‘ఫొటో’ విజేతలకు పురస్కారాలు
మాదాపూర్: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను చూసి వాటిని తీసిన ఫొటోగ్రాఫర్లను కొనియాడారు. ఫొటో జర్నలిజంలో మూడో బహుమతి సాధించిన కంది బజరంగ్ ప్రసాద్ (సాక్షి) జ్ఞాపిక, రూ.6 వేల నగదు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ డి. మనోహర్, ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించిన బెస్ట్ ఫొటోగ్రఫీ-2015 పోటీలో విజేతలకు బధవారం బహుమతులను ప్రదానం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్‌ఏఎఫ్‌ఏయూ జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీ ఏపీసీపీఐ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఎస్.ఎన్. వికాస్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు బి. రాజేష్ రెండో బహుమతి, దశరథ్ రజువా మూడో బహుమతి, పి.వరప్రసాద్ ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు.