బోనాలు చిత్రాలు
బోనాలు.. కొందరికి సంప్రదాయుం.. వురికొందరికి పండుగలా.. ఇంకొందరికి ఆటవిడుపులా కనిపి
స్తుంది. ఈ వైవిధ్యాన్ని విభిన్నంగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 22న ప్రారంభమైన కళాత్మక ప్రదర్శనలా ఉంటుంది.
బోనాలు.. ఈ జానపద వేడుకను శిల్పి ఉలి ఎలా చెక్కుతుంది.. కెమెరా కన్ను ఎలా ఫ్లాష్ కొడుతుంది.. ఫిల్మ్ మేకర్ ఎక్కడ యూక్షన్ చెబుతాడు.. కవి ఏ తీరుగ వర్ణిస్తాడు.. చిత్రకారుడి కుంచె ఎలా స్పంది స్తుంది..? ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ప్రదర్శన. ప్రముఖ శిల్పకారుడు, చిత్రకారుడు చిలువేరు మనోహర్ చేసిన అరుదైన ప్రయత్నమిది. వేర్వేరు రంగాల్లో తనకు పరిచయం ఉన్న నలుగురు కళాకారులతో కలిసి ‘బోనాలు’తో ఒకే వేదిక పైకి వచ్చి ఈ ప్రయోగానికి బోనమెత్తారు! స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వురో రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన కళాభివూనుల వునసు కట్టిపడేస్తోంది.
ప్రతి కోణం అపురూపం..
బోనాల వేడుక వసుధైక కుటుంబానికి ప్రతిరూపవుని చిత్రకారుడు చిలువేరు వునోహర్ తన చిత్రాల్లో చూపించారు. ఫిలిం మేకర్ దూలం సత్యనారాయుణ బోనాల పండుగను తెలంగాణ ప్రజల ఉనికిగా చూపే ప్రయుత్నం చేశారు. కాలగవునంలో బోనాలు ఉత్సవంలో వచ్చిన వూర్పులను క్లిక్ వునిపించారు ఫొటోగ్రాఫర్ రావూ వీరేశ్‌బాబు. బోనాలతో పాటు జీవన విధానంలోని వూర్పులపై కూడా తన ఫోకస్ ఉంటుందంటున్నారు. రచరుుత దెంచనాల శ్రీనివాస్ జనాల బోనాలు అందుకునే అవ్మువారిని శైవశక్తి రూపంలో వర్ణిస్తూ కవితా రూపం ఇచ్చారు.