State of the Art Gallery
-
‘ఫొటో’ విజేతలకు పురస్కారాలు
మాదాపూర్: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను చూసి వాటిని తీసిన ఫొటోగ్రాఫర్లను కొనియాడారు. ఫొటో జర్నలిజంలో మూడో బహుమతి సాధించిన కంది బజరంగ్ ప్రసాద్ (సాక్షి) జ్ఞాపిక, రూ.6 వేల నగదు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ డి. మనోహర్, ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించిన బెస్ట్ ఫొటోగ్రఫీ-2015 పోటీలో విజేతలకు బధవారం బహుమతులను ప్రదానం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్ఏఎఫ్ఏయూ జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీ ఏపీసీపీఐ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఎస్.ఎన్. వికాస్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు బి. రాజేష్ రెండో బహుమతి, దశరథ్ రజువా మూడో బహుమతి, పి.వరప్రసాద్ ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు. -
బోనాలు చిత్రాలు
బోనాలు.. కొందరికి సంప్రదాయుం.. వురికొందరికి పండుగలా.. ఇంకొందరికి ఆటవిడుపులా కనిపి స్తుంది. ఈ వైవిధ్యాన్ని విభిన్నంగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈ నెల 22న ప్రారంభమైన కళాత్మక ప్రదర్శనలా ఉంటుంది. బోనాలు.. ఈ జానపద వేడుకను శిల్పి ఉలి ఎలా చెక్కుతుంది.. కెమెరా కన్ను ఎలా ఫ్లాష్ కొడుతుంది.. ఫిల్మ్ మేకర్ ఎక్కడ యూక్షన్ చెబుతాడు.. కవి ఏ తీరుగ వర్ణిస్తాడు.. చిత్రకారుడి కుంచె ఎలా స్పంది స్తుంది..? ఈ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ప్రదర్శన. ప్రముఖ శిల్పకారుడు, చిత్రకారుడు చిలువేరు మనోహర్ చేసిన అరుదైన ప్రయత్నమిది. వేర్వేరు రంగాల్లో తనకు పరిచయం ఉన్న నలుగురు కళాకారులతో కలిసి ‘బోనాలు’తో ఒకే వేదిక పైకి వచ్చి ఈ ప్రయోగానికి బోనమెత్తారు! స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వురో రెండు రోజుల పాటు కొనసాగే ఈ ప్రదర్శన కళాభివూనుల వునసు కట్టిపడేస్తోంది. ప్రతి కోణం అపురూపం.. బోనాల వేడుక వసుధైక కుటుంబానికి ప్రతిరూపవుని చిత్రకారుడు చిలువేరు వునోహర్ తన చిత్రాల్లో చూపించారు. ఫిలిం మేకర్ దూలం సత్యనారాయుణ బోనాల పండుగను తెలంగాణ ప్రజల ఉనికిగా చూపే ప్రయుత్నం చేశారు. కాలగవునంలో బోనాలు ఉత్సవంలో వచ్చిన వూర్పులను క్లిక్ వునిపించారు ఫొటోగ్రాఫర్ రావూ వీరేశ్‌బాబు. బోనాలతో పాటు జీవన విధానంలోని వూర్పులపై కూడా తన ఫోకస్ ఉంటుందంటున్నారు. రచరుుత దెంచనాల శ్రీనివాస్ జనాల బోనాలు అందుకునే అవ్మువారిని శైవశక్తి రూపంలో వర్ణిస్తూ కవితా రూపం ఇచ్చారు.