుందని భక్తులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒక దేవాలయం గురించి , దాన్ని ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. తంజావూరు జిల్లా కుట్టాలమ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయం కళ్యాణసుందర్ ఆలయం. కావేరీ నదీతీర ప్రాంతంలో నిర్మితమైన ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరులు పాణిగ్రహణ (చేతిలో చేయి వేసి పట్టుకున్న) స్థితిలో దర్శనమిస్తారట. ఆదిదంపతుల వివాహం జరిగిన పవిత్రమైన స్థలంగా భక్తులవిశ్వాసం. అందుకే పెళ్లికాని వారు ఒక్కసారి ఈ ఆలాయన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏడాది తిరిగే లోగా ఆమూడుముళ్ల వేడుక జరుగుతుందని భక్తులు నమ్ముతారు . తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని లాల్గుడి బ్లాక్‌లో ఉందీ దేవాలాయం. దీని పేరే మంగళాంబి సమేత మాంగళీశ్వర దేవాలయం. మాంగల్య మహర్షి ఇక్కడ విరివిగా వివాహాలను నిర్వహించారని ప్రతీతి. ఈ దేవుడి ఆశీస్సుల వల్లే బైరవ, వశిష్టర్, అగస్తియర్ల వివాహాలు జరిగాయట. ముఖ్యంగా ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు క్రమం తప్పకుండా సందర్శించే దేవాలయం. పురాణాల ప్రకారం, మాంగల్య మహర్షి స్వయంగా ఉత్తర నక్షత్రంలో జన్మించాడట. మాంగల్య మహర్షి తపస్సు చేసి సంపాదించిన అపారమైన శక్తి మహిమతో ఇది సాధ్యమవుతుందని చెబుతారు. ఆయన దేవదూతలకు గురువైనందున, ఆయన ఆశీర్వాదంతో శ్రీఘ్రమే వివాహాలు జరుగుతాయని, అమోఘమైన వరాలను అనుగ్రహిస్తారని నమ్ముతారు.వివాహానికి సంబంధించిన ప్రతీ ముహూర్తాన్ని దేవదూతలు పైనుండి ఆశీర్వది స్తారని కూడా నమ్ముతారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో చెంగల్పట్టు జిల్లా, చెన్నైలోని తిరువిందందై అనే గ్రామంలో ఉన్న నిత్యకల్యాణ పెరుమాళ్ ఆలయం సహా ఇలాంటి టెంపుల్స్ చాలా ఉండటం విశేషం. -
అక్కడ..అబ్బాయే అత్తారింటికి వస్తాడు..
ఇప్పటికీ చాలా కుటుంబాల్లో కొడుకు పుట్టగానే వారుసుడు పుట్టాడంటూ ఘనంగా వేడుకలు చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆడిపల్ల పుడితేనే సెలబ్రేషన్స్. ఆడిపిల్లలకే ఆస్తి ఇస్తారు. ఆఖరికి అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు. అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి విభిన్నంగా ఉంటారని చెప్పొచ్చు. ఆ వ్యవస్థ విదేశాల్లోనేమో! అనుకోకండి. మనదేశంలోనే ఈ వ్యవస్థ ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో మనదేశంలో ఉన్న ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? ఏంటా వింత ఆచారాలు తెలుసుకుందామా!. గిరిజనులు అనగానే బాగా వెనుకబడిన వాళ్లు, అమాయకులు అనుకుంటాం. మేఘాలయ రాష్ట్రంలోని గిరిజన తెగను చూస్తే మీ అభిప్రాయం మార్చుకుంటారు. ఆ తెగల ఆచారాలు సంప్రదాయలను చూసి సమాజానికి ఎంత స్ఫూర్తిగా ఉన్నాయా ? అని ఆశ్చర్యపోవడం ఖాయం. మనమే చాలా వెనకబడి ఉన్నామా? అన్నా సందేహం కూడా వస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే.. ఆడపిల్లకే పట్టం.. మేఘాలయలోని ఖాసీ, గరో అనే తెగలు మయాన్మార్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన తెగలు. ఈ తెగలు మేఘలయాలోని జైంటియా అనే పర్వత ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయితే ఈ తెగలు దశాబ్దాలకు పూర్వమే కొన్ని నియమాలు, పద్ధతులు పెట్టుకున్నారు. వాటినే ఇప్పటికీ ఆచరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడ ఆడపిల్ల పుడితేనే వేడుకగా సెలబ్రేషన్స్ చేస్తారు. ఆడపిల్లకే పట్టం కడతారు.పెత్తనం అంతా ఆడపిల్లదే. ఆడపిల్లకే ఆస్తి ముట్టజెప్పుతారు. ఆఖరికిగా ఆడపిల్ల అత్తారింటికి వెళ్లదు. వరుడే అత్తారింటికి ఇళ్లరికం అల్లుడుగా వస్తాడు. అయితే ఆ తెగలోని ఆడపిల్లలు తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో జాతి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ నియమాలు వర్తించవట. అలాగే అక్కడి కుటుంబాల్లో ఒకరికి మించి ఎక్కువమంది ఆడిపిల్లలు ఉంటే..చిన్న కూతురు తప్పించి మిగతా వాళ్లంతా తమ భర్తలతో అదే ఇంట్లో ఉండోచ్చు. అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆ అమ్మాయికి పెళ్లి తర్వాత ఇంటి భాద్యతలు, ఆస్తిపాస్తులన్నీ ఆమెకే ఇస్తారు. ఆఖరికీ తల్లి మరణం తర్వాత ఇంటి భాద్యతలన్నీ నిర్వర్తించాల్సి కూడా ఆమెనే. అంతేగాదు పుట్టబోయే పిల్లలకు ఇంటిపేరు కూడా తల్లి ఇంటి పేరే పెడతారు. అలాగే పిల్లల పోషణ, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో కూడా ఆడవాళ్లకే ఎక్కువ హక్కులు ఉంటాయట. అందువల్లే ఇక్కడ మహిళలు వ్యవసాయం, ఇతర ఉద్యోగాల్లో వాళ్లే బాగా రాణిస్తారట. ఇలా ప్రతి విషయంలో పురుషుల కంటే మహిళలదే పైచేయి కావడంతో అక్కడ గృహహింస,అత్యాచారాలు, వేధింపులు ఉండవని అక్కడ స్థానికులు చెబుతున్నారు. సమానత్వం కోసం పురుషుల పోరాటం.. ఇలా ఇక్కడ దశాబ్దాలుగా మాతృస్వామ్య వ్యవస్థే రాజ్యమేలుతోంది. అయితే ప్రపంచంలో చాలా చోట్ల స్త్రీలకు సమాన హక్కుల ఉండాలని, లింగ సమానత్వం కోసం తెగ పోరాటాలు చేస్తుంటే ఆ ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు మాత్రం తమ సమానత్వం కోసం ఏళ్లుగా పోరాడుతుండటం విశేషం. ఇందుకోసం 1990 నుంచి ఓ స్వచ్ఛంద సంస్థ నిరంతరం కృషి చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ రెండు తెగలు సమాజానికి స్ఫూర్తిగా మంచి నియమాలు పెట్టుకున్నాయి కదూ!. అయితే ఇలాంటి ఆచారమే 20వ శతాబ్దానికి పూర్వమే కేరళలోని నాయర్ తెగలో కూడా ఉండేదట. (చదవండి: వజ్రాలు, వైఢ్యూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..ధర ఏకంగా..!) -
రష్యా డాన్స్ ఇంత అందంగా ఉంటుందా?
ఇంతవరకు ఎన్నో రకాల డ్యాన్స్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి అద్భుతమై డ్యాన్స్ మాత్రం చూసి ఉండే అవకాశమే లేదు. కళ్లు ఆర్పడమే మర్చిపోయాలా చేస్తేంది ఆ నృత్యం. వావ్! ఎంత అద్భుతమైన డ్యాన్స్ అని అనుకుండా ఉండలేరు. ఎవరు చేశారు? ఎక్కడ అంటే.. డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహిళలు, పురుషుల సముహంతో కూడిన ఓ గ్రూప్ ఈ నృత్యాన్ని చేసింది. ఎంత అద్భుతంగా చేశారంటే..అలా చూస్తుండిపోతారు. అయ్యిపోయందా అని కూడా తెలియదు. ఏదో ఓ ట్రాన్స్‌లో తీసుకెళ్లిపోతుంది ఆ డ్యాన్స్. ఎవరు చేశారంటే..రష్యన్ వాసులు తమ సంప్రదాయం నృత్యంతో అలరించారు. చూసినవాళ్లు..రష్యా డ్యాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందా! అని ఆశ్చపోవడం మాత్రం ఖాయం. ఎంత బ్యాలెన్స్డ్గా అంతమంది జనం ఒకేసారి ఎంత బాగా చేశారబ్బా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్ అంటే ఇది కదా!. ఎంతలా ప్రాక్టీస చేశారో గానీ చాలా అద్భుతంగా చేశారంతా. వారి డ్యాన్స్‌కి ఆ వేదికే అదిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆ కూడా ఓ లుక్కేసేయండి. Another amazing skills from traditional Russian dance 😮 pic.twitter.com/0uebaS5LWS — Family Moments (@Family_viralvid) February 19, 2024 (చదవండి: అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!) -
పురాతన క్రిస్మస్ సంత! ఎక్కడ జరుగుతుందంటే..?
దక్షిణ అమెరికా దేశమైన పెరులో పురాతనమైన క్రిస్మస్ సంత ఏటా డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. ఈ సంత దాదాపు ఐదువందల ఏళ్లకు పైగా కొనసాగుతోంది. పెరులోని కుస్కో నగరంలో ఏర్పాటు చేసే ఈ సంతకు దేశం నలుమూలలకు చెందిన హస్తకళా నిపుణులు తాము తయారు చేసిన బొమ్మలు, చిత్రపటాలు, ఇతర కళాఖండాలతో చేరుకుంటారు. క్రిస్మస్ రోజు అర్ధరాత్రి వరకు ఈ సంత కొనసాగుతుంది. ‘శాంచురాంటికై’ పేరుతో ఈ సంతను ఏర్పాటు చేయడాన్ని పెరు ప్రజలు పండుగలాగా జరుపుకొంటారు. వీథుల్లో నృత్యగానాలతో ఊరేగింపులు జరుపుతూ సందడి చేస్తారు. ఈ సంతలో రకరకాల పరిమాణాల్లో తయారు చేసిన బాల ఏసు బొమ్మలు, ఏసుక్రీస్తు జన్మించిన పశువులపాక నమూనా బొమ్మలు, ఉయ్యాలలోని ఏసు బొమ్మలు, బాల ఏసును తిలకించడానికి వచ్చిన దేవదూతల బొమ్మలు వంటివి అమ్ముతారు. వెదురు, కలప, పింగాణి, వెండి వస్తువులను, సంప్రదాయకరమైన ఆభరణాలను, క్రిస్మస్ అలంకరణల కోసం ఉపయోగించే ఆలివ్ కొమ్మలు, అడవి మొక్కలు వంటివి కూడా అమ్ముతారు. పెరులో జరిగే ఈ సంతను యూనిసెఫ్ ప్రపంచ వారసత్వ వేడుకగా గుర్తించింది. (చదవండి: మగువ కన్నీళ్ల వాసన పురుషుడులోని దూకుడుతనాన్ని తగ్గిస్తుందా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
350 ఏళ్లుగా ఈ ఆలయంలో ప్రసాదం దోపిడీ.. కారణమిదే!
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు వింతగా ఉంటాయి. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శించినప్పుడు అక్కడ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందిస్తుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం దేవుడి ప్రసాదాన్ని అక్కడి భక్తులు దొంగతనం చేయడం ఆనవాయితీగా వస్తుందట. ఆలయల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు,పూజలు అయ్యాక దేవుడికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. కానీ రాజస్థాన్‌లోని రాజసమంద్ని శ్రీనాథ్జీ ఆలయంలో మాత్రం దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయడం ఆచారంగా వస్తోంది. దాదాపు 350 ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుంది. ప్రసాదాన్ని దొంగిలించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చేసి తింటే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి వద్ద నుంచి దొంగిలించే బియ్యాన్ని భక్తులు తమతమ ఇళ్లలో భద్రంగా దాచుకుంటారు. దీనివల్ల తమ కష్టాలు, దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. అందుకే ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి పోతుంటారు. ఈ లూటీని ఎవరూ అడ్డుకోరు. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటమే శ్రీనాథ్జీ స్వామివారికి ఇష్టమట. ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇటీవలె మమోత్సవం జరగగ్గా అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. -
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సాంప్రదాయాన్ని బ్రేక్ చేసిన ఖర్గే..
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకాని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తన సొంత నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. పార్టీ అధ్యక్షునిగా మొదటిసారి కాంగ్రెస్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అయితే.. ఏ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయని విధంగా, పార్టీ సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు ఖర్గే. సోనియా గాంధీ హయాంలో ఇలా జరగలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంతకూ ఎం చేశారు..? గౌర్హాజరుకు కారణం..: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవలేదు. తనకు కంటి సమస్య కారణంగా రావడం కుదరదని చెప్పారు. సెక్యూరిటీ సమస్యల వల్ల ఒక్కసారి ఎంట్రీ ఇస్తే.. ప్రధాని, రక్షణ మంత్రి, స్పీకర్లు వెళ్లేవరకు ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు.. తాను ఇంటివద్ద, కాంగ్రెస్ అధికారిక భవనంలో జెండా ఎగురవేయాల్సిన ఉన్నందున రాలేకపోతున్నానని చెప్పారు. సాంప్రదాయానికి విరుద్ధంగా..: స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునే క్షణాన రాజకీయాలకు వెళ్లకూడదనే నియమం పార్టీలో ఉండేది. అందుకు అనుగుణంగానే ఇప్పటివరకు ఉన్న అధ్యక్షులు పాటించారు. కానీ నేడు మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం తన హయాంలోనే భారత్ అభివృద్ధి చెందినట్లు చెప్పడంపై విమర్శలు కురిపించారు. కేవలం గతంలో ఏర్పాటు చేసిన పథకాలనే రూపుమార్చి కొత్త పేరుతో ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. చివరికి ప్రధాని వాజ్‌పేయి సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులు లేవని ఖర్గే అన్నారు. అలాగే.. స్వాతంత్య్ర పోరాటంలో అసువులు బాసిన త్యాగమూర్తులను ఖర్గే కొనియాడారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, అంబేద్కర్లను తలుచుకున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్మించడంలో గత ప్రధానులు చేసిన పనిని గుర్తు చేశారు. आप सभी को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएँ व बधाई। लोकतंत्र और संविधान हमारी देश की आत्मा है। हम यह प्रण लेते हैं कि हम देश की एकता और अखंडता के लिये, प्रेम और भाईचारे के लिए, सौहार्द और सद्भाव के लिए लोकतंत्र और संविधान की स्वतंत्रता क़ायम रखेंगे। जय हिन्द 🇮🇳 pic.twitter.com/d5EurpcRNM — Mallikarjun Kharge (@kharge) August 15, 2023 అటు.. స్వాతంత్య్ర ఉపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు భూతాలను దేశం నుంచి పారదోలాలని అన్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశంలో కొన్ని సమస్యలు వెంటాడాయని చెప్పారు. రాజరిక పాలన, ఇంకా ఓ పార్టీ కుటుంబానికి, కుటుంబం చేత, కుటుంబం కోసం అనే మూలసూత్రాల మీద పనిచేసిందని కాంగ్రెస్ పేరు ఎత్తకుండానే నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: వీడియో: జెండా ఎగరేసి సొమ్మసిల్లిపడిపోయిన ఆరోగ్యశాఖ మంత్రి -
విశాఖలో శారీ వాక్‌థాన్
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో అతి ముఖ్యమైన వస్త్రధారణపై నేటి యువతకు అవగాహన కల్పించేందుకు ఆదివారం విశాఖ ఆర్కేబీచ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్‌థాన్ (చేనేత చీర నడక) నిర్వహించారు. భారీగా హాజరైన మహిళలతో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన వాక్‌థాన్‌ను ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ట్రేడిషనల్ వాక్, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
బార్బీ కాస్త హిజార్బీ! నాలా లేదన్న ఆలోచనే.. ఈ సరికొత్త బార్బీ!
బార్బీ బొమ్మలను ఇష్టపడని వారు ఉండరేమో. బార్బీ అంత అందంగా ఉండాలని అమ్మాయిలంతా అనుకుంటారు. కానీ నాలాగా బార్బీలేదే? నాలాంటి డ్రెస్ వేసుకోలేదే అని అనుకున్న ఓ ఆర్టిస్ట్ ఏకంగా సరికొత్త బార్బీని రూపొందించింది. సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన ఈ సరికొత్త బార్బీ అందర్నీ తెగ ఆకర్షిచేస్తోంది. రంగు రంగుల డ్రెస్‌లు, ప్రముఖుల రూపాలతో అందర్నీ ఆకర్షించే బార్బీ హిజాబ్ వేస్తే ఎలా ఉంటుంది అనుకుంది నైజీరియాకు చెందిన 32 ఏళ్ల హనీఫా ఆడమ్. మార్కెట్లో హిజాబ్ ధరించిన బొమ్మల కోసం వెతికింది. ఎంత గాలించినా హిజాబ్ ధరించిన ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. తనలా హిజాబ్ ధరించిన బార్బీ కనిపించలేదని బాధపడింది. దీంతో తనే... హిజాబ్ ధరించిన బార్బీని తయారు చేయాలని నిర్ణయించుకుంది. 2015 డిసెంబర్లో ..నేవీ మ్యాక్సి స్కర్ట్ కుట్టి, నీలం రంగు జాకెట్, నలుపు రంగు హిజాబ్‌ను బార్బీకి తొడిగి ఫోటో తీసింది. ‘హిజార్బీ’ పేరుతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి...చక్కగా చూడముచ్చటగా ఉన్న తొలి హిజార్బీ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటో చూసిన వారంతా..‘‘ చాలా బావుంది. మా పిల్లలకు కూడా ఇటువంటి డ్రెస్సే కావాలని’’ అడిగారు. దీంతో హనీఫా మరింత ఉత్సాహంతో వివిధ రకాల హిజార్బీలను రూపొందించింది. డ్రస్లన్నింటిలోకి లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ హబీబీ డిసిల్వా ధరించిన బ్రిటిష్ స్టైల్ డ్రెస్ బాగా పాపులర్ అయ్యింది. మీడియా భారీ కవరేజ్‌తోపాటు, టీన్వోగ్ కూడా గుర్తించడంతో హిజార్బీకి మంచి ఆదరణ లభించింది. ఇప్పటిదాక హిజార్బీ అకౌంట్లో రెండు వందలకు పైగా ఫోటోలు పోస్టు చేసింది. ముస్లిం సాంప్రదాయం, ఫ్యాషన్‌ను ప్రతిబింబించేలా హనీఫా హిజార్బీలు తయారు చేయడం విశేషం. ఇటీవల విడుదలైన బార్బీ సినిమాతో బార్బీ మేనియా చూసి హనీఫా మరోసారి హిజార్బీని యాక్టివ్ చేసింది. ఈ క్రమంలోనే ..ఆరేళ్ల తరువాత పింక్ రంగు వేసిన గోడ ముందు పింక్ కలర్ డ్రెస్ వేసుకుని, హిజాబ్ ధరించి నిలుచున్న హిజార్బీ పోటోను ఇన్‌స్టా అకౌంట్లో ‘‘హిజార్బీ ఈజ్ బ్యాక్’’ అంటూ పోస్టు చేసింది. ఈ పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ లైక్‌లు కొడుతున్నారు. మ్యాటెల్ హిజార్బీ.. హనీఫా తయారు చేసిన హిజార్బీ పాపులర్ కావడంతో 2017లో బార్బీ తయారీ సంస్థ కూడా హిజాబ్ దరించిన బార్బీని విడుదల చేసింది. అమెరికా ఒలింపిక్ ఫెన్సర్ ఇతిహాజ్ మహమ్మద్ రూపంతో హిజార్బీని విడుదల చేసింది. వ్యాపారిని కాదు.. ఆర్టిస్ట్ అవాలనుకోలేదు ‘‘ఫైన్ ఆర్ట్స్‌ను చదివాను. కానీ ఆర్టిస్ట్ అవ్వాలనుకోలేదు. డాక్టర్ అవాలనుకున్నాను. అదీ కుదరక ఫిజియాలజీ చదివాను. ఫార్మకాలజీలో మాస్టర్స్ చేసాను. చదువు పూర్తిచేసి యూకే నుంచి నైజీరియా వచ్చాక... నాకు తెలిసిన ఫ్యాషన్ ఐడియాలను ఆన్లైన్లో పోస్టు చేసేదాన్ని. వాటిని చూసిన వారంతా అభినందించేవారు. 2016లో ఫుడ్ ఆర్ట్ కాంపిటీషన్లో పాల్గొని విజేతగా నిలిచాను. అప్పుడు ఆర్టిస్ట్‌గా మారాలనుకున్నాను. అప్పటినుంచి నేను రూపొందించిన కళారూపాలను నైజీరియా, న్యూయార్క్ ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం మొదలు పెట్టాను. ఇలా చేస్తూ హిజార్బీని మీ ముందుకు తీసుకొచ్చాను. నేను వ్యాపారిని కాదు. నా స్నేహితురాళ్లు ప్రోత్సహించడంతో వివిధరకాల హిజార్బీని రూపొందించాను. ఈ నెలలో హిజార్బీ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించబోతున్నాను. బట్టల తయారీతోపాటు, నైజీరియా డిష్‌లకు ఫుడ్ ఆర్ట్‌ను జోడిస్తూ మా సంప్రదాయాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. నేను రూపొందించే హిజార్బీల్లో.. ఏసియన్, తెలుపు, నలుపు బొమ్మలు ఉన్నాయి. సెలబ్రెటీలను రోల్ మోడల్స్‌గా తీసుకునేందుకు వివిధ రంగుల్లో రూపొందిస్తున్నాను’’ అని చెబుతోంది హనీఫా. (చదవండి: కరోనాలో దొరికిన ఆ సమయమే..ఆ యువకుడుని కోటీశ్వరుడిగా చేసింది!) -
ఆషాడంలో నేరేడు పండ్లను తినాలని ఎందుకంటారో తెలుసా..!
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ శాస్త్ర ప్రమాణం. వెంటనే మనకు మరీ శాకాహారులు అని సందేహం వచ్చేస్తుంది కదా! అక్కడకే వస్తున్న ముందుగా దీనిలో ఉండే అంతరార్థాన్ని నిశితంగా పరిశీలిస్తే.. మొక్కలకు ప్రాణముందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. అలాగే సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని అర్థం. వరిధాన్యాన్నివ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే మొక్క మనకి ఆహారమిచ్చి, అది ప్రాణాన్ని కోల్పోతుంది. కాబట్టి అది మాంసాహారమే. ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! అలాగే మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి. ప్రకృతిలో జరిగే మార్పు కోసం దేహానికి సహజ చికిత్సగా ఈ నేరేడు పళ్లను ఈ మాసంలోనే తీసుకోమని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కూడా. మొన్నటి వరకు వేసవి తీవ్రతకు దేహం నుంచి శ్వేద(చెమట) రూపంలో బయటకు వెళ్లిన నీరు కాస్త ఆషాఢంలో ఎండతగ్గి, మూత్రం రూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ ఆయుర్వేదం చెబుతోంది. ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయాలు 1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడం, 2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. అంటే శూన్యమాసమైన ఈ ఆషాడ మాసం మానవుడిని ఆరోగ్యాన్ని కాపాడుకోమని సూచించడమే గాక మన జీవనం కోసం చేసే పాపాలకు ప్రాయచిత్తం చేస్తుకునేలా వేదాధ్యయనం చేసి ప్రకృతికి కృతజ్క్షత చూపమని చెబుతోంది. మన ఆచారాల్లో దాగి ఉన్న గొప్ప శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే గాక తరువాత తరాలకి చెబుదాం. (చదవండి: ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..) -
ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..
గోరింటాకు ఇష్టపడని అతివలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో!. పెళ్లిళ్లు, పండుగలు, ఫంక్షన్లు సమయంలలో మహిళల చేతులు రకరకాల గోరింటాకు డిజైన్లతో ఎర్రగా మెరిసిసోవాల్సిందే. అలాంటి గోరింటాకు ప్రత్యేకించి ఆషాడంలోనే కంప్లసరీగా ఎందుకు పెట్టుకుంటారు? అస్సలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? గోరింటాకు ప్రాముఖ్యత ఏమిటి? తదితరాల గురించి చూద్దామా!. పార్వతి దేవి రుధిరాంశతో జన్మించిందే గోరింటా గౌరిదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలను తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింత గూర్చి చెలులు పర్వతరాజు(హిమవంతుడు)కు చెప్పడంతో ఆయన సతీసమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు. నా వలన లోకానికి ఏవిధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరిదేవిని ప్రశ్నిస్తుంది. ఇంతలో పార్వతి దేవి చిన్నతనపు చలపతతో ఆ చెట్టు ఆకుని కోస్తుంది. వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి. దీంతో పార్వతి తల్లిదండ్రులు అయ్యో బిడ్డా చేతుల కందిపోయాయి అని భాదపడుతుండగా..వెంటనే పార్వతి దేవి నాకు ఏవిధమైన భాద కలగలేదు. పైగా నాకు ఇది చేతులకు అలంకారంగా కనిపిస్తోంది అంటుంది. దీంతో పర్వతరాజు హిమవంతుడు స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధ చెందుతుందని అని ఆ వృక్షాన్ని ఆశ్వీరదిస్తాడు. అదీగాక గౌరిదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు. అది కాస్త కాలక్రమేణ అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది. అంతేగాదు గౌరిదేవి నీ వర్ణం కాళ్లు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగపడుతుంది గనుక అదే నీ జస్మకు సార్థకత అని ఆ వృక్షానికి వరం కూడా ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు, కాళ్లు అందంగా తీర్చిదిద్దుకునే అలంకార వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే సమయంలో కుంకుమకు ఓ సందేహం కలుగుతుంది. నదుటన కూడా ఈ ఆకు పసరునే బొట్టుగా దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది. ఈ విషయమే గౌరిదేవికి చెప్పగా గోరింటాకు నుదుటన పెడితే పండదని చెబుతుంది. కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు. స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా.. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరేవేసే ప్రధాన నాడులు ఉంటాయి. అంతేగాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం ఏమిటంటే.. స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోనుల పని తీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. ఆ అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకుని పెంటుకుంటే..బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లిచేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బావుంటుంది. దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు. ఈ దూరదృష్టితోనే బాగా పండితే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెప్పారు. ఈ చెట్టు సంత్సరానికికోమారు పుట్టింటకి పోతుందంట అంటే పార్వతి దేవి దగ్గరికి. అంతేగాదు అషాడమాసంలో అక్కడున్నప్పడూ కూడా తనని మరిచిపోకుండా పెట్టుకోవాలని పార్వతి దేవిని కోరిందట. అందుకనే అందరూ ఆషాడం రాగానే గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు మనకు చెబుతుంటారు. (చదవండి: తొలి ఏకాదశి..శయన ఏకాదశి..విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా..!) -
ప్రపంచంలోని టాప్ 10 నృత్యాలు
-
ఆ శుభదినాన తల్లితో కలిసి.. ఐశ్వర్యరాయ్ ఫోటో వైరల్.. గంటల వ్యవధిలోనే
అందమంటే ఏంటీ? అని హఠాత్తుగా పది మందిని అడిగితే.. కనీసం ఐదుగురు ఐశ్వర్య రాయ్ పేరు చెబుతారట. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ఓ విషయం ఇది. నిజమే.. భువి నుంచి దిగి వచ్చినట్టుండే ఐశ్వర్య రాయ్ అత్యంత ప్రసిద్ధ మోడల్స్ లో ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్.. అటుపై బాలీవుడ్, హాలీవుడ్.. ఎన్నో సినిమాలు.. మరెన్నో పాత్రలు. ఇదీ ఐశ్వర్య కెరియర్. ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫోటో ఇది. 21 years ago aishwarya rai gave one of her best performances ever. pic.twitter.com/HLDx9KKzyV — ً (@SheethalS5) July 13, 2023 ఈ ఫొటోను చూస్తూ ‘ఇది అంతర్జాల విందు’ అన్నారు ఒక యూజర్. 21 సంవత్సరాల వయసులో ‘మిస్ వరల్డ్’ అందాల కిరీటాన్ని గెలుచుకుంది ఐశ్వర్యరాయ్. ఆ శుభదినాన తల్లితో కలిసి ఫ్లోర్ మ్యాట్‌పై కూర్చొని భోజనం చేస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. how can someone who has seen this, not be an aishwarya rai stan ?#aishwaryarai • #devdas pic.twitter.com/MmvHSIzGZT — 𝒂𝒚𝒖𝒔𝒉𝒊. (@_ayushi_saran) July 13, 2023 భారతీయతకు, భారతీయ భోజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఫొటో ఇది. పాపులర్ పేజ్ ‘హిస్టారిక్ విడ్స్’లో షేర్ చేసిన ఈ ఫొటో గంటల వ్యవధిలోనే 2.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘సో...ప్యూర్ అండ్ జెన్యూన్’‘మన విలువలు, సంప్రదాయాలు భూమాతను, భోజన సంప్రదాయాలను గౌరవిస్తాయి’... ఇలా నెటిజనులు రకరకాలుగా స్పందించారు. Gorgeous Aishwarya Rai in Her Early Age. pic.twitter.com/qTUK8Jr58R — 🫶𝙌𝙃𝘿❤️🔥 (@QHDposts) July 10, 2023 ఐశ్వర్యారాయ్ నవంబర్ 1 న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. 1994లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. అప్పటినుంచి ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2007లో అభిషేక్ బచ్చన్ ను వివాహామాడి అమితాబ్ ఇంట కోడలిగా అడుగుపెట్టారు. 21 Years of Aishwarya Rai as Iconic Paro. ❤#AishwaryaRaiBachchan #21YearsOfDevdas https://t.co/CvKCHCMztn pic.twitter.com/2pwbHEIGVM — Name! why? (@Whatever820082) July 12, 2023 -
పిల్లనిచ్చి వరకట్నంగా కుక్కలు..
సిరిసిల్ల: శునకాలను కొందరు అభిరుచికొద్దీ, ఇంకొందరు ఇంటికి రక్షణ కోసం పెంచుకుంటారన్న విషయం తెలిసిందే. కానీ.. శునకరాజాలను ఆస్తిగా భావిస్తూ.. ఆడపిల్లలకు కట్నంగా కూడా ఇచ్చే కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్లెవరూ, వారి జీవనశైలి ఏమిటి? తెలుసుకోవాలనుకుంటున్నారా..! రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. కోనరావుపేట మండలం కొండాపూర్, బావుసాయిపేట, చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాల్లో దాదాపు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ మూడు పల్లెలకు చెందిన గంగిరెద్దుల కుటుంబాల వారు జిల్లావ్యాప్తంగా భిక్షాటన చేస్తారు. ఆహారాన్ని సేకరించి కుక్కలను పోషిస్తారు. ఈ కుక్కలను వేటకు, వారు నివాసం ఉండే గుడారాల రక్షణకు ఉపయోగిస్తారు. ఒక్కో కుటుంబంలో ఐదు నుంచి పది, పదిహేను, ఇరవై.. శునకాలను పెంచుతుంటారు. అయితే శునకాలనే ఆస్తిలా భావించే ఈ ఆచారం గంగిరెద్దుల కుటుంబాల్లో తరతరాలుగా కొనసాగుతోంది. ఎన్ని ఎక్కువ శునకాలను పెంచితే అంత ఆస్తిపరులన్న మాట. వారు పోషిస్తున్న శునకాల సంఖ్యను బట్టే ఆ కుటుంబపెద్దకు వారి కులంలో గౌరవం లభిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఆడ పిల్లలకు పెళ్లిలో కట్నంగా శునకాలను ఇచ్చే సంప్రదాయం ఈ కుటుంబాల్లో ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఆ కుటుంబాల్లో మార్పు వస్తోంది. వ్యవసాయం చేస్తూ కొందరు.. చిన్న చిన్న బుట్టల్లో ప్లాస్టిక్ సామగ్రి అమ్ముతూ, కొబ్బరి కుడుకలకు బదులు చక్కెర ఇçస్తూ కొందరు జీవనం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి.. మాకు కుక్కలను పెంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటి ముందు ఎన్ని ఎక్కువ కుక్కలుంటే అంత విలువ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ తక్కువ. కాలం మారినా.. మాకు కుక్కలు ఉండాల్సిందే. మేం ఏం తింటే అదే వాటికి పెడతాం. మాతోనే ఉంటాయి. మేం ఏ ఊరికి వెళ్తే.. ఆ ఊరికి మా వెంట వస్తాయి. – టేకుమల్ల రాజయ్య, సంచార జీవి. శునకాలే మా ఆస్తి.. మునుపు ఎక్కువ కుక్కలను పెంచేటోళ్లం. షికారీ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మావోళ్లు సోకులకు వచ్చిండ్రు. కుక్కలను ఎక్కువ సాదుత లేరు. వ్యవసాయం చేస్తుండ్రు. కుడుకలకు చక్కరి అమ్ముతూ.. బతుకుతుండ్రు. బిచ్చం ఎత్తడం లేదు. అయినా మాకు కుక్కలతోనే ధనం. – గంట లచ్చయ్య, బావుసాయిపేట. -
శాస్త్రీయమైతే సంప్రదాయానికి విలువ
సంప్రదాయ విజ్ఞానం ముఖ్యమైనది. కానీ దానిలోని దురవగాహనలకు తప్పక అడ్డుకట్ట వేయాలి. విమర్శ స్ఫూర్తిని అభివృద్ధి చేయడాన్ని రాజ్యాంగం ఒక విధిగా నిర్దేశించిన భారత్ వంటి దేశంలో నిపుణులు తప్పుడు సమాచారంపై కూడా యుద్ధం చేయాలి. ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయడానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన తప్పు. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్రదాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి. భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. అది అభివృద్ధికి పరాకాష్టగా ఉండి పతనమైంది, మళ్లీ వృద్ధి చెందుతోంది. ఒకప్పుడు మనకు విలువైన సంప్ర దాయ విజ్ఞానం ఉండేది. అయితే ఇప్పుడది ఆధునిక శాస్త్రీయ మదింపునకు గురికావలసి ఉంది. పైగా సంప్రదాయ విజ్ఞానానికి తగిన సాక్ష్యాధారం లేదని భావిస్తున్నారు. కానీ ఆరోగ్య రంగంలో, స్వావలంబనతో కూడిన జీవన ఆచరణలు ఆయుర్వేదంలో సమృద్ధిగా ఉన్నాయి. ఆధునిక వైద్యం ఇప్పుడు వాటినే ప్రతిధ్వనిస్తోంది. ఉదా హరణకు, ప్రేవుల ఆరోగ్యం(గట్ హెల్త్), పలురకాల ఆరోగ్యకరమైన ఆహార రకాల లక్షణాలను, వంటల పద్ధతులను ఆయుర్వేదం చాలా కాలంగా నొక్కి చెబుతోంది. ఆహారం, ప్రేవుల్లోని సూక్ష్మజీవులు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని ఆధునిక సైన్స్ ఇటీవల మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. అయితే సంప్రదాయ విజ్ఞానం మూఢనమ్మకాలతో, దురభిప్రా యాలతో కూడి ఉంటోంది. వ్యక్తికీ, సమాజానికీ హాని కలిగించకుండా వీటిని తప్పక వడపోత పోయాలి. వైద్యంలో నిరూపించాల్సిన బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తప్పు సూచన ఇస్తే అది మానవ ప్రాణాలకే ప్రమాదకరం. సందేహాస్పదమైన మూలికా సప్లిమెంట్ల కారణంగా ఆరోగ్యవంతమైన ప్రజల్లో కూడా కాలేయం దెబ్బతింటున్న కేసులు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ ఉత్తమమైన వైఖరి ఆరోగ్యపరమైన సంశయవాదమే. అప్పుడు మాత్రమే మూలంతో పనిలేకుండా కొత్త ఆలోచనలు మనలో తెరుచుకుంటాయి. ఏదైనా నిరూపితం కాని కొత్త ఆలోచన కనిపించినప్పుడు, మూడు కోణాల్లోని కచ్చితమైన ప్రమాణాలతో దాని లబ్ధిని పరీక్షించాల్సి ఉంటుంది. మొదటిది, శాస్త్రీయ ఆమోదయోగ్యత. రెండు, జరిగే హానిని పరిశీలించడం. మూడు, నిర్దిష్ట శాస్త్రీయ సంభావ్యత. శాస్త్రీయ వైద్య ఆచరణలో మేళనం వైపుగా సాక్ష్యాన్ని తీసుకురాదగిన సంభావ్యత ఇది. సైన్స్, సైంటిఫిక్ మెథడ్ ద్వారా సత్యాన్ని వెంటా డటం భవిష్యత్ సమగ్ర వైద్యశాస్త్రపు సారాంశం. అలాంటి మార్గాన్ని చాలా సంస్థలు సిఫార్సు చేశాయి. వీటిలో మూఢ నమ్మకాలను పాతిపెట్టిన వారి నుంచి, నీతి ఆయోగ్ వంటి భారతదేశ పరివర్తనకు మార్గదర్శకత్వం వహిస్తున్న సంస్థల వరకు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఇది సవాలుతో కూడుకున్నది. ఇటీవలే, ఏకీకరణ వైద్యానికి సంబంధించి మాతృ, శిశు వైద్యుల సమావేశం ఒకటి జరిగిందని మీడియా కథనాలు వెలువరించాయి. ఇందులో నా పూర్వసంస్థ అయిన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ ఫ్యాకల్టీ కూడా పాల్గొ న్నారు. అయితే ఆ కథనంలో కొన్ని భాగాలు అశాస్త్రీ యంగా ఉండటం ఇబ్బంది కలిగించింది. పుట్టబోయేవారికి సంబంధించిన తల్లుల లింగపరమైన అంచనాలు పిల్లల్లో స్వలింగ సంప ర్కానికి దారితీయవచ్చనేది అందులో ఒకటి. ఉదాహరణకు ఆడ పిల్లను కోరుకుంటున్న గర్భిణి మగపిల్లాడిని హోమోసెక్సువల్ (స్వలింగ సంపర్కి)గా పెరిగేట్టు చేస్తుందనే ఆలోచన హాస్యాస్పదం. జీజాబాయి(శివాజీ తల్లి) ప్రార్థనలను గర్భవతిగా ఉన్నప్పుడు అను సరిస్తే ‘హిందూ నాయకుల’ లక్షణాలతో పిల్లలు పుడతారన్న సూచ నలు ఆందోళనకరం. ప్రసవ సమయంలో ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేయ డానికి ఉన్న ప్రాధాన్యతపై, ఆధునిక తల్లితండ్రులకు అపసవ్యతలు, మానసిక వ్యాధులతో పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనే అంశంపై చర్చ నడుస్తోంది. దీనికి సంస్కార లేమిని కారణంగా చూపుతున్నారు. శాస్త్రీయ, సామాజిక, నైతిక స్థాయిల్లో ఇలాంటి ఆలోచన చాలా తప్పు. అంతిమ సమగ్ర మొత్తం దాని విడిభాగాల మొత్తం కంటే తక్కువగా ఉండదని మనం ఎలా నిర్ధారించాలి? పలువురు ఆయుర్వేద సహచరులు ఈ చర్చను ‘గర్భసంస్కార్’పై వక్రీకరించిన వైఖరి అని తోసిపుచ్చారు. ప్రసవ సమయంలో ఆరోగ్యకరమైన ఆచరణల ప్రాధాన్యత గురించే గర్భసంస్కార్ మాట్లాడుతుంది. భవిష్యత్తు పిల్లల ఆరోగ్యాన్ని బాహ్య జన్యు ప్రభావాల ద్వారా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ మీడియా నివేదికల గురించి ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన డాక్టర్ల బృందంలో చాలామంది జాగ్రత్తగా ఉండాలన్నారు. అయితే ఇలాంటి ఆలోచనలు, ఆచరణలు అంత హానికరం కాదని మరి కొంతమంది భావించారు. అలాంటి నివేదికల్లో మంచి భాగాన్ని ప్రజలు తీసుకోవచ్చనీ, మిగతా వాటిని వదిలేయాలనీ వీరు సూచించారు. వీరి దృష్టిలో, సాక్ష్యాధారం లేక పోవడం అంటే సాక్ష్యం లేదని అర్థం కాదు. పైగా మనం సంప్ర దాయాల గురించి మరీ విమర్శనాత్మకంగా ఉండకూడదన్నది వీరి ఆలోచన. భారత్‌లో సమగ్ర పరిశోధనల నిర్వహణకు ఈ రెండో వైఖరి ఎంతమాత్రమూ ఉపకరించదు. ఆయుర్జీనోమిక్స్ అనేది ఆయుర్వేద భావనలు, జీనోమిక్ పరిశోధనల సంగమం. దీనికి నా పూర్వ సంస్థ సీఎస్ఐఆర్–ఐజీఐబీ విజయవంతంగా నేతృత్వం వహించింది. ఎందుకంటే మేము నిజా యితీతో కూడిన శాస్త్రీయ చర్చలు జరిపేవాళ్లం. ఆ చర్చల్లో మేము ఆయుర్వేద టీమ్‌కు సాక్ష్యాధారాల గురించి సవాల్ విసిరేవాళ్లం. ఒక పక్షం నిపుణులు మరొక పక్షంలోని వాళ్లను ప్రశ్నించకూడదని భావిస్తుంటారు. ఇలాంటి వైఖరి తెలివితక్కువతనంతో కూడింది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతుంది. సహకారం అందించు కునే సమయాల్లో శాస్త్రీయ సంభావ్యతల సరిహద్దులను మేం పాటించేవాళ్లం. వాటిని తరచుగా తిరిగి సందర్శించేవాళ్లం. నూతన జ్ఞానాన్ని గుర్తించేవాళ్లం. ఇది అర్థవంతమైన సహకారాన్ని వేగవంతం చేసేది. మరోవైపున అర్థరహితమైన వాటిని తొలగించేవాళ్లం. పైగా, మహి ళలు తప్పుడు సమాచారపు పర్యవసానాలను ఎదుర్కొంటున్న భారత్ వంటి భిన్నమైన సమాజంలో వాస్తవికతల నేపథ్యంలో మాత్రమే మనం ఫలితాన్ని వీక్షించవలసిన అవసరం ఉంది. సీనియర్ నిపుణుల ద్వారా ప్రచారమయ్యే తప్పుడు విశ్వాసాలకు పర్యవసానాలు ఉంటాయి. పైన పేర్కొన్న ఉదాహరణలో, ఇలాంటి చర్చలు పిల్లల్లోని వివిధ సామర్థ్యాలు లేక లైంగిక ధోరణుల కారణంగా తల్లిని నిందించడానికి దారితీస్తాయి. లేదా గర్భిణిపై సామాజిక ఒత్తిడిని కలిగిస్తాయి. పిల్లల జెండర్ కారణంగా మహిళలను సంప్ర దాయికంగా నిందిస్తున్న వాతావరణం గురించి ప్రతి డాక్టర్ కూడా జాగరూకతతో ఉండాలి. అలాంటి సామాజిక అవలక్షణాలకు తప్పుడు సమాచార ప్రచారాన్ని వైద్యులు అనుసంధానించుకోగల గాలి. శాస్త్రీయ ఉ«ధృతిని, మానవవాదాన్ని, విమర్శ స్ఫూర్తిని, సంస్క రణను అభివృద్ధి చేయడం ప్రాథమిక విధిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ (హెచ్)ని కలిగి ఉన్న దేశంలో వైద్య వృత్తిలో ఉన్నవాళ్లు చేయ వలసింది చాలానే ఉంది. ఒక ఆచరణను ప్రశ్నించే లేదా సవాలు చేసే విషయంలో సీని యర్లను లేదా బోధకులను ఆధునిక వైద్య సంస్థలతో సహా భారత్‌లో తగినవిధంగా గౌరవించడం లేదు. పర్యవసానంగా, మనకు మితి మీరిన విశ్వాసం ఉంటోంది తప్పితే సైంటిఫిక్ టెంపర్ ఉండటం లేదు. ఇది తప్పక మారాలి. మన ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాతే ఇత రులతో వ్యవహరించే నమ్మకం మనకు వస్తుంది. మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నట్లే ఇతరుల ఆచరణలను కూడా మనం శాస్త్రీయంగా ప్రశ్నించగలం. చిట్టచివరగా, ఈ ప్రపంచంలో మ్యాజిక్ లేదు, సర్వత్రా సైన్స్ మాత్రమే ఉంది. అనురాగ్ అగర్వాల్ వ్యాసకర్త డీన్, బయోసైన్సెన్ అండ్ హెల్త్ రీసెర్చ్, అశోకా యూనివర్సిటీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రామ్ చరణ్ - ఉపాసన.. ఎక్కడికెళ్లినా ఆ విషయాన్ని మర్చిపోరు!
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లేముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా భారతీయ సంప్రదాయ దుస్తులో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజును కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు, వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు. కాగా.. 95వ ఆస్కార్ వేడుకల్లో RRRలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడిగా నటిస్తోంది. -
పచ్చబొట్టు చెరిగీపోదులే! ‘మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం’
ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే కేవలం ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నం.. టాటూ పేరుతో చిత్రించుకొనే ప్రత్యేకమైన డిజైన్. కానీ నిన్నటితరం వారికి మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకొనే ఒక పదిల జ్ఞాపకం.. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం.. జీవన విధానంలో ఓ భాగం.. తరతరాల ఆచారం. గిరిజనుల్లో మొదలై మైదాన ప్రాంతాలు, అటు నుంచి మెట్రో నగరాలకు ఓ ఫ్యాషన్ గా మారిన పచ్చబొట్టు పుట్టుక, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి అనే తెగలోని ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. ఐదేళ్ల నుంచే సూదులు చేతబట్టి, ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు నాటి తరం తోటి మహిళల సొంతం. ఇందుకోసం సన్నని మూడు సూదులను దగ్గర చేర్చి చేతితో పట్టుకొనేలా దారంతో చుట్టగా చుడతారు. అడవిలో దొరికే (పెద్దేగి జాతి చెట్టు) బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు. ఒక్కో బొట్టుకు ఒక్కో ప్రత్యేకత.. ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్‌గోండ్ అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకొనేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై, మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకొనేవారు. రోగాలు, నొప్పులు వస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతి వేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై వేసుకొనేవారు. అలంకారమే కాక, దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మనాన్నలు, ఇష్ట దైవం, పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకునేవాళ్లు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారని నాటి తరం ఆదివాసీలు చెబుతున్నారు. పూర్వం గిరిజన మహిళలు చేతి నుంచి వీపు, తల వరకు ఒంటికి వేయని దుస్తుల వలే పచ్చబొట్టును వేయించుకొనేవారని గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు వలసలు మొదలవడంతో గిరిజనేతరులకు సైతం ఈ ఆచారం అలవాటు అయిందని పేర్కొన్నారు. అయితే ఈ తరం గిరిజన మహిళల్లో ఎక్కువ మంది పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. చరిత్రకారుల ప్రస్తావన.. గతంలో హైమన్ డార్ఫ్, మైఖేల్ యోర్క్ వంటి విదేశీ పరిశోధకులు తమ రచనలు, ఫొటోలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం తమ ఒంటిపై కనీసం ఒక చుక్కనైనా తోటిల వద్ద వేసుకొని మురిసిపోయేవారు. ఆదివాసీల్లో ఒకటైన తోటి తెగ జనాభా 2011 లెక్కల ప్రకారం 4,811గా ఉండగా ప్రస్తుతం 10 వేల వరకు ఉండొచ్చని అంచనా. దేవుడిచ్చిన వరం మా ముందు తరం నుంచే పచ్చబొట్టు వేసే ఆచారం ఉంది.. మా తెగకు దేవుడు ఇచ్చిన వరం ఇది. రాను రాను గిరిజనుల్లో పచ్చబొట్టుపై ఆసక్తి తగ్గిపోయినా మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం. – వెడ్మ రాంబాయి, ఎదులపాడ్, తిర్యాణి మండలం, కుమురంభీం జిల్లా -
ఇదో వెరైటీ సంప్రదాయం.. పండగ వస్తే అక్కడివాళ్లంతా గుమ్మడికాయలు తీసుకుని
ఎల్.ఎన్.పేట(శ్రీకాకుళం): కొండల్లో పోడు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల (తెగల) వారితో నేస్తరికం (స్నేహం) చేస్తారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగల సమయంలో గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వెళతారు. గిరిజనులు పోడు పంటగా పండించే రకరకాల పంటలను కొద్దికొద్ది గా తీసుకుని నేస్తం ఇంటికి పయనమవుతారు. భోగీ రోజున ఉదయం నేస్తం ఇంటికి చేరుకుని సాయంత్రం వరకు ఉంటారు. ఆ సమయంలో గుమ్మడికాయ, కర్రపెండ్లం, అరటి కాయలు, అరటి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులను ప్రేమగా అప్పగిస్తారు. తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో కొసరి కొసరి సంతృప్తిగా భోజనం పెట్టి కొత్త దుస్తులు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు అందిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం కుటుంబం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తారు. చదవండి: సంక్రాంతి స్పెషల్.. అరిటాకంత ఆనందం! -
పెళ్లికి ముందు.. వధువు హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: రోస్ వేడుకలో వధువు కుప్పకూలి మరణించింది. ఉడుపి కోళలగిరి హవంజెలో జరిగింది. హవంజెకీ చెందిన జోస్నా లూయిస్ (24)కు గురువారం పెళ్లి జరగాల్సిఉంది. పెళ్లికి ముందు రోజు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు బంధువుల ఇంటిలో రోస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆమె స్పృహ తప్పి పడిపోగా స్థానిక ఆస్పత్రికి తరతలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. లో బీపీనే కారణమని బంధువులు తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
అమ్మ మరిచిన పాట
పక్క ఫ్లాట్‌లో పాపాయి పుట్టింది. బుజ్జిగా ఉండుంటుంది. కళ్లు తెగ తెరిచి తల్లిని చూస్తూ ఉండుంటుంది. పాలు సరిపోతుండొచ్చు. గుండెలకు హత్తుకుని ఇచ్చే వెచ్చదనం సరిపోతుండొచ్చు. అయినా సరే కయ్‌మని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నానహో అని చెప్పడానికి ఏడుస్తున్నట్టుంది. నాకేదో కావాలహో అని చెబుతున్నట్టు ఏడుస్తుంటుంది. అమ్మకు పాతికేళ్లుంటాయి. ఎత్తుకుని సముదాయిస్తుంది. అటూ ఇటూ తిప్పుతూ ఊరుకోబెడుతుంది. పాపాయి ఏడుపు ఆపదే! బహుశా అమ్మ పాడాలేమో! యుగాలుగా తల్లులందరూ పసికందుల కోసం మనోహరమైన గాయనులై ఎత్తే గొంతును ఆ తల్లి కూడా ఎత్తాలేమో! ‘ఆయి ఆయి ఆయి ఆపదలు కాయీ’. ఆహా. ఒకప్పుడు ఏ అమ్మయినా ఈ పాట అందుకుంటే పసినోరు ఠక్కున మూతపడేది. గొంతులో లయ ఊయల ఊపుతున్నట్టుండేది. ఏదమ్మా... మళ్లొకసారి పాడు అన్నట్టుగా పాపాయి మెడ కదిలించేది. ‘ఆయి ఆయి ఆయీ... ఆపదలు కాయీ’. చిట్టి బంగారు తల్లికి ఏ ఆపదలూ రాకూడదు. ఈ బంగరు బుజ్జాయి బొజ్జ నిండా పాలు తాగి, కంటి నిండా కనుకు తీయాలి. వివశుల్ని చేసే చిర్నవ్వు నిదురలో నవ్వాలి. గుప్పిళ్లు బిగించాలి. ఉత్తుత్తికే ఉలికి పడాలి. అందుకు తల్లి ఏం చేయాలి? పాడాలి. ‘ఏడవకు కుశలవుడ రామకుమార... ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు?’ సీతాదేవి పాడకుండా ఉందా? అడవిలో తావు కాని తావులో, లోకుల మధ్య ఇద్దరు కుమారులను కని, వారికి సర్వం తానై, వారు ఒడిలో ఉంటే అదే పెన్నిధిగా భావించి, ఆ కారడవిలో, రాత్రివేళ, ఏనాడైనా దడుపు వల్లో కలత చేతో ఏడిస్తే సీత పాడకుండా ఉందా? ‘ఉంగరమ్ములు కొనుచు ఉయ్యాల గొనుచు ఊర్మిళా పినతల్లి వచ్చె ఏడవకు. పట్టు అంగీ గొనుచు పులిగోరు గొనుచు భూదేవి అమ్మమ్మ వచ్చె ఏడవకు’. సీతాదేవి పాడుతున్నదా? పిల్లలకు తన సొద చెప్పుకుంటున్నదా? ఆశను వారిలో సజీవంగా ఉంచు తున్నదా? ఏమో! పాడటం మాత్రం మానలేదు. వాళ్ల నాన్న విన్న పాటను తిరిగి వల్లెవేయక ఉండ లేదు. ‘రామా లాలీ మేఘ శ్యామా లాలి... తామరస నయన దశరథ తనయా లాలీ’... తల్లి గొంతు ఎలా ఉంటే ఏమి? బిడ్డ కోసం పాడితే అందులోకి అమృతం వచ్చేస్తుంది. వాత్సల్యపు తేనె తొర్లి పడుతుంది. నా పంచప్రాణాలు నీవే కన్నా అనే భావం మాటలు రాని చిట్టిగుండెకు గట్టిగా చేరుతుంది. పాపాయికి అది కావాలి. పసివాడికి ఆ మాట చెవిన పడాలి. అందుకై చెవి రిక్కిస్తుంది ఒడిలో ఉండే కలువమొగ్గ. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద.. రార పరమానంద రార గోవింద’... వింటుంటే నిద్రాదేవి బింకం చెదిరేలా లేదూ! అయ్యో తల్లి... నీ బిడ్డను చేరి హాయిగా నిద్ర పుచ్చుతాలే అని బెట్టు తీసి గట్టున పెట్టేట్టు లేదూ!! శ్రీమంతుల ఇంట్లో వారసుడు పుట్టాడట. సంగీతం వినిపించే ఖరీదైన ఆట వస్తువులు కొంటారు. యూట్యూబ్‌లో జింగిల్స్ వినిపిస్తారు. మధ్యతరగతి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందట. కొత్త గౌన్లు కొంటారు. బంగరు దండ వేస్తారు. ఏడ్చిన ప్రతిసారీ పాలకే అని భ్రమసి ఎదను నోటికంది స్తారు. పేదవాడి గుడిసెలో ముత్యాలమూట ఒడిలోకొచ్చి పడిందట. ముద్దులు పుణుకుతారు. కంటి మీద రెప్పేయక కాచుకుంటారు. ఏడుస్తూ ఉంటే అగ్గిపెట్టె మీద దరువేసి వినిపిస్తారు. తెలుగు ఉంది మనకు. భాష ఉంది మనకు. రాగం ఉంది, పసికందుల నిదురకై భావం ఉంది మనకు. పాడమని చెప్పారు పెద్దలు పిల్లల కోసం. పాటలు అందించి వెళ్లారు పిల్లల కోసం. తల్లిపాలు పోయి పోత పాలు వచ్చె. లాలిపాట పోయి హోరుపాట వచ్చె. పిల్లలకు తెలుసు ఇది బాగలేదని. అందుకే ఏడుస్తారు. తల్లికి అమ్మమ్మ పాట ఇవ్వలేదు. తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాట ఇవ్వబోదు. లాలిపాట అదృశ్యమయ్యే నేలా మనది? ‘నిద్ర నీ కన్నుల్లు మబ్బు మొగముల్లు నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు... నిన్ను గన్నయ్యకూ నిండు నూరేళ్లు... జో జో’.... తల్లి బిడ్డతో చేసే తొలి సంభాషణ లాలిపాట. బిడ్డ జీవితంలో సంగీ తాన్ని తొలిగా ప్రవేశపెట్టేదే లాలిపాట. శ్రుతి తప్పని జీవితాన్ని కాంక్షించేదే లాలిపాట. ఒంటరితనం మిగిలినప్పుడు పాటను తోడు చేసుకొమ్మని ఉపదేశం చేసేదే లాలిపాట. సర్వం సంగీతమయమైన ఈ జగత్తులో బిడ్డకు స్వాగతం పలికేదే లాలిపాట. కాని తల్లి గొంతు ఫోన్లో బిజీ. తల్లి గొంతు ఏదో పని పురమాయింపులో బిజీ. తల్లి గొంతు ఇరుగు పొరుగు పలకరింపుల్లో బిజీ. బిడ్డ పుడితే చేయవలసిన సాంగేలు అనేకం పోయాయి. బిడ్డ పుడితే హాజరు కావాల్సిన బంధుమిత్రులు ముఖం చూపించలేనంత బిజీగా ఉన్నారు. చీటికి మాటికి వచ్చి ఆ చిట్కా, ఈ విరుగుడు చెప్పే ముసలమ్మలు సొంతింట, పరాయింట కాన రావడం లేదు. దిష్టి చుక్కలు, సాంబ్రాణి ధూపాలు లేవు. గోరువెచ్చని నీళ్లతో కాళ్లన బోర్లించి స్నానం చేయించి ఇచ్చే అమ్మలక్కలు లేరు. సంస్కృతి అంటే ఏమిటి? అది ఏదో మహా విగ్రహాల్లో, అపూర్వ ఉత్సవాల్లో ఉండదు. కుటుంబంలో నిబిడీకృతం అయ్యే చిన్నచిన్న ఆనందాల్లో, ముచ్చట్లలో ఉంటుంది. ముగ్గు, మామిడి తోరణం లేనిది కూడా ఇల్లే. కాని అవి రెండూ ఉన్న ఇల్లు తెలుగుదనపు ఇల్లు. ఏడుపు ఆపి, పిల్లలు బుల్లి పెదాలు విప్పి, భలే నవ్వాలి. ఇంటింటా బిడ్డ కోసం పాడి తల్లి ఆవులించాలి. ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు... నీలాలు కారితే నే చూడలేను... పాలైన కారవే బంగారు కళ్లు...’. -
గురువాణి: పంచెకట్టు కట్టి పై కండువాతో నడిచొస్తుంటే...
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వస్త్రధారణ ఉంటుంది. దాన్ని చూడగానే అది ఫలానా ప్రాంతపు సంప్రదాయం అని ఠక్కున గుర్తుపట్టేస్తాం. అది ఏ ప్రాంతానిదయినా అభినందించవలసిందే. దానిపై అక్కడి వాళ్ళకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఇతరుల ఆచార వ్యవహారాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను, అలవాట్లను, కట్టూబొట్టూను... వీటిని జ్ఞాపకం ఉంచుకోవడం, గౌరవించడం, అనుసరించడం... ఇది మాది ...అని చెప్పుకొని పొంగిపోవడం... ఉండవలసిన లక్షణం. తెలుగువాడు ఎలా ఉంటాడు...అన్నదానికి... అల్లూరి వేంకట నరసింహరాజు గారనే ఒక కవి ఏమంటున్నాడంటే....‘‘ పంచెకట్టు కట్టి పైమీది కండువా వేసికొనిన తెలుగువేషమగును, అటుల సుందరము, శృతిపేయమైనట్టి భాషయన్న తెలుగు భాషయగును’’ అని వర్ణించాడు. పంచెకట్టు తెలుగువాడి వస్త్రధారణ. అదికూడా...కుచ్చిళ్ళు వచ్చేటట్లుగా దాని అంచు నిలువుగా నిలబడేటట్లుగా ఎడం పక్కకు పెట్టుకొని ..ఒక్కోసారి ఇంకా అందంగా కనబడడానికి అర్ధవృత్తాకారంలో కట్టుకొని, వెనక ప్రత్యేకించి కుచ్చిళ్ళతో గోచీపోసి కట్టుకుని ..అటువంటి అలంకరణతో నడుస్తుంటే ఆ వస్త్రధారణ అందమే వేరు... ఇంతకంటే అందమైన మరొక వస్త్రధారణ ఉంటుందా..అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక పంచెకట్టుతోపాటూ పైన ఉత్తరీయం.. కండువా. కనీసంలో కనీసం ఒక తువ్వాలు... అది లేనిదే తెలుగువాడు ఒకప్పుడు బయట అడుగుపెట్టేవాడు కాడు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో, సంప్రదాయ కుటుంబాల్లో, శుభాశుభాల్లో ఈ వేషధారణ తప్పనిసరిగా కనిపిస్తున్నది. నవతరం కూడా ఈ సంప్రదాయాలను గౌరవిస్తున్నది. ఈ రెంటికీ అదనంగా భాష.. తెలుగు ఎంత మధురమైన భాషంటే... దానిని చెవులతో జుర్రుకోవచ్చు.. అనేంత మధురంగా ఉంటుంది. ఈ భాష రానివాడు కూడా దానిని వింటూ మైమరిచిపోతాడు. ఇది ప్రతి తెలుగువారూ తమది అని గొప్పగా చెప్పుకొని పరవశించే సంస్కృతి. వేదం కూడా ప్రత్యేకించి ఈ రకమైన వస్త్రధారణ చాలా గొప్పది.. అంటుంది. స్వాధ్యాయచ... వేదం చదువుకోవాలన్నా, హోమం చేయాలన్నా, దానం చేయాలన్నా, భోజనం చేయాలన్నా, ఆచమనం చేయాలన్నా...ఈ అయిదింటికీ పంచెకట్టే కట్టుకోవాలి. ‘‘విగచ్ఛః అనుత్తరీయశ్చ నగ్నస్య అవస్త్రేయచ’’ అంటుంది. అంటే వెనుక గోచీ పోసి కట్టుకోకపోతే, ఉత్తరీయం వేసుకొని ఉండకపోతే వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం అంటుంది. తెరమీద రకరకాల వేషాలతో నవయవ్వనులుగా కనిపించినా.. బహిరంగంగా సభలకు వచ్చేటప్పడు ఎటువంటి భేషజాలకు పోకుండా నందరమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావుగార్లలాంటి వారు, అలాగే ప్రభుత్వంలోని అత్యంత ఉన్నతస్థానాల్లో ఉన్న అధికారులు కూడా కొన్నిరకాల సభలకు, సమావేశాలకు పంచెకట్టుతోనే వచ్చేవారు. వారలా కనిపిస్తుంటే పంచెకట్టులో వెలిగిపోతుండేవారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు అందంగా గోచీపోసి అంచులు ఆకర్షణీయంగా కనబడేట్టుకట్టి.. అలా వేదికలమీద, జనం మధ్యన నడిచిపోతుంటే అందరి దృష్టి వారిమీదే. వీళ్ళు పై ఉత్తరీయాన్ని కూడా తలపాగా లాగా ఎంత వేగంగా తలకు చుట్టినా అది అంత అదనపు ఆకర్షణగా నిలిచేది. అంత గొప్ప కట్టుబొట్టూ ఉన్నచోట పుట్టే అదృష్టం, అంత మధురమైన తెలుగు భాషను నోరారా మాట్లాడుకొనే అవకాశం ఇచ్చిన పరమేశ్వరుడికి కృతజ్ఞత చెప్పుకోకుండా ఎలా ఉండగలం!!! మనదైన సంస్కృతిని కొత్త తరం అందిపుచ్చుకొని మరింత వ్యాప్తిలోకి తీసుకురావాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వధువును కాపురానికి తీసుకెళ్లాలంటే వరుడు వాటితో కొట్టించుకోవాల్సిందే..!
అయ్యో.. తప్పుగా అనుకోకండి. దక్షిణ కొరియాలోని పెళ్లి కొడుక్కి తప్పకుండా చేయాల్సిన మర్యాద ఇది. అంటే వధువు చెప్పుతో వరుడిని కొట్టడం కాదండీ! కట్టుకున్న భార్యను తనతోపాటు తీసుకెళ్లాలంటే వరుడు తన కాళ్లకున్న చెప్పులు తీసి.. అతని కుటుంబమో.. లేక అతని స్నేహితులతోనో తన అరికాళ్ల మీద కొట్టించుకోవాలి. రక్తం మాత్రం కారకూడదు. పోలీసు దెబ్బలన్నమాట. వరుడి కాళ్లను కట్టేసి.. అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పమని ప్రశ్నిస్తూ మరీ కొట్టాలట.. కర్రతో కానీ.. ఎండు చేపతో కానీ! వరుడి శక్తిసామర్థ్యాలను పరీక్షించడమే ఈ ప్రోగ్రాం సారీ.. సంప్రదాయం ఆంతర్యమట. ఇలాంటి పలు వింత పెళ్లి సంప్రదాయాలు మీకోసం.. వంటింట్లో సామాన్లు విరగ్గొట్టాల్సిందే.. ! చేయి జారి చిన్న కప్పు పగిలిపోతేనే మనసు మనసులో ఉండదు.. అలాంటిది ఇష్టపడి కొనుక్కున్న వంటింట్లోని ఖరీదైన పింగాణి సామాగ్రిని కావాలని నేలకేసి కొట్టి.. కాళ్ల కిందేసి తొక్కితే ప్రాణం చివుక్కుమనదూ! అయినా నవ్వుతూ ఆ సంప్రదాయాన్ని పాటించాల్సిందే! జర్మనీలో ఇదీ పెళ్లి తంతేనండీ! దీన్ని పోల్టరాబెండ్ అంటారు. పెళ్లికి వచ్చిన అతిథులంతా పెళ్లి కూతురి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న వంటింటి సామాగ్రిని చితక్కొట్టేస్తారు. దీనివల్ల నూతన జంట నూరేళ్లు కలసి ఉంటుందని విశ్వాసం. మొహమ్మీద ఊసి... దేవుడా.. ఇదీ పెళ్లి ఆచారమేనా? అవును.. కెన్యా, మాసై తెగలో! పెళ్లయిపోయి అప్పగింతలప్పుడు.. వధువు మొహమ్మీద ఉమ్మేస్తాడట ఆమె తండ్రి. అలా చేస్తే అత్తింట్లో అదృష్టం తన్నుకొస్తుందట అమ్మాయికి. మసి పూసి.. ఊరేగించి.. ఎక్కడ? ఎవరిని? స్కాట్లాండ్లో.. కాబోయే వధూవరులను. అది పెళ్లికి సంబంధించి స్కాట్లాండ్లో ఉన్న ఒక సంప్రదాయం. పెళ్లికి ముందు.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్నేహితులు కలసి ఆ ఇద్దరి మొహాలకు చక్కెర పాకం, పిండి, మసి పూసి వీథంతా తిప్పుతారట. ఇలా చేస్తే ఆ ఇద్దరి మీదున్న చెడు దృష్టి, దుష్ట శక్తి పోయి.. వాళ్ల కాపురం పచ్చగా ఉంటుందని వాళ్ల నమ్మకమట. -
అయ్యవారికి అరటి గెల.. తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే..
టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): భీష్మ ఏకాదశి పర్వదినం.. చెట్లతాండ్ర అనే గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసన. యువకులు గెలలు లెక్క పెడుతున్నారు. వంద దాటాయి.. వెయ్యి దాటాయి.. సమయం గడుస్తోంది గానీ లెక్క తేలడం లేదు. గెలలన్నీ పూర్తయ్యే సరికి వచ్చిన లెక్క ఎనిమిది వేలు. చదవండి: ‘ఎల్లువొచ్చి గోదారమ్మా’.. బిందెలన్నీ అక్కడ తయారైనవే! ఎనభై ఏళ్ల కిందట ఊరిలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు సరిహద్దులు చెరిపేస్తూ ఇతర రాష్ట్రాలకూ పాకింది. ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి ఇక్కడ అరటి గెలలు కడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున గెలలు కట్టినా ఎన్నడూ లెక్కలో పొరపాటు రాలేదు. అసలు ఈ అరుదైన సంప్రదాయం ఎలా మొదలైంది.? ఆలయ నిర్మాణం వెనుక విశేషాలేంటో తెలుసుకోవాలంటే 170 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. సంతబొమ్మాళి మండలంలోని చెట్లతాండ్ర. పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేవు. అన్ని పల్లెల్లాగానే సా దాసీదా గ్రామం. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో నిర్వహించే శుభ కార్యానికి ముందు పరావస్తు అయ్యవారికి మొదట పూజలు నిర్వహించి ఆ తర్వా తే పనులు మొదలుపెడతారు. 170 ఏళ్ల కిందట ఈ ఊరికి వచ్చిన స్వామీజీ పేరే పరావస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే. అయ్యవారు జీవ సమాధిగా మారిన స్థలానికి ఆనుకుని నిర్మాణం చేసిన లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఇప్పటికి 170 ఏళ్ల కిందట.. ప్రస్తుతం నౌపడ ఆర్ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వే స్టేషన్లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మరి వృత్తిదారులు కుండలు అమ్మడానికి వెళ్లారు. పరావస్తు అయ్యవారు అనే స్వామి వారి వద్దకు వెళ్లి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని కోరారు. దీంతో కుమ్మరి వృత్తిదారులు స్వామిని గ్రామానికి తీసుకువచ్చారు. అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. గ్రామం చుట్టుపక్కల సత్సంగాలు నిర్వహించే వారు. ఈతి బాధలు ఉన్న వారికి స్వామి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకుని సాంత్వన పొందేవారు. ఇలా 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్నేళ్లూ ఆయన వద్ద ఉన్న అక్షయ పాత్ర ద్వారా ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెప్పుకునేవారు. పరావస్తు అయ్యవారు జీవసమాధిగా మారిన స్థలంలో పుట్టిన మర్రిచెట్టు 45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు. ఆయన జీవ సమాధిగా మారిన ప్రదేశంలో కొద్ది రోజులకే మర్రి చెట్టు పుట్టింది. దీంతో ఆ మర్రిచెట్టు అయ్యవారికి ప్రతిరూపంగా భావించారు. ఆ తర్వాత గ్రామం మధ్యలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించి లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మొదట్లో వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించేవారు. రోజు రోజుకూ భక్తులు ఆరాధన పెరుగుతుండడంతో 80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులు మాత్ర మే అరటి గెలలు కట్టేవారు. ఆ తర్వాత జిల్లాలు, రాష్ట్రాలు దాటి భక్తులు ఇక్కడకు చేరుకుని అరటి గెలలు కట్టడం ప్రారంభించారు. అరటి గెలల సంఖ్య పదుల నుంచి వేలకు చేరింది. ఈ ఏడాది నిర్వహించిన భీష్మ ఏకాదశి ఉత్సవాలకు ఏకంగా 8 వేలకుపై చిలుకు అరటి గెలలు కట్టారు. ఒక్కటీ మిస్ కాదు చెట్లతాండ్ర గ్రామంలో గల పరావస్తు అయ్యవారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఆవరణలో భక్తులు వేల సంఖ్యలో అరటి గెలలు కడుతుంటారు. అయితే తిరిగి అరటి గెలలు తీసుకునే క్రమంలో ఏ ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు. గ్రామంలో యువకులంతా ఎంతో బాధ్యతగా చూసుకుంటారు. మూడు రోజుల తర్వాత కొంత మంది భక్తులు అరటి గెలలను ఇంటికి తీసుకువెళ్తారు. మరి కొంత మంది స్వామి వద్దనే ఉంచేస్తారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఏ రోజూ అరటి గెలలు పోయాయి అనే మాట రాలేదని ఉత్సవాల కమిటీ సభ్యులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా.. మా ఊరిలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయ్యవారి సన్నిధిలో అరటి గెలల మహోత్సవాన్ని చూస్తున్నాను. ఏటా భక్తులు పెరుగుతున్నారు. -పి.జగ్గయ్య, చెట్లతాండ్ర, సంతబొమ్మాళి మండలం. బాధ్యతగా ఉంటాం మా గ్రామంలో ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు పరావస్తు అయ్యవారు లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో ఎంతో బాధ్యతగా ఉత్సవాలు నిర్వహిస్తాం. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువకులంతా సమష్టిగా పనిచేస్తారు. భక్తులకు అన్నదానం నిర్వహిస్తాం. ఆంధ్రా, ఒడిశా, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. -పి.అసిరినాయుడు, సర్పంచ్, చెట్లతాండ్ర -
వింత ఆచారం.. వరుణుడి కరుణ కోసం అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి..
సాక్షి,బళారి: వరుణ దేవుడి కరుణ కోసం విజయపుర జిల్లాలో చిన్నారులకు వివాహాలు జరిపిస్తున్నారు. జిల్లాలోని ముద్దేబిహాల్ తాలూకా సాలతవాడ పట్టణంలో కారుపౌర్ణిమ తర్వాత చిన్నారులకు పెళ్లి జరిపించే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే అబ్బాయి, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకుంటే పొరపాటు. ఇక్కడ అమ్మాయిని అబ్బాయిగా అలంకరించి, మరొక అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. 14 సంవత్సరాలు లోపు అమ్మాయిలతో ఈ తంతు పూర్తి చేస్తారు. పెళ్లి జరిపించడంతో పాటు విందు, దేవాలయాలు సందర్శన చేస్తారు. సంప్రదాయబద్దంగా 18 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, శాంతి నెలకొంటుందని వారి నమ్మకం. చదవండి: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ -
బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడ? ఎప్పుడు అంటే?
మంత్రాలయం/ఆలూరు: గోవులను, ఎడ్లను పూజించడం హిందువుల సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను ఎద్దుల పండుగలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో వాటికి స్నానాలు చేయించి, అలంకరణలు గావించి, పిండివంటలు పెట్టి పూజిస్తారు. మనకు ఇంత వరకే తెలుసు. కానీ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న సుళేకేరి, విరుపాపురం గ్రామాల్లో ఎద్దులను ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. ఇలవేల్పు బసవేశ్వర స్వామి ప్రతి రూపాలుగా భావించి వారంలో ఒక రోజు పూర్తిగా సెలవు ఇచ్చేస్తారు. ఎంత పని ఉన్నా సోమవారం వాటితో చేయించరు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం. చదవండి: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్ కట్టుబాట్ల సుళేకేరి.. కౌతాళం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుళేకేరి గ్రామంలో అవధూత బంధమ్మవ్వ మహిమాని్వతురాలుగా ప్రసిద్ధి. అవ్వ పరమపదించిన తరువాత గ్రామంలో జాతరతో పాటు కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ వస్తున్నారు. అవ్వ జాతరకు నెల రోజుల ముందు ఓ సామాజికవర్గం గ్రామ చావిడిలో చెప్పులు వేసుకుని నడవకపోవడం ఒక సంప్రదాయం కాగా మరొకటి ప్రతి సోమవారం ఎద్దులకు సెలువు ఇవ్వడం. దాదాపు 4 శతాబ్దాల క్రితం గ్రామంలో రైతులు యథావిధిగా ప్రతి రోజు పొలాలకు వెళ్లి కాడెద్దులతో పనులు చేసుకునేవారు. అయితే సోమవారం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునేవి. కాడెద్దు చనిపోవడం, కాలు విరగడం, బండి ఇరుసులు, చక్రాలు విరగడం, రైతులకు గాయాలు కావడం జరిగేవి. దీంతో గ్రామంలోని అవధూత బంధమ్మవ్వకు గ్రామస్తులు గోడును వినిపించుకున్నారు. సోమవా రం కాడెద్దులను కష్టపెట్టడం మానేయాలని ఆమె ఆదేశించడంతో ఆ ఆజ్ఞను సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విరుపాపురంలో విత్తు ఉన్నా సెలవే.. ఆలూరు నియోజకవర్గ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విరుపాపురం ఉంది. ఆ గ్రామ ఇలవేల్పు బలగోట బసవేశ్వర స్వామి. ఏటా ఏప్రిల్ నెలలో వచ్చే హంపయ్య పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర జరుపుకుంటారు. శివుని వాహనం బసవేశ్వరుడు కావడంతో గ్రామస్తులు బసవన్నలను దైవాలుగా పూజిస్తారు. ఇక్కడ 1975లో ఇందిరమ్మ గృహాలు రావడంతో విరుపాపురం పక్కనే బలగోట గ్రామం వెలసింది. విరుపాపురం గ్రామం రెండు గ్రామాలుగా ఆవిర్భవించడంతో బలగోట బసవేశ్వర స్వామి(బలగోటయ్య తాత) ఆజ్ఞగా భావించి ప్రతి సోమవారం కాడెద్దులకు సెలవు దినంగా ప్రకటించుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రతి సోమవారం కాడెద్దులకు స్నానాలు చేయించడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, పిండి వంటలతో నైవేద్యాలు సమరి్పంచడం చేస్తున్నారు. అదే రోజు బలగోటయ్య స్వామి ఆలయానికి ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలతో ఎద్దులను తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. విత్తు వేసే పనులు ఉన్నా, పెళ్లిళ్లకు మెరవణిలు, ప్రయాణాలు ఉన్నా ఎద్దులతో పనులు చేయించరు. -
పిడకల సమరంలో 50 మందికి గాయాలు
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పిడకల సమరాన్ని (నుగ్గులాట) చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అరగంట పాటు జరిగిన పిడకల సమరంలో సుమారు 50 మంది గాయపడ్డారు. వారందరికీ స్థానికంగా చికిత్స చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఆ రోజు ఊరంతా ఖాళీ!... దశాబ్దాలుగా సాగుతున్న ఆచారం
అనంతపురం(తాడిపత్రి రూరల్): శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ బుధవారం సూర్యుడు ఉదయించక ముందే తాడిపత్రి మండలం తలారి చెరువు మొత్తం ఖాళీ అయింది. ‘అగ్గి పాడు’ ఆచారం పేరుతో ఇంటిలోని విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పి, నిప్పు సైతం వెలిగించలేదు. పశువుల పాక ల్లోని పేడకళ్లతో పాటు ఇళ్లలోని కసువూ శుభ్రం చేయలేదు. కట్టెలు, వంట సామగ్రి, పాత్రలను మూటగట్టుకుని ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వేసుకుని, ఇళ్లకు తాళం వేసి దర్గా వద్దకు చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చీకటి పడిన తర్వాత ఇళ్లకు చేరుకుని ఆరుబయటనే భోజనాలు ముగించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంటి గడపకూ టెంకాయ కొట్టి లోపలకు ప్రవేశించారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం. -
ఆ గ్రామంలో వింత సంప్రదాయం.. మా ఊరికి రావొద్దు..
సీతంపేట(శ్రీకాకుళం జిల్లా): గ్రామాన్ని చల్లగా చూడాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సీతంపేట మండలం జరడుకాలనీ గ్రామస్తులు గ్రామదేవత పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు గ్రామంలోకి ఇతరులు రాకను నిషేధించారు. చదవండి: సీఎం జగన్ ఆదేశాలు: పెద్దమ్మా.. ఇదిగో సెల్‌ఫోన్! మొదటి రోజున గ్రామ శివారున సందమ్మ, రెండో రోజున అమ్మవారికి, మూడో రోజున గ్రామ పితృదేవతలకు మొక్కులు తీర్చారు. దీనిలో భాగంగా బుధవారం యజ్జరోడు, దీసరోడు, జన్నోడులు వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేశారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను కాపాడుకుంటూ పూజలు చేస్తున్నామని, అందరూ సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
Latth Maar Diwali: డప్పు చప్పుళ్లకు హుషారైన స్టెప్పులు.. కర్రలతో ‘ఫైటింగ్’
లక్నో: సాధారణంగా దీపావళి రోజు ఒక్కొ ప్రాంతంలో.. ఒక్కొ ఆచారం ఉంటుంది. దీపావళిని కొందరు బందీఛోడ్ దివస్‌గా నిర్వహించుకుంటే.. మరో చోట లాత్మార్ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని జలౌన్ గ్రామస్తులు..ప్రతి ఏడాది లాత్మార్ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిలో వందల సంఖ్యలో గ్రామస్తులు ఒకచోట చేరారు. ఆ తర్వాత.. రెండు గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున డప్పులకు తగ్గట్టుగా హుషారుగా స్టెప్పులేశారు. ఈ క్రమంలో.. కర్రలతో ఒకరిపై ,మరోకరు దాడి చేసుకుంటున్నారు. దీంట్లో పాల్గోన్న వారు.. 30 నుంచి 40 ఏళ్ల వయసు వారున్నారు. ఈ వేడుకలో కొందరు పాల్గొంటే.. మరి కొందరు పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. అయితే , ఈ లాత్మార్ దీపావళి మేము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్ గ్రామస్తులు తెలిపారు. ఇది.. బుందేల్ ఖండ్ నుంచి వచ్చిందని తెలిపారు. అయితే, ఈ వీడియోలో గ్రామస్తులు .. కొవిడ్ నిబంధనలు పాటించలేదు. #WATCH | People in Jalaun participate in Bundelkhand's traditional 'Latth Maar Diwali'. #Diwali pic.twitter.com/3F29F0Pgmx — ANI UP (@ANINewsUP) November 4, 2021 చదవండి: మరిది పెళ్లి... డ్యాన్స్‌తో రచ్చచేసిన వదిన.. వైరల్ వీడియో -
వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..
ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్‌టాప్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు. నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు. పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్(ఫైల్) కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా.. ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు. మా ఆచారాన్ని మర్చిపోం ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. – భాను ప్రసాద్, అనంతపల్లి సంప్రదాయాన్ని గౌరవించాలి భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. – డాక్టర్ మానస, పోతవరం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. – గన్నమని రాము, పోతవరం సంతానం నిలవడం కోసం.. గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు. – రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి -
దారుణం: దురాచారం మహిళ ప్రాణం తీసింది
గుడిహత్నూర్(బోథ్): ఓ దురాచారం మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మం డలం ధరమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. మావల మండలంలోని వాఘాపూర్‌కు చెందిన సునీత (22)కు మండలంలోని ధరమడుగుకు చెందిన ఆత్రం సంతోష్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల కిందట బాబు పుట్టగా.. అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులకే మృతిచెందాడు. మళ్లీ సంతానం కోసం నిష్టతో పెద్దలు చెప్పినట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు రుతుక్రమం వచ్చింది. వీరి ఆచారం ప్రకారం రుతుక్రమం వచ్చిన మహిళ ఇంటి బయటే ఉండాలి. దీంతో సునీత సోమవారం రాత్రి ఇంటి బయట నేలపై పడుకోగా.. రాత్రి 11 గంటల సమయంలో పాము కాటేసింది. ఆమె బాధతో మూలగడంతో.. పక్కనే మంచంపై పడుకున్న భర్త సంతోష్ వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు -
సంస్కృతి గుండెకాయ లాంటిది
కళల పరిపూర్ణస్థాయి కారణంగా ఒక సమాజపు, ఒక దేశపు సంస్కృతిని నిర్ణయిస్తారు. ‘కళ’ అన్న మాటకు అర్థం ‘వృద్ధి చెందునది’, ‘వృద్ధి చెందించునది’– అని. అందుకే చంద్రకళలు అంటాం. అది ప్రకాశిస్తుంది, ప్రకాశింప చేస్తుంది. పెరుగుతుంది, పెంచుతుంది. అటువంటి ‘కళ’ను – దేనికోసం సమాజం అనుష్ఠిస్తుంది? ఆ కళలవల్ల ప్రధానమైన ప్రయోజనాలు ఏముంటాయి? అసలు కళలు ఎందుకోసం సమాజంలో అనుష్ఠానం లోకి వచ్చాయి? వాటిని ఎందుకు నేర్చుకుంటారు? దేనికోసం వాటిని తప్పనిసరిగా జీవితాల్లో భాగంగా చేసుకుంటారు? వాటి ద్వారా ఏం ప్రతిపాదన చేస్తారు? ఒక కీర్తన పాడితే, ఒక నృత్యం చేస్తే, ఒక బొమ్మ గీస్తే, ఒక రాతిని చెక్కి శిల్పంగా మలిస్తే వాటి వెనుక ఏదయినా సందేశం ఉంటుందా? దేనికోసం చేస్తారు వాటిని? వాటికి ఆధారంగా ఏవయినా శాస్త్రాలు ఉంటాయా? అవి ఏవయినా ప్రతిపాదనలు చేస్తాయా? అవి ఏ భావనలను ఆవిష్కరిస్తాయి? ఒక వాద్యాన్ని మోగిస్తే దేనికోసం అలా చేస్తారు? అసలు ఎటువంటి వాద్యాలను మోగిస్తారు? ఎటువంటి వాద్యాలను, ఎక్కడ అనుమతిస్తారు? ఏవి వినవచ్చు, ఏవి వినకూడదంటారు? వేటిచేత ఎవరు కళలను అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారో, ఎవరు వాటిని అభ్యసించారో, ఎవరు ప్రావీణ్యం సంపాదించారో వారిని కళాకారులని అంటారు. ఆ నైపుణ్యాలతో సమాజానికి ఏం అందించాలని వారు ప్రయత్నిస్తున్నారు? ఒక దేశంలో కళల సమాహార స్వరూపంగా ఉండి, అక్కడి సమాజానికి ఒక సందేశాన్ని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించే దానిని ఆ దేశ సంస్కృతి అంటారు. ఒక దేశంలో అందరూ సహృదయ సంపన్నులే ఉండరు. ఆ దేశం చాలా గొప్పదేశం అయి ఉండవచ్చు, గొప్ప సంస్కృతికి ఆలవాలం కావచ్చు, తిరుగులేని పరమ సత్యాన్ని ఆవిష్కరించి దాన్ని అక్కడి ప్రజలకు అందించే ప్రయత్నం చేసే కళాకారులున్న దేశమయి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ దేశంలో ఒక్కడుకూడా సంఘ వ్యతిరేకమయిన భావనలో ఉండడు అనీ, లేదా దుర్మార్గపు ఆలోచనలతో కూడుకున్నవాడు ఒక్కడూ కూడా ఉండడు –అనీ అధర్మపరులు అసలే ఉండరని సిద్ధాంతీకరించడం సంభవం కాదు. కానీ కొద్దిమంది అలా ఉంటే దోషభూయిష్టమైన పరిస్థితికి కారణం కాదా? వారి ప్రభావం సంస్కృతిపై పడదా? అంటే...వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు మొదట గుండె పరిశీలిస్తాడు. గుండె సక్రమంగా కొట్టుకుంటున్నదనుకోండి. మిగిలిన శరీర భాగాల్లో రుగ్మత ఏర్పడినా, వ్రణాలు ఏర్పడినా చికిత్సలతో వాటిని తొలగించడం ఆయనకు తేలిక. అసలు గుండే సరిగ్గా లేకపోతే, అసలా వ్యక్తే ఉంటాడన్న నమ్మకం లేకపోతే, ఇతర భాగాలకు వైద్యుడు చికిత్సలు అందించి ప్రయోజనం ఉండదు. గుండెకాయ లాంటిదే సంస్కృతి కూడా. సంస్కృతి వర్ధిల్లినంతకాలం, ఇది దేశంలో నిలబడినంతకాలం, వ్రణాల వంటి కొంతమంది దుర్మార్గులు బయల్దేరినా, శరీరానికి కలిగే పీడ సంబంధమైన వ్యాథులవంటి కొందరు దురాచార తత్పరులు ప్రవర్తించినా, దానికి వచ్చే దోషం ఏమీ ఉండదు. అది దిద్దబడుతుంది. సంస్కృతి నిలబడుతుంది. గుండెమీదే దాడి జరిగి దేశ సంస్కృతి ఛిన్నాభిన్నం అయిననాడు ఆ దేశ కీర్తి తరిగిపోతుంది. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నేను ఆ రకం కాదు
సినిమా : తాను ఆ రకం కాదు అని అంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ అనే మలమాళ చిత్రం ద్వారా విరబూసిన పూబోణిల్లో ఈ భామ ఒకరు. ఆ తరువాత తమిళంలో కొడి అనే ఒకే ఒక చిత్రంలో నటించి కనుమరుగైన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం బాగానే నటించేసి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ అవకాశాలు అడుగంటాయి. ప్రస్తుతం మాతృభాషలో ఒక చిత్రం, చాలాకాలం తరువాత కోలీవుడ్‌లో ఒక చిత్రం చేస్తోంది. అనుపమ ఇప్పుడు తరచూ సామాజక మాధ్యమాల్లో కనిపించడానికి తాపత్రయ పడుతోంది. అలా ఒక భేటీలో మాట్లాడుతూ సంప్రదాయ, అలవాట్లు, ఆచార వ్యవహారాల గురించి పెద్ద లెక్చరే ఇచ్చింది. ఈ తరం, భావితరం కంటే నాటి తరం సంప్రదాయమే మేలని ఒక ఉచిత సలహాను కూడా ఇచ్చేసింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ ఏం చేప్పిందో చూద్దామా! ఈ తరం యువత జీవన సరళి విభిన్నంగా ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో జీవిస్తున్నాం. పాత తరం జీవన విధానం గురించి అస్సలు అలోచించడానికే సమయం సరిపోవడం లేదు. మన ముందు తరాల ఆచార వ్యవహారాలను ఆచరించడానికి ఇష్ట పడడం లేదు. నేను ఆ రకం కాదు. పాత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నమ్ముతాను. పెద్దల మాటలకు గౌరవం ఇస్తాను. ప్రజలు ఇలానే జీవించాలని పెద్దలు కొన్ని పద్ధతులను నియమించారు. ఒక్కో పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని నాగరీకం పేరుతో ఈ తరం విస్మరించడం సరైన విధానం కాదు. నవ తరం ఆధునిక పోకడలతో సంప్రదాయబద్ధమైన విషయాలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. నేను నటి అయిన తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. సినిమారంగంలోకి రాక ముందు ఎలా ఉండేదాన్నో, ఇప్పుడూ ఇంట్లో అలానే ఉంటున్నాను. నేను రాహు కాలం, అష్టమి, నవమి, మంచి గడియలు వంటి వాటిని నమ్ముతాను. వాటి గురించి పెద్దలు ఊరికే చెప్పలేదు. వాటిని ఆచరిస్తే సంప్రదాయబద్ధమైన జీవినాన్ని సాగించవచ్చు. నమ్మకాలతోనే జీవితం సాగుతోంది అని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది. కాగా సడన్‌గా ఈ అమ్మడు పాత తరం, సంప్రదాయం వంటివి వల్లించడంలో అర్థమేమిన్న ప్రశ్న సినీ జనాల్లో రెకెత్తుతోంది. -
చిన్న కోరిక
గొప్ప ధనికుడు, ధార్మికవేత్తగా పేరుగాంచిన ఒక పెద్దాయన ఒకరోజు తన పిల్లల్ని దగ్గరకు పిలిచాడు. వారికేసి చూస్తూ, ‘‘పిల్లలూ! ‘నాకా వయసు మీద పడుతోంది. ఏ క్షణాన గుటుక్కుమంటానో నాకే తెలియదు. నాదో చిన్న కోరిక. తీరుస్తారా?’‘ అని అడిగాడు.‘‘భలే వారే నాన్నగారు మీరు, మమ్ముల్ని పెంచి పోషించి పెద్ద చేశారు. మేము, మా పిల్లలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టి ఇచ్చారు. మీకోసం ఆ మాత్రం చేయలేమా? చెప్పండి నాన్నా!. ఏమి చేయాలో.‘ అన్నారు అంతా ముక్తకంఠంతో. ‘ఏమీ లేదు నాయనా! నేను చనిపోతే, నా కాళ్లకు నా చెప్పులు తొడిగి సమాధి చేయండి’ అన్నాడు. సరేనన్నారు పిల్లలు. కొన్ని రోజులకు ఆ తండ్రి చనిపోయాడు. అంతిమ యాత్ర సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సంతానానికి తన తండ్రి కోరిక జ్ఞాపకం వచ్చింది. కాని ఇస్లామీయ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని తెల్లని గుడ్డ లో చుట్టి సమాధి చేయాలి. వెంట చిన్న వస్తువును కూడా సమాధిలో వేయరాదు.ఇప్పుడెలా? వారు పండితులను సంప్రదించారు. వారు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయడం కుదరదంటే కుదరదు’అన్నారు.‘అయ్యో! మా తండ్రి చిన్న కోరికను సైతం తీర్చలేకపోతున్నామే!’ అని బాధ పడుతున్నారు వారంతా. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ‘బాబూ! మీ నాన్నగారు ఈ ఉత్తరాన్ని నాకు ఇచ్చి నేను చనిపోయిన తర్వాత మా వాళ్లకు ఇవ్వమని చెప్పారు’ అంటూ ఆ లేఖను వారికి ఇచ్చాడు.వారు ఆత్రుతగా ఆలేఖనుతీసి చదవడం మొదలు పెట్టారు.‘పిల్లలూ చూసారా!? నేను ఎంతగా సంపాదించినా, చివరకు చనిపోయిన తర్వాత కనీసం పాతబడిపోయిన చెప్పులు కూడా తొడుక్కొని పోలేకపోతున్నా. రేపు మీఅందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కనుక ఆస్తులు అంతస్తులు కూడబెట్టకుండా పుణ్యాలు సమకుర్చుకునే పనుల్లో ధనాన్ని ఖర్చు చేయండి’ అని రాసి ఉంది.నిజమే కదా. ఈ సత్యం తెలిసి కూడా ఆధర్మ మార్గంలో అన్యాయంగా అక్రమాలకు పాల్పడి సంపాదించే వారు ఒకసారి ఆలోచించాలి. విశ్వసించిన ప్రజలారా! క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు చెల్లని, ఆ చివరి దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. (ఖురాన్ 2:254) – షేక్ అబ్దుల్ బాసిత్ -
గురుపూర్ణిమ
గురువును దైవ సమానంగా ఆరాధించడం మన దేశంలో తరతరాల నాటి సంప్రదాయం. ప్రాచీన గురుకుల సంప్రదాయం శతాబ్దాల తరబడి కొనసాగింది. మన పురాణాల ప్రకారం పరమ శివుడిని ఆదిగురువుగా పరిగణిస్తారు. భగవద్గీతను బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా ఆరాధిస్తారు. కొన్ని అవతారాల్లో శ్రీమహావిష్ణువు సైతం గురువుల వద్దనే విద్యాభ్యాసం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడు పరమ శివుడు ఆదిగురువుగా ఆవిర్భవించినందున ఈ రోజును గురుపూర్ణిమగా పాటించడం యోగ సంప్రదాయంలో అనాదిగా వస్తోంది. జూలై 27న గురుపూర్ణిమ సందర్భంగా... యోగ సంప్రదాయంలో శివుడిని ఆదియోగిగా కూడా పరిగణిస్తారు. గురుపూర్ణిమ రోజుకు మరికొన్ని పౌరాణిక విశిష్టతలు కూడా ఉన్నాయి. పరాశర మహర్షికి, సత్యవతికి వ్యాస మహర్షి ఇదే రోజున జన్మించినందున గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుడు మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాలను రచించాడు. అపౌరుషేయాలైన వేద శ్లోకాలను సేకరించి, వాటిని రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు. అందుకే వ్యాసుడికి వేదవ్యాసుడనే పేరు వచ్చింది. గురు పూర్ణిమను హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, జైనులు కూడా పర్వదినంగా పాటిస్తారు. గురుశిష్య పరంపర గురుశిష్య పరంపర వేదకాలం నుంచే ఉండేది. నాటి గురువులు శిష్యులకు వేద విద్యను మౌఖికంగా చెప్పేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక, యోగ విద్యలు మాత్రమే కాకుండా ఆనాటి గురువులు అస్త్ర శస్త్ర విద్యలు, ఆయుర్వేద, గణిత జ్యోతిష వాస్తు శాస్త్రాలు, శిల్పం, సంగీతం వంటి లౌకిక విద్యలను కూడా నేర్పేవారు. గురువుల ఆధ్వర్యంలో నడిచే గురుకులాల్లో రాజు పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందిన పిల్లలకూ ఒకే రీతిలో విద్యలు నేర్పించేవారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శిష్యులు గురువులకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురుకులాల నిర్వహణ కోసం కావలసిన వనరులను రాజులు సమకూర్చేవారు. విద్యాభ్యాసానికి తగిన వయసు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు గురుకులాల్లో చేర్చేవారు. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు వారు గురుకులాల్లోనే నివాసం ఉండేవారు. శిష్యుల యోగక్షేమాలను గురువులే చూసుకునేవారు. గురువులకు శుశ్రూషలు చేస్తూ శిష్యులు విద్యలను నేర్చకునేవారు. యోగ వంటి ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే వారైతే గురువును అవతారమూర్తిగా ఆరాధించేవారు. ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకునే శిష్యులు మోక్షమే లక్ష్యంగా గురువుల వద్ద ఉంటూ యోగ సాధన కొనసాగించేవారు. లౌకిక విద్యలు నేర్చుకునే శిష్యులు తమ తమ విద్యల్లో తగిన ప్రావీణ్యం సాధించిన తర్వాత గురువులు వారిని ఆశీర్వదించి సమాజంలోకి పంపేవారు. వారు వివిధ వృత్తుల్లో స్థిరపడేవారు. హిందూ మతంలోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాల్లోను, బౌద్ధ, జైన మతాల్లోని వివిధ శాఖల్లోనూ గురుశిష్య పరంపరకు విశిష్ట స్థానం ఉంది. గురుశిష్యుల అనుబంధానికి సంబంధించిన పలు గాథలు మన పురాణాల్లోను, ఆధ్యాత్మిక గురువుల చరిత్రల్లోనూ కనిపిస్తాయి. గురువు ఎలా ఉండాలంటే..? అద్వైత ఆచార్యుడు ఆదిశంకరాచార్యులు గురువు విశిష్టతను తన ‘ఉపదేశ సాహస్రి’లో వివరించారు. జ్ఞానసాగరంలో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడని ఆయన అభివర్ణించారు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాకుండా, వారి నియమ నియమాలను పాటించడంలో నిష్ణాతులుగా తయారు చేయాలని, వారికి రాగద్వేషాలను అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలని, అరిషడ్వర్గాలకు దూరంగా వారిని సన్మార్గంలో ముందుకు నడిపించడం గురువు బాధ్యత అని విశదీకరించారు. వేద వేదాంతాల్లో నిపుణుడు, జ్ఞానసంపన్నుడు, ఈర్షా్యద్వేషాలు లేశమైనా లేనివాడు, నిస్వార్థపరుడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి మాత్రమే గురువు కాగలడని, అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న గురువు మాత్రమే తన శిష్యులలో అంధకార తిమిరాన్ని పారద్రోలి వారిని జ్ఞానమార్గంలో ముందుకు నడిపించగలడని ఉపనిషత్తులు చెబుతున్నాయి. తత్వం ఎరిగిన వాడు, ధర్మాన్ని బోధించేవాడు, దైవత్వంగలవాడు మాత్రమే గురువు కాగలడని జైనమతం చెబుతోంది. గురువు మాత్రమే కైవల్యప్రాప్తిని కలిగించగలడని జైనుల విశ్వాసం. దైవత్వాన్ని తెలుసుకునే జ్ఞానమార్గానికి ఆలంబన గురువు అని సిక్కులు విశ్వసిస్తారు. గురువే ‘ధమ్మం’, గురువే ‘సంఘం’ అని బౌద్ధులు నమ్ముతారు. బుద్ధత్వాన్ని పొందిన గురువును అత్యుత్తమ గురువుగా వారు పరిగణిస్తారు. దత్త సంప్రదాయంలో గురుపూజ దత్త సంప్రదాయంలో గురుపూజకు చాలా విశిష్టత ఉంది. అత్రి అనసూయల తనయుడు, త్రిమూర్తి స్వరూపుడైన శ్రీదత్తాత్రేయుడిని గురుదత్తునిగా కొలుస్తారు. దత్తాత్రేయుని అవతారాలుగా పరిగణించే శ్రీపాద శ్రీవల్లభుని, శ్రీ నృసింహ సరస్వతి స్వామిని, శ్రీ షిరిడీ సాయిబాబాను గురుపూర్ణిమ రోజున ప్రత్యేక పూజలతో ఆరాధిస్తారు. దత్త క్షేత్రాలలోను, దత్త పీఠాల్లోను, షిరిడీలోని ప్రధాన ఆలయం సహా దేశవ్యాప్తంగా గల సాయిబాబా ఆలయాల్లో గురుపూర్ణిమ వేడుకలు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. దత్త భక్తులు, షిరిడీ సాయి భక్తులు ఈ రోజుల్లో గురు చరిత్ర, గురుగీత పారాయణం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. తమ తమ గురువులకు ఇతోధికంగా దక్షిణలు సమర్పించి, సత్కారాలు చేస్తారు. గురుపూర్ణిమ నాడు గురుపూజ వల్ల జ్ఞాన వృద్ధి, మోక్ష సిద్ధి కలుగుతాయని నమ్ముతారు. చరిత్రలో మన ఆధ్యాత్మిక గురువులు భారతదేశ చరిత్రలో ఆధ్యాత్మిక గురువులు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు తమ తమ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ప్రబోధించి, భిన్న మతాలను స్థాపించారు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని క్రీస్తుపూర్వమే స్థాపించారు. ఇవి విదేశాలకూ వ్యాపించాయి. అద్వైతాన్ని బోధించిన ఆదిశంకరాచార్యులు, విశిష్టాద్వైతాన్ని బోధించిన రామానుజాచార్యులు, ద్వైతాన్ని బోధించిన మధ్వాచార్యులు త్రిమతాచార్యులుగా ప్రసిద్ధికెక్కారు. ఆదిశంకరులు జీవించిన కాలం కేవలం 32 సంవత్సరాలు మాత్రమే అయినా, ఆ స్వల్పకాలంలోనే ఆయన ఆధ్యాత్మిక రంగంలో అసాధారణమైన పురోగతిని తీసుకొచ్చారు. వివేకచూడామణి, సౌందర్యలహరి వంటి గొప్ప రచనలు చేశారు. బ్రహ్మసూత్రాలపైన, భగవద్గీతపైన వ్యాఖ్యానాలు రాశారు. రామానుజాచార్యులు 120 ఏళ్ల పరిపూర్ణ జీవితం గడిపారు. దళితులకు ఆలయ ప్రవేశం వంటి సంస్కరణలకు తెరలేపిన తొలి ఆధ్యాత్మిక విప్లవకారుడు ఆయన. ద్వైత మార్గాన్ని బోధించిన మధ్వాచార్యులు ఆదిశంకరులు, రామానుజులు చేసిన రచనలపై విమర్శనాత్మక విశ్లేషణలు చేశారు. గురు రాఘవేంద్రులు మధ్వ మార్గానికి మరింత ప్రాచుర్యం కల్పించారు. నింబకారాచార్యులు ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ గురువు, కృష్ణభక్తుడు అయిన శ్రీ చైతన్య మహాప్రభువు భక్తి మార్గానికి ప్రాచుర్యం కల్పించారు. ఆధునిక యుగంలో మన గురువులు ఆధునిక యుగంలో కూడా పలువురు గురువులు యోగ, ఆధ్యాత్మిక మార్గాల్లో తమ తమ శిష్యులకు వెలుగు బాట చూపారు. బెంగాల్లో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని, అయితే ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. రామకృష్ణ పరమహంస వద్ద ఆధ్యాత్మిక విద్య పొందిన స్వామీ వివేకానంద పాశ్చాత్య ప్రపంచంలో సైతం భారతీయ ఆధ్యాత్మిక తత్వజ్ఞానానికి ప్రాచుర్యం కల్పించారు. స్వామీ వివేకానంద ఆధ్వర్యంలో రామకృష్ణ భక్తి ఉద్యమం దేశ విదేశాలకు విస్తరించింది. మహావతార్ బాబా పరంపరకు చెందిన పరమహంస యోగానంద సైతం భారతీయ యోగ ఆధ్యాత్మిక విద్యలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పించారు. లాహిరి మహాశయుని శిష్యుడైన యుక్తేశ్వర గిరి వద్ద పరమహంస యోగానంద యోగ విద్యాభ్యాసం చేశారు. తమిళనాడుకు చెందిన స్వామీ శివానంద కొంత కాలం దేశ విదేశాల్లో వైద్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. దివ్యజీవన సంఘాన్ని నెలకొల్పి ఆధ్యాత్మిక జ్ఞానానికి బోధించారు. స్వామీ శివానంద శిష్యుడైన స్వామీ కృష్ణానంద దివ్యజీవన సంఘం ద్వారా తన గురువు బోధనలకు మరింత ప్రాచుర్యం కల్పించారు. స్వామీ రామతీర్థ కొంతకాలం గణిత ఆచార్యునిగా పనిచేసి, తర్వాత ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. ప్రాక్ పశ్చిమ దేశాల్లో విస్తృతంగా పర్యటించి భారతీయ వైదిక జ్ఞానాన్ని, తత్వాన్ని బోధించారు. గౌడీయ వైష్ణవ కుటుంబానికి చెందిన స్వామీ ప్రభుపాద ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఉద్యమాన్ని దేశ విదేశాలకు విస్తరించారు. ఆయన ఇంగ్లిష్‌లోకి అనువదించిన భాగవతం విదేశాల్లో పాఠకాదరణ పొందింది. అరుణాచల స్వామిగా పేరుపొందిన రమణ మహర్షి భక్తిమార్గాన్ని బోధించారు. ఇలాంటి ఎందరో గురువులు భారతీయ వైదిక తత్వానికి, భక్తి మార్గానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. గురువు ప్రాముఖ్యత మన సనాతన సంప్రదాయంలో ఎనలేని ప్రాముఖ్యత ఉంది. గురువును త్రిమూర్తి స్వరూపంగా, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా పరిగణించి, పూజించడం మన సంప్రదాయం. గురువు రూపమే ధ్యానానికి మూలమని, గురు పాదాలే పూజకు మూలమని, గురు వాక్యమే మంత్రానికి మూలమని, గురు అనుగ్రహమే మోక్షానికి మూలమని ‘గురు గీత’ చెబుతోంది. విశాల విశ్వమే గురుస్వరూపమని సనాతన గురువులు చెప్పిన మాట. గురువులకే గురువుగా పరిగణించే దత్తాత్రేయుడు ఇరవై నాలుగు ప్రకృతి శక్తులనే గురువులుగా తలచి లోకానికి భక్తి జ్ఞానమార్గాన్ని బోధించాడు. గురు పూర్ణిమ రోజున వ్యాసుని మొదలుకొని గురు పరంపరను స్మరించుకుని పూజించడం ఆచారంగా వస్తోంది. మన దేశంలోని దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలలో గురుపూజ వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లోనైతే దేవాలయాలే కాకుండా విద్యాసంస్థల్లో కూడా గురుపూర్ణిమ వేడుకలు జరుగుతాయి. గురుపూర్ణిమ నాడు విద్యార్థులందరూ గురువులను సంప్రదాయబద్ధంగా టోపీలతో అలంకరించి, కానుకలతో సత్కరించి, వారి ఆశీస్సులు అందుకుంటారు. పురాణాల్లో ప్రసిద్ధ గురువులు మన పురాణాల్లో ప్రసిద్ధులైన గురువులు చాలామందే ఉన్నారు. దేవతల గురువు బృహస్పతి సకల శాస్త్ర కోవిదుడుగా పురాణాల్లో కనిపిస్తాడు. పలు ధర్మశాస్త్రాలు బృహస్పతి పేరుతో ప్రసిద్ధి పొందాయి. బృహస్పతి ప్రస్తావన రుగ్వేదం మొదలుకొని అనేక పురాణాల్లో కనిపిస్తుంది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూడా బృహస్పతికి దీటైన శాస్త్ర కోవిదుడు. శుక్రాచార్యుడు చెప్పిన నీతి సూత్రాలు ‘శుక్రనీతి’గా ప్రసిద్ధి పొందాయి. మరణించిన వారిని తిరిగి బతికించగల మృతసంజీవని విద్యకు శుక్రాచార్యుడే ఆద్యుడని, దేవతలతో జరిగిన యుద్ధాల్లో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు తన విద్యతోనే తిరిగి బతికించేవాడని పురాణాలు చెబుతాయి. రామ లక్ష్మణులకు గురువైన విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి చాటాడు. వశిష్టుడితో స్పర్థపూని అనేక కష్టనష్టాలను, అగ్నిపరీక్షలను ఎదుర్కొని మరీ బ్రహ్మర్షి పదవిని సాధించాడు. తాను బొందితో స్వర్గానికి పంపిన త్రిశంకుడిని దేవతలు కిందకు తోసేస్తే, అతడి కోసం దేవతల స్వర్గాన్ని తలదన్నే త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాడు. సప్తర్షులలో ప్రసిద్ధుడైన వశిష్టుడు రఘు వంశానికి కులగురువు. బాల్యంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్టుడి వద్దనే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. రామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు జన్మించారు. ఆయనే వారికి గురువుగా విద్యాబుద్ధులు నేర్పించాడు. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు సకల శాస్త్రాలతో పాటు అస్త్రశస్త్ర విద్యలనూ నేర్పించారు. కురువృద్ధుడు భీష్ముడు, ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. జగద్గురువుగా పూజలు పొందే శ్రీకృష్ణుడు బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు గురువులకే గురువుగా ప్రసిద్ధి పొందాడు. ఆయన గౌరవార్థమే గురుపూర్ణిమను వ్యాసపూర్ణిమగా పరిగణిస్తారు. గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం ఈసారి గురుపూర్ణిమ నాడే చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఇది సుదీర్ఘ చంద్రగ్రహణం. యోగ సాధకులు, మంత్రవేత్తలు గ్రహణాలు చాలా విశిష్టమైనవిగా పరిగణిస్తారు. పర్వదినాల్లో గ్రహణాలు వచ్చినట్లయితే, అవి మరింత విశిష్టమైనవిగా భావిస్తారు. గ్రహణ సమయంలో చేసే మంత్రజపం అనంత ఫలితాన్ని ఇస్తుందని విశ్వసిస్తారు. మంత్రోపదేశం పొందిన వారు గ్రహణకాలం ప్రారంభానికి ముందు స్నానం ఆచరించి, ఎలాంటి ఆహారం తీసుకోకుండా గ్రహణం పూర్తిగా విడిచిపెట్టే వరకు మంత్రజపం, ధ్యానం చేస్తారు. మంత్రోపదేశం లేని వారు నవ గ్రహశ్లోకాలలోని చంద్ర శ్లోకాన్ని ఈ సమయంలో పఠించుకోవచ్చు. గ్రహణం పూర్తిగా విడిచిన తర్వాత తిరిగి స్నానం ఆచరించి, ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు సంప్రోక్షణ జరిపి ఆ తర్వాతే నిత్యపూజ చేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత యథాశక్తి దానాలు చేస్తారు. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే గ్రహణ సందర్భంగా బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, కర్పూరం, చందనం, శంఖం, వెండి వస్తువులు, తెల్లని పువ్వులు, ముత్యాలు, తెల్లని వస్త్రాలు శక్తిమేరకు దానం చేస్తే దోష నివారణ జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గురుపూర్ణిమ గురించి కొన్ని విశేషాలు గురు పూర్ణిమ రోజునే వర్ధమాన మహావీరుడు గౌతమస్వామిని తన తొలి శిష్యునిగా స్వీకరించాడు. ఇదే రోజున గౌతమ బుద్ధుడు సారనాథ్‌లో తన శిష్యులను ఉద్దేశించి తొలి బోధ చేశాడు. ఆదిగురువు అయిన పరమశివుడు ఇదే రోజున సప్తర్షులకు యోగ రహస్యాలను బోధించాడు. వేదవ్యాసుడు తన జన్మదినమైన ఆషాఢ పూర్ణిమ రోజునే బ్రహ్మసూత్రాల రచన ప్రారంభించాడు గురుపూర్ణిమ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమంలోని గురువులు ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాటి నుంచి నాలుగు నెలల పాటు బస చేసిన చోటే ఉంటూ శిష్యులకు బోధన చేస్తారు. ఆధ్యాత్మిక సాధన ప్రారంభించదలచిన వారు గురుపూర్ణిమ రోజున గురువుల సమక్షంలో సాధన ప్రారంభించడాన్ని శ్రేష్టంగా భావిస్తారు. -
సంఘర్షణ నేర్పిన సంస్కృతి
తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. ‘హిందూమతంతో మాకు ఎటువంటి సామ్యం లేదు. మేము హిందువులు అనుసరించే పూజా పద్ధతులనూ, ఇతర విధానాలనూ అనుసరించటంలేదు. మా దైవం, దేవత అంతా దర్పణమే. అంటే అద్దానికే పూజలు చేస్తాం. దేవాలయాల్లో కొబ్బరి కాయలు కూడా కొట్టం. మా వివాహ పద్ధతులు వేరు. మరణం తర్వాత పాటించే సంప్రదాయాలు వేరు. అందువల్లనే మమ్మల్ని వేరే మతంగా ప్రకటించాలని కోరుతున్నాం’ అంటూ ‘అయ్యవాజి’ సామాజిక వర్గం కోరుతున్నది. జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా, కన్యాకుమారిలో ఉన్న ప్రధాన దేవాలయాన్ని సందర్శించిన సమయంలో తాము ఇలా విజ్ఞప్తిని చేశామని, ఆమె సానుకూలంగా స్పందించారని, కానీ ఆమె మృతితో తమ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ విధంగా మిగిలిందని, అయ్యవాజీల అధిపతి బాలప్రజాపతి అడికల్ ఈ మధ్య పత్రికా ప్రతినిధుల ఎదుట వాపోయారు. కర్ణాటకలో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత వీరి డిమాండ్‌కు ప్రాధాన్యం పెరి గింది. కానీ ఇది కొత్త డిమాండ్ కాదు. అయ్యవాజి సామాజిక వర్గం ఎక్కడిది? ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నలు సందర్భోచితం. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ట్రావెన్కోర్ సంస్థానంలో ఒక సామాజిక ఉద్యమం పురుడు పోసుకున్నది. ఆ ఉద్యమమే ఆ తర్వాత ఒక జీవన విధానమైంది. ఆ ఉద్యమ వ్యవస్థాపకుడినే భగవంతుడి అవతారంగా పరిగణించారు. ఆనాటి అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన తిరుగుబాటు ఒక మత సంప్రదాయంగా అవతరించింది. ఒక సామాజిక పోరాటం మతంగా రూపుదిద్దుకోవడం ఎలా జరిగిందో ఊహించడానికి ఇదొక ఉదాహరణ. పైగా ఇది ఆధునిక యుగంలో జరగడం విశేషం. ట్రావెన్కోర్ సంస్థానంలో కులవివక్ష, అణచివేత, అంటరానితనం కింది స్థాయి ప్రజలను ఎన్నో ఇక్కట్లకు గురిచేశాయి. మెజారిటీ కులాలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. ఉద్యోగాల్లో స్థానం లేదు. అగ్రకులాలు నడిచేదారుల్లో నడవడానికి వీలు లేదు. ఇందులో ఎక్కువగా వివక్షకు, అణచివేతకు గురైంది నాడార్లే. నాడార్ల ప్రధాన వృత్తి కల్లుగీత. వ్యవసాయం ఇతర నిర్మాణ పనుల్లోను వీరి ప్రమేయం ఎక్కువే. వీరి చేత ప్రభుత్వ భవనాలూ, దేవాలయాలూ నిర్మాణం చేయించేవారు. కానీ వేతనాలు లేవు. స్పష్టంగా చెప్పాలంటే వెట్టిచాకిరి. ఇంకా సంస్థానాధీశులు వీరిపైన విపరీతంగా పన్నులు విధించేవారని చరిత్ర చెబుతోంది. దాదాపు 300 రకాల పన్నులు. ఈ పన్నులలో పురుషాంతరం అనే పన్ను తీవ్రమైనది. తాతముత్తాతల ఆస్తిలో దాదాపు 40 శాతం విలువైన డబ్బునీ, ధనాన్నీ, సంస్థానానికి అప్పగించాలి. ప్రాయశ్చిత్తం పేరుతో మరోపన్ను. ఎవరైనా ఒక పురుషుడు ఇతర ప్రాంతాలకూ, దేశాలకూ వెళితే పన్ను. ఇల్లు కట్టుకున్నా, గుడిసె వేసుకున్నా పన్ను. చివరకు చెట్లను పెంచితే, ఒక్కొక్క రకం చెట్టుకి ఒక్కొక్క రకం పన్ను విధించేవారు. కొత్త దుస్తులు, నగలూ, తలపాగా ధరించినా, గొడుగుపట్టినా, పెళ్లి ఊరేగింపు జరిపినా పన్ను చెల్లించాల్సిందే. పెళ్లి చేసుకుంటే తాళి పన్ను. ఆవులను, మేకలను, చివరకు కుక్క లాంటి జంతువులను పెంచుకున్నా పశువుల పన్ను. గానుగ ఆడే వారిపైనా పన్ను. ఓడ నడిపే వారికి ఓడ పన్ను, చేపలు పట్టేవారికి వలపన్ను. ఎడ్లబండి పన్ను. గొడ్డలి పన్ను, సుత్తి పన్ను, గునపం పైన కూడా పన్నులు విధించేవారు. వాటి భారంతో ప్రజలు విలవిల్లాడిపోయేవారు. ఘోరమైన విషయం స్త్రీల పైయ్యెదపై ఏ ఆచ్ఛాదనా ఉండకూడదు. ఒకవేళ ఎదపై వస్త్రాన్ని ధరించినట్టయితే పన్నుచెల్లించుకునే దారుణమైన పరిస్థితి. స్త్రీలు అర్థనగ్నంగా మంచినీళ్ల బిందెలను నెత్తిపై పెట్టుకొని తెచ్చుకోవాలి. అలా బిందెను మోసుకొస్తున్నప్పుడు రెండు చేతులూ పైకెత్తి ఉంచాలి. స్తనాల పరిమాణాన్ని బట్టి పన్నులు చెల్లించాల్సి ఉండేది. స్త్రీలు పన్నులు చెల్లించలేని స్థితిలో ఉంటే అధికారికంగా వారి పైన అత్యాచారాలు చేసే నీచమైన పద్ధతులు ఉండేవి. వీటన్నిటిపైనా స్త్రీజాతిలో అంతులేని ఆగ్రహం నిద్రాణమై ఉండేది. పన్నులు చెల్లించకపోతే తీవ్రమైన శిక్షలు అమలు చేసేవారు. అయినా ప్రభుత్వ భూములను, దేవాలయ భూములను వీరే ఉచితంగా సాగుచేయాలి. పండుగల్లో రాజకుటుంబాలకూ, అధికారులకూ కోళ్లనూ, గుడ్లను, పండ్లను, కూరగాయలనూ, వంటచెరుకునూ అందించాలి. ఆర్థిక ఆంక్షలు, నిషేధాలు, పన్నులు, సామాజిక అణచివేత, అత్యాచారాలు జరుపుతూనే ఆధిపత్య కులాలు వీరిని మతపరంగా వెలివేసినంత పనిచేశాయి. ఆధిపత్య కులాల దేవాలయాల్లో వీరికి ప్రవేశం లేదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించడానికి వీరు అనర్హులు. వాళ్లు ఆధిపత్య కులాల దేవుళ్లు. కింది కులాల కోసం వీరభద్రుడు, సుధాలయ్ మదన్, ఇరులన్, ముత్తురామన్, భద్రకాళి లాంటి దైవాలనే వీరు పూజించాలి. ఇలాంటి నేపథ్యంలోనే 1809లో ఆ సంస్థానంలోని తామరక్కులం గ్రామంలో పొన్ను నాడార్ వెయ్యిలాల్ అమ్మాళ్‌లకు ఒక కొడుకు జన్మిం చాడు. మొదట ముదిచోడుం పెరుమల్గా అతడికి నామకరణం చేశారు. దాని అర్థం కిరీటం ధరించిన ప్రభువు. కానీ ఆధిపత్య కులాలు దానికీ ఆగ్రహించాయి. చివరకు తల్లిదండ్రులు కొడుకు పేరును ముత్తుకుట్టిగా మార్చారు. ముత్తుకుట్టి 22 ఏళ్ళ వరకు సాధారణ జీవితాన్నే గడిపారు. ఇంటి పన్నుల్లో ఇతర వృత్తి పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా నిలబడ్డారు. అప్పుడే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్రామంలో ఉండే వైద్యులు, దగ్గరి పట్టణాల్లోని వైద్యులు చేసిన చికిత్సకు ఏం ఫలితం లేకపోయింది. కొందరి సలహా మేరకు తన కొడుకుని తిరుచందూరులోని దేవాలయానికి తల్లి తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత దగ్గరి సముద్రంలోనికి ముత్తుకుట్టి పరుగు లంఘించుకున్నాడు. ఎటు వెళ్లాడో తెలి యదు. మూడు రోజుల తర్వాత ముత్తుకుట్టి ప్రత్యక్షమయ్యాడు. ఏదో దైవాంశతో ఇలా జరిగిందని తల్లిదండ్రులూ, బంధువులూ భావిం చారు. ఆయన తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మార్గంలో ఎంతో మంది ఆరోగ్యాలను మెరుగుపరిచినట్టు ఆయన జీవిత చరిత్రలో ఉంది. సామాజిక పరిశోధకులు ఆయనను మరో రకంగా విశ్లేషించారు. ఆ తరువాత ఆయన పేరు అయ్యావైకుందార్గా మారింది. ప్రజల్లో తన సేవల ద్వారా తన ప్రవచనాల ద్వారా మంచి పేరును సంపాదించారు. అప్పటి వరకు కొనసాగుతున్న అణచివేత, వివక్షలపైన ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. దీనితో ఆధిపత్య కులాలు సంస్థానానికి ఎన్నో ఫిర్యాదులు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నాడని, రాజ్యాన్ని కూలదోయాల్సిందిగా ప్రేరేపిస్తున్నాడని నూరిపోశారు. దీనితో తప్పనిసరై సంస్థానాధీశులు అయ్యావైకుందార్‌ను అరెస్ట్ చేయడానికి సైన్యాన్ని పంపించారు. అయితే వేలాది మంది ప్రజలు అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు. కానీ అయ్యావైకుందార్ ప్రజలకు నచ్చచెప్పడంతో సైన్యానికి దారిచ్చారు. సైన్యం ఆయనను అరెస్టు చేసి, సుచింద్రంలోని రాజు ఎదుట హాజరుపరిచారు. రాజు ఆయనను పరీక్షించదలచి, మాయలు, తంత్రాలను ప్రదర్శించాని ఆజ్ఞాపించాడు. ఇందుకు అయ్యావైకుందార్ తిరస్కరించారు. దానితో జైలు శిక్ష విధించారు. రెండు రోజుల తర్వాత రాజధాని తిరువనంతపురం తరలించి, మరోసారి పరీక్షించే యత్నం చేసి, విఫలమయ్యారు. సారాలో విషం కలిపి తాగించారు. అయితే ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇది జరుగుతుండగానే ప్రజలు వేలాదిగా ఆయన ఆశీర్వాదం కోసం తిరువనంతపురం చేరుకోవడంతో రాజు కంగారు పడ్డాడు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోవడంతో అయ్యావైకుందార్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ వైకుం దార్ అంగీకరించలేదు. తన శిక్షాకాలం దాదాపు 110 రోజులు జైలు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత ఆయన తన సామాజిక ప్రతిఘటనోద్యమంతో సాంస్కృతికపరమైన ఒక నూతన మత సంప్రదాయాన్నీ నెలకొల్పారు. అదే అయ్యవాజీ సంప్రదాయం. ఈ సంప్రదాయానికి దేవాలయం ఉంటుంది. దేవుడు ఉండడు. ఇంటిలో, గుడిలో ఒక అద్దం ముందు నిలబడి మాత్రమే పూజలు చేయాలి. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడనేదే దానర్థం. ఇందులో వేదాలకూ, పురాణాలకూ, ఇతిహాసాలైన మహాభారతం, రామాయణం, భాగవతం లాంటి వాటికీ స్థానం లేదు. సంస్కృత మంత్రాలూ, వచనాలూ ఉండవు. వైకుందార్ ఈ సంప్రదాయం కోసం మొట్టమొదటిగా కన్యాకుమారిలో ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం పేరు స్వామితొపే. అందులోభాగంగానే ఆయన ‘అఖిలం’ పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. నిత్యం తిరుణాల్ అని (ప్రతి రోజూ పండుగేనని), ప్రత్యేకమైన పండుగల ఆవశ్యకత లేదనీ ప్రకటించాడు. ఈ రోజు అదే సామాజిక వర్గానికి చెందిన వారు తమిళనాడులో తమను ప్రత్యేక మతంగా గుర్తించాలనీ, తమకూ హిందూ మతానికీ ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. అందుకే అయ్యా వైకుందార్ చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ‘ఓ భగవంతుడా ఇటు వినండి! నా ప్రజలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వుంది. సంప్రదాయాలూ, కట్టుబాట్లూ మాకు లేవు. మేము దేవాలయాలను నిర్మించం. పూజారులుండరు. మేము ఆవులనూ, మట్టి విగ్రహా లను పూజించం. మేం మేకలనూ, కోళ్ళనూ, గొర్రెలనూ, ఎద్దులనూ, మొత్తంగా పశువులను బలివ్వం. జీవజాతులన్నింటినీ మేం సమంగా ప్రేమిస్తాం.’ మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 97055 66213 -
చెవులు ఎందుకు కుట్టించాలి?
చెవులు కుట్టించుకోవడం అనేది కేవలం అందం కోసమేనని చాలామంది భావిస్తారు. మరికొందరు ఇదో మూఢనమ్మకంగా భావిస్తారు. మొరటు చర్యగా, చిన్నారులను హింసించే చర్యగా కొందరు వితండవాదం చేస్తారు. అందుకే ఇటీవల కాలంలో చాలామంది చెవులు కుట్టించే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. బయట దుకాణంలో దొరికే కమ్మలను చెవికి అతికిస్తే సరిపోతుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ అది పొరపాటు. ఈ సంప్రదాయం వెనక గొప్ప వైజ్ఞానిక విషయాలనేకం ఉన్నాయి. చెవులు కుట్టించడం అనేది ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి సంబంధించినది. అయితే.. ఇలాంటి మెళకువలన్నీ భారతీయులే కనిపెట్టారని, కనక ఇది భారతీయుల సంప్రదాయమని చెబుతున్నారు. ఆ తర్వాతే చైనీయులు మన ఆచారాన్ని తీసుకున్నారంటారు. అదలా ఉంచితే, చెవికి కళ్లు, ముక్కు, పళ్లు వంటి అవయవాలతో సంబంధం ఉంది. కాబట్టి చెవులు కుట్టించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెవులు కుట్టించడం వల్ల రుతు సంబంధ అనారోగ్య సమస్యలు రావని, ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుందనీ, మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ ఆధునికులు కూడా అంగీకరిస్తున్నారు. చెవులు కుట్టడం వల్ల ఆ ప్రాంతంలో నాడీ మండల వ్యవస్థను ఉత్తేజితం చేసే నాడులు ప్రేరణ చెందుతాయి. దీంతో జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు, చెవులకు కింది భాగంలో మధ్యలో పోగులు కుట్టడం వల్ల కళ్లకు సంబంధించిన నాడులు ఉత్తేజితమై.. కంటిచూపు మెరుగుపడుతుంది... ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. పూర్వం పురుషులకు కూడా విధిగా చెవులు కుట్టించేవారు. ఇప్పుడు కూడా కొందరు పురుషులు ఫ్యాషన్‌గా చెవులు కుట్టించుకుంటున్నారనుకోండి... మంచి పరిణామమే అనుకోవాలి. -
నమస్కారం భారతీయ సంస్కారం
సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళినపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం. ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ? చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ కలుసుకుంటాయి కదా...ఇవి ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం. ఈ పదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపు మరల్చి శరణాగత భావంతో అర్పణ చేయటమే! న+మమ, నాది అనేది ఏమీలేదు. అంతా నీదే! స్వీకరించు పరమాత్మా! అనే అర్పణ భావనను కలిగి ఉండటం. ఇంతేకాక నమస్కారం ‘ తత్వమసి ‘ అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. కుడి అరచేయి మనకు కనపడని ‘తత్ ’ ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు –– తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవది లేదనే భావనే! ఇది శాస్త్రీయమైన, సంప్రదాయమైన కారణమైతే, దీనివెనక ఎంతో సైన్స్ విజ్ఞానం దాగి ఉంది. అదేమిటో చూద్దాం...నమస్కరించే సమయంలో మన చేతులకున్న పది వేళ్లు ఒకదానికి మరొకటి తాకడం వల్ల మన శరీరంలోని కళ్లు, చెవులు, మెదడు వంటి అవయవాలలో చైతన్యం కలుగుతుంది. దీనివల్ల ఎదుటివ్యక్తిని చిరకాలం గుర్తుంచుకోవచ్చనే నమ్మకం ఉంది. నమస్కారం చేయడం వల్ల గుండె భాగంలో ఉండే చక్రం తెరుచుకుంటుంది. ఎదుటి మనిషి కూడా మనకు నమస్కరించినపుడు ఒకరికొకరు తమ ఆత్మ శక్తి ద్వారా అనుసంధానించబడతారు. కేవలం మాటలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం కాకుండా ఆత్మానుసంధానమైన వారధి నిర్మించుకోవడానికి ఈ నమస్కారం దోహదం చేస్తుంది. అంటే మాటలతో అవసరం లేకుండా.. ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంబంధం ఏర్పడుతుందనేది నమస్కారం వెనక ఉన్న రహస్యం.సైంటిఫిక్ రీజన్ ఏమిటో మరోసారి చూద్దాం... నమస్కారం పెట్టే సమయంలో అరచేతులని దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ విధమైన శక్తి విస్ఫోటనం అవుతుంది. ఇలా చేయడం వల్ల జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది. అవతలి వారికి సదభిప్రాయం కలుగుతుంది. అలా అవతలి వ్యక్తిని మనతో సహకరించే జీవిగా చేసుకుంటామన్నమాట. -
నుదుటి కేక
వీడు తగిలాడు. వీడు అనే సంస్కారం కాదు తనది. కాని వీడు అనదగ్గవాడే వాడు. అసలే తన టెన్షన్లో తాను ఉంది. పిరియడ్స్ వచ్చేలా ఉన్నాయి. వస్తే ఏం చేయాలి అనేది టెన్షన్. వచ్చాయని చెప్పాలా? చెప్తే... మొన్నొక రోజు ఆ ఇంటి పెద్దకూతురు మూడురోజుల పాటు బాత్రూమ్ పక్కన ఉన్న స్థలంలో కూర్చున్నట్టు తనూ కూచోవాలా. అక్కడే తినాలా? అక్కడే నిద్రపోవాలా? పోనీ చెప్పకుండా దాచేస్తే? అది మోసం కదూ. దాచామే పో. ప్యాడ్స్‌ను ఎక్కడ పారేయాలి? స్నానానికి వెళ్లినప్పుడు విప్పిన బట్టల్లో దాచి, తెచ్చి, బ్యాగ్‌లో పెట్టుకొని బయటకు వెళ్లి పారేయాలి. ఛీ. వాసన. తన ఇంట్లో అయితే ఇలాంటి సమస్య ఉండేది కాదు. పిరియడ్స్ వచ్చినా రాకపోయినా ఒకేలాగ తిరుగుతారు. ఏసునాథా... పిరియడ్స్ రాకుండా చూడు తండ్రీ. నవ్వొచ్చింది. ఏసునాథుడు ఎందుకు చూడాలి?ఇక్కడకు వచ్చేటప్పుడు లాకెట్‌లోని ఏసునాథుణ్ణి తీసి ఉత్త లాకెట్ వేసుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ఎర్రటి బొట్టుబిళ్లలు పెట్టుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ‘అండీ’ ‘ఔనండీ’ ‘చాలా బాగా చెప్పారండీ’ వంటి మాటలు మూతికి తగిలించుకుని వస్తుంది. స్నేహితురాలు అలా అలవాటు చేసింది. ఆ అమ్మాయి మంచిది. తనంటే ఇష్టం. ప్రాణం. కులం ఏమిటి మతం ఏమిటి కడగొట్టుజాతి వాళ్లా కిరస్తానీలా పట్టించుకోలేదు. ఇష్టంవోయ్ నువ్వంటే అనేది. ఇంటికి తీసుకెళ్లేది– బొట్టు పెట్టాకే అనుకోండి. వాళ్ల అమ్మానాన్నలు సంప్రదాయం కలిగినవారు. పూజ, మడి, ఆచారం కలిగినవారు. అయితే ఏమిటి? ఇంతమంచి ముక్కూ ముచ్చట ఉన్న అమ్మాయి అచ్చు మనమ్మాయిలానే ఉంది అని అనేవారు.తను కూడా అలా ఉండేది.స్నేహితురాలి సమక్షంలో ఆ స్నేహితురాలే తనకు పూనినట్టుగా ఉండేది. ఆ సమయంలో రిక్షా వేసే తండ్రి చిరాగ్గా కనిపించేవాడు. తల దువ్వుకోక మాసిన చీర కట్టుకుని ఉండే అమ్మ చిరాగ్గా కనిపించేది. రోజు విడిచి రోజు నీసుకూర తెస్తే తప్ప ముద్ద దిగని తమ్ముడు, చిటికెలో మునుసును జుర్రి మూలిగని నోట్లో వేసుకునే తమ్ముడు చిరాగ్గా కనిపించేవాడు. సువార్తవాణి– అనే పేరులో సువార్తను కత్తిరించి అవతల పారేసింది. పద్యం ఇష్టం అనేది. గద్యం ప్రాణం అనేది. పెద్దనను పెదనాన్నగా గుర్తించేది. ఫ్రెండ్స్ అందరి మధ్యా– మా ఇంట్లోనా మా ఇంట్లో నీసూ గీసూ అస్తమానం వండరమ్మా... మా అమ్మ ఎంచక్కా కొబ్బరీ శనగపప్పు వంటి కూరలే చేస్తుంది తెలుసా– అని చెప్పేది. మేము చర్చికి వెళితే వెళతాం లేకపోతే లేదు అనేది. ఇంకా ఏమిటి? అసలు చర్చే ఎగ్గొట్టేది.తనకు తెలుసు. స్నేహితురాలి ఇంట్లో తను ఎంతో తానూ అంతే.కాని– ఆరోజు– అక్క బారసాలలో ఆ స్నేహితురాలు అందరు ముత్తయిదువుల కాళ్లకు పసుపు రాస్తూ ‘చీ... నీకు పసుపు రాయకూడదే. నేను నీ పాదాలు ముట్టుకోకూడదు’ అని అన్నప్పుడు ఒక్కక్షణం వెనుకంజ వేసింది. వాళ్లవీ పాదాలే. తనవీ పాదాలే. మధ్యలో మైల ఎక్కణ్ణుంచి వచ్చింది?గట్టి స్నేహం ఇద్దరిదీ.తను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. తాను లెక్చరర్ అయ్యి స్పాట్ వాల్యుయేషన్ పని ఉంటే హైదరాబాద్ వచ్చి, వాళ్ల అమ్మానాన్నలు అక్కడే సెటిల్ అయి ఉన్నారు కనుక, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు అనుకుని దిగింది. పెద్దకూతురు, అల్లుడు కూడా వాళ్లతోనే ఉంటున్నారు. ఆమె తనకు అక్క. కనుక అతడు బావ. బావా బావా అని గౌరవంగా పిలిచేది. కాని ఇప్పుడు ఇలా తగిలాడు. బజారులో. కాఫీ కోసం హొటల్కు తీసుకెళ్లి ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.‘మాదేముందండీ బతుకు బుగ్గి జీవితం మట్టి. అదే మీ వాళ్లలో అయితే లైఫ్ పైలాపచ్చీసుగా వెళ్లిపోతుంది. మా ఆడపిల్లలకు ఎంతసేపటికి సంగీతం అనీ సంప్రదాయం అనీ పద్ధతి పాడూ అనీ... మీలా ఫ్రీగా ఉంటారా వాళ్లు. ఫ్రీగా మూవ్ అవుతారా?అందుకేగా పల్లెల్లో పైకులాల వాళ్లు మీతో వామి చాటుకు వెళుతుంటారు. అసలు మీ డ్రస్సులూ, మీ ఫాస్ట్‌నెస్, అబ్బాయిలతో రాసుకుపూసుకు తిరిగే పద్ధతి... ఇవన్నీ నాకు పిచ్చండి. అలా ఉండాలి అమ్మాయిలు. మా ముండలూ ఉన్నారు. ఎందుకు? తగలెట్టుకోనా? అయినా ఈ మధ్య పల్లెల్లో రిస్క్ అవుతోందని విన్నాను. ఈ హైదరాబాద్‌లో అయితే ఎవరు పట్టించుకుంటారు లేండి. అంతదాకా వస్తే సైన్సు చాలా ఇంప్రూవ్ అయ్యిందిగా. ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నప్పుడు అక్కడిదాకా ఎందుకొస్తుందనేది నా ప్రశ్న. ఉండండి ఇక్కడ. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. నేనుంటాను. నాకు మీరుంటారు’...చాలా దుఃఖం కలిగింది ఆ రాత్రి. నిద్ర పట్టలేదు. ఎంత మాటన్నాడు. ఆ మాటనే ధైర్యం ఎవరిచ్చారు? తెల్లారి గోలగోలగా ఉంటే నిద్ర లేచింది. స్నేహితురాలి తండ్రి భార్యను తిడుతూ ఉన్నాడు.‘దరిద్రపు ముఖమా అంటే దరిద్రపు ముఖమానీ. కార్పెంటర్‌తో సరిగ్గా పని చేయించవే అంటే చేయించలేదు. అన్నీ నేను చూసుకు చావాలా? నీ కళ్లు కాకలెత్తుకెళ్లాయా?’వింటూ ఉంది.‘ఏం దాపురించావే నాకు. ఏం దాపురించావూ అని. అసలు అగ్రహారం పుటకేనా నీది?’వింటూ ఉంది.‘ఇలాక్కాదు నిన్ను. నడ్డి మీద తన్ని ఏ మాలవాడకో మాదిగవాడకో తరమాలి. అప్పుడు తప్ప నీకు బుద్ధిరాదు. వాళ్లలో అయితే బాగా కలిసిపోతావు’ఎవర్ని తిడుతున్నాడీయన. ఆమెనా? తననా? స్త్రీజాతినా? దళిత బతుకునా? ఈ దేశంలో రెంటికీ తేడా అంటూ ఒకటి ఏడ్చిందా?నుదురు మీద ఏదో పెద్ద బరువు ఉన్నట్టు అనిపించింది. బొట్టు. తీసేసింది. తల్లి గుర్తుకొచ్చింది. తన తల్లి. తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రి. భాష గుర్తుకొచ్చింది. తన భాష. కూర గుర్తుకొచ్చింది. తన కూర. నుదురు గుర్తుకొచ్చింది. తన నుదురు. అవును. ఇదే తన నుదురు.కాసేపటికి బ్యాగు సర్దుకొని వెళుతూ వెళుతూ వాళ్ల ముందు నిలుచునింది. ‘వెళతానండీ’ ‘సరే’కదులుతుంటే ఆమె అంది– ‘బొట్టు మర్చిపోయినట్టున్నావ్ అమ్మాయ్’ఆగి స్థిమితంగా జవాబు చెప్పింది– ‘మర్చిపోలేదండీ. నుదురు ఇలాగే ఉండాలి. నేను వాడ అమ్మాయిని. కిరస్తానీ పిల్లని’. ఆమె ముందే పర్స్‌లోని జీసస్‌ను తీసి చైన్‌లో వేసుకుంది కూడా.కథ ముగిసింది. వినోదిని రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కథ ఇది. పేపర్లలో వార్తలు వస్తుంటాయి. దళిత ఆయాలు వండిన అన్నం మేం తినం అని పిల్లలు ధర్నా చేస్తుంటారు. ఏ వయసు నుంచి మనం విషం నూరిపోస్తున్నాం. సినిమాల్లో గమనించారా? బికినీలలో ఉన్నవ్యాంప్ల పేర్లు మేగీ, రోజీ అని ఉంటాయి. పాపులర్ కల్చర్ ద్వారా ఏ భావజాలాన్ని పాదుకునేలా చేస్తున్నాం? పల్లెల్లో సామెతలు, జాతీయాలు, అశ్లీల భాష ఏ స్త్రీలను చులకన చేస్తున్నాయి? స్త్రీలే అణచబడ్డ వర్గం అంటే మళ్లీ ఆ వర్గంలో ఇంకా అణచబడ్డ స్త్రీ వర్గం. శతృవును పట్టుకోవాలంటే ఆ కన్నూ ఈ కన్నూ కలవాలి. ఇటు కదిలారు. ఓహ్.. అటు కూడా. పునః కథనం: ఖదీర్ -వినోదిని -
బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవడం
బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున అని తెలుసు కానీ.. సరైన సమయం మాత్రం చాలామందికి తెలియదు. సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలకు, మంచి ఆలోచనలు చేయడానికీ విశిష్టమైన సమయంగా చెబుతారు పెద్దలు. ఇంతకూ దీని గురించి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతోందో చూద్దామా... ∙రాత్రి తొందరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచేవారికి ఆనారోగ్య సమస్యలు రావని ఆయుర్వేదం చెబుతోంది. ∙ప్రతిరోజూ సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ∙బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల సూర్యుని లేలేత కిరణాలు మన పైన ప్రసరిస్తాయి. సూర్యరశ్మి లో ఉండే విటమిన్ డి ఎముకల బలానికి సహాయపడుతుంది.... ∙ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింబగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. ∙బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు, సకల పుష్పాలు ఈ ముహూర్తంలోనే పరిమళాలు వెదజల్లుతాయి. ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ధి వికసించి ఉత్తమమైన ఆలోచనలు వస్తాయి. -
మరోసారి ట్రెడిషన్ బ్రేక్ చేయనున్న జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సార్వత్రిక ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎప్పుడూ ఆంగ్లంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక శాఖ మంత్రి తొలిసారి రేపు హిందీలో బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. గ్రామీణ ప్రజలకు చేరువయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పాత సాంప్రదాయానికి గుడ్‌బై చెపుతూ రేపటి బడ్జెట్‌ను ఆర్థికమంత్రి హిందీలో చదవనున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మొత్తం వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వస్తున్న సందర్భంగా గ్రామీణ ప్రజలకు, రైతులకు అర్థమయ్యే రీతిలో ఈసారి హిందీలో ప్రసంగించాలని అరుణ్ జైట్లీ ఈ నిర్ణయం తీసుకున్నారట. దీంతో హిందీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తొలి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీనే కావడం విశేషం. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌కు కావాల్సిన సన్నాహాలు పూర్తి చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కావడం మరో విశేషం యూనియన్ బడ్జెట్ అంటే.. అదో బిగ్ డే. ప్రతీ ఏటా కేంద్ర బడ్జెట్ వస్తోందని అనగానే సామన్యుడి నుంచి ఎనలిస్టుల దాకా ..కార్పొరేట్ సెక్టార్ సహా దాదాపు అన్ని రంగాలు అలర్ట్ అయిపోతాయి. రాయితీలు, ఊరటలు, ఉపశమనాలు అంటూ ప్రతీ రంగం ఎదురు చూస్తుంటుంది. తమకు కావల్సిన సౌకర్యాలు, దక్కాల్సిన ఊరటలపై అనేక అంచనాలు.. కోరికలను వెల్లడించడం ఆనవాయితీ..మరోవైపు ఆర్థిక రంగాన్ని ఇటు దేశ ప్రగతిని.. మరోవైపు రాజకీయ ప్రయోజనాలను.. ఇంకోవైపు ప్రజల సంక్షేమానికి సమతూకం పాటిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసేందుకు అధికార కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇదులో తీపి కబుర్లు.... షాక్‌లు తగలడం కామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సామే. అందులోనూ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఐ సర్కార్‌కు మరింత కీలకం. ఈ అంచనాల మధ్య కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గానూ పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ గురించి ఇతర కొన్ని ఆసక్తికర విషయాలు సంప్రదాయానికి విరుద్ధంగా బడ్జెట్‌ను నెలరోజుల ముందే ప్రవేశపెట్టడం.. 2017 నుంచి ప్రారంభించారు. ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్లో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే రైల్వే బడ్జెట్‌తో యూనియన్ బడ్జెట్‌ను ప్రకటించడం ఇది రెండవ సారి. ఈ సాంప్రదాయం గత ఏడాదే మొదలైంది. 2017లో రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో చేర్చారు. 92 ఏళ్లుగా వస్తున్న పార్లమెంట్ సాంప్రదాయానికి వీడ్కోలు చెప్పారు. బడ్జెట్‌ను సాధారణంగా ఫిబ్రవరి నెల చివరి రోజున (పార్లమెంట్ పనిదినాల్లో) సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ వాజ్‌పేయి హయాంలో ఉదయం 11 గంటలనుండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు హల్వా వేడుక జరుగుతుంది. ఈ వేడుకల్లో ఆర్ధికమంత్రి స్వయంగా పాల్గొంటారు. బడ్జెట్ రూపకర్తలకు, సిబ్బందికి హల్వా పంచుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ఒకరోజు ముందు నోరు తీపి చేసుకోవడం సంప్రదాయం. బడ్జెట్ పత్రాలను బడ్జెట్‌కు వారం రోజుల ముందే ముద్రిస్తారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్, సెంట్రల్ సెక్రటేరియట్లో వీటిని ముద్రిస్తారు. హల్వా వేడుక తరువాత బడ్జెట్ ప్రింటింగ్‌తో సంబంధం ఉన్న ప్రతి అధికారి ఆ ప్రాంగంణం వదిలి బయటికి రావడానికి లేదు. కనీసం వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా దూరంగా ఉండాలి. బడ్జెట్ సమర్పణ పూర్తయ్యేవరకు ఇది కొనసాగుతోంది. అయితే మాజీ కేబినెట్ కార్యదర్శి, ప్రణాళికా సంఘ సభ్యుడు బి.కె. చతుర్వేది చెప్పినట్టుగా, ప్రభుత్వం ప్రతీదీ డిఫరెంట్‌గా చేస్తోంది. ఈ సారి లెదర్ బ్యాగ్ నుంచి హల్వాదాకా ప్రతిదీ అత్యంత రహస్యంగా చక్కబెడుతోంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే 1969లో ప్రధాని ఇందిరా గాంధీ మహిళా ఆర్థికమంత్రి హోదాలో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మహిళ ఆర్థికమంత్రిగా పనిచేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఇప్పటివరకు కేంద్ర ఆర్థికమంత్రిగా ఇందిరా గాంధీ తరువాత ఇంకెవరూ ఈ పదవిని చేపట్టలేదు..బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. -
సంప్రదాయ సంబరం
మన సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? వాటిని శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి– అనేది తెలుసుకోవడం అవసరం. ఓర్పును నేర్పే ముగ్గులు ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో వేస్తే చాలు. గంటసేపు వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ గీతలు గీయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. పైటచెంగును సరి చేసుకుంటూ, జడను వెనక్కు వేసుకుంటూనే ముగ్గు మీద బోలెడంత ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే సమస్యాపూరణం లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. గంగిరెద్దులు.. హరిదాసులు... భిక్షానికీ ఓ ధర్మం.. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామ సంకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది అని చెబుతారు పెద్దలు. అసహ్యం నుంచి అద్భుతాల గొబ్బెమ్మ కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. జీవితం దారం వంటిదని చెప్పే పతంగం మనిషికి ఆత్మనిగ్రహం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. లాగితే తెగిపోతుంది. వదలకుంటే ఎగరలేదు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైనా! చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము. చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్నదిని మరచిపోలేదని చెప్పడానికే గాలిపటాలు ఎగుర వేస్తారు. కోడిపందేలు యుద్ధనీతిని గెలిపించే పందెం పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది. పశు పూజలు... శ్రమకు కృతజ్ఞత చెల్లింపులు సంక్రాంతికి ఇంటినిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు. కనుమును పశువుల పండుగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. -
కొత్త సంవత్సరం - నమ్మకాలు
-
శైవాగమంలో గణపతి... మరి వైష్ణవంలో..?
ఆగమం శైవసంప్రదాయంలో తొలిపూజ అందుకునేది వినాయకుడైతే, శ్రీవైష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. ‘విశ్వ’ అంటే సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడనీ అర్థం. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విష్ణు సైన్యాధిపతియైన విష్వక్సేనుని ఆశ్రయించిన వారికి ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తాడు. నాలుగు భుజాలతో శంఖు, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు విష్వక్సేనుడు. కొన్ని సందర్భాలలో గదకు బదులుగా దండాయుధంతో కనబడుతుంటాడు. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖానస ఆగమం చెబుతోంది. విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. మనం చేతికి ధరించే రక్షాసూత్రానికి అధి దేవతే సూత్రవతి. శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. శైవంలో పసుపు గణపతిని పూజిస్తే, వైష్ణవంలో తమలపాకుపై వక్కను ఉంచి, విష్వక్సేనునిగా భావిస్తారు. అందుకే వక్కలు లేని ఆకులు నిరర్థకం, నిష్ఫలం అంటారు. -
సంప్రదాయాలను కాపాడుకుందాం
– హంపీ పీఠాధిపతి స్వరూపానంద విద్యాభారతి బండిఆత్మకూరు: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హంపీ విరూపాక్షి పీఠాధిపతి స్వరూపానంద విద్యారణ్యభారతి అన్నారు. శనివారం పెద్దదేవళాపురం గ్రామంలో ఏకశిల అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠను వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి ప్రవచనాలు వినిపించారు. భారతదేశ సంప్రదాయాలను తెలుసుకొని విదేశీయులు ఆచరించి నోబెల్ ప్రైజ్‌ను సైతం పొందారన్నారు. తల్లిదండ్రులను ప్రతి రోజూ పూజిస్తే జ్ఞానం కలుగుతుందన్నారు. అయితే ప్రతి ఇంట్లో మమ్మి, డాడీ పిలుస్తూ అగౌరవ పరుస్తున్నామన్నారు. మమ్మి అంటే శవం అని, డాడీ అంటే గాడిద కంటే తక్కువ పదం వస్తుందన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులు రైన్‌రైన్ గో అవే అని పాటలు పాడుతున్నారన్నారు. దీని అర్థం వర్షం వెళ్లిపో... నని అన్నారు. దీంతో బాల వాక్కు బ్రహ్మవాక్కు అని, దీని వల్ల కూడా వర్షాలు కురియడం లేదన్నారు. వానవానా వల్లప్ప అంటే వర్షాలు వస్తాయని, మన సంప్రదాయాల విశిష్టత గురించి వివరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు తన వైట్‌హౌస్‌ను దీపావళి పండుగ రోజు దీపాలు వెలిగించి మన సాంప్రదాయాన్ని పాటిస్తేంటే.. మనదేశీయులు మాత్రం విదేశాల పాశ్చాత్య పోకడలను ఆచరిస్తున్నారన్నారు. పిల్లలు హనుమాన్ చాలీసా చదివితే టెన్షన్ తగ్గుతుందన్నారు. యజ్ఞ యాగాదులు నిర్వహించడంతో వర్షాలు కురుస్తాయన్నారు. -
అజాన్ సంప్రదాయం ఏర్పడిందిలా!
ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలన్నా, ఎటువంటి ప్రకటన చెయ్యాలన్నా ప్రవక్త మహనీయులు మసీదునే వేదికగా చేసుకునేవారు. ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ప్రసంగ వేదిక (మింబర్ ) మొదటి మెట్టుపై నిలబడి ప్రసంగించేవారు. సంభాషణ అయితే ’మింబర్ ’ రెండవ మెట్టుపై కూర్చుని మాట్లాడేవారు. ప్రారంభంలో ఎవరికివారు నమాజు వేళకు మస్జిదుకు చేరి ప్రార్థన చేసేవారు. కాని అందరూ ఫలానా సమయానికి మస్జిదుకు రావాలని పిలిచే పద్ధతేదీ లేదు. అందుకని ప్రవక్తమహనీయులు సహచరులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దూరాన ఉన్నవారికి తెలియడం కోసం ఏదో ఒకవిధానం రూపొందించాలన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమైంది. కొందరు బాకా ఊదడం గాని, గంట మోగించడం గాని చేద్దామన్నారు. మరికొందరు శంఖం పూరిస్తే బాగుంటుందన్నారు. ఈవిషయంపై ఏకీభావం కుదరగానే శంఖాన్ని ఏర్పాటు చేయమని ప్రవక్తవారు హజ్రత్ ఉమర్ గారికి పురమాయించారు. ఇవే ఆలోచనలతో ఇంటికి వెళ్ళిన ఉమర్ ఆ రాత్రి ఒక కలగన్నారు. ’గంటలు, బాకాలు కాదు ‘అజాన్ ’ పలకండి’ అని ఆ కల సారాంశం. ఈ ‘అజాన్ ’ ఏమిటీ? తెల్లవారిన తరువాత ఈ విషయం ప్రవక్తకు తెలియజేద్దామని, అసలు ‘అజాన్ ’ అంటే ఏమిటీ అని ఆలోచిస్తూ మసీదువైపు బయలుదేరారు. అంతలో మసీదు పక్కనే ఓ ఇంటికప్పుపై హజ్రత్ బిలాల్ నిలబడి ’అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అష్ హదు అల్లాయిలాహ ఇల్లల్లాహ్...’ అని పలుకుతున్న మధురవచనాలు చెవిన పడ్డాయి. అజాన్ అంటే ఇదేనేమో... మరి బిలాల్‌కు ఎవరు చెప్పారీ పలుకులు అనుకుంటూ వడివడిగా అడుగులేశారు. అప్పటికే అక్కడ కొంతమంది విశ్వాసులు ఈ విచిత్ర పలుకుల్ని వింటున్నారు. అక్కడికి చేరుకున్న ఉమర్ , బిలాల్ నుద్దేశించి, ‘ఎవరు చెప్పారు ఇలా చదవమని?’ అంటూ ప్రశ్నించారు సంభ్రమాశ్చర్యాలతో.. ఇప్పుడే హజ్రత్ అబ్దుల్లా బిన్ జైద్ వచ్చి, తనకు ఎవరో కలలో కనిపించి, అజాన్ ఇలా పలకాలని చెప్పినట్లు తనకు చెప్పారన్నారు బిలాల్. అక్కడినుండి హజ్రత్ ఉమర్ నేరుగా ప్రవక్త వారి వద్ద కెళ్ళి, ’దైవప్రవక్తా! రాత్రి నాకు, అబ్దుల్లాబిన్ జైద్ ఇద్దరికీ ఒకేలాంటి కల వచ్చింది’ అని అంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఇదంతా విన్న దైవప్రవక్త, ‘ఉమర్! ఇది అల్లాహ్ మహదానుగ్రహం. నా వద్దకు కూడా ఇలాంటి సందేశమే వచ్చింది’. అన్నారు సంతోషంగా. ఈ విధంగా ప్రార్థన (నమాజ్ ) కోసం మసీదుకు రమ్మని పిలిచే సంప్రదాయం ఏర్పడింది. అప్పటినుండి మసీదు పక్కనే ఉన్న ఇంటికప్పుపై నిలబడి హజ్రత్ బిలాల్ (ర) అజాన్ పలికేవారు. అదేవిధానం యావత్ ప్రపంచంలో కొనసాగుతోంది. ప్రళయకాలం వరకూ ఇన్షా అల్లాహ్ ఇదే పద్ధతి కొనసాగుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
హిందూ సంప్రదాయాన్ని కాపాడాలి
–శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు పెరవలి (మద్దికెర) : హిందూ సంప్రదాయం కాపాడాలని, ఇది ప్రతి హిందువు కనీస ధర్మమని మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు అన్నారు. ఆదివారం మండలంలోని పెరవలిలో రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా స్వామిజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రంగనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుభుదేంద్ర తీర్థులు మాట్లాడుతూ మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే వారివారి మతాలను అగౌరపరచకుండా నడుచుకున్నపుడే జన్మ సార్థకమవుతుందన్నారు. ఈ సందర్భంగా భక్తులు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ విరాళదాత పారా విశ్వనాథ్, జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి, సర్పంచు వెంకట్రాముడు వర్మ, భక్తులు పాల్గొన్నారు. -
ఒక కొమ్మకు పుట్టిన ప్రేమ
లీగల్ స్టోరీస్ ప్రేమ ఒక బంధమే. కానీ అది కూడా ఒక విపరీత బంధానికి దారితీయవచ్చు. ఒక కొమ్మకు పుట్టిన పిల్లలు వరసలు తెలియక ప్రేమలో పడితే?! సంప్రదాయం వద్దంటోంది. సంస్కారం కాదంటోంది. మరి చట్టం ఏమంటుంది? ‘‘ఆనందా... గుడ్ న్యూస్ డియర్’’ శ్రీరామ్ వాయిస్‌లో ఆనందం.‘‘మీవాళ్లు ఒప్పుకున్నారా?’’ ఇవతల ఆనంద గొంతులో ఆత్రుత.‘‘ఊ.... ఒప్పుకున్నారు..’’ ఆ స్వరంలో ధీమా.‘‘హూ..’’ ఓ భరోసాతో నిట్టూర్చింది ఆనంద.‘‘నిన్ను ఎల్లుండి కలుస్తామన్నారు అమ్మానాన్న..’’ చెప్పాడు. ‘‘అవునా... అయితే తాతయ్యతో చెప్పేస్తాను ఈ రోజే’’. ‘‘చెప్పేయ్.. కాని హడావిడి పడకు.. పెద్దాయన్ని హడావిడి పెట్టకు. జస్ట్ నిన్ను చూసి పెద్దాయనతో మాట్లాడి వెళతారు అంతే.. ఓకేనా?’’ అన్నాడు శ్రీరామ్.‘‘ఒకే బాస్..’’ ఆనందలో సంతోషం.‘బై మరి..’ అంటున్న శ్రీరామ్‌కి ‘బై’ అంటూ ఆన్సర్ చేసింది. ఇద్దరి ఫోన్లు డిస్కనెక్ట్ అయ్యాయి.ఆనందకి ఆనందం మామూలుగా లేదు. ఎక్కడా కాలు నిలవడం లేదు. శ్రీరామ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అంటే త్వరలోనే శ్రీరామ్‌కి భార్య కాబోతుంది. ఆ ఊహ ఆమె కళ్లల్లో ఓ మెరుపుని తెచ్చింది. మదిలో జ్ఞాపకాలను తట్టిలేపింది. ‘ప్రొఫైల్స్’.. కలిపాయి ఇద్దరినీ ఆనంద కృష్ణ... ఫేస్బుక్లో ఓ మ్యూచువల్ ఫ్రెండ్ పోస్ట్‌కి కామెంట్ పెట్టింది. ఆమె సోషల్ కాన్షస్కి ముగ్ధుడయ్యాడు శ్రీరామ్. ఆ పేరును క్లిక్ చేసి ఆమె పేజీని ఓపెన్ చేశాడు. ప్రతి పోస్ట్‌లో కనిపించిన ఆమె ఆలోచన, అభిరుచి, అవగాహన ఆయనను ఆనందకు కట్టిపడేశాయి. ఆమె ప్రొఫైల్ పిక్ ఆయనను ఫిదా చేసింది.బ్యూటీ విత్ బ్రెయిన్! మురిసిపోయాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. నాలుగు రోజులకు గానీ రెస్పాన్స్ రాలేదు ఆనంద నుంచి... యాక్సెప్ట్ చేస్తూ! ముందు హలో.. హాయ్ అంటూ పలకరింపు పర్వం. అతి కొద్ది రోజుల్లోనే వీళ్ల ప్రేమతో ఇన్‌బాక్స్ సిగ్గు పడడం మొదలెట్టింది. శ్రీరాం ఓ యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్. ఆనంద ఓ మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. మంచి క్లాసికల్ డాన్సర్. ఆయన సోషల్ సర్వీస్‌లో మేటి. ఆయన స్లమ్స్‌లో సర్వీస్ ఇచ్చే చోట ఆ పిల్లలకు స్వచ్ఛందంగా డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. దాంతో శ్రీరామ్‌కి ఆనంద మీద మరింత ప్రేమ పెరిగింది. గౌరవమూ ఇనుమడించింది. తను జీవిత భాగస్వామిగా వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. ఆ ఆశను ఆమె ముందు ఎక్స్‌ప్రెస్ చేశాడు. శ్రీరామ్ తనకన్నా మూడేళ్లు చిన్నవాడు. ఆ సంశయాన్నే వెలిబుచ్చింది ఆనంద. అదసలు మ్యాటరే కాదన్నాడు. రెండు రోజులు ఆలోచించుకునే టైమ్ అడిగింది. మూడో రోజు ‘ఎస్’ అని చెప్పింది. పెళ్లిచూపులకు ఏర్పాట్లు శ్రీరామ్ ఆనందానికి అవధుల్లేవ్ ఆరోజు. ఆనందను తలచుకొని గర్వంగా ఫీలయ్యాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకటే. ఆలోచనలు సరే... అలవాట్లూ ఒకటే! ఆ విషయంలో చాలాసార్లు ఆశ్చర్యపోయేవాడు శ్రీరామ్. మొత్తానికి తనతో పెళ్లికి ఆనంద ఒప్పేసుకుంది. ఆనందకు అమ్మానాన్న లేరు. తాతే ఆమెను పెంచాడు. ఆయన ఆమెకు ఓ స్నేహితుడు. అన్నీ షేర్ చేసుకుంటుంది. శ్రీరామ్ విషయమూ చెప్పింది. చూస్తాను అన్నాడు. ఇంటికి తీసుకెళ్లింది. పిల్లాడు నచ్చాడు పెద్దాయనకు. ఆయన తల్లిదండ్రులకు విషయం చెప్పి వారిని ఇంటికి తీసుకురమ్మన్నాడు. శ్రీరామ్ ఉండేది ముంబైలో. తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉంటారు. కిందటి వారం హైదరాబాద్ వెళ్లినప్పడు చెప్పాడు. వివరాలు అన్నీ విని.. ‘వీలు చూసుకొని వస్తాం’ అన్నారు. తర్వాత అతడి పేరెంట్స్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది వస్తున్నట్టుగా. వెంటనే ఆనందకు చెప్పాడు.జ్ఞాపకాల్లోంచి వాస్తవంలోకి వచ్చింది ఆనంద. శ్రీరామ్ చెప్పిన శుభవార్తను తాతయ్యకు అందించింది. శ్రీరామ్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లలో పడిపోయారు తాతా మనవరాలు ఆ క్షణం నుంచే...! ఊహించని పరిణామం శ్రీరామ్ చెప్పిన ఎల్లుండి రానేవచ్చింది. ఇల్లంతా నీట్‌గా సర్దింది. సర్దినవాటిని వందసార్లు సరిచూసుకుంది. మనవరాలి ఆరాటం చూసి తాతయ్య ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఈలోపు కాలింగ్ బెల్ మోగనే మోగింది. ఆత్రంగా వెళ్లి తలుపు తీసింది ఆనంద. ఎదురుగా చిలిపిగా నవ్వుతూ శ్రీరామ్... అతని వెనకాలే మొహాల మీద చిరునవ్వులతో ఆయన తల్లిదండ్రులు ‘రండి రండి...’ అంటూ అంతే ఆత్రంగా లోనికి ఆహ్వానించింది. హాల్లో సోఫా చూపిస్తూ కూర్చోండి అంది. ఆనంద తాతయ్య వచ్చి త్రీ సీటర్ సోఫాకు ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్‌లో కూర్చున్నాడు. అక్కడే నిలబడ్డ ఆనందను చూస్తూ వాళ్లకు కాస్త మంచినీళ్లు తెచ్చివ్వమ్మా అంటూ మనవరాలిని పురమాయించాడు. వచ్చిన వాళ్లను పరిచయం చేసుకుందామని ఇటు తిరిగాడు. శ్రీరామ్ తల్లిని చూడగానే ఒక్కక్షణం ఆగిపోయాడు ఎందుకో ఆ పెద్దాయన! ఆయనను చూసిన శ్రీరామ్ తల్లిలో కూడా ఇంచుమించు అదే భావం. అమ్మా... నువ్వు శోభ కదూ... అన్నాడు అనుమానం నివృత్తి చేసుకుందామని. అర్థమైపోయింది... శోభకు విషయం మొత్తం అర్థమైపోయింది. మామయ్యా... మీరు... ఆనంద... అంటూ ఆగిపోయింది. కాళ్లు చేతులు చల్లబడ్డాయి. మెదడు మొద్దు బారిపోయింది. అడుగు ముందుకు పడడం లేదు. పాలిపోయిన మొహంతో కొడుకును, భర్తను చూసింది. శ్రీరామ్ తల్లి వైపు, తండ్రి వైపు అయోమయంగా చూశాడు. భార్య స్థితి అర్థమైన శ్రీరామ్ తండ్రి... కొడుకును బయటకు తీసుకెళ్లాడు. నాటి కూతురే.. నేటి కోడలు! ‘‘శ్రీరామ్... నాతో పెళ్లికి ముందే మీ అమ్మకు పెళ్లయింది. ఓ కూతురు కూడా. ట్రైన్ యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. అప్పటికి వాళ్లకు యేడాదిన్నర బిడ్డ. ఆ షాక్‌తో మీ అమ్మ సైకలాజికల్‌గా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఆర్నెల్లు పిచ్చిదానిలాగే ఉంది. ఇక్కడ ఉంచితే లాభంలేదు ఎప్పటికీ కోలుకోదని వాళ్ల మేనమామ అమెరికా తీసుకెళ్లాడు. ఆ బిడ్డను శోభ వాళ్ల అత్తగారు, మామగారే ఉంచేసుకున్నారు. మీ అమ్మమ్మ వాళ్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు జ్ఞాపకంగా ఉంటుందని తమ దగ్గరే పెట్టుకున్నారు. శోభ యూఎస్‌లోనే ఉండిపోయింది. నయం అయ్యాక కూతురి కోసం చాలానే తాపత్రయ పడింది. కాని పెద్దవాళ్లు సర్ది చెప్పి అక్కడే యూఎస్‌లో వాళ్ల మేనమామ ద్వారా ఉద్యోగం ఇప్పించారు. ఆ కంపెనీలోనే నేనూ జాబ్ చేసేవాడిని. అలా ఇద్దరం లవ్ లో పడ్డాం. పెళ్లి ప్రస్తావన తెచ్చాను. అప్పుడు చెప్పింది మీ అమ్మ.. తనకు అంతకు ముందే పెళ్లయిన విషయం, ఓ కూతురూ ఉన్న సంగతి. అయినా నాకేం అభ్యంతరం లేదన్నాను. పెళ్లి చేసుకున్నాను. తర్వాత నేను, మీ అమ్మ ఇద్దరం కలిసి ఆ అమ్మాయిని తెచ్చేసుకోవాలని చాలా ప్రయత్నించాం. ఆ పాప నానమ్మ, తాతయ్యను కలిశాం. వాళ్లు ససేమీరా అన్నారు. చేసేదేం లేక అమెరికా తిరిగి వెళ్లిపోయాం. యేడాదికి నువ్వు పుట్టావ్. లైఫ్ బిజీలో పడిపోయాం. అదిరా వివరం. అందుకే ఈ పెళ్లి కుదరదు’’ అని చెప్పాడు శ్రీరాం తండ్రి. హతాశుడయ్యాడు శ్రీరాం. ఉన్న చోటనే కూలబడిపోయాడు. చట్టం ఏం చెబుతోందంటే... హిందూవివాహ చట్టం 1955, సెక్షన్ 5 పెళ్లికి కొన్ని షరతులు విధిస్తోంది. పెళ్లి సమయానికి వధూవరుల్లో ఎవరికైనా అంతకుముందే పెళ్లయి ఉండి, ఆ భాగస్వామి బతికున్నా, విడాకులు ఇవ్వకపోయినా ఆ పెళ్లి చెల్లదు. ఆచార వ్యవహారాలు అనుమతించినప్పడు తప్ప నిషేధించిన బంధుత్వం ఉండకూడదు, సపిండులు కాకూడదు. పై షరతులకు విరుద్ధంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. వీటినే వాయిడ్ మ్యారేజెస్ అంటారు. సెక్షన్ 11 ప్రకారం ఇలాంటి పెళ్లిళ్లను రద్దు చేయొచ్చు. వేరువేరు తండ్రుల ద్వారా ఒకే తల్లికి పుట్టిన పిల్లల సంబంధాన్ని ఏకోదర రక్తసంబంధం అంటారు. పైన కేస్‌లోని శ్రీరామ్, ఆనందల బంధం దీని కిందికే వస్తుంది. కాబట్టి ఆ పెళ్లి చెల్లదు. సంపూర్ణ రక్త సంబంధం అంటే... ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల మధ్య, అసంపూర్ణ రక్త సంబంధం... అంటే ఒకే భర్తకు వేరువేరు మహిళల ద్వారా పుట్టిన పిల్లల మధ్య, ఏకోదర రక్తసంబంధం ఉన్న పిల్లల మధ్య వివాహాలు నిషిద్ధం. – ఇ. పార్వతి,అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ parvathiadvocate2015@ gmail.com – సరస్వతి రమ -
భారతీయ సంప్రదాయాలు మహోన్నతమైనవి
–మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు కర్నూలు(హాస్పిటల్): ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు అన్నారు. వికాసభారతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ‘భారతీయ శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన గరికపాటి నరసింహరావు మాట్లాడుతూ మనం అన్ని దేశాలను, మతాలను గౌరవిస్తూనే మన సంప్రదాయాలను ఆచరించాలన్నారు. గుడితో పాటు గుండెలోనూ దేవుడిని కొలువు చేసుకోవాలని సూచించారు. శాస్త్రం ప్రకారం శివలింగానికే అభిషేకం చేయాలని, ఇతర విగ్రహాలకు అర్చన చేయాలని సూచించారు. ఆంగ్లేయులు మన దేశీయులను శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. దానికి కొనసాగింపుగా నేటి ప్రభుత్వాలు మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు భాషను తీసేస్తున్నాయని విమర్శించారు. మాతృభాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్యభారతి స్వామి మాట్లాడుతూ సంస్కారంతో కూడిన చదువే భవిష్యత్‌కు పునాది అవుతుందన్నారు. మహిళలు సన్మార్గాన్ని చూపే కార్యక్రమాలను టీవీల్లో చూడాలన్నారు. కార్యక్రమంలో వికాసభారతి సంఘటనా కార్యదర్శి నాగేంద్రప్రసాద్, అధ్యక్షుడు సుజాతశర్మ, భారతీయ స్ఫూర్తి కేంద్రం కార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు హుసేన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రైతన్నల జాతర
ఎమ్మిగనూరు : సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించుకునే ఎమ్మిగనూరు జాతర వృషభాలు, వాటి అలంకరణ సామగ్రి, సాగు పరికరాల విక్రయాలకు పేరు గాంచడంతో రైతుల జాతరగా మారిపోయింది. వృషభాలు, సాగు పరికరాల క్రయవిక్రయాలకు తరలివచ్చిన వారితో జాతర కళకళలాడుతుంది. నాలుగు రోజులపాటు రాష్ట్రస్థాయి ఎద్దుల బండలాగుడు బలప్రదర్శనలు జరుగుతాయి. ఆదివారం మంత్రాలయం రహదారిలో ఏర్పాటు చేసిన ఎద్దుల సంతకు ఒంగోలు జాతి, కిలారీ జాతి, దూపాటి, సీమరకం ఎద్దులు, తూరునాటి దూడలు అధిక సంఖ్యలో అమ్మకానికి తరలివచ్చాయి. జత వృషభాల ధర రూ.50వేల నుంచి రూ.1.80 లక్షల వరకు పలికాయి. ముఖ్యంగా సేద్యంకు చురుకుదనంతో ఉండే కిలార్ రకం ఎద్దుల కొనుగోలుకు రైతులు మొగ్గు చూపారు. భవిష్యత్తుల్లో బలప్రదర్శనకు ఉపయోగపడే తూరునాటి దూడలు జత రూ.25 వేల వరకు పలికాయి స్థానిక టీటీడీ కల్యాణమంటపం ఆవరణలో ఎద్దుల బండ్లు, వాటి చక్రాలను అమ్మకానికి ఉంచారు.బండి ధరను రూ.25వేలు, బండికి అమర్చే రెండు చక్రాలు రూ.15వేల వరకు ధర పలికాయి. -
రాణీ జాకెట్
మహారాజులు... మహారాణులు... ఉండే సినిమాల్లో... ఏదీ... ఇంగ్లీషు సినిమాల్లో... రాకుమారి వేసుకొనే జాకెట్టు... అచ్చు ఇలాగే ఉంటుంది! ఇప్పుడు ఈ సై్టల్ ‘రాణి’స్తోంది! ఈ జాకెట్‌ను ‘కోర్సెట్’ అంటారు. వేసుకుంటే... మీరూ రాకుమారిలా ‘సెట్’ అయిపోతారు! ► శారీ మీదకు కోర్సెట్ బ్లౌజ్ ధరిస్తే, సంప్రదా యంలోనూ ఆధునికత కళ్లకు కడుతుంది ► ధోతీశారీకి అటాచ్ చేసిన కోర్సెట్ ఫ్యాషన్ వేదికల మీదా వైవిధ్యంగా రూపుకడుతుంది. ► లేస్ కోర్సెట్ బ్లౌజ్, షిఫాన్ శారీ కాంబినేషన్ గ్రేస్‌ఫుల్‌గా ఆకట్టుకుంటుంది ► మెరూన్ కలర్ శారీకి పైన ఎంబ్రాయిడరీ చేసిన కోర్సెట్ బ్లౌజ్‌ను ధరిస్తే ఎంత ట్రెడిషన్ అయినా సై్టలిష్‌గా కనిపిస్తారు. ► ఆధునికపు అమ్మాయిలకు చీరకట్టు పరిచయం చేయాలంటే కోర్సెట్ ఉండాల్సిందే! ► ఏంజిల్‌లో మెరుపులీనే చిరు నవ్వుతో పోటీపడుతున్న కోర్ సెట్ బ్లౌజ్ -
సన్మామ
ఇదిగో సూర్యుడింకా కనపడుతూనే ఉన్నాడు. మరి అదేంటో చంద్రుడూ కనపడుతున్నాడు. సన్ వస్తే మామ కనపడకూడదు కదా! అదేనండి, చందమామ కనపడకూడదు కదా! ఎక్కడైనా సూర్యుని కాంతిలో వెలిగేవాడిని చందమామ అంటారు కానీ ఇక్కడ మామకాంతిలో వెలుగుతున్నాడు సన్! మామలాంటి సన్మామ ఇదిగో సన్మామ కథ. అంతసేపూ తన వెంటే ఉన్న గౌతమ్ ఎటువెళ్లాడా అనుకుంటూ కిచెన్‌లోంచి బయటకు వచ్చి చూసిన భాగ్యకు నోటమాట రాలేదు. గౌతమ్ తన మేనమామ హరి ఫొటోను తదేకంగా చూస్తున్నాడు. ఫొటోకు ముద్దులు పెడుతున్నాడు. పై షెల్ఫ్‌లో ఉన్న ఫొటో గౌతమ్ చేతిలోకి ఎలా వచ్చిందో ఒక్క క్షణం అర్థం కాలేదు భాగ్యకు. చెయిర్ వేసుకున్నా వీడికి షెల్ఫ్ అందదు, బహుషా షెల్ఫ్ ఎక్కి ఉంటాడు. వీడి అల్లరి ఎక్కువైంది, కిందపడితే..!’ పిలవబోయి ఆగిపోయింది. ఆ ఫొటో చూస్తూ గౌతమ్ ఏడుస్తున్నాడు. అప్పుడే బయట నుంచి వచ్చిన కిరణ్ ‘‘ఏమైందిరా.. ఎందుకేడుస్తున్నావ్!’’ కంగారుగా అడిగాడు.భాగ్య, కిరణ్‌ల కొడుకు గౌతమ్. ఐదేళ్ల వయసు. ఏడాదిగా స్కూల్ కెళుతున్నాడు. ‘‘ఈ రోజు నా బర్త్ డే, కొత్త డ్రెస్ లేదు. కేక్ లేదు. నన్ను మీరు అసలు పట్టించుకోవడమే లేదు. అందరికీ పార్టీ ఎలా ఇవ్వాలి’’ ఏడుపు గొంతుతో అన్నాడు గౌతమ్. ‘‘నీ బర్త్‌డేకి ఇంకా రెండు నెలల టైముందిరా, ఇప్పుడు కాదు’’ అంది భాగ్య.‘‘కాదు, ఈ రోజే నా బర్త్ డే! నువ్వు మర్చిపోయావ్! నన్ను పూర్తిగా మర్చిపోయావ్’’ వెక్కిళ్లు పెడుతూ అన్నాడు గౌతమ్.భాగ్య ఉలిక్కిపడింది. ‘ఈ రోజు తన తమ్ముడు హరి పుట్టినరోజు. వాడు చనిపోయి ఈ రోజుకు ఏడేళ్లు. మరి, వీడేంటి? తన బర్త్ డే అంటున్నాడు..’ భాగ్య కిరణ్‌వైపు అయోమయంగా చూసింది. గత జన్మ అప్పు లు ‘‘అక్కా, అక్కా లే!’’ ఆ పిలుపుతో ఆందోళనగా లేచింది భాగ్య. బెడ్‌లైట్ వెలుగులో గౌతమ్‌ను చూసిన భాగ్య ‘‘ఏంట్రా, ఏమైంది?’’ అని అడిగింది. ‘‘నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు’’ అంటున్న గౌతమ్‌ని ఆశ్చర్యంగా చూసింది. టైమ్ అర్థరాత్రి దాటింది. తినే పడుకున్నాడు. కానీ, ఇలా... ! ఆశ్చర్యంగా గౌతమ్‌నే చూస్తూ .. లేచి Ðð ళ్లి అన్నం, కూర కలిపి ప్లేట్ చేతికిచ్చింది. అన్నం తింటున్న గౌతమ్‌ని కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది. ఏడాదిగా గౌతమ్ ప్రవర్తన అచ్చూ హరిలా ఉంటోంది. హరి గౌతమ్ రూపంలో తన కళ్ల ముందు నిలుచున్నట్టుగా ఉంది. హరికన్నా రెండేళ్లు పెద్ద తను. తమ్ముడే అయినా కొడుకులా మారాం చేసేవాడు. పెళ్లయ్యాక తనెక్కడ దూరమైపోతానో అని చదువు, ఉద్యోగం పేరుతో తన దగ్గరే ఉండేవాడు. అన్నం తినేసి పడుకున్నా అర్థరాత్రి లేచి, ఆకలేస్తోందని మళ్లీ అన్నం తినేవాడు. అందుకే వాడి కోసం ఇంకాస్త ఎక్కువ వండి ఉంచేది. ఈ మధ్య గౌతమ్ కూడా హరిలాగే అర్థరాత్రి లేస్తున్నాడు. ఆకలేస్తోంది అన్నం పెట్టు అంటున్నాడు. బర్త్ డే అంటే హరికి చాలా ఇష్టం. పండగలా జరుపుకునేవాడు. ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఫ్రెండ్స్‌తో టూర్ వెళుతుంటే కారు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇప్పుడు గౌతమ్ హరి బర్త్ డే రోజున కొత్త డ్రెస్ వేసుకొని కేక్ కట్ చేసి చుట్టుపక్కల వాళ్లందరికీ పంచాడు. ఎక్కడకెళ్లినా హరి ఫొటో వదలడం లేదు. ‘‘ఇది నా ఫొటో! నా దగ్గరే ఉండాలి’’ అంటున్నాడు. ‘‘నా అజాగ్రత్త వల్లే యాక్సిడెంట్ అయ్యింది’’ అని చెబుతున్నాడు. మొన్నటికి మొన్న హరి స్నేహితురాలు దారిలో కలిస్తే ఇంటికి తీసుకొచ్చింది. తామిద్దరూ మాట్లాడుతూ కూర్చుంటే గౌతమ్ ఆమెనే చూస్తూ కాసేపటి తర్వాత లోపలికెళ్లి ఏదో పుస్తకం తీసుకొచ్చాడు. ‘‘రమ్యా, ఇదిగో నీ బుక్. అప్పుడు నిన్ను అడిగి తీసుకున్నా! తిరిగి ఇవ్వలేకపోయాను. తీసుకో.. ’’ అన్నాడు. రమ్య షాకైంది. నిజమే! ఆ బుక్ ఏడేళ్ల కిందట రమ్య హరికిచ్చింది. గౌతమ్‌ని భయం భయంగా చూస్తూ వెళ్లిపోయింది. మొన్నామధ్య ఎవరికో ఫోన్ చేసి ‘నీకు ఐదు వేల రూపాయిలు ఇవ్వాలిగా! వచ్చి తీసుకెళ్లు’ అని చెప్పాడు. ఆ వచ్చిన వ్యక్తికి నిజంగానే హరి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ విషయం వచ్చిన అతనూ నిర్ధారణ చేశాడు. హరి చనిపోయాడని తెలుసుకొని వెళ్లిపోయాడు. వెళుతూ వెళుతూ.. ‘‘నా ఫోన్ నెంబర్ మీ అబ్బాయికి ఎలా తెలుసు?’’ అన్నాడు ఆశ్చర్యంగా! జ్ఞాపకాల భారం ‘‘దీనినే పునర్జన్మ అంటారు’’ అన్న కౌన్సెలర్ మాటలకు కొయ్యబారిపోయారు భాగ్య, కిరణ్‌లు.‘‘ఏంటి డాక్టర్, చనిపోయినవారు మళ్లీ పుడతారా! అలా అయితే మా తమ్ముడే నాకు కొడుకుగా పుట్టాడా? నమ్మలేకపోతున్నాను’’ ఆందోళనగా అడిగింది భాగ్య. కిరణ్ మాట్లాడుతూ ‘‘డాక్టర్ అది నిజమే కావచ్చు. కానీ, ఆ జ్ఞాపకాల వల్ల గౌతమ్ ఇప్పుడెంతో జీవితాన్ని కోల్పోతున్నాడు. తనలో తనే మాట్లాడుకుంటాడు. ఎవరితోనూ కలవడం లేదు. స్కూళ్లోనూ ఒంటరిగా ఉంటున్నాడు. వీడి ప్రవర్తన మాకు భయాన్ని కలిగిస్తుందిు. దీన్నుంచి బయటపడే మార్గం..’’ కిరణ్ మాటలు పూర్తి కాకుండానే ‘‘ఉంది’’ అన్నారు కౌన్సెలర్. స్మృతులను తుడిచే ఎరేజర్ థెరపీ గౌతమ్ ధ్యానప్రక్రియ ద్వారా చేతన స్థితి నుంచి అచేనత్వంలోకి.. చైతన్యం నుంచి అనంతంలోకి ప్రయాణిస్తున్నాడు. హరిగా తాను జీవించిన రోజులు ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. ‘‘అక్కా, నువ్వు చెబితే వినకుండా వెళ్లిపోయాను. ఘోరమైన నొప్పిని అనుభవించాను. నీ కోసమే మళ్ళీ వచ్చాను. నువ్వు నాకు ఎన్నో ప్రమాణాలు చేశావు నన్ను ఎప్పటికీ దూరం చేయనని. కానీ, నువ్వు నన్ను మర్చిపోయావ్! చెబితే వినలేదనేగా! నన్ను క్షమించు. నాకు ఎన్నో కలలు ఉన్నాయి. వాటిని సాధించాలని ఉంది. నాకు సాయం చేయ్!’’ అక్కతో తను చేసిన తప్పులు, తిరిగి తను నేర్చుకోవాల్సిన విషయాల గురించి ఒక్కొక్కటిగా చెబుతున్నాడు. వింటున్న భాగ్య, కిరణ్‌లు చలించిపోయారు.. కౌన్సెలర్ సూచనలు మళ్లీ మొదలయ్యాయి. ‘‘హరీ.. నువ్విప్పుడు గౌతమ్వి. గతజన్మ జ్ఞాపకాలన్నీ ఎరేజర్‌తో తుడిచినట్టు తుడిచేయ్! ఇప్పుడు నీ మస్కిష్తం ఒక తెల్లని కాగితం. దానిపై ఈ జన్మ అనుభవాలను మాత్రమే రాసుకో...’’ అని సూచనలు ఇచ్చారు కౌన్సెలర్. అర గంట పాటు సాగిన థెరపీ గౌతమ్ నిద్రతో పూర్తయింది. మెలకువ వచ్చిన గౌతమ్ తల్లిని చూసి హత్తుకుపోయాడు. స్కూళ్లో టీచర్ ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి తల్లీతండ్రి చేతికిచ్చాడు గౌతమ్. అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో స్కూల్ టాపర్ అని పేరుతెచ్చుకుంటున్న గౌతమ్‌ని భాగ్య దగ్గరగా తీసుకొని బుగ్గమీద ముద్దిచ్చింది. మరెప్పుడూ ఆ ఇంట్లో హరి జ్ఞాపకాలు వినిపించలేదు. కర్మభూమి కర్మసిద్ధాంతానికి పెద్ద పీట వేసే మన దేశం ప్రాచీన సంప్రదాయం ప్రకారం కుటుంబసభ్యులలో ఎవరైనా మరణిస్తే వారు మన మధ్యే ఉంటారని, మనకోసం మళ్లీ వారు పుడతారని నమ్ముతారు. ఆ నమ్మకంతోనే చనిపోయినవారికి పిండప్రదానం చేయడం, వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేయడం చూస్తుంటాం. అలాగే చనిపోయిన రోజు, పుట్టినరోజులను గుర్తుంచుకొని వారికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంటారు. – నిర్మల చిల్కమర్రి -
హైందవ ధర్మాన్ని రక్షించాలి
పుష్పగిరి స్వామీజీ శ్రీ విద్యాశంకర భారతీస్వామి కాకినాడ కల్చరల్ : హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా పురోహిత సంఘం అధ్యక్షుడు ఆకెళ్ళ మురళీకృష్ణ స్వగృహంలో స్వామీజీకి వేదమంత్ర పూర్వక పూర్ణకుంభంతో శనివారం స్వాగతం పలికారు. దేశంలో జరగుతున్న అన్యమత ప్రచారాల వల్ల హిందూమతం సంక్షోభంలో పడిందన్నారు. అన్యమత ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ధర్మ సంస్థాపన కోసం తాము దేశ పర్యటన చేస్తున్నామన్నారు. దేవాదాయశాఖలో జరుగుతున్న హైందవ విరుద్ధ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. భగవంతుని బోధనలను అనుసరిస్తే మానవ జీవితానికి సార్ధకత చేకూరుతుందన్నారు. కార్తికమాసం సందర్భంగా శ్రీ చక్రార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలను నిర్వహించి భక్తులను అనుగ్రహిస్తున్నామన్నారు. కార్తికమాసం పుణ్యఫలం గురించి, ప్రత్యేకత గురించి భక్తులకు స్వామీజీ వివరించారు. కార్యక్రమంలో వై.పద్మనాభం, బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వాడ్రేవు సుబ్మహ్మణ్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి అజ్జరపు సత్యనారాయణ, చల్లా నిరంజ¯ŒS పాల్గొన్నారు. -
తులసి చెట్టు గొప్పతనం
మీకు తెలుసా? ఇంటింటా తులసి మొక్కను పెంచడం, పూజించడం హిందూ సంప్రదాయం. తులసి మొక్కల్ని ఒక బృందావనంలా పెంచడం, ఆ తులసి కోట దగ్గర నిత్యం ధూప దీపారాధన స్త్రీలకు సనాతనంగా వస్తున్న విధి. అందులోనూ కార్తిక మాసంలో అది ఇంకా విశేషం. అంత మహత్తరమైన ప్రాధాన్యం తులసికి ఇచ్చారు. తులసీ మాహాత్మ్యం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు స్పష్టంగా చెప్పాయి. తులసీ మాహాత్మ్యం గురించి సాక్షాత్తూ వ్యాసమహర్షి, ధర్మరాజుకు ఇలా చెప్పాడు... ‘‘సాక్షాత్తూ బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పదనాన్ని పూర్తిగా వర్ణించలేనన్నాడు. అయితే, ఆయన నారదుడికి చెప్పిన మాట ఏమిటంటే - కార్తిక మాసంలో తులసి పూజ చేసినవారు స్వర్గానికి వెళతారు. తులసీ దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే, తుదిశ్వాస విడిచాక వైకుంఠానికి చేరుకుంటారు. ఎవరైతే ఒక బృందావనంగా తులసి మొక్కల్ని పెంచుతారో వారికి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో నివసించడం, తులసి చెట్టు పెంచడం, తులసి పూసల మాల ధరించడం, తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలూ పోతాయి. యమకింకరులు తులసి చెట్టు సమీపానికి కూడా రారు.‘యన్మూలే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా, యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీమ్ త్వామ్ నమామ్యహమ్’ ‘ఏ చెట్టు మూలంలో అయితే సమస్త తీర్థాలూ ఉన్నాయో, ఏ చెట్టు మధ్యలో అయితే సర్వదేవతలూ వసిస్తున్నారో, ఏ చెట్టు అగ్రభాగంలో సమస్త వేదాలూ ఉన్నాయో - అలాంటి తులసి చెట్టుకు నమస్కరిస్తున్నాను’ అనే మంత్రం చదివితే, అన్ని సమస్యలూ, కష్టాలూ నశిస్తాయి. అకాల మృత్యు భయం ఉండదు.’’అని శాస్త్రవచనం. - మహతి -
మూడు రోజుల పెళ్ళి అమ్మాయి బంధువులకు నో ఎంట్రీ!
తెలుగునాట ఒకప్పుడు అయిదు రోజుల పెళ్ళిళ్ళు... మూడు రోజుల పెళ్ళిళ్ళు... ఆనవాయితీ! ఇప్పటికీ మూడు రోజుల పెళ్ళిళ్ళు చూడాలంటే... ఛలో చెచెన్యా! రోజుల్లోనే కాదు... సంప్రదాయం విషయంలోనూ మనకూ, అక్కడికీ పోలికలున్నాయి. సంప్రదాయ చెచెన్ వివాహమంటే... స్నేహితులంతా కలసి అమ్మాయిని అందంగా సిద్ధం చేస్తారు. అయితే, ఇక్కడే ఒక తిరకాసు. అంతగా తయారైన పెళ్ళికూతురు అన్నీ చూస్తూ ఉండాలే కానీ, ఈ ఆటలు, పాటల కోలాటంలో పాల్గొనకూడదని సంప్రదాయమట! పెళ్ళికొడుకు తరఫు కుటుంబానికి గౌరవం చూపిస్తూ ఉండిపోవాలట! వేడుకకు అమ్మాయి కుటుంబం రాకూడదు! చెచెన్యాలో సంప్రదాయం ప్రకారం పెళ్ళి కూతురి వయసు కేవలం 17 నుంచి 18 ఏళ్ళ లోపుండాలి. పెళ్ళి కొడుకు వయసేమో 20 ఏళ్ళ చిల్లర ఉండాలి. పెళ్ళి ఖర్చంతా వరుడి తరఫు వాళ్ళదే! కానీ, వరుడి కుటుంబమే తప్ప, వధువు తరఫువాళ్ళు హాజరు కాకూడదు. చెచెన్యా రాజధాని గ్రోజ్నీలో జరిగిన ఓ పెళ్ళిలో కారెక్కి, పెళ్ళి మండపానికి వెళుతూ ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటున్న నవ వధువు ఫోటో పక్కనే చూస్తున్నారుగా! దేశాలు, ప్రాంతాలు మారినా, ఆడపిల్ల మనసు, ఆ మనసులోని ప్రేమానురాగాలు ఒకటే కదూ! కానీ, అక్కడి సంప్రదాయం కూడా ఇక్కడ లానే పితృస్వామ్య భావజాలంతో ఉండడమే విచారకరం! -
పెళ్లి వేడుకలో మహాద్భుతం
సువార్త కానా అనే ఊళ్ళో జరిగిన పెళ్లికి యేసు తన తల్లి మరియ, శిష్యులతో సహా హాజరయ్యాడు. పెళ్లివారింటి వేడుకల్లో ద్రాక్షారస పానం అక్కడి సంప్రదాయం. మామూలుగా అయితే సంపన్నులు మాత్రమే ద్రాక్షారసం సేవిస్తారు. కాని వేడుకల్లో పేద గొప్ప తేడా లేకుండా అంతా సేవిస్తారు. అందువల్ల పెళ్లి వేడుకల్లో ద్రాక్షారసమే హైలైట్! ఈ పెళ్లిలో కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. అతిథులు ఎక్కువ తాగారో, లేక లెక్కకు మించి వచ్చారో తెలియదు కాని పెళ్లిలో ద్రాక్షారసం నిండుకుంది. విందు చేస్తున్న వారిలో విషాదం నెలకొంది. తమదాకా ద్రాక్షారసం రాకపోతే అతిథులు దాన్ని అవమానంగా భావిస్తారు. అందుకు విందు పెద్దలు ‘పరిష్కారం’ చూపారు. ఇక్కడున్న వాళ్లకు ఏదో విధంగా ద్రాక్షారసం సర్దేద్దాం. ఇంకా రానున్న అతిథుల్ని మాత్రం ఆపేద్దామన్నారు వారు. ఎలా? ప్రతి యూదుని ఇంటి వెలుపల నీటి బానల్లో నీళ్లుంటాయి. అతిథులు అక్కడ కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రావడం వారి శుద్ధీకరణ ఆచారం. బానల్లో నీళ్లు లేకపోతే అతిథులు ఇక రావడానికి లేదు. అందువల్ల బానల్లో నీళ్లు పారబోయమన్నారు వాళ్లు. ద్రాక్షారసం నిండుకోవడమే అవమానమైతే ‘మా పెళ్లికి రాకండి’ అని అలా చెప్పుకోవలసి రావడం మరింత అవమానకరం. అయినా గుడ్డిలో మెల్లలాగా అదే మంచిదనిపించి, అక్కడున్న ఆరు రాతి బానలూ ఖాళీ చేశారు. ద్రాక్షారసం నిండుకున్నదన్న విషయాన్ని మరియ, యేసుకు తెలిపింది. ‘అమ్మా! నా సమయమింకా రాలేదన్నాడు’ ప్రభువు. యేసు అసలు ద్రాక్షారసం తాగరు. అయితే సర్వజనరక్షణార్థం చేయనున్న సిలువ యాగానికి ముందు రాత్రి మాత్రం మహా పండుగ విందులో ఆయన ద్రాక్షారసం తన శిష్యులతో కలిసి తాగనున్నారు. ఆ సమయమింకా రాలేదన్నాడు ప్రభువు. కాని విందులో ద్రాక్షారసం కొంత తీర్చడానికి యేసు పూనుకున్నాడు. ఖాళీ అయిన ఆరు రాతి బానల్లో అంచుల దాకా నీళ్లు నింపించాడు. ఆ నీటినే ద్రాక్షారసంగా మార్చాడు. అంతా సమృద్ధిగా సేవించారు. ‘చివరిదాకా ఇంత రుచికరమైన’ ద్రాక్షారసమా? అని అచ్చెరువొందారు అంతా!! మహా విషాదంగా ముగియవలసిన పెళ్లి వేడుకను దేవుడు అలా ఎంతో ఘనమైన వేడుకగా మార్చారు. చుక్క ద్రాక్షారసం లేని పెళ్లి వేడుకలో ప్రభువు కృప వల్ల కాళ్లు కడుక్కునే నీళ్లంతా సమృద్ధిగా ద్రాక్షారసంగా ప్రవహించింది. ద్రాక్షపళ్లనే సృష్టించిన దేవుడు పెళ్లిలో ఉండగా, మిడిమిడి జ్ఞానంతో రాతి బానల్లోని నీటిని పారబోసి, అవమానాన్ని అధికం చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా ఆదుకున్నాడు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా యేసు చేతికి అప్పగిస్తే జరిగేది అదే! ఆయన సమస్యను తీరుస్తాడు. ఆయన తీర్చేవాడే కాదు, దాన్ని మహాశీర్వాదంగా మార్చే దేవుడు. లోకం మన సమస్యను తీర్చబోతూ మన అవమానాన్ని అధికం చేస్తుంది. కానీ దేవుడైతే మన పరువు ప్రతిష్ఠలు ఇనుమడించేలా సమస్యను తీరుస్తాడు. సమస్యకు వెయ్యి పరిష్కార మార్గాలున్నా, పనిచేసే పరిష్కారమొక్కటే... అది - యేసును ఆశ్రయించడమే!! - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
వెలుగు పూల పండుగ
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి పోరు సాగించి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. పురాణాల్లో... పండుగ కథలెన్నో! లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉన్న విషయం. ఇదే కాకుండా ఇంకా చాలా పురాణ కథలు దీపావళికి సంబంధించినవి ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగా, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా - ఇలా దీపావళికి అనేక పురాణ కథలు. ఇంటింటా... దీపలక్ష్మి లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. ఆయన అన్నిరకాలైన చీకట్లనూ... అంటే... అవిద్యను, అజ్ఞానాన్ని, అవివేకాన్ని పారదోలగల సమర్థుడు. జ్ఞానప్రదాత. దీపం వల్లనే సమస్త కార్యాలూ సాధ్యమవుతాయి. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకరవస్తువుల్లో, వేదఘోష వినిపించేప్రదేశాలల్లో, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుడినీ, తులసినీ పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్త్తి. దివిటీలు కొట్టాలి! మానవతకు దివిటీ పట్టాలి!! సమాజానికి దుష్టుని పీడ వదిలిందన్న ఆనందోత్సాహాలతో దీపావళినాడు బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. టపాసులు కాల్చే ముందు పిల్లలు గోగుపుల్లలకు నూనెతో తడిపిన వస్త్రాన్ని చుట్టి, దాన్ని కాలుస్తూ ‘దుబ్బూ దుబ్బూ దీపావళీ... మళ్లీ వచ్చే నాగులచవితి’ అని దివిటీలు కొట్టడం ఆనవాయితీ. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో పేదవారికి దానం చేయడం, సాటివారికి సాయపడే బాధ్యత పురుషులది. పూజా సంప్రదాయం ఇదీ... దీపావళి రోజు సాయంకాలం నువ్వులనూనె, లేదంటే ఆవు నేతిని మట్టి ప్రమిదలలో నింపి, దీపాలు వెలిగించాలి. దారిద్య్రబాధలు తొలగి, ధనలాభం పొందడానికి ఆశ్వయుజ అమావాస్య నాడు తప్పక లక్ష్మీపూజ చేయాలి. అలా ఈ దీపావళి అందరి ఇంటా కొత్తకాంతి తేవాలని కోరుకుందాం. - డి.వి.ఆర్. భాస్కర్ -
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి
పెద్దవూర: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని డిప్యూటీ తహసీల్దార్ ఇస్లావత్ పాండునాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి«థిగా హాజరై ఆయన మాట్లాడారు. విద్యార్థినులు బతుకమ్మలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర, తెప్పమడుగు సర్పంచ్‌లు కూతాటి భానుశ్రీదేశ్, చామల సువర్ణభాస్కర్రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ నడ్డి ఆంజనేయులు, చామకూరి లింగారెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు. న్యూకిడ్స్ పబ్లిక్ స్కూల్లో.. మండల కేంద్రంలోని న్యూకిడ్స్ పబ్లిక్ పాఠశాలలోనూ గురువారం విద్యార్థినులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ షేక్ అబ్బాస్, ఉపాధ్యాయులు రామకృష్ణ, వెంకటయ్య, రషీద్, చిరంజీవి, శ్రీనివాస్‌రెడ్డి, ఖలీల్‌పాషా పాల్గొన్నారు. -
సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
అహోబిలం (ఆళ్లగడ్డ): మన సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందామని కేరళ రాష్ట్రానికి చెందిన గురువాయర్ మందిర్ ప్రధానార్చకులు కూనంపల్లి శ్రీరాంనంభూదిరి స్వామి అన్నారు. లోక సంరక్షణార్థం వారం రోజుల పాటు భాగవత్ పారాయణం చే సేందుకు కేరళలోని ఎర్నాకులం భక్త సేవా సంస్థ సభ్యులు 150 మంది ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలానికి వచ్చారు. ముందుగా స్వామిని దర్శించుకుని పారాయణం ప్రారంభించారు. కార్యక్రమంలో మాలోల అతిథి గృహ మేనేజర్ భద్రినారాన్, అనంతకృష్ణన్, కృష్ణన్ పాల్గొన్నారు -
బనారంగ్
అరచేతిలోకి సూర్యుణ్ణి తీసుకుని రుద్దితే దాన్ని తీసుకెళ్లి చంద్రుడికి అద్దితే ఆకాశం కొత్తగా ఉండదూ! బనారస్ చీరల రంగులు వేడివేడిగా... చల్లచల్లగా... హృదయాన్ని తాకుతాయి. ఈ రంగుల రంగేళీయే... బనారంగ్ వేర్ ట్రెడిషన్ బ్రేక్స్ ట్రెడిషన్. సంప్రదాయంలోంచి పుట్టుకొచ్చిన కొత్తరంగులివి. మొఘలుల కళ మగ్గం మీద ఒక్క నాణ్యమైన బనారస్ పట్టు చీర నేయాలంటే కనీసం 15 రోజుల నుంచి ఆరు నెలల కాలం పడుతుంది. 14వ శతాబ్దికి ముందు గుజరాత్ నుంచి వలస వెళ్లిన చేనేతకారులు బనారస్‌లో చీరలు నేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రాంతం పేరుమీదుగా బనారస్ ఫ్యాబ్రిక్‌కు ఆ పేరు వచ్చింది. మొఘలుల కాలంలో ఈ చీరల నేతలో ఎన్నో మార్పులు వచ్చాయి. 19వ శతాబ్ది మొదట్లో బనారస్ పట్టు స్థానంలో జరీ, బ్రొకేడ్ వెలుగు చూసింది. అలాగే, పట్టులోనే బ్రొకేడ్ మెరుపులు 17వ శతాబ్దిలో పరిచయం అయ్యాయి. వీటిల్లో ప్యూర్ బనారస్ సిల్క్, జార్జెట్, ఆర్గంజా, జరీ, సిల్క్‌లు ప్రవేశించాయి. టిష్యూ, బుటీదార్, కట్‌వర్క్, టంచోయి, జంగల్.. వంటివీ పరిచయం అయ్యాయి. దీంతో డిజైనర్ శారీస్ అంటే బెనారస్ ఫ్యాబ్రిక్ అనే పేరు స్థిరపడిపోయింది. పువ్వులు, పండ్ల నుంచి తీసిన నేచురల్ కలర్స్ రంగులు సిల్కు దారాలకు ఇంకేలా చర్యలు తీసుకొని, ఆ తర్వాత ఫ్యాబ్రిక్‌గా మెరిపిస్తారు. అందుకే ఈ కళకు సహజమైన ప్రత్యేకత ఇమిడి ఉంటుంది. డిజైనర్ల మొట్టమొదటి ఎంపిక భారతీయ డిజైనర్లు ఎంపిక చేసుకునే మొట్టమొదటి ఫ్యాబ్రిక్ బనారస్. భారతీయ వివాహ వేడుకలలో ప్రధానంగా కనిపించే వస్త్రం బనారస్. అన్ని మతాలకు నప్పే ఏకైక వస్త్రంగా చరిత్ర నిలుపుకున్నది బనారస్. మన గొప్ప సంస్కృతికి కళాత్మక చిహ్నమైన ఈ ఫ్యాబ్రిక్ వేల ఏళ్లుగా తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. బనారస్ ఫ్యాబ్రిక్‌లోని రంగులు, జరీ వెలుగులు చూపుతిప్పుకోనివ్వవు. ప్రతి భారతీయ మహిళ తప్పని సరిగా తన వార్డ్‌రోబ్‌లో బనారస్ చీర ఒక్కటైనా ఉండాలని ముచ్చటపడతారంటే అతిశయోక్తి కాదు. ఇండో వెస్ట్రన్ బనారస్ చీరలలో బ్రొకేడ్, ఫైన్ సిల్క్, మెత్తటి జరీ ఎప్పుడూ హైలైట్. ఇది రాయల్ ఫ్యాబ్రిక్ అవడంతో దుస్తుల్లో ఏదైనా ఒక అంశంగా తీసుకోవాలని ముచ్చపడేవారే ఎక్కువ. దీంతో జాకెట్లు, ట్రౌజర్లు, చీరలు డ్రెస్సుల అంచులు, ట్రెడిషనల్ ఇండియన్ ఔట్ఫిట్స్.. గా బెనారస్ ఫ్యాబ్రిక్ ఇమిడిపోయింది. బ్రైడల్ లెహంగా లేదా ఫెస్టివ్ లెహంగా ఏదైనా ఈ తరం అమితంగా ముచ్చటపడి ఎంచుకునే లెహంగా బనారస్ ఫ్యాబ్రిక్. ఏ ఫ్యాబ్రిక్‌తో చేసిన డ్రెస్ అయినా భనారస్ దుపట్టా వేసుకుంటే చాలు ఒక గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. బనారస్ ట్యునిక్స్, కుర్తాలను మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ధరించవచ్చు. స్ట్రెయిట్ ట్రౌజర్ లేదా లెహంగా మీదకు బనారస్ కుర్తా వేసుకుంటే నాటికీ- నేటికీ అద్దం పట్టే ఒక ఫ్యుజన్ స్టైల్ వస్తుంది. -
అపురూపాయల్
రంగులకు ప్రాణం పోస్తే... విహంగాలవుతాయి. హంగులకు ఫ్యాషన్ లుక్ ఇస్తే... లెహంగాలవుతాయి.ప్రింట్లను కట్ చేస్తే... ‘ఫుల్ లెంగ్త్’లు అవుతాయి. తారల్ని తీరుగా దిద్దితే... ట్రెడిషన్‌కి బొట్టూ కాటుక అవుతాయి. పాయల్ సింఘాల్ డిజైన్ చేస్తే అంతే మరి! డ్రెస్.. రాయల్‌గా ఉంటుంది. లాయల్‌గా ఉంటుంది.అపురూపంగానూ ఉంటుంది. ‘యువరాణీవారొస్తున్నారహో... తప్పుకోండి’ అంటుంది. పదిహేనేళ్లకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవార్డులు సొంతం చేసుకుంది. పదిహేనేళ్లకే ర్యాంప్ షోలో ఐశ్వర్యారాయ్‌తో పాటు ప్రముఖ తారలను తన డిజైనరీ దుస్తుల ద్వారా మెరిపించింది. పదిహేనేళ్ల్ల తన సృజనాత్మక ప్రపంచంలో ఎన్నో కొత్త వాణిజ్యసముదాయాలను నెలకొల్పి మహిళా వ్యాపారవేత్తగానూ నిరూపించుకున్న ఆమే పాయల్ సింఘాల్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ అయిన పాయల్ ఆన్లైన్ స్టోర్‌లోనూ తనదైన ముద్ర వేసింది. మూడు పదులు దాటిన పాయల్ ఈ రంగంలో ఎదగాలనుకునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘మిగతా డిజైనర్ల డిజైన్స్ నుంచి కొత్తదనం నేర్చుకోవడం వరకు మంచిదే. కానీ, ఈ రంగంలో ఎదగాలంటే తమను తామూ మెరుగు పెట్టుకొని, ఎప్పటికప్పుడు దుస్తులలో కొత్తదనం చూపించాల్సిందే’ అంటున్నారు. -
అక్కడ వితంతువులే ఉండరు!
బెహంగాః ప్రాంతాన్నిబట్టి గిరిజన తెగల్లో ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. అయితే మధ్యప్రదేశ్ లోని గోండ్ల లో కనిపించే సంప్రదాయం మాత్రం విభిన్నంగా కనిపిస్తుంది. కుటుంబంలోని మహిళకు భర్త చనిపోతే ఆమె జీవితాంతం వితంతువుగా ఉండాల్సిన అవసరం వారి తెగల్లో ఉండదు. భర్త చనిపోయిన పదోరోజు కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి ఆమెను పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు వారి సంప్రదాయం ప్రకారం భర్త కావడానికి మనుమడుకి కూడ అర్హత ఉంటుంది. మధ్యప్రదేశ్ మండ్లా జిల్లాలోని గోండ్లలో కనిపించే ప్రత్యేక సంప్రదాయంతో, వారి తెగల్లో మహిళలు వితంతువులుగా మిగిలిపోయే అవకాశం ఉండదు. భర్త చనిపోయిన పది రోజుల్లోగా ఆ మహిళను వారి కుటుంబంలోని పెళ్ళికాని ఏ యువకుడైనా తిరిగి వివాహమాడొచ్చు. కనీసం ఆమెకు మనుమడు వరుస అయ్యే వాడు కూడ నాయనమ్మను, లేదా అమ్మమ్మను పెళ్ళి చేసుకునేందుకు అర్హత ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవ్వరూ లేనప్పుడు, లేదా అలా చేసుకునేందుకు ఇష్టపడని పక్షంలో, భర్త చనిపోయిన పది రోజులకు.. ఆమెకు సంఘంలోని పెద్దలు ప్రత్యేకంగా వెండి గాలులు చేయిస్తారు. పదో రోజు అనంతరం ఆ గాజులను ఆమెకు ఎవరు అందిస్తే వారిని పెళ్ళి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సంప్రదాయాన్ని 'పోటో' గా పిలుస్తారు. ఇదే నేపథ్యంలో 'పటిరం వర్కేడ్' పెళ్ళి కూడ జరిగింది. అతడికి ఆరేళ్ళ వయసున్నపుడు అతడి తాత మరణించడంతో తొమ్మిదవరోజున పటిరం.. 'నాటి పాటో' సంప్రదాయంలో భాగంగా తన నాయనమ్మ చమ్రీబాయ్ ని పెళ్ళి చేసుకున్నాడు. అలా సంప్రదాయ బద్ధంగా ఆ వితంతు మహిళకు పెళ్ళి అయితే... తిరిగి ఆ దంపతులు... భార్యాభర్తలుగా సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. నేను ఇతర అమ్మాయినే పెళ్ళి చేసుకుందాం అనుకున్నానని, అయితే తమ సంప్రదాయంలో భాగంగా, కుల పెద్దల నిర్ణయంతో మైనర్లు పెద్ద వారిని చేసుకునే అవకాశం ఉండటంతో తన నాయనమ్మను పెళ్ళి చేసుకొన్నానని బెహంగా గ్రామంలో నివసించే 42 రెండేళ్ళ పటిరం చెప్తున్నాడు. అయితే ఐదేళ్ళ క్రితం తన నాయనమ్మ మరణించే వరకూ తన భార్య రెండో భార్య హోదాలో కొనసాగేదని వివరించాడు. గోండ్ల ప్రత్యేక సంప్రదాయంలో జీవిత భాగస్వాముల మధ్య తీవ్ర వయోబేధం ఉన్నపుడు ఎటువంటి భౌతిక సంబంధాలు ఉండవు. అయితే సంఘంలో వారు గౌరవ మర్యాదలను పొందేందుకు, సాన్నిహిత్యంతో ఉండేందుకు ఈ ప్రత్యేక సంస్రదాయం సహకరిస్తుంది. 75 ఏళ్ళ సుందరో బాయి కుర్వాతి కూడ పెళ్ళయిన రెండేళ్ళకే తన భర్త చనిపోవడంతో 'దేవర్ పాటో' సంప్రదాయంలో భాగంగా అప్పట్లో ప్రస్తుతం 65 ఏళ్ళున్న తన మరిదిని వివాహమాడింది. భర్త చనిపోయిన సమయంలో అతడు తనను పెళ్ళాడేందుకు ఇష్టాన్ని చూపించలేదని, దాంతో తనను సంఘ పెద్దలు శుభకార్యాలకు అనుమతించే వారు కాదని, అనంతరం రెండేళ్ళ తర్వాత అతడు నన్ను పెళ్ళాడటంతో పెద్దలు తిరిగి అన్నికార్యాలకూ హాజరయ్యేందుకు అంగీకరించారని, అప్పట్నుంచీ దశాబ్దాల కాలంగా తాము ఎంతో సంతోషంగా ఉన్నామని సుందరో బాయి చెప్తోంది. అలాగే తనకంటే ఐదేళ్ళు పెద్దదైన వదినగారిని పెళ్ళాడానని 55 ఏళ్ళ కృపాల్ సింగ్ చెప్తున్నారు. అయితే కొందరు మహిళలు భర్త చనిపోయినప్పటికీ, తిరిగి వివాహం చేసుకోకుండానే వితంతువుగా కాక వివాహితగా కొనసాగేందుకు పెద్దలనుంచి అనుమతి తీసుకుంటారు. అటువంటి వారిలో 28ఏళ్ళ భాగ్వతి ఒకరు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోవడంతో ఆమె తిరిగి వివాహం చేసుకునేందుకు అంగీకరించలేదు. పాంచ్ పటో సంప్రదాయంలో భాగంగా ఆమె వివాహితగా కొనసాగేందుకు సంఘ పెద్దలనుంచి అనుమతి తీసుకుంది. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా గోండ్లు తమ సంప్రదాయాలు పాటిస్తారని, ఒక్క తమ గ్రామంలోనే కాక, భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేస్తున్నఇద్దరు ఇంజనీర్లు సైతం తమ దేవర్ పాటో సంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నారని ట్రైబల్ లీడర్ గుల్జార్ సింగ్ మర్కమ్ తెలిపారు. ఈ వివాహ వ్యవస్థ మా సంస్కృతిలో భాగమని, నాటీ పాటో వివాహంలో నాయనమ్మను పెళ్ళి చేసుకున్న పిల్లలు ఆమెతో ఆడుకోవడం కనిపించడం సాధారణమని గుల్జార్ తెలిపారు. అయితే నాటి పాటోలో నాయనమ్మను పెళ్ళాడిన మనుమడే కుటుంబ పెద్దగా ఉంటాడని వివరించాడు. -
ఊరంతా వనవాసం !
నెలరోజుల్లో ఏడుగురి మృతితో ముందుగానే అడవి బాట జంతు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు తమిళనాడులో వింత ఆచారం క్రిష్ణగిరి : ఊరంతా వనవాసానికి బయలుదేరింది. పుష్కరానికి ఒక్కసారి మేలుమలై గ్రామ ప్రజలు ఒక రోజు పాటు అడ విదారి పడతారు. సూళగిరి సమీపంలోని మేలుమలై గ్రామంలో 400 కుటుంబాలు ఆదివారం ఉదయం వనవాసానికి బయలుదేరారు. అయితే ఈ సారి మాత్రం కొంత ముందుగానే గ్రామదేవత ఆదేశానుసారం గ్రామం అడవి బాటపట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు... గత నెల రోజుల వ్యవధిలో ఏడుగురు మరణించడంతో గ్రామస్తుల్లో భయం చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు అందరూ గతనెల 29న ఒకచోటకు చేరి చర్చించారు. ఇదే సమయంలో పూజారి వెంకటేశులుకు మారియమ్మ దేవత పూనకం వచ్చి అమృతవాక్కు పలికిందని, గ్రామానికి అరిష్టం జరిగిందని, గ్రామం మొత్తం వనవాసం చేయాలని అమ్మవారు ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు. వనవాసానికి ఇంకా రెండేళ్లు ఉన్నా కూడా వనవాసం చేయాల్సిందేనని అమ్మవారు ఆదేశించడంతో గ్రామస్తులు ఆదివారం ఉదయం వనవాసానికి సిద్ధమయ్యారు. ఉదయం 6.30 గంటకు బిక్కనపల్లి అడవికి చేరుకున్నారు. అడవిలో స్నానాలు చేసి విశేషపూజలు చేశారు. గ్రామదేవతకు జంతుబలులిచ్చి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం వనభోజనాలు ఆరగించారు. ఆదివారం రాత్రి 7 గంటలకు మళ్లీ గ్రామదేవతను ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకొచ్చారు. బోసిపోయిన గ్రామం రాత్రి మళ్లి కళకళలాడింది. గ్రామ రక్షణ కోసం.. గ్రామానికి ఏ అరిష్టం జరగకుండా వర్షాలు సమృద్ధిగా కురవడం కోసం, పంటపొలాలపై చీడపీడల దాడిని నివారించేందుకు గ్రామంలో చెడ్డ జరగకుండా గ్రామదేవత మొక్కులు తీర్చుకొనేందుకు ప్రతి 12 ఏళ్లకొకసారి తాతల కాలం నుంచి ఈ ఆచారం ఉందని గ్రామపెద్ద మునిరాజు తెలిపారు. -
సంప్రదాయ కళల్లో సమస్యల 'ప్రదర్శన'
నాగాలాండ్ సంప్రదాయ కళలు అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్లో భాగమయ్యాయి. స్థానిక సమస్యల కథాంశాలుగా మారాయి. నాగాలాండ్ మహిళల రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా ఉండే నూలు వడకడం, నేత, నృత్యం, అల్లికలు, కాన్వాస్, పెయింటింగ్స్, ఫోక్ డ్యాన్స్ వంటి సంప్రదాయ కళలను కాన్వాస్‌లు, షాల్స్ రూపంలో రూపొందించిన ఓ కళాకారిణి ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంలో 'హీలింగ్' పేరున ప్రదర్శన ఏర్పాటుచేసింది. సమస్యలు ప్రధానాంశంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. నాగాలాండ్‌కు చెందిన విద్యావంతురాలు, కళాకారిణి ఐరిస్ ఓడ్యూ తన కళకు అక్కడి సమస్యలను జోడించింది. గృహహింస, లైంగిక వేధింపుల వంటి సమస్యల పరిష్కారంతో పాటు... వారి గౌరవానికి వన్నె తెచ్చేలా శాలువాలు, పెయింటింగ్స్ గా అనేక కళాత్మక డిజైన్లను రూపొందించి ప్రదర్శన ఏర్పాటు చేసింది. నాగాలాండ్ లోని వివిధ సామాజిక వర్గాల ద్వారా తయారైన 9 ఎక్రిలిక్ పెయింటింగ్స్, ఉలెన్ సంప్రదాయ శాలువాలను ఓడ్యూ 12వ ఆసియా ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రదర్శించారు. మహిళలే కాదు.. బాధిత పురుషులు, బాలల సమస్యలను కూడ తన కళల్లో పొందుపరిచారు. ప్రపంచయుద్ధ సమయంలో జర్మన్ సైనిక యూనిఫారాల కోసం మొదటిసారి ఫ్యాబ్రిక్స్ వాడకం మొదలు పెట్టారని, నాగాలాండ్ బర్మా సరిహద్దు ప్రాంతంలో నేటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందని, అత్యధిక సమయం పట్టడంతో పాటు, కఠినంగా కూడా ఉండే నేత కళను గ్రామాల్లోని మహిళలు అందమైన శాలువాలుగా వారి కోసం నేస్తూనే ఉన్నారని ఓడ్యూ చెబుతున్నారు. తన కాన్వాస్ కోసం శాలువాలను నేసే విధానం చూస్తే అక్కడి మహిళల కష్టం ప్రత్యక్షంగా తెలిసిందంటున్నారు. ఈ ప్రదర్శనలు గ్రామీణ మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించగలవని, సమస్యల పరిష్కారానికి సహకరిస్తాయని ఓడ్యూ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే ఆలోచనతోనే హీలింగ్ పేరున తాను ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఓడ్యూ వెల్లడించారు. -
'హెలికాప్టర్లో వెళ్లైనా ఆ గుడిలోకి ప్రవేశిస్తాం'
అహ్మద్‌నగర్: మహిళలకు ప్రవేశం నిరాకరిస్తున్న మహారాష్ట్రలోని శని దేవాలయంలోకి తాము ఎట్టిపరిస్థితుల్లో వెళ్లితీరుతామని ఓ మహిళా హక్కుల సంఘం హెచ్చరించింది. ముంబైకి 330 కిలోమీటర్ల దూరంలో షిగ్నాపూర్లో ఉన్న ప్రముఖ దేవాలయమైన శని ఆలయంలోని గర్భగుడిలోకి గత ఆరు దశాబ్దాలుగా మహిళలను అనుమతించడం లేదు. ఇది మహిళల పట్ల వివక్ష చూపడమేనని, రాజ్యాంగ ప్రకారం స్త్రీ, పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉన్నాయని పేర్కొంటూ భూమాత రణరాగిణి బ్రిగేడ్ (బీఆర్బీ) కార్యకర్తలు దాదాపు 400 మంది ఆలయంలోని ప్రవేశించాలని నిర్ణయించారు. ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నపక్షంలో అవసరమైతే హెలికాప్టర్లో ప్రయాణించైనా ఆలయానికి చేరుకుంటామని, హెలికాప్టర్ నుంచి నిచ్చెనలు వేసుకొని ఆలయంలోకి దిగుతామని బీఆర్బీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 'మేం ఇప్పటికే హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం. భూమార్గంలో మాకు ప్రవేశాన్ని నిరాకరిస్తే.. మేం చాపర్ ద్వారా నిచ్చెనలు వేసి ఆలయంలో దిగుతాం. మహిళలకు హక్కులకు సంబంధించిన ఈ విషయంలో మేం దేనికి భయపడేది లేదు' అని బీఆర్బీ అధ్యక్షురాలు తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు. మరోవైపు షిగ్నాపూర్ గ్రామస్తులు మహిళా కార్యకర్తలు ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. మానవహారంగా ఏర్పడి అయినా వారిని అడ్డుకుంటామని స్థానికులు చెప్తున్నారు. దీంతో షిగ్నాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. -
జల్లికట్టు రంకేసింది
-
ఉత్సాహం రంకేసింది
జన సంద్రమైన రంగంపేట పదిమందికి గాయాలు ఉత్సాహం రంకెలేసింది.. సంప్రదాయం ఉట్టిపడింది.. పశువుల పండుగ కనువిందు చేసింది.. సంక్రాంతి సందర్భంగా శనివారం చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టు యువకుల్లో కొత్త జోష్‌ను నింపింది. మొదట కోడెగిత్తల కొమ్ములకు చెక్కపలకలు కట్టి వీధుల్లో పరుగెత్తించారు. వాటిని నిలువరించి, పలకలను చేజిక్కించుకోవడానికి యువకులు పోటీపడ్డారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన జనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వాహనరాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చంద్రగిరి: కోడెగిత్తల రంకెలు హోరెత్తించాయి. గిత్తలను పట్టుకోవడానికి యువకులు హుషారుగా పరుగులు తీశారు. మండలంలోని ఏ.రంగంపేటలో శనివారం జల్లికట్టు కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా కోడెగిత్తలకు కట్టిన పలకలను చేజిక్కిచ్చుకోవడానికి యువకులు పోటీలు పడ్డారు. పలకలను దక్కించుకున్న యువకులు ఆనందంగా ఈలలు వేసి, కేరింతలు కొట్టారు. ఆనందకేళిలో మునిగి తేలారు. ఇరువర్గాల మధ్య గొడవ జల్లికట్టులో అక్కడక్కడ యువకుల గ్రూపుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఎద్దులను నిలువరించే సమయంలో తాము పట్టామంటే.. తామని గొడవలకు దిగా రు. దీంతో యువకులు చెక్క పలకల కోసం కొట్టుకునే స్థాయికి దిగారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీకి పని చెప్పడ ంతో గొడవలు సద్దుమణిగాయి. పశువుల నుంచి చెక్క పలకలను సొంతం చేసుకునే క్రమంలో సుమారు పది మందికి యువకులకు గాయాలయ్యాయి. గట్టి బందోబస్తు మండలంలో జల్టికట్టు చట్టవిరుద్ధమని మూడు రోజులు గా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా తరతరాలుగా జరుపుకుంటున్న పండుగను నిలిపే ప్రసక్తే లేద ని గ్రామస్తులు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు ముందస్తుగా చంద్రగిరి, తిరుపతి పోలీసులు, స్పెషల్ఫోర్సుతో బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఊరంతా వీరులే!
మన దేశంలో కరాటే, కుంగ్‌పూ లాంటి ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యలను అభ్యసించేవారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎవరైనా ఇలాంటి విద్యలో ప్రావీణ్యం ప్రదర్శిస్తుంటే మనం వారిని చాలా గొప్పగా, ఆశ్చర్యంగా చూస్తాం. కానీ చైనాలోని ఒక గ్రామంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఊరుఊరంతా కుంగ్‌పూ విద్యలో తమదైన నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. వారేదో ఆర్మీలో చేరేందుకో మరేదైనా ఉద్దేశంతోనో ఈ విద్యను అభ్యసిస్తున్నారనుకుంటే మీరు పొరబడ్డారన్నమాటే. మొదట్లో ఆత్మరక్షణ కోసం ప్రారంభించిన ఈ విద్య, ప్రస్తుతం ఆ గ్రామంలో ఒక సంప్రదాయంగా మారింది. చైనాలోని టియాంఝ పర్వతాల్లో ఉన్న ఈ గ్రామం పేరు 'గంజి డోంగ్' ఈ రోజు ఆ ప్రత్యేక గ్రామం విశేషాల గురించి తెలుసుకుందాం..! రోజూ సాధన.. యువకుల నుంచి ముసలివారి దాకా రోజూ క్రమం తప్పకుండా కుంగ్‌ఫూ సాధన చేస్తుంటారు. మహిళలు కూడా ఇందులో ఉత్సాహంగాపాల్గొనడం విశేషం. సుమారు 120 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. వీరంతా చిన్నచిన్న గుడిసెల్లో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. ఎవరి స్టైల్ వారిదే.. ఇలా సాధన చేసేటప్పుడు అందరూ ఒకే రకమైన విన్యాసాలను అభ్యసించరు. ఒక్కో కుటుంబానిది ఒక్కో రకమైన శైలి కుంగ్‌పూ. దినచర్యలో భాగంగా వాడే వస్తువులే వారికి ఆయుధాలు. ఎటువంటి ఆయుధాలు లేకుండా చేతులతోనే పోరాడే యోధులు కూడా ఉన్నారు. కొన్ని తరాలుగా ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ పటిష్టమైన యుద్ధ కళను కాపాడుకుంటున్నారు గ్రామస్తులు. ఒంటరిగా తమదైన శైలిలో సాధన చేస్తూనే మరోశైలి వారిపై కయ్యానికి కాలుదువ్వుతుంటారు. ఇవన్నీ స్నేహపూర్వక పందాలే అయినప్పటికీ పోరాటం మాత్రం యుద్ధాన్ని తలపిస్తుంది. వైరమనేదే కనిపించదు.. ఎన్ని పోరాటాలు జరిగినా ఏ కుటుంబానికీ మరో కుటుంబంతో వైరమనేదే ఉండదు. గ్రామం మొత్తం ఒక కుటుంబంగా కుంగ్‌ఫూ అభివృద్ధికి తోడ్పడుతోంది. చైనాలో కనిపించే 56 సంప్రదాయక జాతుల్లో ఈ గ్రామం వారిది ఒక తెగ. కుంగ్‌ఫూలోని కొన్ని ప్రత్యేకమైన విన్యాసాలను కేవలం ఈ గ్రామంలో మాత్రమే చూడగలమని కుంగ్‌ఫూ నిపుణులు అంటున్నారు. సాధన కోసం గ్రామస్తులు ఎంత కష్టమైనా వెనుకాడరు. అడవి, కొండలు, గుహలు, లోయలు, కాలువలు, పొలాలు.. ఇలా ప్రతిచోట ఎదురయ్యే సవాళ్లనే తమ సాధనకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎలా మొదలైంది..? ఈ ఊరి ప్రజలంతా కుంగ్‌ఫూ నేర్చుకోవడం వెనుక రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గ్రామం అరణ్య ప్రాంతంలో ఉండటంతో క్రూర మృగాలు నిత్యం గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచేవి. వారికి జీవనాధారమైన పెంపుడు జంతువులను చంపేసేవి. దాంతో ఇంటికొక యువకుడు చొప్పున ఒక బృందంగా ఏర్పడ్డారు. క్రూర మృగాల బారినుంచి వారి గ్రామాన్ని కాపాడుకోవడానికి యువకులంతా ఈ విద్యను అభ్యసించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా ఇదే వారి సంప్రదాయంగా మారింది. మరో కథనం ప్రకారం మొదటగా కొన్ని కుటుంబాలు ఆ ఊరికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాయి. అయితే దోపిడీ దొంగల బెడద ఎక్కువవడంతో ఆ గ్రామ ప్రజలు ఇద్దరు మార్షల్ ఆర్ట్స్ నిపుణుల్ని సంప్రదించి వారి ఆధ్వర్యంలో ఆ యుద్ధవిద్యను నేర్చుకున్నారు. వాళ్లు నేర్చుకున్న ఆ కళను మిగిలిన వారికి కూడా నేర్పించడం మొదలు పెట్టారట. -
భక్తిశ్రద్ధలతో జగన్నాథుని వనజాగరణ యాత్ర
జగన్నాథుడు అందరి వాడు. ఆయన ప్రతి సేవ, పూజ, నైవేద్యం, సంప్రదాయం అంతా అద్వితీయం. అపురూపం. మనిషే దైవం, దైవమే మనిషి అనే మహత్తర అనుబంధం స్వామి ఆచార వ్యవహారాల్లో ఉట్టిపడుతుంది. శ్రీజగన్నాథుని సంస్కృతిలో ‘నవ కళేబరం’ మహత్తర ఘట్టం. పాత శరీరం వీడి కొత్త శరీరంలోకి బ్రహ్మని ప్రతిష్టింపజేసుకోవడం నవ కళేబరం సరళమైన భావనగా భక్తులు విశ్వసిస్తారు. శ్రీమందిరం దేవస్థానంలో రత్న వేదికపై చతుర్థామూర్తులు (సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీజగన్నాథుడు) భక్తులు, యాత్రికులకు నిత్యం దర్శనమిస్తారు. ఈ మూర్తులన్నీ దారు విగ్రహాలే. ఆలయ పంచాంగం లెక్కల ప్రకారం పుణ్యతిథుల్లో రత్న వేదికపై కొలువు దీరిన దారు మూల విరాట్లని మార్చే ప్రక్రియ నవ కళేబర ఉత్సవం. బాడొగ్రాహిల నేతృత్వంలో నవ కళేబరం రూపు దిద్దుకుంటుంది. చతుర్థామూర్తుల తరపున ప్రత్యక్ష ప్రాతినిధ్యం వహించే వర్గాన్ని బాడొగ్రాహిగా పరిగణిస్తారు. నవ కళేబర ఉత్సవంలో వన జాగరణ యాత్ర ఆది ఘట్టం. నవ కళేబరానికి అవసరమైన పవిత్ర దారు అన్వేషణని వన జాగరణ యాత్రగా పేర్కొంటారు. ఈసారి దళపతిగా హల్దర్ దాస్మహాపాత్రొ వన జాగరణ దళానికి సారథ్యం వహించారు. ఈ దళంలో నలుగురు ఉప దళపతులు ఉంటారు. ఇలా దళంలో సుమారు 150 మంది సభ్యులు ఉంటారు. రత్న వేదిక నుంచి చతుర్థా మూర్తుల ఆజ్ఞా మాలలు అందడంతో వన జాగరణ యాత్ర వాస్తవంగా ప్రారంభమవుతుంది. తదుపరి శ్రీజగన్నాథుని ప్రథమ సేవకునిగా పరిగణించబడే గజపతి మహారాజా దివ్య సింగ్‌దేవ్ రాజ మందిరంలో రాజ గురువుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజాదుల్లో పవిత్ర వక్కని వన జాగరణ దళపతికి అందజేస్తారు. అక్కడ నుంచి దళం నిరవధిక పాదయాత్ర ఊపందుకుంటుంది. ఈ యాత్రలో తొలి మజిలీ పూరీ పట్టణంలో శ్రీజగన్నాథ వల్లభ మఠం. తొలి రోజు రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ప్రాతఃకాలంలో బయల్దేరి మలి మజిలీ కోణార్కు/రామచండీ మందిరంలో బస చేసి విశ్రమిస్తారు. అక్కడ నుంచి చివరి మజిలీ దెవుళి మఠానికి దళం చేరుతుంది. మఠానికి చేరువలో మా మంగళా దేవీ పీఠం ఉంది. మా మంగళా దేవీ కటాక్షం అత్యద్భుతం జగతి నాథుని నవ కళేబర ఉత్సవం శక్తి, శ్రీమన్నారాయణుల ఉమ్మడి ఉపానతో ముడి పడి ఉంది. కాకత్పూర్ మంగళా దేవి కటాక్షంతో శ్రీజగన్నాథుని నవ కళేబరానికి అవసరమైన దారు సంకేతాలు లభిస్తాయి. దేవీ కటాక్షం మేరకు వన జాగరణ దళం అన్వేషణ యాత్ర ప్రారంభిస్తుంది. శ్రీమందిరం నుంచి బయల్దేరిన వన జాగరణ దళం అంచెలంచెలుగా దెవుళి మఠానికి చేరుతుంది. అది మొదలుకొని మంగళా దేవీ కటాక్షం కోసం జపతపాలు ప్రారంభిస్తారు. దేవీ పీఠంలో స్వప్న ఆదేశం కోసం స్వప్నేశ్వరి మంత్ర జపాన్ని నిరవధికంగా నిర్వహిస్తారు. పవిత్ర దారు ఆచూకీ స్వప్నంలోనే ప్రాప్తిస్తుంది. దేవీ అనుగ్రహంలో దళంలో సభ్యులకు స్వప్న ఆదేశం అందేటంత వరకు స్వప్నేశ్వరి మంత్ర జపం నిరవధికంగా సాగాల్సిందే. స్వప్న ఆదేశంతో తక్షణమే అన్వేషణకు యాత్ర బలం పుంజుకుంటుంది. దళంలో సభ్యులు 6 జట్లుగా విడిపోయి అన్వేషిస్తారు. ప్రాతఃకాలం నుంచి అపరాహ్ణం వరకు 4 జట్లు, అపరాహ్ణం నుంచి సంధ్య వేళ వరకు 2 జట్లు దారు కోసం అన్వేషిస్తాయి. ఈ జట్లుకు తారసపడిన దారు వివరాల్ని నిత్యం సంధ్య వేళలో దళపతి, ఉప దళపతి, దైతపతులంతా కలిసి దెవుళి మఠంలో సమీక్షిస్తారు. ఇలా 100 పైబడి వేప చెట్ల వివరాల్ని సేకరించిన మేరకు చివరగా 4 వృక్షాల్ని ఖరారు చేస్తారు. ఈ వృక్షాల దారుని చతుర్థా మూర్తుల తయారీకి వినియోగిస్తారు. నవ కళేబరం దారు వెలసిన ప్రాంతం, అర్హత కలిగిన దారు చిహ్నాల్ని స్వప్న ఆదేశంలోనే పొందుతారని దైతపతుల సమాచారం. నవ కళేబరం దారుకు సంబంధించి శాస్త్రీయంగా కూడ ప్రత్యేక మార్గదర్శకాలు ఆచరణలో ఉన్నాయి. నదీ తీరాన స్మశాన వాటికకు చేరువలో ఆఘాతం లేకుండా ఎదిగిన వేప వృక్షం నవ కళేబరానికి అర్హత కలిగిన కల్పంగా పరిగణిస్తారు. ఈ కల్పం పాద ప్రాంతంలో పుట్ట, నాగ సర్ప సంచారంతో చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక పరిసరాల మధ్య పశు పక్ష్యాదులు తాకకుండా శంఖం, గద, చక్రాదులు వంటి చిహ్నాలు కలిగిన నింబ వృక్షం దారుని పవిత్ర నవ కళేబరం కోసం వినియోగిస్తారు. వీటితో మరికొన్ని గోప్యమైన సంకేతాల్ని కూడ పరిగణనలోకి తీసుకున్న మేరకు కొత్త మూల విరాట్ల తయారీకి అర్హమైన దారు వివరాల్ని వన జాగరణ దళం ప్రకటిస్తుంది. వన జాగరణ దళం సూచన మేరకు శ్రీమందిరం దేవస్థానం తొలుత సుదర్శనుని దారుకు సంబంధించి వివరాల్ని అధికారికంగా బహిరంగపరుస్తుంది. తర్వాత అంచెలంచెలుగా బలభద్రుడు, దేవీ సుభద్ర, చివరగా శ్రీజగన్నాథుని దారు వివరాల్ని ప్రకటిస్తారు. శ్రీచక్ర నారాయణుని తోడుగా .... నవ కళేబరం దారు అన్వేషణలో వన జాగరణ దళానికి శ్రీ చక్ర నారాయణుడు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉండడంతో చీకటి, వెలుగులు, ఎండ, తాపం వంటి అలసత్వం లేకుండా యాత్ర నిర్భయంగా, నిరవధికంగా సాగుతుందని దళంలో సభ్యులు వివరించారు. బస చేసిన ప్రతి చోట నిరంతరాయంగా శ్రీ చక్ర నారాయణుని సేవించడంలో వన జాగరణ దళం తల మునకలై ఉంటుంది. దారు అన్వేషణలో దైతపతులు శ్రీ చక్ర నారాయణుని చేత పట్టుకుని ముందుకు సాగుతారు. ఆయన శక్తితో పాదయాత్ర అవలీలగా సాగిపోతుంది. దారు అన్వేషణని విజయవంతం చేస్తుంది. వన జాగరణ యాత్ర దళం సభ్యులు యాత్ర ఆద్యంతాల్లో ఒంటి పూట (మహా ప్రసాదం) భోజనంతో అత్యంత నియమ నిష్టలతో మంత్ర జపతపాలు, పూజాదుల్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. పాద యాత్రలో వీరు బస చేసే మజిలీల్లో వసతి, ఆరోగ్యం, శాంతి భద్రత ఏర్పాట్లని శ్రీమందిరం దేవస్థానం పర్యవేక్షిస్తుంది. నిత్యం శ్రీమందిరం నుంచి శ్రీజగన్నాథుని మహా ప్రసాదాలు (అన్న ప్రసాదాలు) వన జాగరణ దళం బస చేసే చోటుకు సాయంత్రం సరికి చేరేలా దేవస్థానం అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. దేవస్థానం ప్రధాన పాలనాధికారి ఈ వ్యవహారాల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దిగువ స్థాయి అధికారులతో వన జాగరణ దళానికి ఎటువంటి ప్రమేయం ఉండకపోవడం విశేషం. లోగడ నవ కళేబర ఉత్సవం 1969, 1977, 1996 సంవత్సరాల్లో జరిగినట్లు దేవస్థానం రికార్డుల సమాచారం. - ఎస్.వి. రమణమూర్తి, సాక్షి, భువనేశ్వర్ -
ఐటీ బోనం
వాళ్లంతా ఐటీ ఉద్యోగులు. కంపెనీ వార్షికోత్సవంలో సందడే కాదు.. సంప్రదాయం ప్రతిబింబించాలని భావించారు. అందుకే భాగ్యనగరంలో వైభవంగా జరిపే బోనాల పండుగను ఉద్యోగులంతా కలసి చేసుకున్నారు. మహిళా ఉద్యోగినులు బోనమెత్తారు. అమ్మోరు భక్తిగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. మరికొందరు పోతరాజు వేషాల్లో ఇరగదీశారు. మరో ఉద్యోగిని మౌనప్రియ భవిష్యవాణి వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా షేక్‌పేట్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం డీఎస్టీ ఇండియా ఇన్వెస్ట్స్ వార్షికోత్సవం తెలంగాణ సంప్రదాయానికి, హైదరాబాద్ అస్తిత్వానికి వేదికగా మారింది. వేడుకలో భాగంగా గాయకుడు అంజూ గుర్వారా సంగీత విభావరి అందరినీ అలరించింది. -
ఊరూరా భోగి సందడి
నేడు సంక్రాంతి పండగ నెల్లూరు(అర్బన్): సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటుతున్నారుు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఊరూరా భోగి పండగను బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భోగి సందడి ప్రారంభమైంది. తాటి ఆకుతో పాటు పాతచీపుర్లు, పాత కాగితాలు, సామగ్రితో భోగి మంటలు వేశారు. ఒకరితో ఒకరు పోటీ పడటంతో మంటలు ఆకాశాన్ని అంటారుు. నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, బుచ్చిరెడ్డిపాళెం, వింజమూరుతో పాటు ప్రతి పల్లెలో వేకువ నుంచే భోగి సందడి కనిపించింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నా జనం లెక్కచేయక మంటలు వేసి చలిని తరిమికొట్టారు. దాదాపు ప్రతి చోట యువకులు, పిల్లలు బృందాలుగా ఏర్పడి భారీ ఎత్తున మంటలు వేశారు. పల్లెల్లోని కూడళ్లలో అరుుతే పండగ సందడి మరింత ఎక్కువ కనిపించింది. సంప్రదాయంలో భాగంగా చిన్నారులకు భోగిపండ్లు పోయడంతో పాటు శనగలు, పూలు, చెరకు ముక్కలు, నాణేలతో ఆశీర్వదించి దిష్టి తీశారు. అపార్ట్మెంట్ వాసులు సామూహిక భోగి మంటలను వేసుకుని సందడి చేశారు. గొబ్బిపాటలతో పల్లెలు మార్మోగాయి. నెల్లూరులోని బాలాజీనగర్‌లో చిన్నారులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు కీర్తనలు ఆలపించడం పండగకు ప్రత్యేక శోభ తెచ్చాయి. తాటాకు ధరకు రెక్కలు భోగి పండగలో కీలకమైన తాటాకు ధర చుక్కలనంటింది. గతంలో గ్రామాల్లో తాటిచెట్లు భారీగా ఉండేవి. ప్రధానంగా జిల్లాలోని తీరప్రాంతంలో తాటి తోపులు విస్తారంగా కనిపించేవి. ఇటీవల కాలంలో వెనామీ సాగు జోరందుకోవడం, పలు పరిశ్రమలు ఏర్పాటవడంతో తాటిచెట్లు నేలకూలారుు. ఈ క్రమంలో తాటకు ధర భారీగా పెరిగింది. 20 ఆకులు కూడా లేని కట్టను రూ.200 వరకు విక్రరుుంచారు. దీంతో నగర, పట్టణ వాసులకు పండగ ఖర్చు కొంత పెరిగింది. ప్రధాన కూడళ్లలో కనిపించే పెద్దపెద్ద మొద్దుల స్థానంలోనూ టాటాకులే కనిపించారుు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా... తెలుగువారి అతి పెద్ద పండగ సంక్రాంతి. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పల్లెల్లో గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నత్యాలు కనులవిందు చేస్తాయి. హరిలో రంగ హరీ అంటూ నెత్తిపై నుంచి నాసిక వరకు తిరుమణి పెట్టుకొని ఘల్లుఘల్లు మంటూ చిందులు వేస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసు ప్రత్యక్షమవుతారు. అయితే ప్రస్తుతం హరిదాసుల సంస్కృతి బాగా తగ్గిపోయి కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తున్నారు. నగరాల్లో కంటే పల్లెల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండగ ఎంతో ప్రత్యేకం. ఎక్కడున్నా తొలి పండగకు భార్యతో అత్తవారింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఇప్పటికే వారు అత్తారింటికి సందడి చేస్తున్నారు. బోడిగాడితోటలో ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని బోడిగాడితోట(హిందూ శ్మశాన వాటిక)లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పితృ దేవతలకు సంతర్పణ చేసే కార్యక్రమం నగరంలో భారీ స్థాయిలో జరగనుంది. ఇప్పటికే నగర వాసులు పలువురు తమ ఆత్మీయుల సమాధులను ప్రత్యేకంగా అలకరించారు. గురువారం ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారు. -
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?
పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు? నివృత్తం ‘పెళ్లి’ అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి దూరంగా వెళ్లిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం. ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని, కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని, మనసారా ఆశీర్వదించి.. ఆమెకు ప్రీతిపాత్రమైన దుస్తులు, పసుపు-కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ‘ఒడిబియ్యం’ పోయడం అనే సంప్రదాయం పాటిస్తున్నారు. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగుపట్టమన్నాడట కొందరు సందర్భాలను బట్టి మారుతుంటారు. మారడం అంటే ఇక్కడ ప్రతికూల అర్థం తీసుకోవాలి. సంపద ఉంటే ఒకలాగా, పరపతి ఉంటే ఒకలాగా, ఏమీ లేని వాళ్ల వద్ద ఒకలాగా ఉంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. ఒక పేదవాడికి హఠాత్తుగా ఏ లాటరీయో తగిలి కోటి రూపాయలు వచ్చిందనుకుందాం. అపుడు అతను తన కుటుంబ అవసరాలు తీర్చుకోవడంలో, ఇల్లు-పొలాలు కొనుక్కోవడంలో, విలాసాలు అనుభవించడంలో తప్పులేదు. కానీ డబ్బుంది కదా ... పని మనుషులు ఉన్నారు... కదా అని పగటి పూట ఎండలో పట్టాల్సిన గొడుగును అర్ధరాత్రి పట్టుకోమని చెబితే సమాజం హర్షించదు. అలాంటి వారిని దూరంగా పెడుతుంది. పరిస్థితులకు ప్రతికూలంగా ప్రవర్తిస్తూ డాబు చూసుకుని బతికే వాడు మిడిసి పడతాడు. అలాంటి వాడికి ఇబ్బందులు కూడా తప్పవన్న అర్థంలో ఈ సామెతను వాడతారు. -
క్యాంపస్‌లో.. bigg boss
సిటీ కాలేజీలు ట్రెండ్‌ని ఫాలో అవ్వవు. క్రియేట్ చేస్తాయి. సూపర్‌హిట్ అయిన టీవీ రియాలిటీ షో లు బిగ్‌బాస్, రోడీస్లని క్యాంపస్‌లోకి తీసుకొచ్చి కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేయడం ద్వారా సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది పల్సేషన్. మిగిలిన కాలేజీలన్నీ మరిన్ని రియాల్టీ షోలకు వెల్కమ్ చెప్పడం ద్వారా ఇది రేపటి ట్రెడిషన్ గా మారనుంది. కల్చరల్ ఈవెంట్స్, క్విజ్ కాంపిటీషన్స్, గేమ్స్, స్పోర్ట్స్, లిటరరీ యాక్టివిటీస్, మ్యూజిక్ కాంపిటీషన్స్.. ఇంకా చారిటీ వర్క్స్. కాలేజ్ ఈవెంట్లలో హోరెత్తించే ఈ తరహా రెగ్యులర్ ప్రోగ్రామ్‌ల గురించి మాట్లాడడం ఇంకా మనకు బోరెత్తించదా? వాట్స్ నెక్ట్స్? అని అడగాలనిపించదా? యంగ్ అండ్ ఎనర్జిటిక్ గైస్/గాళ్స్‌కు ఆ మాత్రం తెలియదా? తెలుసు కాబట్టే.. ఓ కొత్త ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో క్యాంపస్ ఈవెంట్‌ని టాక్ ఆఫ్ ది ట్విన్ సిటీస్‌గా మార్చారు. ఆ కాన్సెప్ట్ పేరే రియాలిటీ షో. కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా టీవీ వ్యూయర్‌షిప్‌ని శాసిస్తున్న షోస్‌ని అనుకరించడం ద్వారా కాలేజీలలో లేటెస్ట్ ట్రెండ్‌కు నాంది పలికాయి షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సెన్సైస్, డాక్టర్ వీఆర్కే వుమెన్స్ మెడికల్ కాలేజీ. ‘బిగ్’ ఫెస్ట్... విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒకే చోట కొన్ని రోజుల పాటు కలసి గడపడం, వారి ప్రవర్తనను సీక్రెట్ కెమెరాల ద్వారా గమనించడం, సహజమైన భావోద్వేగాలను స్వేచ్ఛగా వెల్లడించే ందుకు అవకాశం కల్పించి.. వారి ప్రవర్తనకు వీక్షకుల ఓటింగ్, న్యాయ నిర్ణేతల జడ్జిమెంట్ బేస్ చేసుకుని మార్కులేయడం.. ఎక్కువ మందిని మెప్పించిన వారిని విజేతలుగా ఎంపిక చేయడం.. ఈ ప్రాసెస్ వినగానే హిందీ టీవీ చానెల్స్ చూసే వాళ్లు వెంటనే బిగ్‌బాస్ అని గుర్తిస్తారు. అంతగా పాపులరైన ఈ ప్రోగ్రామ్‌ను మక్కీకి మక్కీ షాదాన్ కాలేజ్ ఫెస్ట్‌లో భాగం చేశారు. దీని కోసం క్యాంపస్ ఆవరణలోనే బిగ్‌బాస్ హౌస్‌ను కూడా నెలకొల్పారు. ‘విభిన్నంగా ఉంటుందని దీనిని ఎంచుకున్నాం. దాదాపు 100కు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. వీటిలో నుంచి 20 ఫైనలిస్ట్‌లు ఎంపికైతే చివరకు 15 మందికే హౌస్‌లోకి వెళ్లే అవకాశం కలిగింది’ అని నిర్వాహకులు అమన్ చెప్పారు. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్ రూమ్.. వంటి వాటితో ఈ బిగ్ హౌస్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు రాత్రుళ్లు సైతం అక్కడే ఉంటే విద్యార్థినులు రాత్రి వెళ్లి పోయి ఉదయాన్నే మళ్లీ జాయిన్ అయ్యారు. అలాగే ఓటింగ్‌లు, ఎలిమినేషన్ రౌండ్లు.. ఇలా బిగ్‌బాస్‌ను తలపించే రీతిలో షో కండక్ట్ చేశారు. యూత్‌కి యూజ్‌ఫుల్.. యువత కోసం యువత చేత యువత వలన అన్నట్టు రూపుదిద్దుకునే కాలేజీ ఈవెంట్లు.. రోజు రోజుకూ క్రియేటి వ్గా మారుతుండడం నవతరానికి మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. రియాలిటీ షో అనే కొత్త కాన్సెప్ట్ ఎంటరై హిట్టవడంతో రానున్న రోజుల్లో మరిన్ని వెరైటీ థీమ్స్ రావడం, మరింతగా యూత్ టాలెంట్ వెలుగుచూడడం తధ్యం. సో.. లెట్ వెయిట్ ఫర్ మెనీ మోర్ వెరైటీ కాన్సెప్ట్స్.. సమ్‌థింగ్ డిఫరెంట్.. విభిన్నంగా ఏదైనా ప్లాన్ చేయాలని ఆలోచించి బిగ్‌బాస్ రియాలిటీషో కాన్సెప్ట్ డిజైన్ చేశాం. అందిన రిజిస్ట్రేషన్స్ నుంచి 15మందికి కుదించి మరో 5గురికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాం. కాలేజ్ బిల్డింగ్‌లో థర్డ్ ఫ్లోర్లో వేసిన బిగ్ బాస్ హౌజ్ సెట్లో మొత్తం 3రోజుల పాటు కంటెస్టెంట్స్ బస చేసేందుకు అనువుగా ఫుడ్, బెడ్స్ అన్నీ అరేంజ్ చేశాం. లోపలి ప్రతి సన్నివేశాన్ని షూట్ చేశాం. దానిని స్టూడెంట్స్ చూసేలా స్క్రీన్ ఏర్పాటు చేసి, ఆడియన్స్‌కు ఓటింగ్ ఛాన్స్ ఇచ్చాం. ఎవిరిడే ఎలిమినేషన్ రౌండ్స్ నిర్వహించాం. నలుగురు ఫైనలిస్ట్‌ల నుంచి విన్నర్‌గా డాక్టర్ నాసిహ్ని ఓటింగ్ ఆధారంగా సెలెక్ట్ చేశాం. అలాగే రోడీస్ రియాలిటీ షో తరహాలో చేసిన ప్రోగ్రాం కోసం ఆడిషన్స్‌లో 30 స్టూడెంట్స్‌ని సెలెక్ట్ చేశాం. డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాం. దీనిలో షయ్యద్ షాబాజుద్దీన్, అదీబా అలీలు విజేతలుగా నిలిచారు’ అంటూ వివరించారు నిర్వాహకులు. - మన్నన్ అలీ అష్మీ, నిర్వాహక ప్రతినిధి -
సైకిల్ హెరిటేజ్ క్విజ్
భారతదేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వసంపదపై అగర్బత్తీల కంపెనీ సైకిల్ బ్రాండ్ ఈ రోజు వినూత్న క్విజ్ నిర్వహించనుంది. ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులను ఈ పోటీకి ఆహ్వానిస్తోంది. గ్లోబలైజేషన్లో సంప్రదాయ గీతలు చెరిగిపోతున్న వేళ.. మన సంస్కృతిని చాటి చెప్పడానికి ఈ క్విజ్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఈ పోటీ జరగనుంది. -
గణనాయకం భజే..!
ఎన్నో విశేషాలకు నిలయమై, అగణిత శుభాలను అందించే ఏకదంత గణపతిని వివిధ రూపాల్లో, పలు నామాలతో కొలుచుకుంటారు. ప్రత్యేకంగా ‘వినాయక చవితి’ ఆరాధనలో గణనాథునికి అర్పించే దివ్యనీరాజనం మన సంస్కృతిలో, సంప్రదాయంలో భాగం. గణపతిని జ్యేష్ఠ రాజుగా, సర్వదేవతలలో ప్రథమ పూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహా గణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్ట వసువులకూ కూడా ప్రభువు. ప్రణవ నాద స్వరూపుడు వినాయకుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞ వల్క్యస్మృతి చెప్పింది. శుభకరుడు గణపతి ‘గణ్యంతే బుధ్యంతే తే గణాః ’ అన్నట్లు సమస్త దృశ్యమాన వస్తు ప్రపంచానికి అధిష్టాన దేవత గణపతి. నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు విఘ్నేశ్వరుడు. దేవతా గణాలు ఉద్భవించి, సృష్టి ప్రారంభం అయినప్పటినుండీ ఆది పురుషునిగా గణపతి పూజలందుకుంటున్నట్టుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణు స్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ అన్న శ్లోకం సూచిస్తుంది. వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో ఆవిర్భవిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడుగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో ఏకదంతుడై సంపదబొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధి వీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు. విఘ్నేశ్వరుని సంసారం గణేశుని పుట్టుకే ఒక అద్భుత సంఘటన. నలుగు పిండిని నలచి వినాయకుడిని చేసి ద్వారపాలకునిగా నిలబెట్టింది పార్వతి. ముందు వెనుకలు చూడక తనను అడ్డగించినందుకు శివుడు కోపించి అతని తల దునిమేశాడు. పార్వతి విచారం చూడలేక తర్వాత శివుడే తన గణాలను పంపి ఏనుగు తల తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. సుందరతర శుభవదనుడై అరుణ కాంతితో అలరారుతూ జ్యోతి ప్రభలతో, ప్రకాశమానమైన దివ్యాకృతితో వెలుగొందుతూ ఉన్న ఆ బాలగణపతి బ్రహ్మవిష్ణుశంకరులకు నమస్కరించి ‘క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చై వేదృశో నృణామ్’ అంటూ అభిమానవంతుడనై ప్రవర్తించిన తన అపరాధమును మన్నించమని కోరతాడు. పార్వతీదేవి ఆ బాలుని దగ్గరగా తీసుకొని ‘‘గజవదనా! నీవు శుభకరుడవు. శుభప్రదాతవు. ఇక నుండి సమస్త దేవతలలోనూ ప్రథమార్చన నీకే లభిస్తుందని’’ ఆశీర్వదిస్తుంది. ఆనాటి నుండి గణనాథుని ప్రథమ పూజ్యుడుగా ఆరాధించడం మొదలైందనీ, జ్ఞానంతో ముక్తి మార్గాన్ని పొందడానికీ గణేశుని ఆవిర్భావానికీ తాత్త్విక సమన్వయ సంబంధం ఉందనీ శివపురాణం అత్యద్భుతంగా విశదీకరించింది. ప్రజాపతి తన పుత్రికలైన సిద్ధిని, బుద్ధినీ గణపతికిచ్చి వివాహం జరిపించాడు. సిద్ధి బుద్ధి గణపతుల సంతానం క్షేముడు, లాభుడు అనేవారు. కార్యసాధనలో సిద్ధి, బుద్ధి తోడుగా ఉంటే లాభం, క్షేమం కలుగజేసే సందేశాత్మక ఆధ్యాత్మిక దృక్పథం వినాయకుని సంసారం. తొలిపూజతో ఆరాధనాఫలం వినాయకుడిని పూజించడం వలన శ్రీమహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది. గణపతి ఆరాధన సర్వ శుభాలను చేకూరుస్తుంది. త్రిపురాసుర సంహారానికి బయలుదేరినపుడు పరమశివుడు గణపతిని ధ్యానించి, పూజించి విజయం పొందాడట. నారదుని ప్రబోధంతో ఇందుమతీ రాణి గణపతి మట్టి విగ్రహాన్ని చేసి చవితినాడు పూజించి, తత్ఫలితంగా నాగలోకంలో బంధితుడైన తన భర్తను తిరిగి పొందింది. కార్తవీర్యుని కుమారుడైన సహస్రార్జునుడు వక్రాంగంతో జన్మించినవాడై గణేశుని ఆరాధించి సర్వాంగ సుందరుడై విరాజిల్లాడు. రుక్మాంగదుడు చింతామణి క్షేత్రంలో గణేశుని ఆరాధించి కుష్ఠువ్యాధి నుండి విముక్తి పొందాడు. రుక్మిణీదేవి గణేశుని ఆశీర్వాదంతో ప్రద్యుమ్నుని పుత్రునిగా పొందింది. వినాయక చవితినాడు గణపతిని ఆరాధించేవారు సర్వరోగ విముక్తులై, ఆరోగ్యప్రద జీవనాన్ని గడుపుతారు. సమృద్ధినీ, మేధాశక్తినీ, విద్యాజయాన్నీ, అనుకూల మిత్రత్వాన్నీ, కార్యసాధననూ అనుగ్రహించగల దేవుడు గణనాథుడు. - డా.ఇట్టేడు అర్కనందనాదేవి నిమజ్జన ఆంతర్యం తొమ్మిదిరోజుల పాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి, ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపివేయడం బాధగానే ఉంటుంది కానీ, అది ఒక నియమం, సంప్రదాయం. ఆలయాల్లో, ఇంటిలోని పూజామందిరాల్లో పంచలోహాలతో చేసినవి లేదా కంచు, వెండి, బంగారు లోహాలతో చేసిన విగ్రహాలను ఉపయోగిస్తారు. అవి శాశ్వతంగా పూజించడానికి అనువుగా ఉంటాయి. కానీ నవరాత్రి ఉత్సవాల్లో వినాయక విగ్రహాలను మట్టితో, రంగులతో, ఇతర పదార్థాలతో పెద్ద పెద్ద ఆకారాలుగా తీర్చిదిద్దుతారు. ఆలయాల్లో తప్ప ఇళ్లలోగానీ మరేచోట కూడా తొమ్మిది అంగుళాలకి మించిన విగ్రహాలు వాడరాదంటారు. వాటిని కూడా రోజూ నియమ నిష్ఠలతో పూజించాలి. అందుకే 3, 5, 9 రోజుల పూజల తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి, ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ లోతైన నీటిలోగానీ నిమజ్జనం చేస్తారు. ఎన్నో అలంకరణ లతో మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేననీ, పంచభూతాలతో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసి పోవలసిందనే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది. -
లోక జననీ నమస్తే!
తిరుచానూరు: తిరుచానూరులో కొలువైన లక్ష్మీ స్వరూపిణియైన శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం సంప్రదాయం. పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం వల్ల శుభం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందులోనూ వరాలు ప్రసాదించే వరప్రదాయిని, సిరులతల్లి లక్ష్మీదేవి స్వరూపిణి, నిండు ముత్తయిదువైన శ్రీవారి ధర్మపత్ని పద్మావతీ అమ్మవారి చెంత వ్రతం నోచుకుంటే సిరిసంపదలు, దీర్ఘసుమంగళి, సత్సాంతానం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. ఇందులోభాగంగా అమ్మవారిని వేకువజామున 1.30 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. 3.30 గంటలకు అమ్మవారి మూలవర్లు, ఉత్సవర్లకు ఆలయ అర్చకులు అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వజ్రవైఢూర్య ఆభరణాలతో అలంకరించి, ఉదయం 8 గంటలకు సన్నిధి నుంచి ఆస్థాన మండపంలోని వ్రతమండపానికి వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. తరువాత అమ్మవారి ఎదుట కలశాన్ని ఉంచి అందులో నారికేళాన్ని ప్రతిష్టించారు. దానికి చెవులు, కన్ను, ముక్కు ఏర్పాటు చేశారు. అనంతరం పాంచరాత్య్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు కలశంలోకి వరలక్ష్మీని ఆవాహనం చేసి, షోడశోపచార పూజలు నిర్వహించారు. రక్షకట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతం నిర్వహించి, వ్రత మహత్యాన్ని తెలిపే కథను వినిపించారు. అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీతో ఏర్పడింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఆస్థాన మండపం వద్ద ప్రత్యేక బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో తోపులాటలు జరగలేదు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెట్లు కేపీ.వెంకటరత్నం, వరప్రసాద్ పాల్గొన్నారు. -
ఈ పూజ వెరీ వెరీ స్పెషల్!
వీవీయస్ లక్ష్మణ్లాగే ఆయన భార్య శైలజ కూడా వెరీ వెరీ స్పెషల్. లక్ష్మణ్ క్రికెట్ క్రీడను సంప్రదాయంగా ఆడితే... శైలజ పండుగలలోని సంప్రదాయాలను తుచ తప్పకుండా పాటిస్తారు... పుట్టింట్లో... అత్తవారింట్లో... రెండు చోట్లా ఒకే సంప్రదాయం... ఒకే ఆచారం... శ్రావణమాసం వచ్చిందంటే చాలు... శ్రావణగౌరి నోములు... వరల క్ష్మీ వ్రతం... ఇల్లంతా కళకళలాడిపోతూ ఉంటుంది... ఏ పండుగనూ విడిచిపెట్టకుండా... అత్తగారు, తోటికోడళ్లతో కలిసి సంబరంగా చేసుకుంటారు. ఈ వరలక్ష్మీ వ్రతం నాడు శైలజ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఎలా జరుగుతోంది... ‘సాక్షి’కి ప్రత్యేకంగా చెప్పిన ముచ్చట్లు... మా వివాహం జరిగి పది సంవత్సరాలయ్యింది. పెళ్లయిన మొదటి సంవత్సరం మేం ఇంగ్లండ్ వెళ్లవలసి వచ్చింది. అందువల్ల అక్కడే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ తరవాత నుంచి నేను మా అత్తగారు సత్యభామ ఇద్దరం కలిసే చేసుకుంటున్నాం. అత్తగారు డాక్టర్ కావడంతో ఆవిడకు ఎక్కువ సమయం దొరకదు. అందువల్ల ఉదయం మూడు గంటలకల్లా నిద్ర లేచి తొమ్మిదింటికల్లా పూజ పూర్తి చేసేసేవారు. ఆ తరవాతే హాస్పిటల్‌కి వెళ్లేవారు. మాతో మొదటిసారి పూజ చేయించినప్పుడు పూజారిని పిలిచారు. శ్రావణ పట్టీ కింద అమ్మవారి రూపు, పట్టుచీర... అన్నీ ఇచ్చారు. అసలు మాకు చీరలు మా అత్తగారే కొంటారు. తరువాతి సంవత్సరం నుండి ఆవిడ దగ్గరుండి మాకు చెబుతూ చేయించారు. మాకు అనుభవం రావడం కోసం అలా చేశారు. ఇప్పుడు మా అంతట మేమే చేసుకునే అనుభవం సంపాదించుకున్నాం. ఇద్దరి సంప్రదాయాలు ఒకటే... నేను వచ్చాకనే మా అత్తగారు పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటున్నారని చాలా మంది అనుకుంటారు. కాని ఆవిడకు ముందు నుంచీ పూజలు చేయడం బాగా అలవాటు. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉండటం వల్ల, నేను వచ్చాక ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. అంతే! కొన్నిసార్లు పుట్టింటి సంప్రదాయం, అత్తింటి సంప్రదాయం వేర్వేరుగా ఉంటాయి. అయితే మా ఇద్దరి సంప్రదాయాలు ఒకటే కావడం వల్ల ఎవరిది ఎవరు పాటించాలా అనే ఇబ్బందే లేదు మాకు. అంతేకాదు.. మా ఆయన లక్ష్మణ్ గనక ఇంట్లో ఉంటే పూజ చేసేటప్పుడు మాతోటే ఉంటారు. కలశానికి పూజ చేస్తాం... ఈ పూజకు కొందరు బొమ్మకు అలంకరిస్తారు. కాని మేం మాత్రం కొబ్బరికాయకు పసుపు పూసి, కుంకుమతో కల్యాణ తిలకం తీర్చి, పైన రవికెల వస్త్రం ఉంచి, అలంకరించిన నారికేళాన్ని... వెండి కలశం మీద ఉంచుతాం. పుట్టింట్లోను, అత్తవారింట్లోనూ ఇదే ఆనవాయితీ. మంగళగౌరి వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఈ రెండు వ్రతాలూ... పిల్లలు, భర్త బాగుండాలని చేస్తారు. నేను కూడా ఆ నమ్మకంతోనే చేస్తున్నాను. ఆరోజున ప్రత్యేకంగా మొత్తం పన్నెండు రకాల పిండి వంటలు చేస్తాం. బూరెలు, పాయసం, గారెలు, పెరుగు వడలు, బజ్జీలు, ఐదు రకాల చిత్రాన్నాలు, సేమ్యా పాయసం వంటివి చేస్తాం. సాయంత్రం పేరంటానికి అందరినీ పిలిచి వాయనాలు ఇస్తాం. మా అత్తగారికి దగ్గరుండి మరీ అన్నీ సహాయం చేస్తాను. మా తోటికోడలు, అత్తగారు, నేను అందరం కలిసి పూజ చేసుకుంటాం. కన్నకూతురిలా చూస్తారు... మా అత్తగారు నన్నూ, మా తోటికోడలినీ ఏనాడూ కోడలిగా చూడలేదు. మా అత్తమామలకు అమ్మాయిలు లేరు. ‘మాకు అమ్మాయిలు లేరు, మీరిద్దరే మా అమ్మాయిలు’ అని మా మామగారు అంటుంటారు. మా అత్తగారిలో ఉండే సర్దుకుపోయే లక్షణం వల్లే మేం ఈ రోజు హాయిగా ఉన్నాం. మా అమ్మగారు ‘తల్లిదండ్రుల్ని కాదు, అత్తమామలను ప్రేమగా చూడటం గొప్ప’ అని చెప్పేవారు. తల్లిదండ్రులను ఎలాగూ ప్రేమగానే చూస్తార., కాని అత్తమామలను అలా చూడాలంటూ, మా దగ్గర నుంచి ప్రమాణం తీసుకున్నారు. అత్తవారింట్లో రెబెల్లా ఉండద్దన్నారు. కానీ రెబల్ నేచర్ పోదు కదా! చాలా త్వరగానే నేను నా ప్రవర్తనను మార్చుకున్నాను. అనుకున్నప్పుడే ప్రారంభించాలి... భక్తి కావచ్చు, పూజలు కావచ్చు... ఏవైనా సరే చిన్నప్పటి నుంచే ఆచరించాలని భావిస్తాను. ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడే మొదలుపెడతాను. పెద్దవాళ్లమయ్యాక చేయచ్చులే అని వాయిదా వేయకూడదనేది నా అభిప్రాయం. ప్రతిరోజూ పొద్దున్న నిద్ర లేవగానే స్నానం చేసి పూజ చేసేసుకుని, అప్పుడు దినచర్య ప్రారంభిస్తాను. అది కూడా యాంత్రికంగా కాదు, మనస్ఫూర్తిగా చేస్తాను. నాకు ఏదైనా జరిగిపోతుందేమోననే భయంతో కాదు, భగవంతుడి మీద భక్తితో, ప్రేమతో చేస్తాను. మా చిన్నప్పుడు అమ్మ... ఇంట్లో బాగా పూజలు చేసేది. బహుశ నాకు అది వంశపారంపర్యంగా వచ్చిందేమో. ఇక్కడకు వచ్చాక అత్తగారిది కూడా అదే స్వభావం కావడంతో, నేను ఏ ఇబ్బందీ లేకుండా అన్ని పూజలూ చేసుకుంటున్నాను. నిద్ర లేవగానే సూర్యుడికి నమస్కారం చేయమని మా పిల్లలకు నేర్పాను. పెద్దల పట్ల గౌరవంగా ఉండటం మా ఆయన లక్ష్మణ్ దగ్గర నుంచే నేర్చుకున్నారు. - సంభాషణ: పురాణపండ వైజయంతి మాకు ఇద్దరు అబ్బాయిలు. కోడళ్లయినా, కూతుళ్లయినా వాళ్లే. కొత్తలో ఏవేవో ఇబ్బందులు రావడం సహజం. అయితే వాటిని పెద్దవి చేసుకోకూడదు. ముందర ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. అప్పుడే గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతుంది జీవితం. ఇప్పుడు నేను మా ఇద్దరు కోడళ్లు కలిసే పూజ చేసుకుంటాం. కోడళ్లు అంతా సిద్ధం చేసి ఉంచుతారు. - డా. సత్యభామ మా అత్తగారు బాగా సర్దుకుపోయేవారు. మా డెలివరీల టైమ్‌లో ఆవిడే దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పెళ్లయి అత్తవారింట్లో అడుగు పెట్టినప్పుడు మేం చిన్నవాళ్లం కదా. ఆ టైమ్‌లోనే ఏవైనా చిన్నచిన్న తేడాలు వచ్చేవి. నెమ్మదిగా ఆవిడంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు బాగా కలిసిపోయాం. పండుగల లాంటివి వస్తే, ఉప్పాడ, కాంచీవరం పట్టుచీరలు తెస్తారు. - వీవీఎస్ శైలజ -
కట్టేవారికీ, కట్టించుకునే వారికీ...ఇద్దరికీ రక్ష
సందర్భం-10న రాఖీ భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రక్షాబంధన విశేషాలను చెబుతూ దీని వల్ల కలిగే మేలును వివరించాడు. శ్రావణ పౌర్ణిమను రక్షాబంధనం పండుగగా పిలుచుకొంటాం. అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లకు కట్టే రక్ష ఇది. ఈ పండుగ ఎప్పటి నుంచో మన సంప్రదాయంలో ఉన్నదే. భవిష్యోత్తర పురాణంలో రక్షాబంధన ప్రస్తావన ఉంది. కాకపోతే ఇప్పుడు సంబరంగా జరుపుకొంటున్నాం. రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు పూజలో ఉంచిన రక్షను కట్టుకొని ఆ తర్వాత మొదలుపెట్టి, అజేయులయ్యేవారు. రాఖీ పౌర్ణమి నాడు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందని విశ్వాసం. శ్రావణ పౌర్ణమి నాడు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాఖీ కట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు. మధ్యాహ్నవేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి, రక్ష కట్టించుకొన్నవారిని కాపాడాలన్నదే దాని ఉద్దేశం. ఇప్పుడంటే అక్కాచెల్లెళ్లు మాత్రమే అన్నదమ్ములకు రక్ష కడుతున్నారు. పూర్వకాలంలో భర్తకి భార్య రక్ష కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కట్టడమే ఇందుకు నిదర్శనం. చరిత్ర విషయానికి వస్తే, పురుషోత్తముడితో తలపడటానికి సిద్ధపడతాడు అలెగ్జాండర్. విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా బేగం, పురుషోత్తముడి ఆశ్రయం సంపాదిస్తుంది. పురుషోత్తముడికి సోదరి లేదన్న విషయం తెలుసుకొన్న ఆమె, శ్రావణ పౌర్ణమి నాడు పురుషోత్తమునికి రాఖీ కట్టి, బహుమానంగా భర్త ప్రాణాలు కాపాడమని కోరుతుంది. తన చేతికి ఉన్న రక్ష కారణంగా అలెగ్జాండర్‌ను చంపకుండా వదిలేస్తాడు పురుషోత్తముడు. సంప్రదాయం ప్రకారమైతే, పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు తిలకం దిద్ది, అప్పుడు మాత్రమే రక్షను కట్టాలి. ‘‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల’’ రక్షాబంధనమనేది కేవలం అన్నాచెల్లెళ్లు కట్టుకునేదే కాదు, రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడం కోసం అని ధర్మశాస్త్రం చెబుతోంది. ఒకరినొకరు రక్షించుకోవడం కోసం ఈ పండుగ. ఈ ఆచారాన్ని తప్పకుండా అందరూ పాటించాలని కూడా చెబుతారు. శ్రావణీ నృపతిం హంతి... గ్రామం దహతి ఫాల్గుణి శ్రావణ మాసంలో రాజులకు, ఫాల్గుణ మాసంలో గ్రామానికీ ప్రమాదమని శాస్త్రం చెబుతోంది. అందుచేత ఇది రాజవంశాలలో ప్రారంభమై ఉంటుందని తెలుస్తోంది. శ్రావణంలో వచ్చే భద్ర అనబడే సంపుటి ప్రభావంతో రాజవంశాలకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా ఈ రక్షాబంధనం వచ్చిందని తెలుస్తోంది. భద్ర సంపుటి ఏర్పడితే, ఆ రోజున ఏ పనులూ చేయరాదు. అయితే ఆ సంపుటి శ్రావణ పౌర్ణమినాడు వచ్చినప్పటికీ అది వర్జ్యంగా పరిగణింపబడదు. అంటే రక్షాబంధనం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఆటంకం వచ్చినా అంటే వర్జ్యం వచ్చినా కూడా వదలవద్దని శాస్త్రోక్తి. - డా. పురాణపండ వైజయంతి -
పెద్దంచు... కొత్త చీర
సంప్రదాయం ఉట్టిపడుతూనే సవాళ్లను ఎదుర్కొనేంత ధీమాగా కనపడాలన్నదే ఆధునిక మహిళ ఆంతర్యం. నవతరం మహిళ మనసెరిగిన డిజైనర్లు కంచిపట్టుకూ, క్రేప్కూ క్రియేటివిటీని జోడిస్తున్నారు. బ్రొకేడ్ను, బెనారస్నూ... పెద్ద పెద్ద బార్డర్లతో, ట్రెడిషనల్ డిజైన్లతో అమర్చి... సంప్రదాయ వేడుకలకు వైవిధ్యాన్ని తీసుకువస్తున్నారు. చూపులతోనే అల్లుకుపోయే... చక్కదనాల పెద్దంచు చీరలు ఈ శ్రావ ణానికి ప్రత్యేకం. 1- సంప్రదాయపు వేడుక... ఆకుపచ్చని చందేరీ చీరకు జరీ వర్క్ గులాబీల అంచు. 2- ఆధునిక కళ ..శాటిన్ షేడెడ్ చీరకు ముత్యాల అంచు. 3- ముచ్చటగొలిపే... పెద్ద బార్డర్ పైన మరో డిజైనర్ అంచు.కట్టడి చేసే ఆకర్షణకు... హాఫ్‌వైట్ పట్టు చీరకు జర్దోసీ అంచు. 4- అబ్బురపరిచే వైవిధ్యం..సాదా కంచి పట్టుచీరకు పెద్ద అంచు, దానిపైన వర్క్ చేసిన మరో చిన్న అంచు. లక్ష్మీదేవిలా అలంకరించుకునేందుకు మగువలు ఈ మాసాన ముచ్చటపడుతుంటారు. కళను పెంచే కలర్ చీరలు ఉంటే సరి, లేదంటే కొత్త డిజైన్ల కోసం మార్కెట్‌ను జల్లెడపడుతుంటారు. కానీ, ఉన్న చీరలనే కొత్తగా మార్చేస్తే.. మీ ఆలోచనకు సరికొత్త రూపం ఇవ్వడానికే ఈ డిజైనర్ చీరలు కొలువుదీరాయి. ఆకుపచ్చ చందేరీ చీరకు జరీ పువ్వుల గులాబీ అంచును, చివరన సన్నని లేస్‌ను జతచేయాలి. అదే రంగు బ్లౌజ్ ధరిస్తే పండగ శోభ రెట్టింపు కాకుండా ఉండదు. ప్లెయిన్ మస్టర్డ్ కలర్ కంచిపట్టు చీరకు జర్దోసీ వర్క్ చేసిన నీలాకాశం రంగు అంచును, పల్లూను జత చేరిస్తే వినూత్న కళతో వెలిగిపోతుంది. హాఫ్‌వైట్ బెనారస్ పట్టు చీరను పసుపు, గులాబీ, వంగపండు రంగు శాటిన్ అంచులతో తీర్చిదిద్దడంతో చూపులను కట్టిపడేస్తుంది. గులాబీరంగు పట్టు క్లాత్‌పై చేసినస్వరోస్కి వర్క్ అబ్బురపరుస్తుంది. సిల్వర్ బార్డర్ గల ఎరుపు రంగు బ్రొకేడ్ చీరకు అంచుపైన కుందన్ వర్క్ చేసిన మరో చిన్న అంచును జత చేయడంతో పండగకు దీపకళను తీసుకువచ్చింది. ఎరుపు, వెండి రంగుల కలయికతో ఉన్న శాటిన్ చీరకు ముత్యాలు పొదిగిన అంచు ప్రధాన ఆకర్షణగా మారింది. పెద్ద అంచులు ఇప్పుడు ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉన్నాయి. ఉన్న వాటికే ఇలా ఆకర్షణీయమైన సొబగులు అద్ది, కొత్తగా అందమైన చీరలను మీరూ రూపొందించుకోవచ్చు. ఇవి ఏ వేడుకలోనైనా ప్రత్యేకతను చాటుతాయి. భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తా
ఎస్పీ జి విజయకుమార్ మచిలీపట్నం : ఎస్పీగా జి.విజయకుమార్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు సంప్రదాయం ప్రకారం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయకుమార్ విలేకరులతో మాట్లాడారు. తనకు విజయవాడలో డీసీపీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసుశాఖాపరంగా ఉన్న సమస్యలపై అవగాహన పెంచుకుని, సమర్థంగా విధులు నిర్వహిస్తానని చెప్పారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, నేరాల సంఖ్యను తగ్గించేం దుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తానన్నారు. జిల్లాలోని పాత్రికేయులు, మేధావుల నుంచి సలహాలు స్వీకరించి జిల్లాలో పోలీసుల పని తీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తొలుత ఎస్పీకి ఏఎస్పీ వి.డి.వి.సాగర్, వోఎస్డీ వృషికేశ్రెడ్డి, జిల్లాలోని ఆయా డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు స్వాగతం పలికారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ చిలకలపూడి : కలెక్టర్ ఎం.రఘునందనరావును ఎస్పీ విజయకుమార్ సోమవారం ఆయన చాంబ ర్లో కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు. -
బోనాలు చిత్రాలు
బోనాలు.. కొందరికి సంప్రదాయుం.. వురికొందరికి పండుగలా.. ఇంకొందరికి ఆటవిడుపులా కనిపి స్తుంది. ఈ వైవిధ్యాన్ని విభిన్నంగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 22న ప్రారంభమైన కళాత్మక ప్రదర్శనలా ఉంటుంది. బోనాలు.. ఈ జానపద వేడుకను శిల్పి ఉలి ఎలా చెక్కుతుంది.. కెమెరా కన్ను ఎలా ఫ్లాష్ కొడుతుంది.. ఫిల్మ్ మేకర్ ఎక్కడ యూక్షన్ చెబుతాడు.. కవి ఏ తీరుగ వర్ణిస్తాడు.. చిత్రకారుడి కుంచె ఎలా స్పంది స్తుంది..? ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ప్రదర్శన. ప్రముఖ శిల్పకారుడు, చిత్రకారుడు చిలువేరు మనోహర్ చేసిన అరుదైన ప్రయత్నమిది. వేర్వేరు రంగాల్లో తనకు పరిచయం ఉన్న నలుగురు కళాకారులతో కలిసి ‘బోనాలు’తో ఒకే వేదిక పైకి వచ్చి ఈ ప్రయోగానికి బోనమెత్తారు! స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వురో రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన కళాభివూనుల వునసు కట్టిపడేస్తోంది. ప్రతి కోణం అపురూపం.. బోనాల వేడుక వసుధైక కుటుంబానికి ప్రతిరూపవుని చిత్రకారుడు చిలువేరు వునోహర్ తన చిత్రాల్లో చూపించారు. ఫిలిం మేకర్ దూలం సత్యనారాయుణ బోనాల పండుగను తెలంగాణ ప్రజల ఉనికిగా చూపే ప్రయుత్నం చేశారు. కాలగవునంలో బోనాలు ఉత్సవంలో వచ్చిన వూర్పులను క్లిక్ వునిపించారు ఫొటోగ్రాఫర్ రావూ వీరేశ్‌బాబు. బోనాలతో పాటు జీవన విధానంలోని వూర్పులపై కూడా తన ఫోకస్ ఉంటుందంటున్నారు. రచరుుత దెంచనాల శ్రీనివాస్ జనాల బోనాలు అందుకునే అవ్మువారిని శైవశక్తి రూపంలో వర్ణిస్తూ కవితా రూపం ఇచ్చారు. -
చిన్న వయసు సృజనశీలి
సంక్షిప్తంగా... ఝుంపా లహిరి నీలాంజన సుధేష్ణ లహిరి. లండన్! సంప్రదాయం, అధునికత కలగలిసినట్లున్న ఈ పేరు, ఊరు ఝుంపా లహిరివి. రెండేళ్ల వయసులో కుటుంబంతో పాటు లండన్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఝుంపా అసలుకైతే బెంగాలీ అమ్మాయి. తన తొలి కథల సంకలనం ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలాడీస్’కు పులిట్జర్ అవార్డు గెలుచుకోవడం ద్వారా పద్నాలుగేళ్ల క్రితం తొలిసారి ప్రపంచం దృష్టికి వచ్చిన ఝంపా ప్రస్తుతం అమెరికాలోని ‘ప్రెసిడెంట్స్ కమిటీ’ (ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్) లో సభ్యురాలు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా స్వయంగా ఝంపాను కమిటీ సభ్యురాలిగా నియమించారని అంటారు. పులిట్జర్ అవార్డు వచ్చిన మూడేళ్లకు ఝంపా రాసిన తొలి నవల ‘ది నేమ్‌సేక్’ పుస్తకంగానూ, సినిమాగానూ అనేక ప్రశంసలు, అవార్డులు అందుకుంది. సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించగా అమెరికన్ నటుడు కాల్ పెన్, బాలీవుడ్ నటులు ఇర్ఫాన్‌ఖాన్, టబూ నటించారు. గత ఏడాది ఝంపా రాసిన ‘ది లోల్యాండ్’ నవల కూడా విమర్శకుల మన్నన అందుకున్నదే.. ఝంపా రోడ్ ఐలాండ్‌లోని కింగ్‌స్టన్‌లో పెరిగారు. ఆమె తండ్రి అమర్ లహిరి రోడ్ ఐలాండ్ యూనివర్శిటీలో లైబ్రేరియన్. ఝంపాకు అమెరికా అంటే ఇష్టం. ‘‘లండన్‌లో పుట్టినప్పటికీ అమెరికన్‌గా చెప్పుకోడానికే నేను ఇష్టపడతాను’’ అని ఆమె అంటారు. అయితే ఝంపా తల్లికి తన పిల్లలు బెంగాలీ సంప్రదాయంలో పెరగాలని ఆశ. అందుకే ఆవిడ తరచు బెంగాల్‌కి ప్రయాణాలు పెట్టుకునేవారు. ఝుంపాకు నీలాంజన సుధేష్ణ అనే పేరు ఎంపిక చేయడంలో ఆమె తల్లి ప్రమేయమే ఎక్కువగా ఉంది. అయితే అలా పిలవడానికి, వినడానికి అమెరికాలో కష్టంగా ఉంటుందని తండ్రి ఆమెకు ఝుంపా అని ముద్దుపేరు పెట్టుకున్నారు. ఝంపా అంటే ‘ముద్దుపేరు’ అని అర్థం. ఇలా ఏ అర్థమూ లేని ఈ పేరంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఒక ఇంటర్వ్యూలో ఝంపా వాపోయారు కూడా. ఝుంపా ఇంగ్లిష్ లిటరేచర్‌లో బి.ఎ. చేశారు. తర్వాత ఎం.ఎ. ఇంగ్లిష్, క్రియేటివ్ రైటింగ్‌లో ఎం.ఎఫ్.ఎ., ఇంకా... కంపారిటివ్ లిటరేచర్‌లో ఎం.ఎ., చేశారు. తర్వాత రినెసైన్స్ (పునరుజ్జీవనోద్యమం) స్టడీస్‌లో పిహెచ్.డి చేశారు. అనంతరం ప్రావిన్స్‌టౌన్ ఫైన్ ఆర్ట్స్ వర్క్ సెంటర్లో రెండేళ్ల పాటు (1997-98) ఫెలోషిప్ తీసుకున్నారు. బోస్టన్ విశ్వవిద్యాలయం, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్‌లో క్రియేటివ్ రైటింగ్‌పై పాఠాలు చెప్పారు. 2001లో ఝంపా ఆల్బెర్టో వర్వోలియాస్-బుష్‌ను వివాహమాడారు. ఆయన జర్నలిస్టు. అప్పట్లో ఆయన ‘టైమ్’ పత్రిక లాటిన్ అమెరికా విభాగానికి డిప్యూటీ ఎడిటర్‌గా ఉండేవారు. ఇప్పుడు సీనియర్ ఎడిటర్ అయ్యారు. ఇద్దరు పిల్లలు. ఆక్టావియో, నూర్. అంతా కలిసి రోమ్‌లో ఉంటున్నారు. ప్రిన్స్టన్ యూనివర్శిటీలోని ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్లో సృజనాత్మక రచనా విభాగం ప్రొఫెసర్‌గా ఈ నెల 1 నుంచి బాధ్యతలు చేపట్టడానికి ఝుంపా ఇటీవలే మళ్లీ అమెరికా చేరుకున్నారు. ఇవాళ ఝంపా పుట్టినరోజు. -
ప్రేమికురాలి ప్రాణం తీసిన 'సంప్రదాయం'
బెంగళూరు : వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులను సంప్రదించారు. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. అయితే ఏ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయం విషయంలో ఎంతకూ ఇరు కుటుంబ సభ్యులు రాజీకాలేదు. దీంతో విరక్తి చెందిన ప్రేమికురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వర్తూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్‌కు చెందిన నిమిషా (28) స్థానిక కుందనహళ్లిలోని పేయింగ్ గెస్ట్ (పీజీ)లో ఉంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెంది న దుర్గాప్రసాద్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. వీరిద్దరూ మారతహళ్లి సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఇద్దరూ వారి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. వివాహానికి ఇరు కుటుం బాల పెద్దలూ అంగీకరించారు. అయితే పెళ్లి తెలుగు సంప్రదాయంలో చేయాలని దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు.. కాదు, కాదు బీహార్ సంప్రదాయంలోనే జరగాలని నిమిషా కుటుంబ సభ్యులు వాదనకు దిగారు. ఈ విషయంలో ఇరు కుటుంబాల వారు పట్టువీడకపోవడంతో సమస్య జఠిలమైంది. ఆఖరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో నిమిషా జీవితంపై విరక్తి చెందింది. బుధవారం రాత్రి తన చిన్నాన్న రంజిత్‌కు ఫోన్ చేసి తన బాధను చెప్పుకుంది. సుమారు 15 నిమిషాల పాటు తన గోడును వెళ్లబోసుకుంది. కొద్దిసేపు తర్వాత రంజిత్‌కు అనుమానం వచ్చి నిమిషాకు ఫోన్ చేశాడు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించాడు. గురువారం మళ్లీ నిమిషాకు రంజిత్ ఫోన్ చేశాడు. అప్పటికీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే ఈ విషయాన్ని దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాడు. అతను నిమిషా ఉంటున్న హాస్టల్‌కు రావడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాసలు, పంచ్లైన్లతో ఆకట్టుకున్న ప్రణబ్
ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ; డెమొక్రసీ, డెమొగ్రఫీ, డిమాండ్... ఇలా ప్రాసయుక్త పదాలు వాడి రంజింపజేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (అందరితో, అందరి అభివద్ధి)’, హర్ హాత్ కో హునర్, హర్ ఖస్త్రత్ కో పానీ (ప్రతి చేతికీ నైపుణ్యం, ప్రతి పొలానికీ నీరు)’, ‘పెర్ డ్రాప్, మోర్ క్రాప్ (ప్రతి చుక్క నీటికీ మరింత పంట)’ వంటి ప్రణబ్ హిందీ, ఇంగ్లిష్ నినాదాల నిండా మోడీ ముద్ర స్పష్టంగాా కన్పించిం ది. రూరల్-అర్బన్ (గ్రామీణ-పట్టణ) విభేదాలను తుడిచేస్తామంటూ ప్రణబ్ ప్రతినబూనారు. ఆ రెండింటి కలయికగా ‘రుర్బన్’ అనే భావనను తెరపైకి తెచ్చి ఆకట్టుకున్నారు. -
పురాతనం సనాతనం
శరీరాన్ని క్షాళన చేసుకోవడంతో పాటు, మనసునూ క్షాళన చేసుకోవాలన్నదే ఈ పుణ్యనగరం ఇచ్చే సందేశమని అనిపిస్తుంది. పార్వతిని పరిణయమాడేందుకు కైలాసాన్ని వీడి వచ్చిన శివుడు నివాసం కోసం ఎంచుకున్న నేల వారణాసి అని పురాణ గాథలు చెబుతాయి. ఈ పట్టణానికి ఉత్తరాన ఉన్న వారుణ, దక్షిణంగా ఉన్న అసి (లేదా అస్సి) అనే చిన్న చిన్న నదుల నుంచే వారణాసి అన్న పేరు వచ్చిందని ప్రతీతి. కాశీని పురాతన పట్టణంగా పేర్కొంటుంది ఋగ్వేదం. ‘బెనారస్ అంటే చరిత్ర కంటె పురాతనం... సంప్రదాయం కంటె సనాతనం’ అంటాడు మార్క్‌టై్వన్. అందుతున్న ఆధారాలను బట్టి ఈ పుణ్యక్షేత్రం 30 శతాబ్దాల నాటిది. వేదాలు, రామాయణ-భారతాలు, జైన గ్రంథాలు, బౌద్ధుల జాతక కథలు- భారతీయ ఆత్మతో అనుబంధం ఉన్న ప్రతి అక్షరం కాశీకి కైమోడ్పులర్పించినదే. హిమసానువులలో పుట్టి సాగరం వైపు బంగ్లాదేశ్‌కు సాగే అద్భుత గంగా జలహారంలో కాంతులు వెదజల్లే ఒక మణి... వారణాసి. కాశీ అన్నా అదే. కొద్దిమందికే పరిచితమైన నామం - అవిముక్త. ఆంగ్లేయులు రుద్దిన పేరు బెనారస్ లేదా బనారస్. కాశీ జ్యోతిర్లింగాలలో ఒకటి. శక్తి పీఠాలలోనూ ఒకటి. వారణాసి అంటే పరస్పర విరుద్ధ దృశ్యాల మేళవింపు. ‘హర హర మహాదేవ్!’ అంటూ విశ్వేశ్వరుడి నామస్మరణ ఒకవైపు, ‘అల్లాహో అక్బర్’ అంటూ మసీదుల నుంచి ప్రార్థనలు మరోవైపు కాశీలో సర్వసాధారణం. ఇరుకు ఇరుకు సందులనీ, వాటిలోనే నిరంతరం సంచరించే ఆవుల మందలనీ దాటుకుని వచ్చాక కంటికి నిండుగా, విశాలంగా దర్శనమిస్తుంది గంగా ప్రవాహం. త్రిపథగ, జాహ్నవి, భాగీరథి వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఆ గొప్ప నది పవిత్రత గురించి విన్న గాథలు ఓ పక్క గుర్తుకు వస్తుంటాయి. మరో పక్క నదిని అడుగడుగునా కలుషితం చేస్తున్న మనిషి చేష్టలు కంటపడుతూ ఉంటాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాన్ని తెచ్చి ఆ పవిత్ర నదిలో కలిపేందుకు నిర్మించిన భారీ పైపులు మరీ బాధ కలిగిస్తాయి. కానీ సగం కాలిన మృతదేహాలను గంగలోకి తోసే పద్ధతికి చాలా కాలం కిందటే స్వస్తి చెప్పారన్న విషయం సంతోషపెడుతుంది. జానెడు గోచీతో, జడలు కట్టిన జుట్టుతో, ఒళ్లంతా బంకమట్టి పూసుకుని లోకం సంగతి పట్టించుకోకుండా గంగ చిరు కెరటాల దగ్గరే గంటల తరబడి ధ్యానంలో మునిగి ఉండే బైరాగులు తీరమంతా కనిపిస్తారు. ఘాట్లకు అవతలే దుకాణాలలో పట్టు వస్త్రాలను కళ్లప్పగించి చూస్తూ ప్రపంచాన్ని మరచే భక్తకోటి కనిపిస్తుంది. కాశీని చూడడమంటే గంగను చూడడమే. సోపాన పంక్తులతో గంగను దర్శింపచేసేవే ఘాట్లు. ఎనభయ్ నాలుగు వరకు ఉన్నాయవి. అస్సి, మణికర్ణిక, దశాశ్వమేధ్, జైన్, మహానిర్వాణ్, హనుమాన్, నారద, మంగళగౌరి, సింధియా ఘాట్ - ఇలా. ప్రతి ఘాట్‌కు ఒక కథ ఉంది. ఇంకా, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ఉత్తర జన్మ లేకుండా కాశీలో కన్నుమూయాలని వచ్చేవారు వేలాదిగా ఉంటారు. తమ పార్ధివ శరీరానికి కాశీలో గంగ తీరాన అంత్యక్రియలు జరగాలని కోరుకునే వారూ ఎక్కువే. ఈ రెండు ఘాట్లు వాటికే ప్రసిద్ధి. మోక్షాన్ని కోరి వచ్చే వారితో సహా, కాశీలో ప్రాణాలు విడిచే ప్రతి ప్రాణికి కూడా అంతిమ క్షణాలలో సాక్షాత్తు శివుడే ‘రామ’ నామాన్ని కుడిచెవిలో వినిపిస్తాడని ఓ విశ్వాసం. తరతరాలుగా ఒకే దీపం నుంచి మంటను తీసుకుని తలకొరివి పెట్టే ఆచారం మణిక ర్ణిక ఘాట్‌లో ఉంది. ఈ రెండు ఘాట్ల దగ్గరే కాక, కనీసం ఐదు చోట్ల స్నానమాచరించడం సంప్రదాయం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆ నగరంలో మతోన్మాదంతో జరిగిన విధ్వంసానికీ, స్పర్థలతో వర్థిల్లిన విజ్ఞానానికీ కూడా ప్రత్యక్ష సాక్షి గంగ. ముస్లిం దండయాత్రల ఆనవాళ్లు విశ్వేశ్వరుడి సన్నిధిలోనే కనిపిస్తాయి. ఔరంగజేబు ధ్వంసం చేసిన ఆలయాన్ని 1780లో ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కార్ పునరుద్ధరించింది. తరువాత సిక్కు పాలకుడు రంజిత్‌సింగ్ గోపురానికి బంగారు తాపడం చేయించాడు. పూర్వపు ఆలయాన్ని ధ్వంసం చేసిన స్థలానికి పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వరుడి గుడి గోపురం, మసీదు గోపురం పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ మసీదును జ్ఞానవాపి మసీదు అనే అంటారు. జ్ఞానవాపి అంటే పాత ఆలయం కట్టిన స్థలం పేరు. ఒక్క గోడే అడ్డు. అన్నపూర్ణ మందిరం దాటాక శివాలయం కనిపిస్తుంది. ఎప్పుడైనా కావచ్చు, కాశీలో మొత్తంగా రెండు వేల ఆలయాలు వెలిశాయని చెబుతారు. వాటిలో ఐదు లక్షల ప్రతిమలు కొలువైనాయనీ అంటారు. కాశీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రఖ్యాతమో, జ్ఞానానికి కూడా అంతే పేర్గాంచింది. మహామహోపాధ్యాయ మకుటాలను అలంకరించిన కాలం నుంచీ మదన్మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించే వరకు ఆ ఖ్యాతి నిలబడే ఉంది. సంస్కృత విద్యకు వారణాసి విశ్వ ప్రఖ్యాతి గాంచిన పీఠం. జైన, బౌద్ధ గురువులూ కాశీని సందర్శించారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఈ నగరం వాడే. బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత తొలి సందేశం ఇచ్చిన సార్నాథ్ కాశీ శివార్లలోనే ఉంది. ‘అష్టాధ్యాయి’ రచయిత పాణిని, ఆచార్య త్రయం (శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు) బసవన్న గంగాస్నాన మాచరించినవారే. మొగలుల కొలువులో పని చేసిన జగన్నాథ పండితరాయలు ఆ నది ఒడ్డుకు లవంగితో కలసి వచ్చి 53 శ్లోకాల ‘గంగా లహరి’ని ఆలపించాడు. తన లాక్షణిక గ్రంథానికి రసగంగాధరమనే పేరు పెట్టుకున్నాడాయన. పెద కోమటి వేమారెడ్డితో కాశీ వచ్చిన శ్రీనాథుడు, అపారమైన ప్రేమతో స్కాందపురాణంలోని కాశీ ఖండాన్ని అనువదించే పనికి శ్రీకారం చుట్టాడు. గౌతమి తీరంలో ఆ అనువాదం పనిని పూర్తిచేశాడా ‘ఈశ్వరార్చన కళాశీలుడు.’ ఝాన్సీ లక్ష్మీభాయి ఇక్కడే పుట్టింది. ఆమె వీరగాథతో పాటు కబీర్ కవితలనూ ఆ నది విన్నది. ‘అన్ని జీవుల గొంతుకలు ఆ నది గొంతుకలో ఉన్నాయి’ అంటాడు హెర్మన్ హెస్ తన అద్భుత నవల ‘సిద్దార్థ’లో. కాశీ, పక్కనే కొద్దిపాటి ఒంపుతో ప్రవహించే గంగ ఆధునిక కాలంలోనూ రచయితలనీ, కవులనీ ఆకర్షిస్తూనే ఉంది. అందుకేనేమో, హెస్ తన నవలలోనే మరోచోట, ‘అది జీవ శబ్దం. నిత్యంగా వుంటూ, తెంపు లేకుండా మారుతూ ఉండే శబ్దం ఆ నది’ అంటాడు. గోస్వామి తులసీదాస్ ‘రామ చరితమానస్’ గంగ ఒడ్డున కూర్చుని రాశాడని చెబుతారు. ఆయన పేరిట ఒక ఘాట్ కూడా ఉంది. విభూతిభూషణ్ బంధోపాధ్యాయ పథేర్పాంచాలీ, అపరిచితుడు నవలల్లో, శరత్‌బాబు వాక్యాలలో గంగ గలగలలు వినిపిస్తూనే ఉంటాయి. రవీంద్ర కవీంద్రుడు వంగ దేశంలోని ఘాజీపూర్ నుంచి వారణాసికి పడవ ప్రయాణం చేశారు. ఆ యాత్ర లోనే నౌకాభంగం, చోఖెర్బాలి అనే రచనలకు అంకురార్పణ జరిగింది. గంగాతీరంలోని మార్మికత, కాశీ ఆధ్యాత్మిక శక్తులను అక్షరబద్ధం చేయడానికే ప్రేమ్‌చంద్ ‘సేవాసదన్’ నవల రాశారని అనిపిస్తుంది. కొన్ని పురాతన సంప్రదాయాలను ఆ మహా రచయిత నిరసించినా ఆ చరిత్రాత్మక ఘాట్ల మధ్య ‘ప్రేమ్‌చంద్ ఘాట్’ కూడా వెలిసింది. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ రాశారు. తెలుగువారు ఎందరు కాశీ పండితులుగా అవతరించారో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఎంత రమణీయంగా వర్ణించలేదు! వీరంతా అక్షరాలతో ఆ ప్రవాహాన్ని ఆరాధిస్తే, తన షెహనాయ్ నాదంతో పూజించిన మహా కళాకారుడు బిస్మిల్లాఖాన్. మీరొచ్చి అమెరికాలో స్థిరపడకూడదా! అని ఎవరో అడిగితే, అక్కడ గంగ లేదు మరి! అని సమాధానం ఇచ్చిన ఆరాధకుడాయన. ఇక్కడ పుట్టాడు కాబట్టే పండిట్ రవిశంకర్ సితార్ వాదనం గంగా ఝరిలా ఉరుకుతుంది. పగలంతా భక్తుల స్నానాలతో రంగుమారిపోయే గంగ, రాత్రి వేళ కాంతి రేఖలను అలంకరించుకుంటుంది. చీకట్లు ముసిరాక, ఘాట్ల సోపానాల మీద నుంచి నిత్యం గంగమ్మకు ఇచ్చే దీపాల హారతి ఓ అందమైన వేడుక. ఒకే రకం వస్త్ర ధారణతో, భారీ దీపపు గుచ్ఛాలతో, మంగళవాద్యాల నడుమ, భక్తి గీతాలాపన మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిని నదిలోనే పడవల మీద కూర్చుని వీక్షించవచ్చు. గుహుడి వారసులుగా చెప్పుకునే ఒక తెగవారు పడవలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. లేదా గట్టునే భక్తకోటితో కూర్చునీ చూడొచ్చు. హారతి పడుతూ మెట్ల మీద నిలబడి గుండ్రంగా తిప్పే దీపపుగుత్తుల వెలుగులతోనూ, పుణ్యస్త్రీలు అరటిదొప్పలలో వెలిగించి నదిలో విడిచిపెట్టే దీపాలు కెరటాల మీద వయ్యారంగా సాగిపోతూ చిందించే చిరు వెలుగులతోనూ కొన్ని గంటల సేపు గంగ కిన్నెరలా మెరిసిపోతుంది. ఆ నిశిలో కన్ను ఎటు తిప్పినా ఈ సుందర దృశ్యమే కనిపిస్తుంది. కాశీ అంటే దీపకాంతుల నగరమని అర్థం. హిందూ చింతనలో వెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కారణం ఏదైనా నేటికీ ఆ కాంతుల నగరి హిందువుల గుండెలను స్పందింపచేస్తూనే ఉంది. గంగతో శరీరాన్ని క్షాళన చేసుకోవచ్చు. మనసును క్షాళన చేసుకోవాలంటే ఒక్క జ్ఞానంతోనే సాధ్యమన్న సందేశం అక్కడ వినిపిస్తుంది. కాశీ, గంగ, మణికర్ణిక మనకి వెల్లడించే సత్యం ఇదే. మనసుని క్షాళన చేసే జ్ఞానానికి ప్రతీకే వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
మిస్ ఇండియా కాంటెస్ట్ 2014 లో విరబూసిన సాంప్రదాయం
-
ఫెస్ట్స్ వెబ్సైట్ రూపొందించారు...
కాలేజీ అంటేనే ఒక కొత్త ప్రపంచం. విజ్ఞానమే అక్కడి మతం, సంప్రదాయం. మన సంప్రదాయాలని నిలబెట్టేవి మనం జరుపుకునే పండుగలు. మరి కాలేజీ సంప్రదాయాల గురించి ప్రచారం చేసేవి... కల్చరల్ ఫెస్ట్‌లు, టెక్ఫెస్ట్లే. మామూలు పండుగలు ఎప్పుడు జరుపుకోవాలో చెప్పడానికి పంచాంగాలున్నాయి. కాని కొన్ని వేల కళాశాలలు... అన్ని వేల పండుగలు. వీటికి పంచాంగం రూపొందించేది ఎవరు? అంటే, ‘మేము చేస్తాము’ అనుకున్నారు హరీష్ కొట్రా, కల్యాణ్ వీరమల్ల. అనుకున్నదే తడవుగా రూపొందించిందే fests.info. acumen, carpedium, vidyut ఇలాంటి ఫెస్ట్ పేర్లను వినడమే కాని, సగటు విద్యార్థికి అవి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయో అంత ఐడియా ఉండదు. అలాంటి ఇద్దరు సగటు విద్యార్థుల ఆలోచన నుండి పుట్టింది fests.info. వివిధ కళాశాలల్లో జరిగే ఈ ఫెస్ట్‌లలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నా, అంత క్లారిటీ లేక వెనుకంజ వేశారు హరీష్, కల్యాణ్. ఆ వెనుకంజలో పుట్టిన ఆలోచనే ఈ ఫెస్ట్‌ల గురించి చెప్పే వెబ్సైట్. ‘‘హైదరాబాద్‌లోనే కాదు, మొత్తం మన రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలల్లో జరిగే ఫెస్ట్స్ గురించి చెప్పే ఒక వెబ్సైట్ రూపొందిస్తే ఎలా ఉంటుంది’’ అని ఐడియా ఇచ్చాడు కల్యాణ్. స్వతహాగా వెబ్ డిజైనర్ అయిన హరీష్ వెంటనే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. ఇలా మే 2012లో కలిగిన ఆ ఐడియా, జూన్ 21, 2012 కి మన రాష్ట్రంలోని ప్రసిద్ధ కాలేజీలలో జరిగే ఫెస్ట్స్తో వెబ్‌సైట్‌గా రూపొందింది. అలా 2012లో ఫెస్ట్స్‌కి సంబంధించిన అతి కొద్ది వెబ్సైట్లలో ఒకటిగా ఉన్న ఈ సైటు, ఒకటిన్నర ఏళ్లలోనే దేశవ్యాప్తంగా పేరు సాధించింది. ‘‘ఒక విద్యార్థి కాలేజీలో ఎంతో నేర్చుకుంటాడు. కాని ఆ నేర్చుకున్న దానిని ఎలా ఉపయోగించాలి అనేది చెప్పేవి ఫెస్ట్స్ మాత్రమే. రోబోటిక్స్, ప్రోగ్రామింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి సబ్జెక్ట్‌లలోని ప్రాక్టికల్ అప్రోచ్‌ని వినోదంతో కలిపి ఒక వేదికపై నిలపడమే టెక్ ఫెస్ట్‌ల ముఖ్య ఉద్దేశ్యం. అలానే ప్రతి విద్యార్థిలోను దాగి ఉన్న కళలను బయటకు తీసుకురావడం కల్చరల్ ఫెస్ట్ వంతు. ఏం చేసినా ఈ ఇంజనీరింగ్‌లోనే చెయ్యాలి. తర్వాత ఉద్యోగం వచ్చాక ఇలాంటి వాటిలో పాల్గొనే అవకాశం తక్కువ. అందుకే ఈ ఫెస్ట్‌ల మీద మేము అంత ఆసక్తి చూపించి, దానికోసం ఒక వెబ్‌సైట్‌ని రూపొందించింది’’ అంటాడు హరీష్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో కేవలం కళాశాలలో జరిగే ఫెస్ట్‌ల గురించి కాక, ముఖ్యపట్టణాల్లో జరిగే మ్యూజికల్ నైట్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, చారిటీ షోస్, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్స్‌లకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ‘‘మా వెబ్సైట్లో అనవసర యాడ్స్ ఉండవు. మొబైల్లో నుండి కూడా చాలా సులువుగా యాక్సెస్‌ని పొందవచ్చు. ఇవే మమ్మల్ని వేరే వెబ్‌సైట్స్ నుంచి వేరు చేసే గుణాలు. మా వెబ్సైట్లో ఎవరైనా వాళ్ల ఫెస్ట్స్‌కి సంబంధించిన వివరాలను షేర్ చేసుకోవచ్చు. మేము మాకు వచ్చే ప్రతి వివరాన్నీ చెక్ చేసి వందశాతం నిజమని నిర్ధారించాకే మా వెబ్సైట్లో ఆ ఫెస్ట్‌కు సంబంధించిన వివరాల్ని పొందుపరుస్తాం...’’ అంటారు కల్యాణ్. ఇంతకీ దీని ద్వారా వీళ్లు ఎంత సంపాదిస్తున్నారో అనుకుంటున్నారా! సున్నా రూపాయలు. అవును, వీరు ఆ ఫెస్ట్స్‌కి ప్రచారాన్ని కల్పించిన వాళ్ల దగ్గర చిల్లిగవ్వ కూడా తీసుకోరు. పైగా ఈ వెబ్‌సైట్‌ని నడపడానికి అయ్యే ఖర్చుని తమ సొంత డబ్బులతో నెట్టుకొస్తున్నారు. ఎందుకిలా అని అడిగితే, ‘‘మేము ఏదో బిజినెస్ చేద్దాం అని వెబ్సైట్ చెయ్యలేదు, మా స్టూడెంట్ కమ్యూనిటీకి ఒక సర్వీస్‌లా చేస్తున్నాం. మేము ఆశించేది కాస్తంత ప్రేమ, పేరు... అంతే’’ అని నవ్వేస్తారు ఇద్దరూ. కల్యాణ్ ప్రస్తుతం ఎంబిఏ చేస్తున్నాడు. హరీష్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్. రోజంతా వీళ్లు పనిలో ఉన్నా, ప్రతిరోజూ ఈ వెబ్సైట్ బాగోగులని తప్పక చూసుకుంటారు. - శ శ్రీక్ -
సుధాభరితం... గోదాచరితం!
తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అనీ అర్థం. స్వామిని మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆ స్వామిలో ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి భోగిపండుగ వరకు ఉండే మాసమే ధనుర్మాసం. వైష్ణవులు పరమ పావనంగా భావించే ఈ మాసంలో నిత్యమూ గోదాదేవి విరచిత ‘తిరుప్పావై’లోని పాశురాలను పారాయణ చేస్తారు. భూలోక వైకుంఠమై భాసించే తిరుమలలోనూ ధనుర్మాసమంతా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని గానం చేయడం అనూచానంగా వస్తోంది. గోదాదేవి అంటే సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారం. ఈమెనే వైష్ణవ సంప్రదాయంలో ఆండాళ్ అనీ, చూడికుడిత నాంచారి అనీ వ్యవహరిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో, భక్తి ప్రబంధాలలో పన్నిద్దరు ఆళ్వారులు సుప్రసిద్ధులు. వీరిలో పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుడు తన ఉదాత్త చరితంతో విష్ణుభక్తుల్లో శాశ్వత స్థానం పొందాడు. విష్ణుచిత్తుడు స్థానిక వైష్ణవ దేవాలయాల్లో స్వామికి పుష్పాలను, తులసిమాలలను కైంకర్యం చేస్తూ, శ్రీకృష్ణుని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు విష్ణుచిత్తుడికి తులసి మొక్కల మధ్య పవళించి బంగారు వర్ణంలో ఉన్న శిశువు కనిపించింది. భూమాత ప్రసాదించింది కాబట్టి ఆమెను గోదా నామంతో పిలుచుకుంటూ గారాబంగా పెంచాడు విష్ణుచిత్తుడు. ఈ గోదాకు అసలు నామం కోదై అని పండితుల ఉవాచ. కోదై అంటే సుమమాలిక అని అర్థం. గోదాదేవిని శ్రీకృష్ణుని పాదాల చెంతనే ఉంచి ఆమెలో భక్తిభావాలను చిన్ననాటి నుంచే చిగురింపజేశాడు. గోదాదేవి శ్రీవారికి సమర్పించే పూమాలలను కడుతుండేది. ఆ మాలలను భగవంతుడికి వినమ్రంగా సమర్పించేవాడు విష్ణుచిత్తుడు. గోదాదేవికి స్వామి మనోహరత్వాన్ని దర్శించాలనే కోరిక కలిగింది. ఒకనాడు దేవాలయంలో జగన్మోహనాకారుడైన స్వామిని చూసి తన్మయురాలయింది. ఆ తరువాత స్వామివారికి సమర్పించే దండలను తాను ధరించి, తమ ఇంటిలో ఉన్న నూతిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. రానురానూ... తనకు, భగవంతునికి భేదం లేదని తలచి తన ఆత్మలోనే ఆ సర్వేశ్వరుణ్ణి త్రికరణశుద్ధిగా దర్శించింది. ఒకనాడు విష్ణుచిత్తుడు స్వామికి సమర్పించే దండల్లో ఒక కేశపాశాన్ని చూసి గోదాదేవిని సందేహించి, తన అనుమానం నిజమేనని రూఢి చేసుకుని, ఒకరోజు గోదాదేవిని మందలించాడు. ఎప్పుడూ పల్లెత్తు మాట అనని తన గారాలపట్టిని నిందించినందుకు వ్యాకులచిత్తుడై, గోదా ధరించిన మాలలను స్వామికి సమర్పించడం అపచారంగా భావించాడు. ఆనాడు ఆలయానికి వెళ్లకుండా, తన గృహంలోనే తీవ్ర ఆవేదనతో శయనించాడు విష్ణుచిత్తుడు. ఆయనకు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, ‘‘విష్ణుచిత్తా! నీవు నాకు నిత్యం భక్తితో సమర్పించే మాలలను ఈ రోజు సమర్పించలేదేం?’’ అని ప్రశ్నించగానే, విష్ణుచిత్తుడు జరిగినదంతా స్వామికి విన్నవించాడు. దానికి పరమాత్మ చిరునవ్వుతో... ‘గోదా ధరించిన మాలలను అలంకరించుకోవడం నాకు అత్యంత ప్రీతిపాత్రం’ అనగానే విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు. ఆరోజునుంచి శ్రీహరి సేవలో నిమగ్నమయ్యారు తండ్రీకూతుళ్లు. గోదాకు యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చెయ్యాలన్న తన నిర్ణయాన్ని ప్రస్తావించాడు విష్ణుచిత్తుడు. శ్రీకృష్ణుని తప్ప పరపురుషుని తాను వరించనని గోదాదేవి తండ్రికి స్పష్టం చేసింది. కాత్యాయనీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో, దీక్షతో ఆచరించిన గోపికలు ద్వాపరయుగంలో తమ మధురభక్తితో కమలాక్షుడైన శ్రీకృష్ణుని పొందారని తెలుసుకున్న గోదాదేవి తానూ ఆ స్వామి దేవేరిని కాగలనని విశ్వసించి, దృఢసంకల్పంతో కఠినమైన తిరుప్పావై దీక్షను ప్రారంభించింది. తమిళంలో తిరు అంటే శ్రీయుతమైన, పవిత్రమైన అని, పావై అంటే వ్రతం అని అర్థం. తాను విరచించిన తిరుప్పావైలోని భావబంధురమైన 30 పాశురాలతో మధురభక్తినీ, హృదయ సమర్పణం చేసే అలౌకిక ప్రణ యాన్నీ రంగరించి, మనసారా కీర్తించి భోగిపండుగనాడు ఆయనలోనే ఐక్యమైన పావన చరితురాలు గోదాదేవి. పాశుర గీతికలతో స్వామిని కీర్తించి, ఆ పరంధామునికి ఆత్మనివేదన చేసిన కారణజన్మురాలు గోదాదేవి. - వెంకట్ గరికపాటి -
నవ్వులతో పోటీపడేలా..!
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్‌తో పాటు గాజుల గలగలలు కూడా తప్పనిసరి. సంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల మోడల్ గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమితమైన మక్కువ. గాజుల గలగలలు నవ్వులతో పోటీపడాలంటే వాటి ఎంపికలోనూ, ధరించడంలోనూ మెళకువలను పాటించాలి. ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్లో ఉండేట్టుగా వేసుకోవాలి. ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్‌ను మరొక చేతి వేలికి ధరించాలి. నాలుగు నుంచి ఆరు గాజులు వేసుకునేటప్పుడు వాటికి మరికొన్ని భిన్నమైన గాజులను జోడించి ధరించాలి. వెండి, బంగారు, ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా నేచరల్ కలర్స్‌ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా అందుతాయి. లెదర్, దారం, పూసలతో తయారుచేసిన బ్రేస్‌లెట్స్‌ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకు దూరంగా ఉండటం మంచిది. గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. -
నవ్వులతో పోటీపడేలా..!
ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకున్నా, ప్రత్యేకంగా అనిపించాలన్నా దుస్తులు, హెయిర్ స్టైల్స్‌తో పాటు గాజుల గలగలలు కూడా తప్పనిసరి. సంప్రదాయం, ఆధునికం ఏదైనా రకరకాల మోడల్ గాజులను ధరించడం అంటే అమ్మాయిలకు అమితమైన మక్కువ. గాజుల గలగలలు నవ్వులతో పోటీపడాలంటే వాటి ఎంపికలోనూ, ధరించడంలోనూ మెళకువలను పాటించాలి. ఎక్కువ గాజులు వేసుకునేటప్పుడు చూడగానే కంటికి నదురుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గాజును సెంటర్లో ఉండేట్టుగా వేసుకోవాలి. ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఒక చేతికి మాత్రమే గాజులు వేసుకొని, ఆ గాజులను పోలి ఉండే ఫంకీ రింగ్‌ను మరొక చేతి వేలికి ధరించాలి. నాలుగు నుంచి ఆరు గాజులు వేసుకునేటప్పుడు వాటికి మరికొన్ని భిన్నమైన గాజులను జోడించి ధరించాలి. వెండి, బంగారు, ఇతర లోహపు గాజులు ధరించేటప్పుడు రంగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కువగా నేచరల్ కలర్స్‌ని ఎంపిక చేసుకుంటే కాంప్లిమెంట్స్ కూడా అందుతాయి. లెదర్, దారం, పూసలతో తయారుచేసిన బ్రేస్‌లెట్స్‌ను ధరించినప్పుడు ఇతర సంప్రదాయ గాజులకు దూరంగా ఉండటం మంచిది. గాజుల ఎంపిక సమయంలో మీ మణికట్టు పరిమాణం కూడా పరిగణనలోకి తీసుకోవాలి.